Jump to content

వాటాల్ నాగరాజ్

వికీపీడియా నుండి
వాటాల్ నాగరాజ్

పదవీ కాలం
2004  2008
ముందు సి. గురుస్వామి
తరువాత సి. పుట్టరంగశెట్టి
నియోజకవర్గం చామరాజనగర్
పదవీ కాలం
1983  1989
ముందు ఎస్. పుట్టస్వామి
తరువాత సి. గురుస్వామి

వ్యక్తిగత వివరాలు

జననం 1949
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కన్నడ చలవలి వాటల్ పక్ష
వృత్తి రాజకీయ నాయకుడు

వాటాల్ నాగరాజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నాగరాజ్ కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లాలోని టి నరసిపుర మండలంలోని వాటాలు గ్రామంలో జన్మించి చిన్న వయసులోనే బెంగళూరుకు మకాం మార్చాడు. ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు. నాగరాజ్ కు ఇద్దరు పిల్లలు - ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది.

రాజకీయ జీవితం

[మార్చు]

వాటాల్ నాగరాజ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1983 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. పుట్టస్వామి చేతిలో 5,917 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1985 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన 21,758 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.

వాటాల్ నాగరాజ్ 1989 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. పుట్టస్వామిపై 5,893 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కన్నడ చలవలి వాటల్ పక్ష పార్టీని స్థాపించి 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కెసివిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. పుట్టస్వామిపై 5,982 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వాటాల్ నాగరాజ్ 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కెసివిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి. గురుస్వామి చేతిలో 17,519 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కెసివిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డాక్టర్ మంజులపై 10,483 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వాటాల్ నాగరాజ్ 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చామరాజనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కెసివిపి అభ్యర్థిగా పోటీ చేసి 11426 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కెసివిపి అభ్యర్థిగా పోటీ చేసి 18408 ఓట్లతో మూడోస్థానంలో, 2018 శాసనసభ ఎన్నికలలో 5977 ఓట్లతో నాల్గొవస్థానంలో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "Vatal Nagaraj calls for bandh on October 4". The Hindu. 12 September 2006. the original నుండి 8 November 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2016.
  2. "Bengaluru's forever crusader: The man who likes a good protest" (in ఇంగ్లీష్). The Indian Express. 13 October 2023. the original నుండి 12 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2025.