వాడుకరి చర్చ:Ahmed Nisar/పాతచర్చలు 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నిసార్ గారి వివరాలు[మార్చు]

నిసార్ గారూ, మీ ప్రస్థుత చిరునామా, ఫోన్ నంబరు తెలుపగలరా? నా మెయిల్ ఐ.డి naseerahamed@gmail.com, Phone Number 9440241727.--Syed Naseer Ahamed (చర్చ) 03:13, 8 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

దేవాగారు[మార్చు]

దేవాగారూ నమస్తే, వైజాసత్యగారు చెప్పినట్లు మీరు వాతావరణాన్ని ఆహ్లాద పరుస్తున్నారు. కృతజ్ఞతలు అందుకోండి. మీరిచ్చిన ఆంగ్లపదాలకు అర్థాలు ఇవ్వడానికి ప్రయత్నించాను;

Crazy = పిచ్చోడు (తన లోకంలో లీనమైన) , Cute = ముద్దైన (అందమైన), Dumb = మూగ (మౌన), Indifferent = వేరుగాలేని (సాధారణ), Winner = విజేత , Sinner = పాపి , Scientific = (స)శాస్త్రీయ.

అలాగే దీనిని ఓ సారి చూడండి;

" తన పిచ్చే తనకు ముద్దైన వేళ, తన నుండి వేరుగాని మౌనంతో పోరాటం సల్పుతూ, శాస్త్రాల ముసుగులో పాపాలు చేస్తూ, విజయాన్ని కోరుతూ ధరణిపై ధ్వజాన్ని ఎగురవేసేవాడా, ఎవరు నీవు? సాధారణ మానవుడివా? పండితుడివా? పామరుడివా? తన మేధోజ్వాలలతో ప్రపంచాన్ని దహింపజేసే జ్వాలాముఖివా? లేదా తన మేధోకాంతితో ధరిత్రిని వెలుగుతో నింపే దివిటీవా? "

(నాకు తెలుగులో కవిత్వం వ్రాయడం చేతగాదు, ఇది రాయి విసరడం లాంటిదే! దయచేసి భరించండి). :-). అహ్మద్ నిసార్ 19:38, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నన్ను దేవా అని పిలిస్తే చాలండి, గారు అవసరం లేదు, మీరు నాకంటే పెద్దవారు, నాకు ఆయుషు తగ్గిపోతుంది. δευ దేవా 22:29, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
బాగుంది నిసార్ గారూ! కానీ ఇది పొగడ్తో తిట్టో అర్థం కావడం లేదు. హహహ δευ దేవా 22:26, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శాస్త్రాల ఆధారంగా ధర్మాలు చేసేవాడు వెలుగును నింపే తేజస్వి, అలాగే శాస్త్రాల ముసుగులో పాపాలు చేసేవాడు ప్రపంచాన్ని దహింపజేసే జ్వాల. మీరు Sinner అనే చోట Virtuous లేదా Righteous పదాలు ఉపయోగించివుంటే, అర్థాలు విశాలంగా తయారయ్యేవి. :-) అహ్మద్ నిసార్ 13:51, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారూ! చాలా పెడర్థం తీసారండి మీరు, అక్కడ చెప్పిన పదాల్లో ఏ పదానికీ ఇతర పదంతో సంబంధం లేదు. వదిలేయండి. నా పదాలు వెనక్కి తీసుకుంటున్నా! δευ దేవా 17:05, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారూ, మీ మనస్సు నొప్పించింటే సారీ. మీరు పదాలను వెనక్కు తీసుకోనక్కరలేదు. వ్రాయండి, ఇంకా వ్రాయండి. మేధస్సును పదును పెట్టండి. ఈ జిజ్ఞాసే నిజమైన స్వచ్ఛమైన జీవితం. అహ్మద్ నిసార్ 17:14, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కన్ఫ్యూజన్[మార్చు]

చంద్రకాంతరావు గారూ, నమస్తే. భారత స్వాతంత్రోద్యమము లేదా భారత స్వాతంత్ర్యోద్యమము. వీటిలో ఏది సరైనది. కన్ఫ్యూజన్ లో పడ్డాను. దయచేసి తెలుపండి. అహ్మద్ నిసార్ 16:09, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే నిసార్ గారు, స్వాతంత్ర్యోద్యమమే సరైనది. ఎందుకంటే స్వాతంత్ర్యం పదం సరైనది కాని స్వాతంత్రం సరైనది కాదుకదా. ఈ రోజుల్లో కొందరు స్వాతంత్రం అనే సంక్షిప్తంగా వాడుతున్నారు కాని సరైన పదం మాత్రం స్వాతంత్ర్యమే. -- C.Chandra Kanth Rao-చర్చ 19:32, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల జాబితా[మార్చు]

