వాడుకరి:రజనీ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

      యెడబాటు పిలుపు_బాప్తీస్మము కొనసాగింపు   

     

మహోన్నతుడు,విశ్వకారకుడు,సర్వభూమికి సర్వాధికారియైన దేవుని సముఖములో రక్షకుడును ప్రభువైన క్రీస్తు వారి నామమున ప్రియులైన చదువరులకు నా వందనములు

యెడబాటు పిలుపు-బాప్తీస్మము కొనసాగింపు అను అంశమును వ్రాయుటలో తన సహాయము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అంశమును మీ యెదుట ఉంచుతున్నాను.

దేవుడు ఆదిలో నరుని ఒక గొప్ప పాత్ర గాను ఆయన పోలిక చొప్పున ఆయన వలే సృజించాడు ఈ రూపము మనలో అనేకులు తలంచునట్లు శరీరమునకు సంబందించినది కాదు ఆ రూపము ఆత్మ సంబంధిత రూపమై ఉన్నది దేవుడు ఆయన లక్షణములతో పాపము లేని వారిగా మనలను సృజించి అయనతో బంధము కలిగి  జీవించాలని కోరుకున్నాడు. అదే సమయంలో అపవాది తన కుయ్యుక్తి ద్వారా దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసి దేవునికి దూరము అయ్యేట్లు చేసాడు. మనిషి తాను కొనితెచ్చుకున్న పాపమునకు తోడు కొన్ని అలవాట్లు నేర్చుకుని పాపమునకు మరింత సమీపము అయ్యాడు. దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించెను గానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొనియున్నారు(ప్రసంగి7:29) అవును మనిషి తనకు అనుకూలంగా నుండు అనేక తంత్రములు కల్పించుకున్నాడు  కల్పించుకుంటూనే దురాశపరుడయ్యాడు పాపం వెంబడి పరుగులు తీసాడు ఆత్మీయ మరణానికి చేరువయ్యాడు(యాకోబు1:15) ఇదంతా చూస్తున్న పరలోకపు తండ్రికి ఎంతో బాధ కలిగింది ఆకాశమా ఆలకించుము భూమీ చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితినిగాని వారు నామీద తిరుగబడియున్నారు(యెషయా1:2)అని.. వారికి  పాపము వలన కలిగే నష్టాన్ని చూపించాడు సన్మార్గంలో నడిపించుటకు అనేకులను ఏర్పరచాడు కానీ తన పిల్లలు బ్రమపరచు మాయా పాపమును  స్నేహిస్తూ మరణమువైపే నడిచారు మనిషి ఎంతగా దారితప్పి ఆయనకు విముఖుడైనా దేవుని మదిలో కోరిక మాత్రం ఒకటే ఆయన నుండి దూరము అవుతున్న తన పిల్లలు మరలా తన యొద్దకు రావాలి వారు పాప మార్గములను విడిచి తిరిగి తన యొద్ధకు వచ్చుటయే దేవుని కోరిక. అయీయే కాలము సమీపమైనప్పుడు దేవుని రూపము ఆయనతో సమానత్వము కలిగిన తన కుమారుడైన యేసుక్రీస్తువారిని ఈ లోకానికి పంపాడు. (యెహాను26:57)

"అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి

ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.

కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.

బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

ఆయన నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు"(హెబ్రీ 10:3,4,5,8,9)

రక్షించబడుటకు నేను ఏమి చెయ్యవలెను:-

రక్షించబడుటకు నేను ఏమి చేయాలి అని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రాముఖ్య కార్యము పరిశుద్ధ గ్రంథములో తెలుపబడినది అదేమనగా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును(మార్కు16:16) అవును ఆత్మీయంగా రక్షింపబడవలెను అని అనుకునినయెడల అతడు బాప్తిస్మము పొందవలెను. అయితే బాప్తిస్మమునకు  ముందు జరగవలసిన విషయములు నాలుగు కలవు  మరియు ఇవి ప్రాముఖ్యమైనవి కూడా. బాప్తీస్మము పొందువారు  మరియు బాప్తిస్మము ఇచ్చువారు ఈ నాలుగు విషయములను  తెలుసుకొనిన లేదా తెలిపిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తికి బాప్తీస్మము  ఇవ్వవలెను.

అవేమనగా..

1) వినుట(రోమా10:17)

"కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును".

బాప్తీస్మము పొందగోరు వారు వాక్యమును అనగా క్రీస్తును గూర్చిన మాటలను వినవలెను.

2) విశ్వసించుట(మత్తయి16:16; యెహాను 8:24)

మత్తయి 16: 16:-అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను.

