వాడుకరి:బూర్ల వేంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు బూర్ల వేంకటేశ్వర్లు. మా ఊరు పేరు లాలపల్లి. మా మండలం పేరు ఎలిగేడు. మా ఊరు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 20కి.మీ దూరంలో ఉంటుంది.

నేను నా ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యను మండల కేంద్రమైన ఎలిగేడులో పూర్తి చేశాను. సమీప తాలూకా సుల్తానాబాద్ లో ఇంటర్మీడియట్, జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో బి.కాం డిగ్రీ పూర్తి చేశాను.

ఎం.కాం ఉస్మానియా దూరవిద్య ద్వారా పూర్తి చేశాను. ఎం. ఏ (తెలుగు), ఎం. ఏ (సంస్కృతం), తెలుగు పండిత శిక్షణ, నెట్, సెట్ ఉత్తీర్ణత పొందాను.

1998లో తెలుగు పండితునిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, జూనియర్ కళాశాల అధ్యాపకునిగా పని చేసి, ఇప్పుడు తెలుగు సహాయాచార్యునిగా పని చేస్తున్నాను.

తెలుగులో కవిత్వ రచన, వ్యాస రచన చేస్తుంటాను.

2007లో నా మొదటి రచన వాకిలి నుండి ఇప్పటి వరకు 6 కవిత్వ పుస్తకాలు, ఒక వ్యాసాల పుస్తకం, ఒక నిఘంటు సంబంధిత పుస్తకం అచ్చు వేశాను.

నా ఛాయా చిత్రం

బూర్ల_వేంకటేశ్వర్లు2