Jump to content

వాడుకరి:Kalasagary

వికీపీడియా నుండి

పరిచయం

[మార్చు]

నమస్తే

నా పేరు కళాసాగర్ యల్లపు, నేను చిత్రకారుడను, కార్టూనిస్టును మరియు రచయితను. నేను తెలుగు వికీపీడియా లో 2020 నుండి వ్యాసాలు రాస్తున్నాను. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం, డిశంబర్ 10 న,1971 లో. తల్లిదండ్రులు యల్లపు నరసింహమూర్తి, లక్ష్మీకాంతం. పెయింటింగ్ లోను, జర్నలిజంలోనూ డిప్లొమా చేసి, 1993 సం. నుండి విజయవాడలో స్థిరపడి వివిధ పబ్లికేషన్స్ లోనూ, పత్రికల్లోనూ చిత్రకారుడిగా, ఇలస్ట్రేటర్ గా పనిచేశాను. ప్రస్తుతం విజయవాడలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో యూజర్ ఇంటర్ ఫేస్ డిజైనర్ (User Interface Designer)గా పని చేస్తున్నాను.   

నా కార్యకలాపాలు

[మార్చు]

2001 సం.లో ఆంధ్రా ఆర్టిస్టు, స్కల్ఫ్టర్స్ అండ్ కార్టూనిస్టు అసోసియేషన్ (AASCA)ను స్థాపించి, రాష్ట్రంలోనున్న సుమారు 500మంది చిత్రకారుల, శిల్పుల, కార్టూనిస్టుల పరిచయాలతో 'ఆంధ్రకళాదర్శిని-1', 'ఆంధ్రకళాదర్శిని-2లను ప్రచురించాను. ఈ పుస్తకాలు కళాకారుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి, వారికి గుర్తింపురావడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ చిత్ర, శిల్ప కళాచరిత్రను తెలియజేసే 'తెలుగు చిత్రకళా వైభవం' పేరుతో 40 నిమిషాల వీడియో డాక్యుమెంటరీని, రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి చిత్రాలతో, జీవితచరిత్రను తెలియజేసే డాక్యుమెంటరీ సి.డి.ని రూపొందించాను. 165 మంది తెలుగు కార్టూనిస్టుల పరిచయాలతో-కార్టూన్లతో 2021లో 'కొంటె బొమ్మల బ్రహ్మలు ' పుస్తకాన్ని ప్రచురించాను. 'ఆస్కా' వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ రాష్ట్రస్థాయిలో అనేక పెయింటింగ్, కార్టూన్ పోటీలు, ప్రదర్శనలు, వర్కుషాప్లు నిర్వహించాను. 2002 సంవత్సరం విజయవాడలో జయదేవ్ గారు ముఖ్య అతిధిగా 'కార్టూన్ మేళా' ను నిర్వహించాను. విజయవాడ ఆర్ట్ సొసైటి కి ఉపాధ్యక్షులుగా వున్నాను.

వడ్డాది పాపయ్య శతజయంతి ఉత్సవాలు: 2021 సం.లో వపా శతజయంతి (1921-2021) వేడుకలు విశాఖపట్నం, విజయవాడలలో నిర్వహించి, ఈ సందర్భంగా వపా చిత్రకళాప్రదర్శనతో పాటు నేను, చలపతిరావు సంపాదకత్వం వహించిన 'వపాకు వందనం' రంగుల బొమ్మలతో ప్రచురించిన శతజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించాము.  

64కళలు.కాం (www.64kalalu.com)

[మార్చు]

ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా ఇంటర్నెట్ లో చదువుకునేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు 64కళలు డాట్ కామ్ (సకల కళల సమాహారం) అంతర్జాల పత్రిక (https://64kalalu.com/) పేరుతో వెబ్ మేగజైను నవంబర్, 2010సం. లో ప్రారంభించాను. [1]. ఈ వెబ్ మేగజైనుకు సంపాదకులుగా పుష్కరకాలంగా పత్రికను నిర్వహిస్తున్నాను. ఇందులో కళారంగానికి సంబంధించిన సకలకళల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తి ఉచితం. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతీవారు చదువుకోవచ్చు.  

ప్రముఖ పత్రికలలో కళారంగాలపై, కళాకారుల గురించి వందలాది వ్యాసాలు రాశాను. 2006 సం.లో ప్రపంచ ఆరోగ్య సంస్థ 'పొగాకు వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కార్టూన్ పోటీలలో “బెస్ట్ కార్టూనిస్ట్” అవార్డు అందుకున్నాను. అనేక చిత్రకళా ప్రదర్శలలోనూ, సెమినార్లలోనూ పాల్గొని ఎన్నో బహుమతులు అందుకున్నాను. చిత్రకళ, కార్టూన్ కళలపై ఆకాశవాణి లోను, దూరదర్శన్ లోను పలు ప్రసంగాలు, ఇంటర్వ్యూలు నిర్వహించాను. అనేక పెయింటింగ్, కార్టూన్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. 2010 సం.లో కోనసీమ చిత్రకళాపరిషత్, అమలాపురం వారి రజతోత్సవాలలో 'చిత్రకళా వైజయంతి' పురస్కారం అందుకున్నాను.

తెవికి లో నా వ్యాసాలు

[మార్చు]

చిత్రకారులు : 1. కౌతా రామమోహన శాస్త్రి ‎ 2. శ్రీనాథ రత్నశిల్పి వుడయార్ ‎ 3. గుర్రం మల్లయ్య 4. పన్నూరు శ్రీపతి ‎ 5. మజ్జి రామారావు 6. జింకా రామారావు 7. దాసి సుదర్శన్ 8. పల్లా పర్సినాయుడు 9. రాయన గిరిధర్ గౌడ్ 10. బొండా జగన్మోహనరావు 11. సురేష్ కడలి 12. కౌతా ఆనంద మోహన శాస్త్రి 13. రమేష్ గుర్జాల 14. మంచెం సుబ్రమణ్యేశ్వర రావు

కార్టూనిస్టులు: 1. కార్టూనిస్ట్ పాప ‎2. సుభాని (కార్టూనిస్ట్) 3. సురేంద్ర (కార్టూనిస్ట్)

నాటక రంగం : 1. మన్నే శ్రీనివాసరావు


ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.

మూలాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]