చంద్రకాంతరావు గారూ నమస్తే. డెప్త్ గురించి రచ్చబండలో తెలిపారు ధన్యవాదాలు. అలాగే వికీపీడియా:మొలకల జాబితా లో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ పేరు మూడు సార్లు రిపీట్ అయినది, వరుస సంఖ్య 248, 249, 250. కానీ ఈ వ్యాసం మొలక స్థాయి దాటిందనిపిస్తుంది. దీనిని మొలకల జాబితానుండి తొలగించవచ్చా? అహ్మద్ నిసార్ 19:42, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్తే నిసార్ గారు, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ 3 సార్లు రిపీట్ కావడానికి కారణం దారిమార్పులే కారణమనుకుంటా, అన్నవరం (బడంగి) కూడా వరుసగా రెండు (172, 173) సార్లు రిపీట్ అయింది. అలాగే ఆది నారాయణ రావు కూడా 400, 401, 405, 406 లలో నాలుగు సార్లు వచ్చింది. ఆలూరి భుజంగరావు 463, 466 రెండు సార్లు, ఉషా కిరణ్ మూవీస్ 669, 670 రెండు సార్లు, ఉస్తాద్ ఫయాజ్‌ ఖాన్ 673, 674 రెండు సార్లు, ఎ. ఎమ్. రాజా 693, 694, 695 మూడు సార్లు, ఎక్స్-రే 712, 713 రెండు సార్లు ఇలా చూస్తే చాలా వ్యాసాలునాయి. అంటే మొలకల జాబితాలో రిపీట్ అయినవి తొలిగిస్తే మొలకల సంఖ్య మనం అనుకుంటున్న దాని కంటే కూడా తగ్గుతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 20:21, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. రిపీట్ అయిన వ్యాసాలలో ఒకదానిని ఉంచి మిగతావి తీసివేస్త్ఝాను (అవి మొలక స్థాయిలో వుంటే). మొలకల సంఖ్య తగ్గినట్టూ వుంటుంది. అహ్మద్ నిసార్ 20:24, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు, మొలకల జాబితాలో మొలక స్థాయిని దాటినవి తొలగించే అవసరం అంతగా లేదనుకుంటా, ఎందుకంటే మొలకల జాబితాను రెఫ్రెష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవి తొలిగిపోతాయి. దారిమార్పుల వల్ల రెండు కంటే అధికసార్లు వచ్చి వ్యాసాలు తొలగించడం మీఇష్టం. రిఫ్రెష్ చేయుముందు దీని ప్రోగ్రాంలో కొద్దిగా మార్పులు చేస్తే అవి కూడా తొలిగిపోతాయనుకుంటా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:29, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ బాటు స్క్రిప్టులో ఏదో తప్పు దొర్లినట్టున్నది. అందుకే కొన్ని దారిమార్పులు ఒకటికంటే ఎక్కువసార్లు వచ్చాయి. అవి సరిచేస్తాను --వైజాసత్య 22:08, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అదీ ఇదీ![మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! మీతో ఏదైనా చర్చించి చాలా కాలమయ్యింది. ఈ మధ్య ఆఫీసు పని అధికం కావడం వలన వికీపట్ల నా సమయం తగ్గింది. ఇతర భాషలనుండి ఆటొమాటిక్‌గా నమోదైన సభ్యులకు మీరు వ్రాస్తున్న స్వాగతం సందేశమైతే చాలా బాగుంది కాని ఇలా ఆటొమాటిక్‌గా నమోదైన సభ్యులకు ఒక్కొక్కరికీ స్వయంగా స్వాగతం వ్రాసే పద్ధతి మెయింటెయిన్ చేయడం కష్టమనుకొంటాను. దీనికి ప్రదీప్ ఏదో బాటు వ్రాసాడన్నట్లుగుర్తు. బాటు ద్వారా పని సులభమైతే గనుక మీరు సమయం ఇతర విషయాలలో ఉపయోగపడుతుంది. --కాసుబాబు 16:51, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబుగారూ నమస్తే, అవునండి మీరు చెప్పేది చాలా సమంజసంగానే వున్నది. ప్రదీప్ గారి బాటు ఇటువంటి విషయం చేస్తూవుంటే చాలా సంతోషం. సత్యమేమిటంటే కొంచెం బోరుకొట్టినప్పుడల్లా, కొత్త సభ్యులకు స్వాగతం పలికి తిరిగి రెఫ్రెష్ అయి దిద్దుబాట్లు మొదలెట్టే అలవాటు పడింది. కొత్తసభ్యుల లాగ్ వెతికి చూస్తే చాలా సభ్యులకు స్వాగతం పలకాల్సివుందని గ్రహించాను. అందుకే అపుడపుడు అలా చేస్తూ వచ్చాను. మీరు చెప్పింది దృష్టిలో వుంచుకుంటాను. అలాగే, నేను దిద్దుబాట్లు చేస్తున్న వ్యాసాలను అపుడపుడూ వీక్షిస్తూ తగు సూచనలిస్తూవుండండి.అహ్మద్ నిసార్ 20:34, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వాహ్ ఉస్తాద్ వాహ్[మార్చు]

నాగరాజుగారూ! నమస్కారం, శాస్త్రీయ సంగీతం పట్ల మీ అభిరుచి బహుచక్కగా వున్నది, వాహ్, అభినందనలు. :-) అహ్మద్ నిసార్ 19:45, 6 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారూ , మీరిస్తున్న ప్రోత్సాహానికి నా ధన్యవాదములు.--Nagaraju raveender 01:33, 7 ఏప్రిల్ 2009 (UTC) ---[ప్రత్యుత్తరం]

గిటార్ బాన్సురి వ్యాసాలు[మార్చు]

మీ గిటార్ మరియు బాన్సురి వ్యాసాలు బావున్నాయి.----Nagaraju raveender 17:07, 26 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శోభన పేజీ[మార్చు]

రవిచంద్రగారూ నమస్తే, నేనిప్పుడే లాగిన్ అయ్యాను, అదేదో అనుకోకుండా అన్-ఎక్స్‌పెక్టెడ్ క్లిక్ అయినట్టున్నది, తీరా చూస్తే శోభన పేజీలో కొద్ది మార్పులు జరిగినట్టున్నాయి. దీనిని కొంచెం సరిచేయగలరా. అహ్మద్ నిసార్ 11:28, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సరిపోయాయి. ఏమీ సరిచేయనక్కర్లేదు. — రవిచంద్ర(చర్చ) 11:32, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం విభజన, వర్గీకరణ వగైరా[మార్చు]

అహమ్మద్ నిస్సార్ గారూ? కొద్ది రోజుల క్రితం మనం భారతదేశం తాలూకాల వ్యాసాన్ని వభజించాలని చర్చించుకొన్నాము. ఇప్పుడు ఆ వ్యాసం పేరు గుర్తు రావడం లేదు. లింకు ఇవ్వగలరా? --కాసుబాబు 17:52, 15 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబుగారూ నమస్తే, ప్రత్యేకపేజీలు→వర్గీకరించని పేజీలు లోకి వెళ్ళి, అక్కడున్న పేజీలను వర్గీకరణ ప్రారంభించాను. ఆపని సవ్యంగా జరుగుతున్నదో లేదో, మీరు ఒక సారి "ర్యాండం చెక్ అప్" చేసి చెప్పండి. అహ్మద్ నిసార్ 18:22, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ పని సరైన దిశలోనే సాగుతున్నది. కొనసాగించండి. వివరంగా పరిశీలించి ఏవైనా సూచనలుంటే తెలియజేస్తాను --కాసుబాబు 19:52, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని విషయాలు గమనించగలరు -

