వాడుకరి:KAVADAPU LALITHA/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయరాఘవ నాయకుడు[మార్చు]

విజయరాఘవ నాయకుడు (క్రీ.శ.1633-1673 లో) తంజావూరు రాజ్య పాలకూడయ్యెను .ఇతడును తండ్రివలే స్వయముగా కవి. కవి పండిత పోషకుడు[1], రసికాగ్రగణ్యుడును.ఇతని సభామందిరము విజయరాఘవ విలాసము. ఇతడును సంగీత నాట్య కళాప్రియుడు. ఇతని ఆస్థానమున నాట్యకతైలు కేళికలు ,పదములు, దరువులు, పేరణులు మొదలగు అనేక నాట్య విశేషములను అభినయించేడివారు[2]. జోల, సువ్వాల ,ధవళ పదములు,ఏలలు మొదలగునవియు గానము చేయబడుచుండెడివి.అనేకములగు యక్షగానములు  ప్రదర్శింప బడుచుండెడివి.విజయరాఘవుడును,ఇతని కవులను  పెక్కు యక్షగానములను రచించిరి .పదకవితాపితామహుడు  క్షేత్రయ్య ఇతని ఆస్థానమునకు వచ్చి పదరచన చేసి కొన్నింటిని ఈ విజయరాఘవునకు అంకితమిచ్చినాడు.చెంగల్వ కాళకవి ఇతని ఆస్థానకవి .


రచనలు[మార్చు]

విజయరాఘవ నాయకుడు బహు గ్రంథకర్త . ఇతని రచనలు:

  1. రాజగోపాల విలాసము,
  2. చెంగమల వల్లీ పరిణయము ,
  3. గోవర్ధనోద్దరణము,
  4. రతి మన్మథ విలాసము ,
  5. రాస క్రీడ,
  6. నవనీతచోరము,
  7. పారిజాతాపహరణము,
  8. రుక్మిణీ కళ్యాణము,
  9. రాధామాధవ వివాదము,
  10. ధనాభిరామము,
  11. సత్యభామా వివాహము,
  12. ఉషాపరిణయము ,
  13. కాళియమర్థనము ,
  14. రఘునాథాభ్యుదయము ,
  15. ప్రహ్లాద చరిత్ర ,
  16. పూతనాహరణము,
  17. విప్లనారాయణ చరిత్ర ,
  18. సముద్రమథనము ,
  19. కృష్ణవిలాసము,
  20. ప్రణయ కలహాము ,
  21. కంస విజయము,
  22. జానకి కళ్యాణము ,
  23. పుణ్యక  వత్రము.

అను ఇరువది మూడు యక్షగానములను , రఘునాథ నాయకాభ్యుదయము, మోహినీ  విలాసము , పాదుకా సహస్రము  అను మూడు ద్విపదకావ్యములను , గోపికా గీతలు, భ్రమర గీతలు అను ఆంధ్రానువాదములను , ఫల్గుణోత్సవము అను రగడలు, చౌపదములతో కూడిన గ్రంథమును, రాజగోపాల దండకమును,వీర శృంగార సాంగత్యము , సంపంగిమన్నారు సాంగత్యము అను కావ్యములను , వీనితోపాటు వేడికోళ్ళు ,విన్నపములు , దరువులు, ఏలలు ,సుకీర్తనములు మొదలగు వానిని రచించెను .దీనినిబట్టి చూడగా విజయరాఘవుడు సామాజ్ర్యమునేకొక  కవితా సామ్రాజ్యమును కూడా ఏకచ్ఛత్రాధిపత్యముగా ఏలినట్లు గమనింపగలము. ఈ రచనలలో కాళి యమర్థనము, ప్రహ్లాదచరిత్రము, పూతనాహరణము. విప్లనారాయణ చరిత్రము, రఘునాథ  నాయకాభ్యుదయము, రఘునాథాభ్యుదయములు  మాత్రమే లభించుచున్నవి. ఇతడును ఎనిమిది భాషలందు  పండితుడు .ఇతని  సాహితీ సార్వభౌమత్యమునకు  చిహ్నముగా పాదమునకు రాయపెండారము అలంకరింపబడి  ఉండినదని కాళకవి రాజగోపాల విలాసమును బట్టి  తెలిసికొనవచ్చును . ఇతని సభలో శారదాధ్వజము  “ చామరానిల కందళ చరితమగును” ఒప్పుచుండెడిదట.విజయరాఘవుని రెండు మూడు కృతులను సంగ్రహముగ పరిచయము కావించుకొందము.

