వాడుకరి:Gogulapati Krishna Mohan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వీయపరిచయం:- గోగులపాటి కృష్ణమోహన్, కవి, రచయుత, జర్నలిస్టు

పేరు : గోగులపాటి కృష్ణమోహన్

తల్లి దండ్రుల పేర్లు : గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు.

భార్య పేరు: రేఖాజ్యోతి

సంతానం ఇద్దరు :

కూతురు పేరు నవ్యశ్రీ

కొడుకు పేరు అఖిల్ శ్రీవాత్సవ్

జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ.

నివాసం: సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్.

వృత్తి : కేబుల్ రంగం

ప్రవృత్తి : జర్నలిస్టు.

బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే.. సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, సహస్రవాణి శతపధ్య కంఠీరవ, సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ, తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం

జాగృతి కవితాంజలి వారి పురస్కారం (గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడం)

రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (రైతు హార్వెస్టర్ ఆద్వర్యంలో నిర్వహించిన బుక్స్ ఆఫ్ రికార్డ్ లో పాల్గొనడం జరిగింది)

తెలుగు రక్షణ వేదిక ఆద్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన 33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు ఏకదాటిగా నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని ఐదు రికార్డులతో కూడిన సర్టిఫికెట్ జ్ఙాపికను అందుకోవడం.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో కవితా పఠనం చేసి నగదు తో పాటు ప్రశంసా పత్రము పొందటం.

వనపర్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి జలకవితోత్సవం లో పాల్గొనడం...

బాద్యతలు: సలహాదారుడు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్, అల్వాల్ శాఖ.

కో-ఆర్డినేటర్ - బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్.

ఫౌండర్ : జి. ఆర్. కె. ట్రస్టు. (నా ఫౌండేషన్)

వ్యవస్థాపకులు : తెలుగు కవన వేదిక

వ్యవస్థాపక అధ్యక్షులు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం.

రచనలు, ఆటవెలదులు, కంద పద్యాలు కలిపి మూడుశతకాలు, యాబైకి పైగా వచన, భావ కవితలు. యాబై వరకు నానోలు

అభిరుచులు : సామాజిక సేవ, క్రీడలు, కవనాలు, సినిమాలు,  వార్తాసేకరణ, యాంకరింగ్, స్నేహం

నినాదం : కులరహిత సమాజం స్థాపిద్దాం....  ఆర్ధిక అసమానతలు తొలగిద్దాం....

చరవాణి నంబరు: 9700007653

ఇ.మెయిల్ :  krishnamohan138@gmail.com

బ్లాగు :  http://krishnamohan138.blogspot.in

విభిన్న రంగాలలో రాణిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్

విభిన్న రంగాలలో రాణిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్ (కవి, రచయుత, జర్నలిస్టు) తెలుగు కవన వేదిక వ్యవస్థాపకులు

ఒకవైపు కేబుల్ టీవీ రంగంలో రెండు దశాబ్దాలుగా పనిచేసి రాణిస్తూ.... ఇంకోవైపు జర్నలిస్టుగా తన ప్రవృత్తిని నిర్వర్తిస్తూ.... మరోవైపు కవిగా సామాజిక అంశాలపై తనకలాన్ని ఝులపిస్తూ... విభిన్నరంగాలలో తనప్రతిభను చాటుకుంటూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్.

అప్పటి నల్లగొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా కూనూరు గ్రామంలో జన్మించిన గోగులపాటి కృష్ణమోహన్ ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్ సర్కిల్ లోని సూరారంకాలని లో నివాసం ఉంటున్నాడు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తేది 17-12-2017న సాయంత్రం7.0 - 8-30 గంటల మద్య జరిగిన సమావేశంలో నేను "తేటతెనుగు భాష నా భాష" అనే కవితా పఠనము చేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణా గ్రందాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, నాళేశ్వరం శంకరయ్య తదితరుల చేతులమీదుగా మెమొంటో, శాలువా, నగదు పురస్కరం తో సన్మానించారు.