--కాసుబాబు 04:42, 18 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలు[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, [వర్గం:వ్యాపారం], [వర్గం:వ్యాపారము], మరియు [వర్గం:వాణిజ్యం] గలవు. వీటిని అవసరరీత్యా ఏకం చేస్తే బాగుంటుందేమో, కొంచెం చెప్ప గలరు. లేదా వీటి గురించి మీరే ఒక చర్య గైకొనగలరు. అహ్మద్ నిసార్ 18:37, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే నిసార్ గారు, మీరు సూచించిన 3 వర్గాలు దాదాపు ఒకే అర్థంతో ఉన్నాయి. వర్గం:వ్యాపారంలో ఎలాంటి వ్యాసాలు లేవు కాబట్టి దాన్ని ఇప్పుడే నేను తొలిగించాను. ఇక అర్థశాస్త్రంలో ఉప వర్గంగా ఉన్న వర్గం:వాణిజ్యం లో వస్తువులు-->ఆయుధాలు ఉపవర్గంలో కత్తి, గద, ఆయుధం, బాణం తదితర అర్థశాస్త్రానికి సంబంధించని వ్యాసాలున్నాయి. అలాగే దేవతల ఆయుధాలు వర్గం, దుస్తులు వర్గం ఈ ప్రధాన వర్గం (అర్థశాస్త్రం)లో ఉండటం అవసరం లేదనుకుంటా. సమయమున్నప్పుడు వీటన్నింటినీ ఒక పట్టుపట్టడానికి ప్రయత్నిస్తా. శోధించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. వీలయితే మీరే సరిదిద్దండి. -- C.Chandra Kanth Rao-చర్చ 19:44, 18 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ బొమ్మలు, వ్యాసాలు[మార్చు]

అహమ్మద్ నిస్సార్ గారూ! మొదటి పేజీలో ప్రదర్శించే "ఈ వారం బొమ్మ" (వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా), మరియు "ఈ వారం వ్యాసం" (వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా) నిర్వహణలో పాల్గొనమని మిమ్మలిని కోరుతున్నాను. ఎక్కువగా నేనే ఈ పని చూస్తున్నందున కాస్త బోర్‌గా అనిపిస్తున్నది. అంతే కాకుండా మరో నాలుగు నెలలు నేను వివిధ పనులతో - (ఆఫీసు పనులు, స్వకార్యాలు, వికీ పనులు) బిజీగా ఉంటాను. ఈ నిర్వహణలో ఏవయినా సందేహాలుంటే వివరించడానికి ప్రయత్నిస్తాను. --కాసుబాబు 19:01, 20 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహమ్మద్ నిస్సార్ గారూ! 27వ వారానికి మీరు వ్రాసినది ఓకే. తరువాత చైనా మహా కుడ్యం వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2009|వారం=27}} అని వ్రాసాను చూడండి. ఎందుకంటే తరువాత ఈ వ్యాసాన్ని ఎప్పుడు వాడామో తెలుస్తుంది. --కాసుబాబు 16:59, 28 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

నిసార్ గారూ! మీ అభినందనలకు నా కృతజ్ఞతాభివందనాలు. ఈ శుభసందర్భంలో నాకు ఇంతకంటే మాటలు రావడం లేదు. — రవిచంద్ర(చర్చ) 04:31, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్[మార్చు]

Hi, can you take a look at this article? Looks like it's about బ్యాంబి and not The Fox and the Hound. Make it about The Fox and the Hound please, and expand it to the Bambi article's standrads. Thanks. 70.146.241.208 04:04, 8 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగత వ్యాఖ్యలు[మార్చు]

ఎవరైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినప్పుడు, మనం చేసిన మార్పులు సదుద్దేశంతో స్వీకరించనప్పుడు మనస్తాపం కలుగవచ్చు. కానీ సంయనం కోల్పోవద్దు. వివిధ సభ్యలు ఈ విషయానికి తగిన రీతిలోనే ప్రతిస్పందించారనుకుంటా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం --వైజాసత్య 03:24, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సదరు వ్యాసంలో చేసిన దిద్దుబాట్లతో ఎటువంటి సమస్యా లేదు. ఎంత శాంతపరులైనా ఎప్పుడో ఒకప్పుడు సంయమనం కోల్పోవడం సహజం. ఇతర సభ్యులు అలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలను సహృదయంతో అర్థం చేసుకుని ముందుకు సాగిపోదాం. ఒకవేళ ఎవరైనా సభ్యులు శృతి మించుతుంటే వారిని మందలించడానికి నిర్వాహక బృందం ఉంది కదా. కాబట్టి దాన్ని మీ స్మృతిపథం నుంచి చెరిపివేయండి. —రవిచంద్ర 04:45, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాదు. వికీలో చక్కగా సంయమనం పాటిసున్న మీరు మరికొంత సహనం వహించి ముందుకు సాగండి. మీ మీద నా కున్న గౌరవంతో ఇది వ్రాసాను.--t.sujatha 04:53, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులుగా ఇక్కడ జరిగిందేమిటో తెలియదు. గుట్టుచప్పుడు అనే మాటకు ఇక్కడ అర్థం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఏమి చేసిననూ అంతా బహిర్గతమే, ఎవరికీ తెలియకుండా మార్పులు చేయడం వీలుండదు. ఎలాంటి సందేశం లేకుండా మీరు మార్పులు చేసినందుకు కుమారరావు గారు ఆ దృష్టితో వ్రాసినట్లున్నారని బావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 20:37, 29 ఆగష్టు 2009 (UTC)

గిరిజనులు[మార్చు]

గడబ తెగల వారి గురించి పేజీ మొదలుపెట్టాను. సమాచారాన్ని చేర్చమని మనవి.Rajasekhar1961 10:00, 25 సెప్టెంబర్ 2009 (UTC)

ప్రాథమిక - ప్రాధమిక ఏది సరి[మార్చు]

బ్రౌన్ పదకోశం లో ప్రాథమిక సరియైనది. పత్రికలలో కూడా ఇదే వాడుతున్నారు. ప్రాధమిక విద్య ని మార్పు చేయనా (మీరు గతంలో చేసిన మార్పు)? అర్జున 04:20, 19 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారూ, అహ్మద్ నిసార్ గారు చాలాకాలంగా క్రియాశీలకంగా ఉన్నట్లు లేరు. --రవిచంద్ర (చర్చ) 05:12, 19 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, మీ హెచ్చరికకు ధన్యవాదాలు. ఇక వేచి చూడకుండా. నేను మార్పుచేస్తాను. అర్జున 06:43, 21 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి[మార్చు]

