వాట్స్‌యాప్

వికీపీడియా నుండి
(వాట్సప్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లోగో

వాట్స్ యాప్ కు ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్సాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. 2014లో ఈ సంస్థను ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది.[1] [2]

2022 మార్చి 31 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 4.0 అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే యాపిల్ ఐఫోన్ ప్రత్యేక ఓఎస్ అయిన ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి.[3]

విశేషాలు

[మార్చు]
  • ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫోటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.
  • వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో పంచుకోవచ్చు.
  • దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎb c e లాంటి రుసుములు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.
  • ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.
  • మొదట్లో వాట్సాప్ ని ఉపయోగించాలంటే కొంత రుసుం వసూలు చేసేవారు తరువాత కాలంలో వాట్సాప్ ని ఉచితంగా వాడుకునే లాగా అందుబాటులోకి తెచ్చారు.
  • ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.
  • స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.
  • రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా

బయటి లంకెలు

[మార్చు]

వాట్స్‌యాప్ అధికారిక జాలస్థలి

మూలాలు

[మార్చు]
  1. Metz, Cade (April 5, 2016). "Forget Apple vs. the FBI: WhatsApp Just Switched on Encryption for a Billion People". Wired. ISSN 1059-1028. Archived from the original on April 9, 2017. Retrieved May 13, 2016.
  2. "Features". WhatsApp.com (in ఇంగ్లీష్). Archived from the original on May 28, 2019. Retrieved May 31, 2019.
  3. "WhatsApp: మార్చి 31 నుంచి ఈ మొబైల్స్‌లో వాట్సాప్‌ పనిచేయదు". EENADU. Retrieved 2022-03-31.