Jump to content

వాడుకరి:Deepthi nukapeyi/ప్రయోగశాల

వికీపీడియా నుండి

ద్యుతీచంద్

[మార్చు]

భారత్‌కు చెందిన ప్రొఫెషనల్ స్ప్రింటర్ ద్యుతీచంద్ ఫిబ్రవరి 3,1996న జన్మించారు. 100 మీటర్ల పరుగులో ప్రపంచ స్థాయి పోటీల్లో భారత్ తరఫున స్వర్ణం గెలిచిన తొలి క్రీడాకారిణి ద్యుతీచంద్. (2)[1] హైపర్ ఆండ్రోజినిజం నిబంధనల కారణంగా ఒకప్పుడు ఇంటర్నేషనల్ అసొసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (ఐఏఏఎఫ్) నిషేధానికి గురైన ద్యుతీ 100 మీటర్ల పరుగులో 2016 రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించారు. 36 ఏళ్ల తర్వాత 1980 మాస్కో ఒలింపిక్స్ లో పీటీ ఊష అర్హత సాధించిన తర్వాత మరో భారత స్ప్రింటర్ వంద మీటర్ల పరుగులో ఒలింపిక్స్‌లో అర్హత సాధించిన రికార్డును ద్యుతీ సొంతం చేసుకున్నారు. (3)[2] తన తొలి ఆసియా గేమ్స్‌లోనే ఆమె పతకాల పంట పండించారు. 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో ద్యుతీ 100 మీటర్లు, 200 మీటర్ల పోటీల్లో రజత పతకాలు గెలుచుకున్నారు. (1)[3] 2016లో ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికైన ద్యుతీ, 2019లో తాను సేమ్ సెక్స్ రిలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. (6)[4] ఆ తర్వాతి ఏడాది ప్రముఖ క్రీడా దుస్తుల సంస్థ ప్యుమాతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.(6)[5] (10)[6]

వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం

[మార్చు]

ద్యుతీ పేద చేనేత కార్మికుల కుటుంబంలో, ఏడుగురు సంతానంలో మూడో కుమార్తెగా ఒడిషా జాజ్ పూర్ జిల్లా ఛకా గోపాల్ పూర్ గ్రామంలో జన్మించారు. గంటల తరబడి పరిగెత్తుతూ సాధన చేస్తుండేవారు. ఆర్థిక సమస్యల కారణంగా ద్యుతీ, ఆమె సొదరి సరస్వతి 2006లో ప్రభుత్వ క్రీడా హాస్టల్‌లో చేరారు. (3)[2]

కెరీర్

[మార్చు]

2012లో అండర్-18 జాతీయ చాంపియన్ షిప్‌లో వంద మీటర్ల పరుగులో కొత్త రికార్డు సృష్టించి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. (7)[7]

2013లో పుణెలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించడమే కాకుండా, ఆ తర్వాత జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో విజేతగా నిలిచారు. (8)[8]  అదే ఏడాది వరల్డ్ యూత్ చాంపియన్ షిప్‌లో ఫైనల్ కు ప్రవేశించి, ప్రపంచస్థాయి పోటీలో ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు.

2014ను ఆమె విజయాలతో ప్రారంభించారు. తైపీలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 200 మీటర్లు, 4x400 మీటర్ల రిలేలో పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అయితే హార్మోన్ టెస్ట్ లో విఫలమవడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనకుండా భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ ఐ) నిషేధించింది. హైపర్ ఆండ్రోజినిజం కారణంగా ఆమెను నిషేధించారు.(5)[9](8)[8] (10)[6]

అయితే ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు 2015 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆమె వేసిన పిటిషన్లను  విచారించిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ఐఏఏఎఫ్ నిబంధనలను తోసిపుచ్చి, ద్యుతీని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. (3)[2]

దీంతో మానసికంగా మరింత బలోపేతమైన ద్యుతీ 2016 దోహా ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 60 మీటర్ల కేటగిరిలో కాంస్యం గెలిచి, కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. అదే జోరులో కజకిస్తాన్ లో జరిగిన జి కసనోవ్ మెమొరియల్ మీట్‌లో వంద మీటర్ల పరుగును 11.24 సెకన్లతో పూర్తి చేసి 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

అయితే రియోలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన ద్యుతీ, 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. రెండు దశాబ్దాలలో ఏషియాడ్‌లో వంద మీటర్ల పరుగులో రజతం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ద్యుతీ చరిత్ర లిఖించారు. 1986లో పీటీ ఉష వంద మీటర్ల పరుగులో రజత పతకం సాధించారు. ఈ రికార్డును ద్యుతీ తిరగరాశారు. ఇక జకార్తా ఏషియాడ్ లో రెండు వందల మీటర్ల పరుగులో కూడా రజతం సాధించి ద్యుతీ జంట పతకాలు సాధించారు.

నపొలిలో 2019లో జరిగిన సమ్మర్ యూనివర్సైడ్ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి, ప్రపంచ స్థాయి పోటీల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ద్యుతీ రికార్డు నమోదు చేశారు.(1)[3] 2019 జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ సెమీస్‌లో 11.22 సెకన్లతో పరుగు పూర్తి చేసి తన జాతీయ రికార్డును తానే తిరగరాశారు. ఫైనల్‌లో 11.25 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం సాధించారు. (9)[10] (10)[6]

2019లో ద్యుతీ ఓ సంచలన ప్రకటనతో క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను స్వలింగ స్వపర్కంలో ఉన్నట్టు ఆమె ప్రకటించి అం

ద్యుతీ చంద్
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయం
జననం3 ఫిబ్రవరి 1996
జైపూర్, ఒడిషా
క్రీడ
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
పోటీ(లు)100 మీ., 200 మీ., 4x100 రిలే

దరినీ నివ్వెరపరిచారు. ఆమె ప్రకటనపై ఆమె కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ద్యుతీని కుటుంబం నుంచి వెలివేస్తామని, ఆమె సోదరి ప్రకటించారు. (5)[9]

ఎండార్స్ మెంట్ డీల్

[మార్చు]

2019లో ప్రముఖ క్రీడా దుస్తుల సంస్థ ప్యుమా ద్యుతీ చాంద్ తో తమ ఉత్పత్తుల ప్రచారానికిగాను రెండు సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకుంది.

  1. "introduction". the hindu.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 "introduction". times of india.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 "introduction". olympic date.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "introduction". olympic channel.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "introduction". olympic channel.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. 6.0 6.1 6.2 "introduction". bbc.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "career". the hindu.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. 8.0 8.1 "career". olympic channel.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. 9.0 9.1 "career". bbc.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "career". the hindu.{{cite web}}: CS1 maint: url-status (link)