అహ్మద్ నిసార్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:33, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

మీరు తెలుగువికీలో చురుకుగా మరల పాల్గొంటున్నందులకు సంతోషం. --అర్జున (చర్చ) 05:41, 21 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

అహమ్మద్ నిస్సార్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:19, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుస్వాగతం[మార్చు]

నిసార్ గారూ, మిమ్మల్ని మళ్లీ ఇక్కడ క్రియాశీలకంగా చూడటం చాలా సంతోషం. రహ్మానుద్దీన్ గారు వికీసోర్స్‌లో ఖురాన్‌ను ఫీడిఎఫ్‌లో నుండి యూనీకోడ్లో వ్రాస్తే కార్యక్రమాన్ని చేపట్టారు. --వైజాసత్య (చర్చ) 01:37, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అహమ్మద్ నిస్సార్ గారూ ! తెవికీకి పునఃస్వాగతం . మీ అభినందనకు ధన్యవాదాలు. తెవికీకి విశేషసేవలందించిన మీ రాక ముదావహం. --t.sujatha (చర్చ) 12:40, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్తే నిసార్ గారూ, చాలా రోజుల తర్వాత చర్చలలోకొచ్చాము. నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:36, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Ahmed Nisar గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 13:31, 25 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

zwnj కీ గురించి వైజాసత్య (చర్చ) 13:31, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కుడివైపున కల లిప్యంతరీకరణ పెట్టెను గమనించారా, దానిలో మార్ప్చుకుంటూ చూడండి. తెలుగు వస్తుంది. మామూలుగా తెలుగుకు కంట్రోల్ ఎం కొడుతుంటాం కదా అదీ చూడండి...విశ్వనాధ్ (చర్చ) 04:01, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అభిరుచుల్లోకెళ్ళి రూపురేకల్లో వెక్టర్ అప్లై చేయండి. అవ్వకపోతే మీరు ఆగకుండా ఇది యూజ్ చేయండి.. http://lekhini.org/ కాపీ పేస్ట్...విశ్వనాధ్ (చర్చ) 14:04, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదాకు మద్దతు[మార్చు]

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:39, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు[మార్చు]

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:51, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుశ్రుతుడు[మార్చు]

నా దగ్గర గల గ్రంథాలయం లో గల ప్రాచీన శాస్త్రవేత్తల చరిత్రలు పరిశీలిస్తే "సుశ్రుతుడు" అని ఉన్నది. -- కె.వెంకటరమణ చర్చ 10:14, 10 ఆగష్టు 2013 (UTC)

అభినందనలు[మార్చు]

నిసార్ గారూ.. మీరు చేస్తున్న కృషి గొప్పది. అభినందనలు. మీ పేజి కింద ఉన్న లంకెల్లో తెవికీ లక్ష్యాలు స్పష్టంగా తెలియపరచారు. ఒక దిద్దుబాటు -ఆంధ్రప్రదేశ్ లో వికీ ప్రతినిథులు విభాగంలో 'టార్గెట్' అన్న పదాన్ని 'లక్ష్యం' అని మార్చాను నేను. అది మీ పుటలో అనుకుంటారేమోనని అనుమానం వచ్చి ఈ చీటి వ్రాస్తున్నాను... రామారావ్.

  • రామారావ్ గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీ మార్పుకీ, సహృద్భావానికినూ. అహ్మద్ నిసార్ (చర్చ) 12:28, 14 సెప్టెంబర్ 2013 (UTC)

ధన్యవాదం[మార్చు]

అహ్మద్ నిసార్ గారు, మీ అబిమానపూర్వక అభినందనకు నా ధన్యవాదం.పాలగిరి (చర్చ) 19:21, 8 అక్టోబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:Iqbal In 1934.JPG[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:Iqbal In 1934.JPG. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:37, 21 అక్టోబర్ 2013 (UTC)

మీ బ్లాగు[మార్చు]

చంద్రకాంతరావు గారూ, నేను నిన్ననే మీ బ్లాగు చూసాను (తొలిసారిగా), అద్భుతం, చాలా చాలా బాగుంది, అభినందనలు. గాడ్ బ్లెస్ యు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:44, 27 అక్టోబర్ 2013 (UTC)

మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. మీరుచూసినది తెవికీ నిర్వహణ బ్లాగేనా? ఎందుకంటే నేను ఇతర బ్లాగులు కూడా నిర్వహిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:45, 27 అక్టోబర్ 2013 (UTC)

సహాయ అభ్యర్థన[మార్చు]

సత్యగారూ, నాకు ఉర్దూ వికీలోనూ అకౌంటు వున్నది. 2008 జూలైలో చేరాను. దాదాపు 5000 పైబడి దిద్దుబాట్లు వున్నాయి. ఈ లింకు చూడండి.[1]. నా ఖాతా పేరు Ahmadnisar తో వున్నది. దీనిని నా తెలుగు ఖాతా "అహ్మద్ నిసార్" తో లంకె చేయదలచుకున్నాను. కారణం తెవికీ నుండి ఉర్దూ వికీలో ప్రవేశించాలంటే, పాత అకౌంటు Ahmadnisar పేజీకి పోవడం లేదు, "అహ్మద్ నిసార్" (ఎర్రలింకు) తో ప్రవేశం జరుగుచున్నది. ఉర్దూ వికీ లో పాత అకౌంటు అభిరుచులు పేజీ లింకు ఇది [2]తెవికీ మరియు ఉర్దూవికీ లో ప్రవేశించుటకు సుళువు మార్గం దయచేసి తెలిపేది, లేదా ఆ పని మీరే చేసి పెట్టేది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:54, 27 అక్టోబర్ 2013 (UTC)

