వాక్సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాక్సింగ్‌కు ముందు మరియు తరువాత పురుషుని ఛాతీ

వాక్సింగ్ (Waxing) అనేది వెంట్రుకలను మూలం నుంచి తొలగించే ఒక పాక్షిక-శాశ్వత రోమాల తొలగింపు పద్ధతి. వాక్స్ చేసిన (మైనంతో రోమాలు తొలగించిన) ప్రదేశంలో కొత్త రోమాలు రెండు నుంచి ఎనిమిది వారాల వరకు పెరగవు. కనుబొమలు, ముఖం, మర్మాంగ ప్రదేశం, కాళ్లు, చేతులు, వీపు, ఉదరం మరియు పాదాలతో పాటు దాదాపుగా శరీరంలోని అన్ని ప్రదేశాల్లో వాక్స్ చేయడం ద్వారా రోమాలను తొలగించవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించేందుకు అనుకూలంగా ఉండే అనేక రకాల వాక్సింగ్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.

మైనం మిశ్రమాన్ని పలచగా చర్మంపై పూయడం ద్వారా వాక్సింగ్ చేయవచ్చు. ఒక వస్త్రం లేదా కాగితపు పేలికను దానిపైన అంటుకునేలా రుద్దిన తరువాత, ఆ పేలికను రోమాల పెరిగే దిశకు వ్యతిరేక దిశలో వేగంగా లాగివేయాలి.[1] దీని వలన మైనంతోపాటు రోమాలు కూడా తొలగించబడతాయి. మరో పద్ధతిలో గట్టి మైనం (ఇది పేలిక మైనానికి భిన్నంగా ఉంటుంది) ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో, మైనాన్ని కొంతవరకు మందంగా పూస్తారు, దీనికి వస్త్రం లేదా కాగితపు పేలికలు ఉండవు. తరువాత చల్లబడేకొద్ది మైనం గట్టిపడుతుంది, తద్వారా చికిత్సకుడికి ఎటువంటి వస్త్ర పేలికల సాయం లేకుండా దానిని సులభంగా తొలగించేందుకు వీలు ఏర్పడుతుంది. సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులకు ఈ వాక్సింగ్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.

వాక్సింగ్ రకాలు[మార్చు]

వివిధ రకాల వాక్సింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పద్ధతులు అనుమిత కాస్మోటాలజిస్ట్ లేదా ఎస్తెటీషియన్ ద్వారా నిర్వహించబడతాయి. ఆచరణలో ఉన్న వివిధ రకాల వాక్సింగ్ పద్ధతులు:

 • కనుబొమ్మ వాక్సింగ్ (ఐబ్రో వాక్సింగ్)
 • కాలి వాక్సింగ్ (లెగ్ వాక్సింగ్)
 • చేయి/చేతికింది భాగంలో చేసే వాక్సింగ్ (ఆర్మ్/అండరార్మ్ వాక్సింగ్)
 • వీపు వాక్సింగ్ (బ్యాక్ వాక్సింగ్)
 • పాదాలకు వాక్సింగ్ (ఫూట్ వాక్సింగ్)
 • ఛాతీ వాక్సింగ్ (చెస్ట్ వాక్సింగ్)
 • సంపూర్ణ శరీర వాక్స్ (ఎంటైర్ బాడీ వాక్స్)
 • బికినీ వాక్స్
 • ఎగువ పెదవి (అప్పర్ లిప్)

శరీరంలోని దాదాపుగా అన్ని భాగాలకు వాక్స్ చేయవచ్చు, అయితే పైన పేర్కొనని ఇతర భాగాలకు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు. చెవులు మరియు ముక్కు, కనురెప్ప వెండ్రుకలు, కనురెప్పలు, అరచేతులు, అరికాళ్ల ప్రదేశాల్లో ఎన్నడూ వాక్సింగ్ చేయించకూడదు. ఈ ప్రదేశాల్లో వాక్స్ చేసినట్లయితే ఇక్కడ ఉండే సున్నితమైన చర్మానికి తీవ్ర నష్టం జరుగుతుంది.

ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు[మార్చు]

ఇతర మార్గాల్లో రోమాలు తొలగించడం కంటే వాక్సింగ్ ద్వారా రోమాలు తొలగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏక సమయంలో ఎక్కువ పరిమాణంలో రోమాలను తొలగించేందుకు ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి.[2] ఈ పద్ధతి ఎక్కువకాలం కూడా మన్నుతుంది. వాక్స్ చేసిన ప్రదేశాల్లో రోమాలు రెండు నుంచి ఎనిమిది వారాల వరకు తిరిగి పెరగవు. రోమహారి క్రీము (డెపిలేటరీ క్రీమ్) తో రోమాలను షేవ్ చేసినప్పుడు లేదా తొలగించినప్పుడు, రోమాలు మూలం నుంచి కాకుండా, ఉపరితలంపై నుంచి తొలగించబడతాయి. కొద్ది రోజుల్లోనే, ఉపరితల భాగంలో తిరిగి రోమాలు కనిపిస్తాయి. ఈ పద్ధతులతో, తిరిగి పెరిగే రోమాలు కఠినత్వాన్ని, దృఢత్వాన్ని పొందుతాయి. అయితే మళ్లీమళ్లీ వాక్స్ చేసిన ప్రదేశాల్లో తిరిగి పెరిగే రోమాలు మాత్రం సుదీర్ఘకాలంపాటు మృదువుగానే ఉంటాయి.[3]

వాక్సింగ్ పద్ధతి వలన అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాక్సింగ్ పద్ధతిలో చర్మంపై నుంచి పేలికను తొలగించడం బాధాకరంగా ఉంటుంది. ఈ బాధ ఎక్కువ సమయం ఉండనప్పటికీ, ఈ పద్ధతి వలన తీవ్రమైన, ముఖ్యంగా బాగా సున్నితమైన ప్రదేశాల్లో మరింత ఎక్కువగా, నొప్పి కలుగుతుంది. మరో ప్రతికూలత ఏమిటంటే వాక్సింగ్ పద్ధతి వ్యయభరితమైనది: వాక్సింగ్‌ను సాధారణంగా అనుమిత ఎస్తెటీషియన్ చేస్తారు, దీనికి అయ్యే ఖర్చు బాగా ఎక్కువగా ఉండవచ్చు, రోమాలు తొలగించే ప్రదేశం మరియు అవసరమైన చికిత్సల సంఖ్యనుబట్టి కొన్ని వందల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. సొంతగా వాక్సింగ్ చేసుకొనే ఉత్పత్తులు కూడా ఉన్నాయి, అయితే శరీరంపై కొన్ని ప్రదేశాల్లో స్వయంగా వీటిని ఉపయోగించి వాక్సింగ్ చేసుకోవడం కష్టం. రోమాల తొలగింపు శాశ్వతమేమీ కాదు. రోమాల పెరుగుదల దిశకు వ్యతిరేక దిశలో వాటిని తొలగించినప్పుడు, వాక్స్ పేలిక రోమాల పుటికలకు (హెయిర్ ఫాలికల్స్) అంతరాయం కలిగిస్తుంది, తద్వారా రోమాలు వివిధ దిశల్లో పెరగడం మొదలవుతుంది. ఇది రోమాల పెరుగుదల బాగా కనిపించేలా చేస్తుంది, రోమాల తొలగింపుకు సంబంధించిన ఇతర పద్ధతుల వినియోగాన్ని మరింత కష్టం చేస్తుంది. అదృష్టవశాత్తూ, వాక్సింగ్‌ను తగిన విధంగా చేసినట్లయితే ఈ నష్టభయం అతితక్కువగా ఉంటుంది.