యోహాను 8: 24:-కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

3)మారుమనస్సు

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.(అపో.కా 17: 30)

దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.(2కోరింథీ 7: 10)

4)ఒప్పుకొనుట

యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.(1యోహాను 4: 15)

మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.(మత్తయి 10: 32)

రక్షింపబడుటకు సిద్ధపడిన వ్యక్తి విని విశ్వసించి మారుమనస్సు పొంది క్రీస్తు ఒప్పుకున్న తర్వాత మాత్రమే బాప్తిస్మము పొందవలెను

"మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి".(కొలస్సీ 2: 12)

బాప్తీస్మము అనగా నూతనముగా జన్మించుట (యెహాను3:3-8)

"అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు నీకొదేముముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. "అనెను మరియు బాప్తీస్మము పొందుట ద్వారా పరిశుద్ధాత్మ అను శక్తిని వరముగా(సంచకరువుadvance)పొందగలము(2కొరింథీ1:22;5:5;ఎఫెసి1:14)

గమనిక:- కొందరు బోధించినట్లుగా శరీర స్వస్థత, అప్పులుతీరుట, ఐశ్వర్యంముకలుగుట, మరియు వివాహముకొరకైన బాప్తిస్మము వాక్యానుసారమైనది కాదు.

బాప్తీస్మము(రక్షణ)యొక్క కొనసాగింపు

బాప్తీస్మం కొత్తగా పొందిన వారు మరియు బాప్తిస్మ జీవితమును కొనసాగించే వారు కూడా తదుపరి ఏమి చేయవలెను అనునది బాగుగా తెలుసుకొనుట మంచిది

అపోస్తలుడైన పౌలు తన చివరికాలమందు తన పత్రికలో ఇలా వ్రాసారు

"మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును."(2 తిమోతి 4:7,8)

అవును పౌలు తన క్రైస్తవ జీవితములో ఎన్నో శ్రమలను భరించి తన ఇష్టాలను సౌఖ్యాలను విడిచి క్రీస్తు కొరకు ఆయన పని కొరకు ఎంతగానో శ్రమించారు క్రైస్తవజీవితమును కొనసాగించుచున్న మరియు నూతనముగా ప్రారంబించున్నవారు కూడా పిలువబడిన పిలుపునకు తగినట్లు జీవింపవలెను(ఫిలిప్పీ1:27)

బాప్తీస్మము యొక్క కొనసాగింపునకు ఆటంకము కలిగించునది పాపము అయితే బాప్తీస్మము పొందినవారు పాపము చేయకుండవలెను

పాపమనగానేమి?అనే ప్రశ్నకు రెండు  సులువైన సమాధానమును వెదకుదాం...|

పాపము  చేయుటకు అనేక ప్రేరేపిత మార్గములున్నను ఈ క్రింద తెలుపబడు రెండు విధముల పాప మార్గములు ప్రాముఖ్యమైనవి మరియు ప్రధానమైనవి అని నా భావన...అవేవనగా

1)శరీర అవసరతలను అనుసరించి జరిగించు పాపము

2)తోటి సహోదరుల పట్ల జరిగించు పాపము

శరీర అవసరతను అనుసరించి జరుగు పాపము ఎలాగు జరుగునో గమనిద్దాం మన శరీరమును పోషించుటకు మరియు సంరక్షించుటకు కొన్ని సౌఖ్యములను కలుగచేయవలెను అవేమనగా తినుటకుఆహారమును, ధరించుటకు వస్త్రములు, నివసించుటకు గృహము, తోడుకొరకు భార్య మొదలగు అవసరములు మనకు కలవు

వీటిని సమకూర్చుకొనుటకు ఒక క్రమమైన పద్ధతిని దేవుడు మనకు ఇచ్చాడు. ఆహారమును గూర్చి అయితే నీవు నేలను దున్ని నీ ముఖపు చెమట కార్చి పండించిన పంట తిందువనియు(ఆది2:17-19), సంపదను గురించి అయితే మీరు పరుని జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు(1థెస్స 4:11,12)   భార్య గురించి అయితే "అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెనుభర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను". (1 కొరింథీ7:2,)అనియు దేవుని ద్వారా వ్రాయింబడినది ఇది దేవుడు సిద్ధపరచిన క్రమము అయితే మానవ హృదయంలో ఎప్పుడైతే దురాశ పుడుతుందో అప్పుడే శరీర అవసరలను తీర్చు క్రమపద్ధతిని విడిచి అక్రమ పద్ధతి ద్వారా పాపములో ప్రవేశిస్తాడు "దురాశ గర్భము ధరించి పాపమునుకనగా పాపము పరిపక్వమై మరణమును కనును(యాకోబు1:15) అదిలో అవ్వ ఆదాము తినుటకు సరిపడా ఆహారం ఉన్నది మరియు మరియు వారికి ఏది కొదువలేదు అయినప్పటికీ దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన ఫలమును ద్వారా దేవదూతలవలె  అగుదురు అని అపవాది పలికిన మాటలను బట్టి దురాశాపరులై  దేవునికి దూరమయ్యారు ఆదాము అవ్వ(ఆది3:1-6). మరియు తొందరగా ధనవంతులము కావలెను అనే దురాశతో కూడా   దేవుడిచ్చిన క్రమమును  విడిచి "లంచము పుచ్చుకొనుటయు"(1సమూ 8:3;నిర్గమ23:8),"వడ్డీకి ద్రవ్యమిచ్చుటయు"(కీర్తన15:5;నిర్గమ22:25;37)"దొంగిలించుటయు(మత్తయి15:19;మార్కు7:21) వంటి దురాశాపూరిత పాపములను చేయుచున్నాము మరియు కామాతురతగలవారమై వ్యభిచరించుచున్నాము(1కొరింథీ7:2;6:18;సామెత5:15) ఇవన్నియు మనము శరీర అవసరతలను అనుసరించి చేయు పాపములే..