ఇదివరకు చాలా మంది సభ్యులు ఒక్కో వికీప్రాజెక్టులో ఒక్కో పేరుతో వ్రాసేవారు. సభ్యపేజీలు ఆయా భాషలలో మార్చుకున్నారు. మెటావికీ దృష్ట్యా చూస్తే లేదా స్టీవార్డు తదితర ఎన్నికలలో ఇదిగందరగోళంగా కనిపించింది. తద్వారా గ్లోబల్ నామం తెరపైకి వచ్చింది. ప్రారంభంలో ఇది ఐచ్ఛికంగా ఉన్ననూ తర్వాత ఖచ్చితమైపోయింది. అంటే ఒక వికీలో లాగిన్ అయిన సభ్యుడు మరో వికీకి లింకులద్వారా చేరితే ఆటోమెటిగ్గా అక్కడా ఇదే సభ్యనామంతో పేజీ సృష్టించబడుతుంది (అదే పేరు లేనప్పుడు మాత్రమే). అదివరకే అక్కడ వారికి మరోపేరుతో అక్కౌంటు ఉన్ననూ పరిగణలోకి తీసుకోదు. అక్కడి అసలు అక్కౌంటుతో లాగిన్ అయి మళ్ళీ ఇక్కడకు చేరితో అక్కడి పేరుతో ఇక్కడా మరో సభ్యనామంతో కొత్త అక్కౌంటు సృష్టించబడుతుంది. మీకు కూడా ఇదే సమస్య ఎదురైంది. కాబట్టి ముందుగా మీరు నిర్ణయించుకోవాల్సింది ఏ పేరుతో గ్లోబల్ అక్కౌంటు ఉండాలా అని. అంటే ఇక్కడి తెలుగు నామంతోనా లేక ఆంగ్ల నామంతోనా అని ముందు నిర్ణయించి, తెలుగు నామమే ఉండాలంటే ఉర్దూ వికీ అధికారులను సంప్రదించి కొత్తగా తయారైన అక్కౌంటును తొలిగించి అదివరకు అక్కడ ఉన్న ఆంగ్లనామపు అక్కౌంటును తెలుగు పేరుకు తరలిస్తారు. అలాకాకుండా ఆంగ్లనామమే గ్లోబల్ అక్కౌంటుగాఉండాలంటే మాత్రం ఈపని తెవికీలోనే అధికారులు చేస్తారు. వైజాసత్యగారు అధికార హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారు కాబట్టి మరో అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. దీనిపై ఇంకనూ ఏమైనా సందేహాలుంటే తప్పకుండా అడగవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:01, 27 అక్టోబర్ 2013 (UTC)

విక్షనరీ[మార్చు]

విక్షనరీ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉన్నది. మీకు ఉర్దూ భాష మరియు తెలుగు భాష తెలిస్తే ఉర్దూ భాషనుండి తెలుగు భాషలోకి వచ్చి ప్రాచుర్యం పొందిన వాటిని విక్షనరీలో చేర్చి సహాయం చేయండి. తెలుగువారు పలికే ఉర్దూ పదాలు వ్యాసం ఒకసారి చూడండి. వీటిలోని ఉర్దూ పదాలను విక్షనరీలో చేర్చండి. Rajasekhar1961 (చర్చ) 09:51, 1 డిసెంబర్ 2013 (UTC)

వికీపీడియా:2013 కొలరావిపుప్ర[మార్చు]

అహ్మద్ నిసార్ గారు,వికీపీడియా:2013 కొలరావిపుప్ర పురష్కారానికై మీ పేరు ప్రతిపాదించాను.దయచేసి మీ సమ్మతి ప్రతిపాదన పత్రంలో తెలపండి.Palagiri (చర్చ)।

ధన్యవాదాలు పాలగిరిగారూ. అహ్మద్ నిసార్ (చర్చ) 04:51, 4 డిసెంబర్ 2013 (UTC)
వికీపీడియా:2013 కొలరావిపుప్ర/అహ్మద్ నిసార్ పేజీలో మీ సమ్మతిని తెలియజేస్తూ సంతకం చేయండి--కె.వెంకటరమణ (చర్చ) 14:04, 4 డిసెంబర్ 2013 (UTC)

చంద్రకాంతరావు గారి పేజీ లో చర్చ[మార్చు]

చంద్రకాంతరావుగారూ, నేనూ మొదట మీలాగే ఆలోచించాను, మీ ఆలోచన నిజమే అనిపించింది. ఉత్సవ కమిటీ, ప్రతిపాదిత సభ్యుల గురించి మరీ క్షుణ్ణంగానూ సూక్ష్మంగాను చూసి వారే నిర్ణయించి పురస్కారం ప్రకటించి వుంటే బాగుండేది. కాని ఇక్కడ ఒక మెలిక పెట్టారు, అది "ప్రతిపాదిత సభ్యుడు" తమ సంమతాన్ని లేదా అంగీకారాన్ని తెలపాలి. కరెక్టుగా ఇక్కడే "పోటీ" ఏమో లాంటి భావన వస్తుందనే భావన పుట్టుకొస్తుంది. ఉదాహరణకు నేను ఉపాధ్యాయునిగా పనిచేసే రోజుల్లో, (ఐచ్చిక పదవీ విరమణ పొందాను) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇచ్చేవారు, విద్యాశాఖయే గుర్తించి పురస్కారం ప్రకటిస్తుందేమో అని అనుకొనే వాడిని. కాని, దానికీ దరఖాస్తు చేసుకోవాలని చాలాకాలం తరువాత తెలియ వచ్చింది. తెలిసిన తరువాత ఆ పురస్కారాల విషయం గురించి మనసు నుండి పూర్తిగా తీసివేసాను. పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? అనే భావన బలంగా వుండేది. నేను అలాగే ఉండిపోయాను, నా కన్నా అతి తక్కువ సేవ చేసిన వారు (ఈ వాక్యం వ్రాయడం అసభ్యమని తెలిసినా వ్రాసాను - సభ్యులు అన్యదా భావింపక మన్నించండి) జాతీయ పురస్కారాలు, రాష్ట్ర, జిల్లా పురస్కారాలు పొందారు. అది వేరే మైదానం. కాని ఇక్కడ విషయం వేరు. ఇక్కడ ప్రభుత్వ శాఖ లేదు, ప్రభుత్వ మెకానిజం లేదు. ఇక్కడ మనందరం ఒక కుటుంబం లాంటి వారము, మనలో కొందరిని, మనమే గుర్తుంచుకోవాలి. మీ మనసు మరియు భావాలు, ఎమోషన్స్ నాకు అర్థమయ్యాయి. స్పోర్టివ్ గా తీసుకుని మీరు సమ్మతిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి పురస్కార ప్రక్రియలు రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి. ఈ ఉత్సవాలలో మీ పాత్ర మరియు పాల్గొనడం ఎక్కువగా ఉంటుందనే భావించాను. సత్యగారన్నట్టు మీలాంటివారిలా తప్పుకుంటే ఉత్సవాన్ని నీరుగార్చినట్టు ఉంటుంది. సత్యగారూ తెవికీ అధికార హోదా నుండి తప్పుకుని తెవికీని వీక్ చేశారు (నా స్వంత భావన). మీరూ ఈ పోటీల నుండి విరమించకండి. నిర్ణయం మార్చుకోండి. ప్రతిపాదిత సభ్యుల లిస్టులో అగ్రస్థానం మీదే. అహ్మద్ నిసార్ (చర్చ) 04:46, 4 డిసెంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర పురస్కారం[మార్చు]

