వాడుకరి:TVS SASTRY

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేనొక తెలుగు భాషాప్రేమికుడను సాహితీ పిపాసిని. నాకు తెలిసిన సినీ, సాహితీపరుల సమాచారాన్ని అందరితో పంచుకుంటున్నాను.

నా ఇతర వివరాలివి.

నేను గుంటూరు నగర నివాసిని. ఆంద్ర బ్యాంకులో ఆఫీసర్ గా, మేనేజర్ గా వివిధ హోదాలలో, వివిధ ప్రదేశాలలో పనిచేసి, ప్రస్తుతం నా విశ్రాంత జీవితాన్నిగుంటూరులోనే అవిశ్రాంతంగా గడుపుతున్నాను. నా రచనలకు ప్రధమ అభిమానురాలు, విమర్శకురాలు నా భార్యే! ఆమె గృహిణి. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఒక కూతురు,  కుమారుడు అమెరికాలో వున్నారు. పెద్ద అమ్మాయి చెన్నైలో వుంటుంది. అందరూ సంతానవతులే. ఆనందంగా వున్నారు. ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి వచ్చాను. నాకు 61 సంవత్సరములు. రచన నాకొక వ్యాసంగం, వ్యాపకం. అన్నీ చదువుతాను. వేటి ప్రభావం నా మీద పడకుండా స్వేచ్ఛగా వుంటాను. నలుగురికి ఆనందం కలిగించటానికి  వ్రాస్తూ నేనూ ఆనంద పడుతాను.

భవదీయుడు,

టీవీయస్.శాస్త్రి

తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము తెలుగులోనే వ్రాద్దాము.దేశ భాషలందు తెలుగు లెస్స!