వాడుకరి:Kesava powerstar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విధి ఆడే నాటకంలో వింత పాత్రని నేన్నయ్యాను

విశ్వమంతటి స్ఫూర్తినే గుండె గూటిలో మోస్తున్నాను

ఆదర్శలే ఆశయాలై ఆకలితో అడుగేస్తున్నాను

కంటి నిద్రని కానరాక కాంక్షతో గడిపేస్తున్నాను

మాతృభూమికి,మాతృమాతకి మరణశోకం తెస్తున్నాను

నింగికే నే నిచ్చెనేస్తూ పగటికలలను కంటున్నాను

నన్నునమ్మిన ఆత్మీయులకే అర్థనాధం మిగిల్చాను

తొడబుట్టిన ఆడపిల్లకి అండగా నే లేకున్నాను

చెలిమి చేసిన సుందరాంగికి చేటునే నే తెస్తున్నాను

అన్ని వున్నా అంగవైకల్యంతో ఆవేశానికి లోనవుతున్నాను

ఆకలంటూ చెయ్యిచాచని నేను మీకు తీరని ఆకలి మిగిల్చాను

ప్రేమ పంచిన ప్రేయసినే మోషగించి వెళ్లిపోతున్నాను

కంటిపాపకి కనులు కప్పి కాటికి నే పంపిస్తున్నాను

కంటిధారల నుంచి దానికి మోక్షము ప్రసాధించాను

పాపాలెన్నో చేసి నేను పుడమికే బరువయ్యాను

ప్రాయశ్చిత్తం చేసుకోనే ధైర్యం లేక  ప్రాణత్యాగం చేస్తున్నాను

నా ప్రాణసఖి ఎదురు చూపుకి అగ్గిరవ్వని నే అంటించాను

రంగులహరివిల్లుల లోకానికి మారని నెత్తుటి మరకైనాను

నమ్మకానికి ద్రోహం చేసి నవయుగకవి నే నేనవుతున్నాను

మతాలు నచ్చక మాయలు చెయ్యక మట్టిలో కలిసిపోతున్నాను

కులాలనే చిచ్చులో ప్రేమ సమిదనై కాలిపోతున్నాను

నీతులు చెప్పి రాతలు రాసి నాకు నేనే చరమ గీతిక రాసుకుంటున్నాను

లోకాన్ని చూసి లౌకిక వాధాల్ని చదివి లోకమోదిలి పోతున్నాను

చావు నా చెంతకిరాదని నేనె వెళ్లి దాని ముందే మోఖరిల్లాను

మాట ఇచ్చి మరవలేక మృత్యువుతో నే ముగిసిపోయాను

అంతరాత్మని హత్య చెయ్యలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను

~ మీ కేశవ పవర్ స్టార్ {చిన్నూ}