(చంద్రకాంతరావు గారి చర్చాపేజీ నుండి ఇక్కడ అతికించాను) :

నా పేరు ప్రతిపాదించిన పాలగిరి గారికి, సమర్థించిన రమణ, అహ్మద్ నిసార్ గార్లకు కృతజ్ఞతలు. గత రెండు దశాబ్దాల నుంచి నా జీవితమే తెలుగు "విజ్ఞానా"నికై ధారబోస్తున్నాను. అది తెవికీ కావచ్చు, బ్లాగులు కావచ్చు, నా స్వంత విజ్ఞాన చంద్రస్వం కావచ్చు, జికె ప్రశ్నలు కావచ్చు, సలహా-సంప్రదింపులు కావచ్చు. తెలుగుకు సంబంధించి రెండు పెద్ద ప్రాజెక్టు పనులలో ఉన్నాను. విధినిర్వహణలో భాగంగా ఉన్నప్పుడు కూడా సమాచార సేకరణకై ప్రయత్నిస్తున్నాను. మండల మరియు జిల్లా స్థాయికి సంబంధించిన అన్ని గణాంకాలను సేకరించియున్నాను. తెలుగు విజ్ఞానానికి సంబంధించి రోజూ కనీసం ఐదారు గంటలు విజ్ఞానానికై సమయం వెచ్చించడంలో భాగంగా తెవికీలో కూడా నేను ఆరేళ్ళ నుంచి కొంతవరకు కృషిచేసి ఉన్నానేమో! ఇన్నేళ్ళ తెవికీ కృషిలో భాగంగా పురస్కారం పొందడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని పోటీపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిపాదనకు సమ్మతి తెలపడం లేదని చెప్పదలుచుకున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:58, 3 డిసెంబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావు గారూ ఇది పోటీ కాదు, కేవలం అర్హులైన వారిలో పదిమందిని గుర్తించేందుకు జరుగుతున్న కసరత్తు మాత్రమే. ఏదో పక్షపాతంతో కొంత మంది సభ్యులను ఎంపిక చేసారన్న అపవాదు రాకుండా ఉండటానికే కొన్ని సంఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాము. అంతమాత్రాన ఇది పోటీ కాదు. ప్రతిపాదితులు ఇలా తప్పుకుంటే ఈ ఉత్సవాన్ని నీరుగార్చినట్టు ఉంటుంది. దయచేసి మీ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అభ్యర్ధిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 03:00, 4 డిసెంబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావుగారూ, నేనూ మొదట మీలాగే ఆలోచించాను, మీ ఆలోచన నిజమే అనిపించింది. ఉత్సవ కమిటీ, ప్రతిపాదిత సభ్యుల గురించి మరీ క్షుణ్ణంగానూ సూక్ష్మంగాను చూసి వారే నిర్ణయించి పురస్కారం ప్రకటించి వుంటే బాగుండేది. కాని ఇక్కడ ఒక మెలిక పెట్టారు, అది "ప్రతిపాదిత సభ్యుడు" తమ సంమతాన్ని లేదా అంగీకారాన్ని తెలపాలి. కరెక్టుగా ఇక్కడే "పోటీ" ఏమో లాంటి భావన వస్తుందనే భావన పుట్టుకొస్తుంది. ఉదాహరణకు నేను ఉపాధ్యాయునిగా పనిచేసే రోజుల్లో, (ఐచ్చిక పదవీ విరమణ పొందాను) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇచ్చేవారు, విద్యాశాఖయే గుర్తించి పురస్కారం ప్రకటిస్తుందేమో అని అనుకొనే వాడిని. కాని, దానికీ దరఖాస్తు చేసుకోవాలని చాలాకాలం తరువాత తెలియ వచ్చింది. తెలిసిన తరువాత ఆ పురస్కారాల విషయం గురించి మనసు నుండి పూర్తిగా తీసివేసాను. పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? అనే భావన బలంగా వుండేది. నేను అలాగే ఉండిపోయాను, నా కన్నా అతి తక్కువ సేవ చేసిన వారు (ఈ వాక్యం వ్రాయడం అసభ్యమని తెలిసినా వ్రాసాను - సభ్యులు అన్యదా భావింపక మన్నించండి) జాతీయ పురస్కారాలు, రాష్ట్ర, జిల్లా పురస్కారాలు పొందారు. అది వేరే మైదానం. కాని ఇక్కడ విషయం వేరు. ఇక్కడ ప్రభుత్వ శాఖ లేదు, ప్రభుత్వ మెకానిజం లేదు. ఇక్కడ మనందరం ఒక కుటుంబం లాంటి వారము, మనలో కొందరిని, మనమే గుర్తుంచుకోవాలి. మీ మనసు మరియు భావాలు, ఎమోషన్స్ నాకు అర్థమయ్యాయి. స్పోర్టివ్ గా తీసుకుని మీరు సమ్మతిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి పురస్కార ప్రక్రియలు రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి. ఈ ఉత్సవాలలో మీ పాత్ర మరియు పాల్గొనడం ఎక్కువగా ఉంటుందనే భావించాను. సత్యగారన్నట్టు మీలాంటివారిలా తప్పుకుంటే ఉత్సవాన్ని నీరుగార్చినట్టు