తోటి సహోదరుల పట్ల జరిగించు పాపము

సకల జగడమునకు  మనోచింతలకు తొంబదిపాళ్ళు  ఈ పాపమే కారణము మన తోటి వారి పట్ల జరిగించు పాపమును గురించి తెలుసుకొనుటకు కయీను హేబేలు నొద్దకు వెళదాము. కయీను హేబేలు ఇరువురు సోదరులు మరియు దేవుని యెరిగిన వారు ఒక దినమున వారు వారి వారి ఫలములనుండి దేవునికి యర్పణ ఇచ్చుటకు వెళ్లియున్నారు అయితే దేవుడు హేబేలు యర్పణ హృదయ పూర్వకమైనదిగా యెంచి అతని యర్పణ అంగీకరించి కయ్యీను యర్పణ లక్ష్యపెట్టకున్నాడు.  దీని కారణముగా కయీను తన తమ్ముడైన హేబెలు పై కోపంతో అతని హత్య చేసాడు దేవుడు తన కంటే తన తమ్ముని హెచ్చించిన కారణంచే చంపి వాకిట పొంచియున్న పాపమునకు దాసుడు అయ్యాడు.

నిజమే అనేకమార్లు మనం మనకంటే మన పొరుగు వారు ఉన్నత స్థితిలో ఉండటం చూసి ఓర్వలేక వారిని దూషిస్తూ నిందిస్తూ పాపము చేయుచున్నాము చూసినట్లయితే సౌలు దావీదు ఎదుగుదలను చూసి అతనిపై విషపు చూపునిలిపాడు(1సమూ 18:8,9) మరియు సౌలు పతనమైనట్లు తెలుసుకొనగలము.

యేసు పలికెను-నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద(కొన్ని ప్రాచీన ప్రతులలో-నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.  (మత్తయి 5:22)

అని అవును పొరుగు వారిని ద్వేషించు అనునది నరకాగ్నికి లోనగుటకు దారితీయును, అలాగే పరిశుద్ధ వాక్యం యొక్క ఉద్ధేశ్యము కూడా ప్రేమ కలిగి సహోదరులను ఇతరులను ప్రేమించడము అది కూడా మనలను మనము ఏ రీతిగా ప్రేమించుకొనుచున్నామో అట్టి విధముగా ఇతరులను ప్రేమించబద్దులైయున్నాము(లూకా10:27;రోమా13:9;గలతీ5:14;1కొరింథీ13వ అధ్యాయమంతయు) ఎప్పుడైతే ఈ ప్రేమను మనము కోల్పోతామమో అప్పుడే కయ్యీను వలె హంతకులగాను సౌలు వలె ద్వేషకులగాను మారి తోటి సహోదరుల విషయమై పాపము చేయుదము.  ప్రతి ఒక్కరు మన పట్లో ఇతరుల పట్లో పొరపాట్లు చేస్తుంటాము వాటి మూలముగా కోపము వచ్చిట సహజము అయితే ఆ కోపమును మరువక కొనసాగించుట వలనకూడా  పాపము చేయువారమగుదము.(యాకోబు1:19-22;ఎఫెసీ4:26)).

మరియు మనము దేవుని ప్రేమించుచున్నామని చెప్పి ఇతరులను ద్వేషించిన యెడల దేవుని ప్రేమించుచున్నామని చెప్పినది అబద్ధమగును మరియు మనం కూడా అబద్ధికలమగుదుము(1యోహాను4:20) గనుక తోటి సహోదరులు పట్ల పాపము జరిగించుటను అరికట్టుటకు ప్రేమించ ప్రయత్నమును దృడపరచాలి, ఈ ప్రేమ తోటి సహోదరులు పట్ల పాపము చేయుటను అరికట్టును.

ప్రియులారా "ఎడబాటు పిలుపు-బాప్తిస్మము కొనసాగింపు" అనే అంశమును కొద్దిగా క్లుప్తముగా లేఖనములను అనుసరించి తెలుసుకున్నాము దేవుని నుండి యెడబాసిన మనిషి ఆయన ద్వారానే పిలువబడ్డాడు మరియు పిలువబడి రక్షించబడిన వాడు రక్షణ పొందుట ఎంత ప్రాముఖ్యమో దానిని కొనసాగించుటా అంతే ప్రాముఖ్యమని తెలుసుకొనవలెనని దేవుడు కోరుకొనుచంన్నాడు(హెబ్రీ 3:6;6:13) చివరిగా ఈ రక్షణానందము  పొందన వారు పొందులాగునా..పొందినవారు కడముట్టించవలెనని  దేవుని ప్రార్థిస్తూ ఈ పత్రిక చదువుచున్న ప్రియులైనవారందరికి క్రీస్తు నామమున ప్రేమ పూర్వక వందనములు చెప్పుచున్నాను

మీ సహోదరుడు

కొండేపూడి రజనీ ప్రసాద్

9121916398