వాక్సింగ్ వలన మరో ప్రతికూలత ఏమిటంటే, కొందరు వ్యక్తుల్లో చర్మం లోపల రోమాల పెరుగుదల, ఎర్రటి బొడిపెలు ఏర్పడటం, మరియు స్వల్పస్థాయిలో రక్తస్రావం జరగవచ్చు. వాక్సింగ్ చేసే ప్రదేశాల్లో దట్టంగా రోమాలు ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు ఏర్పడేందుకు ఎక్కువ అవకాశం ఉంది, ముఖ్యంగా పుటికలు బలంగా ఉన్నప్పుడు ప్రారంభంలో కొన్నిసార్లు ఈ సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా చర్మం లోపల పెరిగే రోమాలను తొలగించడం అసాధ్యమైనప్పటికీ, క్రమంతప్పకుండా ఎక్స్‌పోలియేటింగ్ (కణాలు రాలిపోయేలా చేయడం) ద్వారా, ఒక ఆస్ట్రింజెంట్ (కండరాలను కుచింపజేసే ఔషధం) లేదా ఆస్ట్రింజెంట్ మరియు నూనె (ఎక్కువగా శిశు లేదా ఆజులెన్ నూనె) రెండింటి ద్రావణాన్ని పూయడం ద్వారా ఇటువంటి రోమాల వృద్ధిని తగ్గించవచ్చు.

జాగ్రత్తలు[మార్చు]

అన్ని సౌందర్య చికిత్సలు మాదిరిగానే, వాక్సింగ్‌కు కూడా చికిత్సను నిరోధించే లేదా అడ్డుకునే ప్రతికూల-సంకేతాలు ఉన్నాయి.

చికిత్సను అడ్డుకునే ప్రతికూల-సంకేతాలు[మార్చు]

 • సాంక్రమిక చర్మ పరిస్థితి (కాంటేజియస్ స్కిన్ కండిషన్) , వాక్సింగ్‌కు ముందు చర్మానికి ఇటువంటి గుణం లేకుండా లేకుండా చూసుకోవాలి.
 • పలచని లేదా దుర్బల చర్మం, ఇటువంటి చర్మం కమలడం మరియు నీరుగారడం వలన ఇన్ఫెక్షన్‌కు (వ్యాధి సంక్రమణ) దారితీయవచ్చు.
 • స్టెరాయిడ్ (ప్రేరక) మందులు ఉపయోగం, స్టెరాయిడ్ (ప్రేరక) క్రీములు లేదా మందులు ఉపయోగించడం వలన చర్మం పలచబడే అవకాశం ఉంది. అటువంటి మందులు ఉపయోగిస్తున్న సమయంలో వాక్సింగ్ చేయకూడదు, ఈ మందులతో చికిత్స పూర్తయిన మూడు నెలల వరకు దీనికి దూరంగా ఉండాలి.
 • రోయాక్యుటేన్, తీవ్రమైన మొటిమలను నివారించేందుకు ఉపయోగించే ఈ చికిత్స వలన చర్మం తీవ్రంగా పొడిబారుతుంది, ఇది తరచుగా పలచని లేదా దుర్బల చర్మం ఏర్పడేందుకు దారితీస్తుంది. ఈ చికిత్స తీసుకున్నట్లయితే, వాక్సింగ్ చేయడానికి కనీసం 6 నెలలు ఆగాలి, చర్మం అప్పటికీ దుర్బలంగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ కాలం వేచివుండాలి
 • అలర్జీలు (అసహనీయతలు) , అలర్జీకి కారణమయ్యే పదార్థాలు ఉన్న ఉత్పత్తులు / చికిత్సలు మాదిరిగానే, ఈ చికిత్స కూడా దూరంగా ఉండాలి.

చికిత్సను నిరోధించే ప్రతికూల-సంకేతాలు[మార్చు]

 • పెరిగిన పుట్టుమచ్చులు మరియు చర్మ కరుపులు, వీటిపై నేరుగా మైనాన్ని పూయరాదు.
 • రాపిడి ప్రదేశాలు, కాట్లు, పగిలిన చర్మం, కమిలిన గాయాలు, పూర్తిగా నయమయ్యే వరకు ఇటువంటి ప్రదేశాల్లో వాక్సింగ్‌కు దూరంగా ఉండాలి
 • ఉబ్బిన నరాలు, ప్రభావిత ప్రదేశంలో వాక్సింగ్ చేయకూడదు

వీటిని కూడా చూడండి[మార్చు]

 • విద్యుద్విశ్లేషణ
 • బికినీ వాక్సింగ్
 • శరీర చికిత్స
 • పర్షియన్ వాక్సింగ్

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

మూస:Cosmetics