వాడుకరి:Chocoholic devil/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివాని కటారియా[మార్చు]

శివాని కటారియా (జననం 1997 సెప్టెంబర్ 27) భారత ఫ్రీ స్టయిల్ విభాగంలో అమెచ్యూర్ స్విమ్మర్.[1] శివాని 2016 ఒలంపిక్స్‌లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. 2004 తర్వాత ఒలంపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత స్విమ్మర్ గా శివాని రికార్డు సృష్టించింది.[2] మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్ లో శివాని జాతీయ రికార్డు నమోదు చేసింది.[3]

వ్యక్తిగత జీవితం, నేపథ్యం[మార్చు]

హర్యానాలోని గురుగ్రామ్ లో శివాని 1997 సెప్టెంబర్ 27న జన్మించింది. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివాని త్రండి ఆమెను వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించడంతో ఆమె స్విమ్మింగ్ కెరీర్ మొదలైంది. ఇంటి పక్కనే శిక్షణ శిబిరం ఉండటం, జిల్లా స్థాయి పోటీల్లో పతకం దక్కడంతో శివానికి స్విమ్మింగ్ మీద ఆసక్తి పెరిగింది. స్విమ్మింగ్ లో ప్రాక్టీస్ చేస్తూ శివానికి ఆమె సోదరుడు ఎంతో సాయంగా నిలిచాడు. అంతేకాకుండా వివిధ పోటీలకు ఆమెను సన్నద్ధం చేశాడు.[1]

స్థానిక పోటీల్లో విజయాలు ఆమెలో స్ఫూర్తి నింపినప్పటికీ, హర్యానాలో సరైన వసతులు లేకపోవడం ఆమె ప్రాక్టీస్‌కు అవరోధంగా మారింది. చుట్టుపక్కల సరైన హీట్ స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడంతో శీతాకాలంలో శివాని స్విమ్మింగ్ ప్రాక్టీస్ పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఏడాదంతా శిక్షణ చేసేందుకు వీలుగా ఉండే బెంగళూరుకు తన మకాంను మార్చింది శివాని.[1]

వృత్తి పరమైన విజయాలు[మార్చు]

జూనియర్ జాతీయ స్థాయి చాంపియన్ షిప్‌లో చాలా రికార్డులను సాధించిన శివాని 2013లో ఏషియా ఏజ్ గ్రూప్ చాంపియన్ షిప్ 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఆరో స్థానం సంపాదించింది.[1]

2014 యూత్ ఒలంపిక్స్‌లో ఆమె భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.[1]

2015లో థాయ్ లాండ్ లో జరిగిన ఎఫ్ఐఎన్ఏ క్యాంప్ కు హాజరై 2:04:00 సెకన్లతో టైమ్ స్లాట్ లెవల్ గా పేర్కొనే బి కార్ట్ ను సాధించిందామె. ఈ ఘనత 2016 రియో ఒలంపిక్స్‌లో పాల్గొనగలననే నమ్మకాన్ని ఆమెలో కల్గించింది.[4]

2016 సౌత్ ఏషియా గేమ్స్ స్విమ్మింగ్‌లో శివాని స్వర్ణ పతకం గెలుచుకుంది.[2]

2016 రియో ఒలంపిక్స్‌లో శివాని వైల్డ్ కార్డు ద్వారా పాల్గొంది.  2004 తర్వాత వేసవి ఒలంపిక్స్‌లో భారత్ తరపున పాల్గొన్న మొదటి స్విమ్మర్ శివానియే కావడం విశేషం.[2] తొలి ఒలంపిక్స్‌లో బలమైన పోటీదారు కానప్పటికీ,[4] సెమీస్కు చేరితే చాలనుకుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. సెమీస్కు కూడా చేరలేకపోయింది శివాని.[5]

క్రీడల్లో అత్యుత్తమ బిరుదు భీమ్ అవార్డుతో 2017లో హర్యానా ప్రభుత్వం శివానిను సన్మానించింది.[1][6]

2019 జాతీయ అక్వాటిక్ చాంపియన్ షిప్ లో 2:05:80 సెకన్లతో గమ్యాన్ని చేరి తన గత మీట్ రికార్డును తానే బద్దలు కొట్టింది శివాని, అంతేకాకుండా ఆ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. [3]

దేశంలో మరింత మంది మహిళా స్విమ్మింగ్ కోచ్ లు ఉంటే మరింత మంది బాలికలు స్విమ్మింగ్ ను కెరీర్ గా ఎంచుకుంటారని కటారియా అభిప్రాయ పడుతుంది.[1][3][3]

Right Hand Box[మార్చు]

వ్యక్తిగత సమాచారం

పూర్తి పేరు: శివాని కటారియా

పౌరసత్వం: భారతీయం

పుట్టిన తేది: 27 సెప్టెంబర్ 1997

పుట్టిన స్థలం: గురుగ్రామ్, హర్యానా

క్రీడ: స్విమ్మింగ్

పతకాలు (భారత్ కు ప్రాతినిథ్యం)

స్వర్ణం: 2016 సౌత్ ఏషియన్ గేమ్స్

స్వర్ణం: 2019 జాతీయ అక్వాటిక్ చాంపియన్ షిప్

మూలాలు[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "శివానీ కటారియా: సమ్మర్‌ క్యాంపు నుంచి సమ్మర్ ఒలింపిక్స్‌ దాకా..." BBC News తెలుగు. Retrieved 2021-02-17.
  2. 2.0 2.1 2.2 "Road to Rio: Shivani Kataria, first Indian woman swimmer at the Olympics after 2004 - Sports News , Firstpost". Firstpost. 2016-07-29. Retrieved 2021-02-17.
  3. 3.0 3.1 3.2 3.3 Staff, Scroll. "Swimming: Srihari Natraj bags two gold medals in Nationals, Shivani Kataria wins 200m event". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  4. 4.0 4.1 Mahendra, Vikram (2016-07-26). "Interview with Indian swimmer Shivani Kataria: "Reaching semi-finals in 2016 Rio Olympics would be historic"". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  5. "Rio 2016 Olympics India Swimming Team: Kataria, Prakash fail to qualify for S/Fs in 200m". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). 2016-08-08. Retrieved 2021-02-17.
  6. "Two Gurgaon teen sportspersons to get Bhim Award". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-02-18. Retrieved 2021-02-17.