ఉంటుంది. సత్యగారూ తెవికీ అధికార హోదా నుండి తప్పుకుని తెవికీని వీక్ చేశారు (నా స్వంత భావన). మీరూ ఈ పోటీల నుండి విరమించకండి. నిర్ణయం మార్చుకోండి. ప్రతిపాదిత సభ్యుల లిస్టులో అగ్రస్థానం మీదే. అహ్మద్ నిసార్ (చర్చ) 04:46, 4 డిసెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారూ, ఈ విషయమై పునరాలోచించారా ?? మీరు, సత్య గారూ ఘటికులండీ. వారు అధికారి పదవినుండి తప్పించుకున్నారు. మీరు అధికారి బాధ్యతను తిరస్కరించారు. ఈ పురస్కారాల విషయమై తిరస్కరించారు. రాబోయే కాలం తెవికీ కొరకు ఉజ్వలంగా వున్నది. సభ్యులు పెరుగుతున్నారు. వ్యాసాల స్థాయీ పెరుగుతున్నది. మీరిలా స్తబ్దుగా ఉండిపోవడం ఏమీ బాగాలేదు. కార్యక్రమాలన్నీ సజావుగానే జరుగుతున్నాయి. కాదనను. మరీ ముఖ్యంగా, అర్జున గారు, లోహిత్ గారు, సుజాత గారు, రహ్మానుద్దీన్ గారు, సత్యగారూ, రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారూ మిగతా అందరు సభ్యులూ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే అదునైన సమయం. వికీ స్పీడు పెంచి, భారత్ లోనే నెంబర్ ఒన్ కావడానికి. ఈ రోజు కోసమే మేమందరమూ సంవత్సరాల తరబడీ శ్రమించాం. స్తబ్దుగా వుండే సభ్యులందరికీ మేల్కొలపండి. అహ్మద్ నిసార్ (చర్చ) 15:35, 4 డిసెంబర్ 2013 (UTC)
నిసార్ గారూ, నేను పురస్కారాన్ని తిరస్కరించడం లేదండి. పోటీ మాత్రం వద్దంటున్నాను. ఒక సభ్యుడు పేరు ప్రతిపాదిస్తే చాలు మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడు అంగీకారం తెలపడం నాకు నచ్చడం లేదు. తెవికీలో ఎవరేమీ చేసిననూ బహిర్గతమే. అలాంటప్పుడు మళ్ళీ ఒక్కో సభ్యుడికి పేజీలు సృష్టించి వాళ్ళ సంతకాలు తీసుకోవడం, ఇతర సభ్యుల మద్దతులు (అవసరమా? ఇది ఓటింగు కాదు కదా!) అనవసరమని నా అభిప్రాయం. మిగితా విషయాలు రచ్చబండలో వ్రాస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:50, 4 డిసెంబర్ 2013 (UTC)
వైజాసత్య గారూ, మీరు తెలిపినట్లు నేను పునఃసమీక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఉత్సవాన్ని నీరుగార్చిన అపవాదు నాపై రాకుండా చేస్తాను. కాని ఈ ప్రక్రియ అంతా నాకు పోటీలాగానే కనిపిస్తోంది. ఒక సభ్యుడు ప్రతిపాదించిన తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా? ఇతర సభ్యుల మద్దతులు ఎందుకు అనేది అర్థం కావడం లేదు. తెవికీలో ఎవరి కృషి ఏమిటో మొదటి నుంచీ పరిశీలిస్తున్న మీకు బాగా తెలుసు, దాని ఆధారంగానే ఎంపిక చేస్తే బాగుండేది. పది మందిని ఎంపిక చేయడానికి పలువురి సంతకాలు తీసుకొంటే కొందరిని ఉత్సాహపర్చిననూ మరెందరినో నిరుత్సాహానికి గురిచేయలేమా? ఇక్కడ ఎవరికి వారు తాము మంచి కృషి చేస్తున్నామనే అనుకుంటారు, ఇలాంటప్పుడు తమకు గుర్తింపు రాలేదన్న నిరుత్సాహాన్ని దశాద్బి ఉత్సవ శుభవేళ కొందరికి కలిగించకపోవడమే మంచిది. ఆంగ్లవికీ లాగా మనది పరిణతి చెందినది కాదు, చిన్న సమూహం పెద్ద ఆటుపోట్లను తట్టుకోజాలదు. దశమ వార్షికోత్సవ సందర్భంగా కొందరికి తేనెను పంచాలనే నిర్ణయాన్ని నేను కాదనను కాని దీనికై తేనెతుట్టెనే కదిలించడం ప్రమాదమే. అర్హులు ఎంపిక కాకపోయినా, అనర్హులు ఎంపికైనా తర్వాత వాదవివాదాలు షరామామూలే. అయితే ఎవరికీ ప్రమాదం లేకుండా మధురాన్ని పంచే సత్తా మీకుందనే అనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:04, 4 డిసెంబర్ 2013 (UTC)
బైగాడ్ ఈవిషయమై "ఒక సభ్యుడు ప్రతిపాదించిన తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా? ఇతర సభ్యుల మద్దతులు ఎందుకు అనేది అర్థం కావడం లేదు", నా మనస్సులొనూ ఇదే భావన వచ్చింది. అందుకే నేను నా ప్రతిపాదిత పేజీలో సంతకం చేయలేదు. రహమతుల్లా గారు కూడా ఇదే విషయమై సంతకం చేయలేదేమో అనే సందేహమూ వచ్చింది. వారి చర్చాపేజీ చూడండి.