అటు జర్నలిస్ట్ గా ,ఇటు సమూహాల్లో ఉత్సాహం గా పాల్గొంటూ కుటుంబానికి దూరమైన భావన రాకుండా వారి ధర్మ పత్ని ని, ఇద్దరు పిల్లల్ని పద్య మకుటం గా ("జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల" అనే మకుటంతో) రెండు శతకాలకు పైగా భావరహిత పద్యాలను రాయడంతో పాటు.... ఎన్నో భావయుక్తమైన వచన కవితలు రాసి ఎన్నో అవార్డులు పొందారు.

వీరు రాసిన కవితలను ఒకసారి పరిశీలిస్తే

కల్తీ లేని మనిషి కలత చెంది రాసిన కల్తీ కవిత ఎంత అద్భుతమో వివిధ గ్రూపుల్లో తిరగడం సాక్ష్యం .

అలాగే వారి జర్నలిస్ట్ బ్రతుకునౌక కవిత ఎన్నెన్నో సమూహాల్లో ప్రయాణం చేసి తిరిగి వారికే వారి పేరు లేకుండా చేరడం చూసి కవిత గొప్పగా ఉంది అన్నమాట అని ప్రతికూలంగా ఆలోచించ గలిగిన స్థిత ప్రజ్ఞ త వారి సొంతం

ఇక నేడు చిద్రమౌతున్బ ఉమ్మడి కుటుంబాల మీద వీరు రాసిన వసుదైక కుటుంబం కవిత సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సప్ లో తిరగని సమూహమంటూ లేదు.

అవయవదానం గురించీ చక్కగా విశదీకరించిన కృష్ణ మోహన్ గారు అవయవాల దొంగతనం చేసే వైద్యుల పై మరో కవితలో సమరశంఖం పూరిస్తారు ..

నగరం లోని ట్రాఫిక్ ని ,అడ్డా కూలీ ల పాట్ల ని అలవోకగా తన కవితల్లో జోప్పిన్చారు

వ్యభిచారిణి అన్న కవితలో కూడా అప్రయత్నంగా నొ, అనుకోకుండానో, పిల్లల కోసం తప్పని పరిస్థితుల్లో ఆ కూపం లోకి దిగినా వారు అనుబవించే కష్టాల వివరణ మనకి వారి పట్ల జాలి కలిగేలా సాగిన కవితా ధోరణీ కృష్ణ మోహన్ గారిని బాధిత పక్ష పాతి గా మన ముందు ఉంచుతుంది

వీరి మారిన విలువలు కవిత నేడు సమాజ పరిస్తితి కి మారిన విలువల కి అద్దం పడితే ,పురాణాల పట్ల వీరి కున్న పట్టు యాగం -యోగం లో స్ఫుటం గా తెలుస్తోంది .

ఆలుమగలు ఎలా ఉండాలో కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయికి తల్లి చెప్పే బుద్ధుల్లా నేటి యువతకి ఎంతో అవసరమైన కవిత .

బాల్యం కవితలో మా వంటి వారికీ తెలియని కొన్ని ఆటలు తెలియజేస్తూ ,చిన్ననాటి ముచ్చట్లు గుర్తుతెస్తుంది .జై జవాన్ -జై కిసాన్ కవితలో రైతుని ఆత్మ త్యాగి గా, సైనికుడిని ప్రాణ త్యాగి గా పోలుస్తూ ఇద్దరికీ సమాన గౌరవాన్ని కల్పించారు .

ఉగాది పై రాసిన కవితలో ఉగాదులు మారుతున్నపుడు ఆకులు రాలుతున్నాయి , ప్రతిసారీ ఆదాయ, వ్యయాలు చూడ్డం తప్ప అనడం లో కొంత పరిస్తుతుల పట్ల నిరాశ పేదల బ్రతుకులు మార్పు లేదు అన్న చిన్న విమర్శ తొంగి చూస్తాయి.

ఇలా వచనం మాత్రమే కాక ,సీస, ఆటవెలదులు, కందము, తేటగీతి వంటి పద్యాలు కూడా అద్భుత భావం తో వెలువరించారు, అంతరంగాల పేరిట ఏకవాఖ్య కవితలను, నానోలను రాసి తోటి కవులప్రశంసలను పొందారు.

