వస్తాడు నా రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వస్తాడు నా రాజు
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం హేమంత్ మధుకర్
తారాగణం మంచు విష్ణు,[1] తాప్సీ, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రమాప్రభ
నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ
విడుదల తేదీ 11 ఫిబ్రవరి 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వస్తాడు నా రాజు 2011 లో విడుదలైన యాక్షన్ చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, తాప్సీ పన్నూ ప్రధాన పాత్రల్లో నటించారు. గోపాల్ రెడ్డి ఎస్ ఛాయాగ్రహణం నిర్వహించగా, సంగీతాన్ని మణి శర్మ సమకూర్చారు. ఈ చిత్రం 2011 లో విడుదలైంది. ఈ చిత్రాన్ని హిందీలో "డేర్ డెవిల్"గా అనువదించారు.[2]

కథ[మార్చు]

నరసింహ ( ప్రకాష్ రాజ్ ) ఒక రౌడీ, ఎమ్మెల్యే కావాలన్నది అతని జీవిత ఆశయం. అతను హత్యలు చేస్తూంటాడు. సీటు లభిస్తుందనే ఆశతో హోంమంత్రి ( సయాజీ షిండే ) కు అనుచరుడిగా పనిచేస్తూంటాడు. నరసింహకు పూజా ( తాప్సీ పన్నూ ) అనే చెల్లెలు ఉంది. ఆమె అంటే అతడికి చాలా ప్రేమ. ఆమె కూడా అన్నయ్యను ఎంతో ప్రేమిస్తుంది.

వెంకీ ( విష్ణు మంచు ) మంచి కుటుంబానికి చెందిన, ఏ సమస్యలూ లేని అదృష్టవంతుడు. ప్రొఫెషనల్ కిక్‌బాక్సర్ కావాలన్నది అతని జీవితాశయం. అతనూ అతని తండ్రీ మధ్య బలమైన అనుబంధం ఉంది. వెంకీ తన ఫోటోలను తీసుకోవటానికి దుకాణానికి వెళ్ళినప్పుడు, అతను అనుకోకుండా పూజ ఫోటోలున్న వేరే కవరు తీసుకుంటాడు. అతని కుటుంబ సభ్యులు పూజా ఫోటోలను చూసి, ఆమె వెంకీ స్నేహితురాలు అని అనుకుంటారు.

హోంమంత్రి కుమారుడు అజయ్ ( అజయ్ ) పూజను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అందుకు ఒప్పుకుంటే అతణ్ణి ఎమ్మెల్యే చేస్తానని నరసింహకు చెబుతాడు. నరసింహ వెంటనే అంగీకరిస్తాడు. పూజకు కూడా తన సోదరుడి నిర్ణయం పట్ల అభ్యంతరం లేదు. వరుసగా ఏర్పడిన అపార్థ ఘటనల కారణంగా పూజా వెంకీని ప్రేమిస్తోందని నరసింహ భావిస్తాడు -వారిద్దరూ అసలు కలవనే కలవనప్పటికీ. వాళ్ళ ప్రేమ కొనసాగితే తాను ఎమ్మెల్యే కానేమోననే అని బాధపడి నరసింహ, వెంకీ కుటుంబానికి చెందిన కాఫీ షాప్ కి వెళ్లి నాసణం చేస్తాడు. వెంకీ సోదరి పెళ్ళిని నాశనం చేస్తాడు. వెంకీ తండ్రిని చెంపదెబ్బ కొడతాడు. వెంకీ ఇంటికి వచ్చి ఈ విధ్వంసం చూస్తాడు. నరసింహపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిన చేస్తాడు.

నరసింహ పూజను కోప్పడతాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె నీటిలో దూకినప్పుడు, వెంకీ ఆమెను రక్షిస్తాడు. అతను ఆమెను ఆమె ఇంటి వద్ద దింపుతాడు. నరసింహ వెంకి బైక్ మీద పూజను చూసినప్పుడు, వారు పారిపోతున్నారని అనుకుంటాడు. తాము ఒకరికొకరు పరిచయమే లేదనీ, అతడు అపార్థం చేసుకున్నాడనీ వివరించడానికి వెంకీ పూజ .ప్రయత్నిస్తారు. కాని నరసింహ వినడు. ఒక పోరాటం జరిగి, నరసింహ వెంకీని కాలుస్తాడు. వెంకీ ప్రాణాలతో బయటపడతాడు. అతను పూజను కిడ్నాప్ చేసి నరసింహ తనకు క్షమాపణ చెప్పాలనీ, తాను నాశనం చేసిన వాటికి నష్ట పరిహారం చెల్లించాలనీ చెబుతాడు. నెమ్మదిగా, పూజా వెంకీతో స్నేహం చేస్తుంది. కొంతకాలం తర్వాత వారు ప్రేమలో పడతారు. కాని వారికి ఇది తెలియదు. పూజా తన పరీక్షా హాలుకు వెళ్లి, పరీక్ష తర్వాత అతడికి ఒక విషయం చెబుతానని చెబుతుంది. పూజా 'ఐ లవ్ యు' అని చెప్పబోతోంది.

ఇంతలో, వెంకీ స్నేహితులు, కుటుంబ సభ్యులు నరసింహకు అపార్థాన్ని వివరిస్తారు, అతను వెంటనే క్షమాపణలు చెప్పి, తాను చేసిన విధ్వంసాలన్నింటినీ పరిష్కరిస్తాడు. తన సోదరుడు వచ్చి క్షమాపణలు చెప్పినందున పూజా తన భావాలను వెంకికి చెప్పలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకేమీ సమస్యలను సృష్టించడం వెంకీకి ఇష్టం లేదు. అంచేత పూజ పట్ల తనకున్న ప్రేమను ఖండించాడు. పూజ అజయ్‌ను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు, కానీ ఆమె తన సోదరుడిని సంతోషపెట్టడానికి అంగీకరిస్తుంది. పూజను కిడ్నాప్ చేసినట్లు అజయ్ తెలుసుకుంటాడు. వెంకీ పూజలు ప్రేమలో ఉన్నారని అనుకుంటాడు. అప్పుడు హోంమంత్రి పూజను అవమానిస్తాడు. ఇది పోరాటానికి దారితీస్తుంది. వారి పెళ్ళి ఆగిపోతుంది. పూజ వెంకీని పెళ్ళి చేసుకోవాలని నర్సింహ భావిస్తాడు. వారు సంతోషంగా పెళ్ళి చేసుకుంటారు.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

మణి శర్మ పాటలకు బాణీలు సమకూర్చారు. మయూరి ఆడియోలో ద్వారా విడుదలైంది.

పాటల జాబితా
సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "హల్లో ఎవిరీబడీ"  రంజిత్ 4:27
2. "పదపద"  హేమచంద్ర, మాళవిక 4:13
3. "సడేమియా"  రంజిత్, రీటా 4:13
4. "కలగనే వేళ"  శ్రీరామచంద్ర, సైంధవి 4:45
5. "ఓలా"  రంజిత్, జనని 4:45
6. "నాతీనే నువ్వు"  సాకేత్, సైంధవి 5:00
7. "ఏదో ఏదో"  కార్తిక్, చిత్ర 4:50
మొత్తం నిడివి:
32:13

మూలాలు[మార్చు]

  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020. CS1 maint: discouraged parameter (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-29. Retrieved 2020-08-12.