కాళియ మర్థనము[మార్చు]

కాళియ మర్థనము: ఇందలికథ భాగవతమున ప్రసిద్దిము, గోభిలుడు, గోప్రళయుడు  అను ఇద్దరు మునులు విజయరాఘవుని ఇలవేల్పాయిన రాజగోపాలస్వామిని కాళిందీ నాట్యమును చూడ కూతూహలముగా ఉన్నవాని ప్రార్థింపగా . ఆ రాజగోపాలుడు బాలకృష్ణుడై  కాలిందీతటమున నాట్యముచేసి కాళియ సర్పమును మర్ధించుట – ఇతడు నగరమునకు తిరిగివచ్చిన తరువాత సఖీజనము నీరాజనాదులను అర్పించి సత్కరించుట , కొలువుతీరుట ఇందలి కథ.    

ప్రహ్లాద చరిత్ర[మార్చు]

ప్రహ్లాద చరిత్ర : భాగవతమున ప్రసద్దిమయిన కథను స్వతంత్రమగు యక్షగానముగా విజయరాఘవుడు రచించెను .ఇందు హాస్యము మెండు.పాత్రలకు తగిన భాష ఉపయోగింపబడినది .ఇందలి ఆస్థాన సంతోషి విదూషకుని పాత్రవంటిది. ఇతనికి సంభాషణలు ఉండవు.కానీ ఇష్టమువచ్చినపుడు హాస్యముగా మాటలాడవచ్చును .

         “సలాము సలామయా దానవలామ !” అని అన్యాభాషాపదములు కూడా ఇందు ప్రయోగింపబడినవి.

         పూతనాహరణము : ఇదికూడ భాగవతప్రసిద్దము ,అయినను స్వతంత్రమగురీతిని యక్షగానముగ రచించెను. ఇందు ఆనాటి పౌరోహిత్యము,ఇతర సమకాలీన విషయములు సున్నితముగా వివరింపబడినవి.

విప్రనారాయణ చరిత్ర : ఇది వైష్ణవ భక్తుని కథ. పండెండ్రుమంది ఆళ్వారులలో విప్రనారాయణుడు ఒకడు. ఇతనిని తొండరడిప్పొడి ఆళ్వారు అనికూడా అందరు . ఇతని చరిత్ర మును పూర్వము చదలవాడ మల్లన్న. సారంగుతమ్మయ్యలు ప్రబుతములుగా రచించరి . విజయరాఘవనాయకుడు దీనిని యక్షగానముగా తీర్చిదిద్దేను . ఈ విప్రనారాయణ కథ విజయరాఘవుని  కాలములోనే గుడిలోనే  జరిగినట్లును ,చోళరాజే విజయరాఘవుడుగ అవతరించినట్లును కల్పింపబడినది . ఈ యక్షగానమండలి విశేషము చూర్ణిక.సమాసములులేని చిన్ని చిన్ని పదములతో కూడిన వచనరచననే చూర్ణిక అందురు .ఈ యక్షగానమున ఇది సంస్కృత భాషలో సంభాషనారూపముగ ప్రయోగింపబడినది.ఈ యక్షగానమున తెలుగు సంస్కృతములేకాక తమిళము కన్నడము కూడా ప్రయోగింపబడినది . ఈనాటి వచనగీతములవంటి మాటలు కూడా ఉన్నవి.

                                     “ మీతో మాకేటి  మాటలు

                                       వినబ్రాతిగాడు మీ పాటలు

                                       భవనంబులు పర్ణశాలలు

                                       మా పాటలు హరిమీద ఏలలు “      

ఈ విధముగ నూతన ప్రక్రియగా ఈ కావ్యము రూపుదిద్దుకొనినది.

రఘునాథాభ్యుందయము[మార్చు]

రఘునాథాభ్యుందయము : ఇది విజయరాఘవునిచే యక్షగానముగాను ద్విపదకావ్యముగాను రచించబడినది .రెండింటియందును కథ సమానమే.ఇతని తండ్రి రచించిన అచ్యుతాభ్యుదయమువలే  ఈ కావ్యమున దినచర్య,కొలువు దీరుట మొదలగు రఘునాథుని విషయములు ఇందు వర్ణింపబడినవి .ఈ యక్షగానమున రామభద్రాంబ మధురవానుల ఆశుకవితా విశేషములు వర్ణింపబడినవి .

విజయరాఘవుని ఆస్థానములో చెంగల్వకాళకవి ,కామరసు  వేంకటపతి ,కోనేటి దీక్షితకవి ,పురుషోత్తమ దీక్షితుడు మొదలగునవి  కవులతోపాటు పసుపులేటి రంగాజమ్మ అను కవియిత్రి కూడా కలదు .[3]

మూలాలు[మార్చు]

  1. "Leveraging the World Heritage Convention for transboundary conservation in the Hindu Kush Himalaya, 30â€"31 May 2019, Kathmandu, Nepal; ICIMOD Proceedings". 2019. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  2. Krishnaswami Aiyangar, Sakkottai (1919). Sources of Vijayanagar history. University of California Libraries. [Madras] : The University of Madras.
  3. "Vijaya Raghava Nayak", Wikipedia (in ఇంగ్లీష్), 2021-04-21, retrieved 2021-08-30