వీరు తెలుగు కవితా వైభవం వారిచే....సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, సహస్ర శతపద్య కంఠీరవ, సహస్ర పద్య కంఠిరవ, సహస్ర శతస్వీయ గానకోకిల, బిరుదులతో పాటు....

తెలుగు రక్షణవేదిక వారిచే జాతీయస్థాయి బతుకమ్మ పురస్కారాన్ని అందుకున్నారు.

దేశంలోని వివిధ బాషలలో సాహిత్య సేవలందిస్తూ ఎంతో మందికవులకు సోషల్ మీడియా ద్వారా వేదికగా నిలిచిన ప్రతిలిపి సంస్థ తమ సంస్థతో అనుసంధానం అయిన కవులు/రచయుతల పట్టాభిషేకంలో బాగంగా గోగులపాటి కృష్ణమోహన్ సాహితీ సేవలను గుర్తించి "ప్రతిలిపికవిప్రవీణ, ప్రతిలిపి కథా భారతి" అనే బిరుదు ప్రధానం చేసింది..

మూడు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్న గోగులపాటి కృష్ణమోహన్

తెలంగాణా రాష్ట్రం లో వరుసగా జరిగిన రెండు రికార్డు కవిసమ్మేళనాలలో, అనంతపురం లో జరిగిన మరో రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు గోగులపాటి కృష్ణమోహన్.

1) 09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి లో తెలంగాణా జాగృతి ఆద్వర్యంలో చేపట్టిన కవిసమ్మేళనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన సంగతి తెలిసిందే.

ఈ కవిసమ్మేళనం గోగులపాటి కృష్ణమోహన్ జోహార్ జోహార్ కాళోజి సార్, అమరవీరుల సాక్షిగా, కళ్తి కళ్తి కళ్తీ, జర్నలిస్టు బ్రతుకునౌక అనే స్వీయ రచనలను ఐదునిముషాలపాటు చదివి రికార్డు కవిసమ్మేళనంలో తన ప్రతిభ చాటుకున్నారు.

2) అదేవిధంగా 10-09-2017 ఆదివారం కరీంనగర్‌లో రైతు హార్వెస్టర్ సంఘం ఆద్వర్యంలో వేయిమంది కవులతో చేపట్టిన కవిసమ్మేళనం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు నమోదు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో గోగులపాటి కృష్ణమోహన్ ఆడ జన్మకు గర్వకారణం అమ్మ అనే కవితను చదవడమే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకవుల సముదాయంతో కూడిన దాశరథి ప్రాంగణానికి సమన్వయకర్తగా భాద్యతలను నిర్వహించి కార్యక్రమాన్ని సజావుగా నబపించి నిర్వాహకుల ప్రశంసలు పొందారు.

3) తెలుగు రక్షణ వేదిక వారిచే అనంతరం లో 33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడంతో పాటు ఐదు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ తోకూడిన పురస్కారాన్ని అందుకున్నారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాదు నగర కవులకు సమన్వయకర్తగా వ్యవహరించారు.


వీరు తెలుగు కవితా వైభవం సంస్థతో పలు ప్రాంతాలలో సాహితి కేంద్రాలను ప్రారంభిస్తూ .. GRK TRUST(నా ఫౌండేషన్) స్థాపించి పలు రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని సేవా బంధు పురస్కారంతో ప్రోత్సహిస్తున్నారు.

ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్.... ప్రతినిదితో మాట్లాడుతూ.. తాను ఆర్ధిక అసమానతలు తొలగిద్దాం కులరహిత సమాజం నిర్మిద్దాం అనే సత్ సంకల్పం తో ముందుకు సాగుతున్నానని, ప్రతి పేదవానికి విద్య, వైద్యం ఉచితంగా అందాలని... కులాధారిత రిజర్వేషన్లు కాకుండా పేదరికం అధారిత రిజర్వేషన్లు అమలయ్యేలా ఉద్యమానికి సైతం సిద్దమయ్యానని తెలిపారు, అందుకు కవులు కళాకారుల సహాయసహకారాలను తీసుకుంటున్నాని పేర్కొన్నారు

తెలుగు కవన వేదిక ద్వారా తెలుగు భాషాభివృద్దికోసం సత్ సంకల్పం తో ముందుకు సాగుతున్న గోగులపాటి కృష్ణమోహన్ సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం.

