మీరు ఏ వ్యాసాన్ని చూసినా అందులో నలుపు, నీలం మరియు ఎరుపు రంగుల్లో కొన్ని లింకులు ఉంటాయి. ఇవి కాకుండా ఇతర రంగుల్లో కూడా అక్షరాలు కొన్ని సార్లు కనిపించవచ్చు. ఆ రంగులెందుకో కింద చూడండి. నలుపు - ఈ రంగు పదాలు వికీపీడియాలో ఎటువంటి లింకులూ లేని పదాలకు ఉంటాయి. (కావాలని నలుపు రంగు లింకులు ఉంచితే తప్ప) నీలం - నీలం రంగు పదాలు తెలుగు వికీపీడియాలోని ఇతర వ్యాసాలకు లింకులు, వాటిపై నొక్కి పదం లింకుకు చేరుకోవచ్చు. ఇలాంటి నీలం లింకులు వ్యాసాన్ని మార్చడానికి కూడా వాడబడతాయి. ఏ వ్యాసం పైనైనా మీరు 'మార్చు' మరియు 'చరితం' వంటి లింకులను చూడవచ్చు. లేత నీలం- ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని లింకులు, ఉదా: ఆంగ్ల వికీ, విక్షనరీ వంటివి ఎరుపు- ఈ రంగులో ఉండే పదాల లింకులు తొలగిపోవడం గానీ ఇంకా సృష్టించబడిగానీ లేవని అర్థం. మీరు వాటిపై నొక్కి ఆ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఇతర రంగులు - ఇవి సాధారణంగా వ్యాసం పేజీల్లో ఉండవు. చర్చా పేజీల్లో, సంతకాలల్లో సభ్యులు వాడుతుంటారు.