ఇంకా వీరి కలంనుండి సమాజానికి ఉపయోగపడే కవనాలు మరెన్నో రావాలని, సమాజానికి మరింత సేవ చేయాలని ఆశిద్దాం....

వీరి కవితల కోసం క్రింది బ్లాగును చూడగలరు.

http://krishnamohan138.blogspot.in/?

కేవుల్ రంగంలో.... గోగులపాటి కృష్ణమోహన్

[7/16, 1:28 PM] కృష్ణమోహన్ గోగులపాటి: కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై యేళ్ళు పూర్తి చేసుకున్న గోగులపాటి కృష్ణమోహన్.... (జన్మదిన ప్రత్యేకం)

1996 డిసెంబర్ లో సౌజన్య శాటిలైట్ నెట్వర్క్ లో రూపొందించిన వెల్కమ్ టు 97 కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమై... ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.

కేబుల్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన గోగులపాటి కృష్ణమోహన్ కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై వసంతాలను పూర్తిచేసుకున్నాడు.

జీడిమెట్ల సిటీకేబుల్ లో, మార్కెటింగ్ మేనేజర్ గా, ప్రోగ్రామ్ ఇంచార్జ్ గా, న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, న్యూస్ ఇంచార్జ్ గా పలు విభాగాలలో రాణించి సుమారు యాబైకి పైగా కార్యక్రమాలను రూపొందించి అందరిమెప్పు పొందాడు.

శుభోదయ కమ్యూనికేషన్ లో ఆపరేషన్ ఇంచార్జ్ గా మెదక్ జిల్లాలో పనిచేశాడు, హిందుజా హిట్స్ లో మెదక్, రంగారెడ్డి జిల్లాల టెరిటరీ మేనేజర్ గా కూడా పనిచేశాడు. డిజీకేబుల్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియానెట్ లో పనిచేస్తున్నారు.

తనకు హాబీలైన వ్యాసాలు, కవితలు, పద్యాలు రెండు శతకాలు రాసి తెలుగువేదిక ఆధ్వర్యంలో 2016 లో "సహస్ర కవిమిత్ర" బిరుదును కూడా పొందాడు.

వీటితో పాటు సురారం కాలనీ లోని శ్రీ నల్లపోచమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజసేవ లో సైతం తనవంతు పాత్రను పోషించాడు.

మరోవైపు తనకిష్టమైన వార్తా రంగంలో స్టింగర్ గా కూడా పనిచేస్తూ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్, అల్వాల్ శాఖకు అడ్వైజర్ గా తన సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా బ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ది కోసం తనవంతు భాద్యతగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఈ సందర్భంగా కృష్ణమోహన్ కేబుల్ సమాచార్ తో తన అభిప్రాయం తెలియజేస్తూ కేబుల్ రంగానికి పరిచయం చేసి తనకు సమాజంలో మరో జన్మను ప్రసాదించిన తెలంగాణ ఎఫ్. టి. ఎమ్. అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డికి తనెంతో ఋణపడి ఉంటానని తెలిపాడు.

కేబుల్ టీవీ రంగంలో సీనియర్లైన శ్రీకుమార్, ఇంతియాజ్ అహ్మద్, ఆర్కే సింగ్, మనీష్ మాథూర్, సత్య, కిషోర్, వికాస్ కన్వర్, ప్రతాప్ రెడ్డి లాంటి వారితో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని... వారి నుండి కేబుల్ ఇండస్ట్రీకి సంబందించిన ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాని పేర్కొన్నాడు.

ఇంతకాలం తనకు అన్నివిధాల సహాయ సహకారాలందించిన కేబుల్ ఆపరేటర్లకు తోటి సిబ్బందికి దన్యవాదాలు తెలియజేశాడు.

ఇలా విభిన్న రంగాలలో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న గోగులపాటి కృష్ణమోహన్ ఈ ఆగస్టు 13న తన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.