కానీ, తోటి సభ్యులూ మాలాంటివారేగదా. వారి ఉద్దేశ్యాలూ మంచివే గదా. బహుశా, తొలుత ప్లానింగ్ జరిగేటపుడే కొద్దిగా దారిమల్లినట్లున్నది. ప్లానింగ్ జరిగేటపుడు సూచనలివ్వకపోవడంలో మా పొరపాటూ వున్నట్లేకదా. ఏది ఏమైనా, సోదర సభ్యులు చాలా శ్రమిస్తూ పనిచేస్తున్నారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారిని ప్రోత్సహిద్దాం. పురస్కారాల విషయమై నేను చాలా ఆలోచనలలో పడ్డాను. పురస్కార సంఘం, ఇంకో సంఘం అని, సత్య గారిని, రాజశేఖర గారిని, సోదరి సుజాత గారిని, అర్జున గారిని, విశ్వనాథ్ గారిని, ప్రసాద్ గారిని, ఇంకా ఇతర సభ్యులనూ పక్కన పడేశామోనని గిల్టీ గానూ ఫీల్ అయ్యాను. దశాబ్దాంతం చేసుకుంటున్న ఉత్సవాలలో మూలస్తంభాలైన వారిని పక్కన పెట్టేశామోనని భావన కలిగినది. సాధారణముగా సాంవత్సరిక ఉత్సవాలలోని సంఘాలలో వీరిని పక్కన బెట్టి, వీరి ద్వారా కొత్త వారికి పురస్కరిస్తే బాగుంటుంది. అయినా సమయం మించి పోలేదు, పురస్కారాలు పదికి బదులుగా ఇరవై ఐన పరవాలేదు, వీరినీ పురస్కరిస్తే బాగుంటుంది. మనసులోని మాట పెట్టాను. దీనిని అమలు చేయక పోయినా పరవాలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:39, 4 డిసెంబర్ 2013 (UTC)

నిసార్ గారూ, అసలు 10 మందికి పురస్కారాలు ఇవ్వడం కంటే కృషిచేసిన వారందరికీ సన్మానం చేస్తే సరిపోయేది. పదిమందికి ఇచ్చిననూ రహస్యంగా జాబితా ఉంచి ఉత్సవాల ముందు ప్రకటించినా బాగుండేది. ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియవల్ల సభ్యులకు అనవసరంగా ఆశలు కల్పించినట్లవుతుంది. ప్రతిపాదిత పేజీలో తమ కృషిని వ్రాసుకోవడానికి అందరూ సిద్ధపడరు, మరికొందరు కొండంతగా చూపిస్తారు. వ్రాసినా వ్రాయకపోయినా ఇక్కడ జరుగుతున్న, సభ్యులు చేస్తున్న కృషి గమనించే ప్రతి ఒక్కరికీ తెలుసు, కాబట్టి దీన్నే ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తే బాగుండేది. తమకు పురస్కారం వస్తుందని భావించినవారు చివరకు అది రానప్పుడు నిరుత్సాహంకు గురికావడం సాధారణమే. అదే విధంగా ఎంపికకు, ఎన్నికకు తేడా ఉంటుంది. ఎంపిక అన్నప్పుడు సభ్యుల ఒప్పుకోలు అవసరం ఉండదు. ఉన్నవారి నుంచి కొందరిని గుర్తించడమే ఎంపిక. ఇదివరకు జరిగిన స్కైప్ సమావేశాలలో సమయం నాకు అనుకూలంగా లేదు, లేకుంటే నేనూ పాల్గొని నా అభిప్రాయాలు చెప్పేవాడిని. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:00, 4 డిసెంబర్ 2013 (UTC)
అవునండి, జరిగిందేదో జరిగిపోయింది, సహ్రుద్భావంతో మెలిగి తెవికీని కీర్తి-పతాకాలకు తీసుకు వెళదాం. మీరు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించారు, మా కోరికను మన్నించారు, ధన్యవాదాలు. అలాగే, అధికారి హోదానూ అలంకరించండి, వైజాసత్య గారికి కూడా కోరుదాం, అధికారి హోదాను తిరిగి స్వీకరించమని. ఇప్పుడుండే అధికార టీం చాలా చాలా బాగుంది, నిర్వాహకుల టీం కూడా బాగుంది, ఒకరిద్దరు నిర్వాహకులనూ పెంచండి, అధికారులూ నిర్వాహకులూ వ్యాసాలూ వ్రాయటం లోనూ, దిద్దుబాట్లలోనూ దిట్టలు. వారిని ప్రోత్సహిద్దాం. కొత్త వారికినీ నిర్వాహకాలిద్దాం. చక్కటి ఔత్సాహికులు కొత్తవారిలో వున్నారు. పతకాలివ్వండి, పరస్పర గౌరవాలు, ప్రోత్సాహకాలు, తెవికీని ఇంకా ముందుకు నడిపిస్తాయి. మీరు అంతా తెలిసినవారు, చట్టాపట్టాలేసుకుని నడిచే - నడిపించే గుణం మీలో వుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:07, 4 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు / షుక్రియా[మార్చు]

నమస్కారం Ahmed Nisar గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 19:54, 4 డిసెంబరు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Ahmed Nisar గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 04:19, 5 డిసెంబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

అర్జున (చర్చ) 04:19, 5 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

అహ్మద్ నిసార్ గారికి ధన్యవాదాలు.

Naidugari Jayanna (చర్చ) 10:26, 5 డిసెంబర్ 2013 (UTC)

ఫోటో అప్-లోడ్ విధానం[మార్చు]

{{సహాయం కావాలి}} ఫోటో అప్-లోడ్ విధానం తెలుపవలెను.-- అహ్మద్ నిసార్ (చర్చ) 12:09, 11 డిసెంబర్ 2013 (UTC)

మీరు ఇంతకు ముందు ఫోటోలు ఎక్కించారు కాబట్టి, మీ సందేహం ఇటీవలి ప్రవేశపెట్టిన ఫైల్ అప్లోడ్ విజర్డ్ గురించి అనుకొని స్పందిస్తున్నాను. పాత పద్దతిలో నకలుహక్కులపై పాక్షిక అవగాహన కలవారు ఎదైనా ఫోటోలను ఎక్కించే అవకాశం ఎక్కువవుండీ ఆ తరువాత ఫోటోలను వికీపీడియాలో వినియోగానికి సరిపడినవేనా, కాదా అని నిర్ణయించడానికి చాలా నిర్వహణ పనులు చేయవలసినందున, ఆంగ్లంలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు, దానినే తెలుగులో స్థానికీకరణ చేసి వాడుతున్నాము. దీని ద్వారా సాధారణ సభ్యులు కూడా ఈ ప్రక్రియలో కనబడే ప్రవేశపెట్టెలలో కనబడే సూచనలు చదివి తగిన సమాచారం చేర్చితే ఫోటో గురించి సమగ్ర సమాచారం తగిన మూసల ద్వారా ఫోటో పేజీలో చేరుతుంది. అప్పుడు సహసభ్యులు ఈ ఫోటోల నకలుహక్కులను, వికీపీడియా వినియోగాన్ని ధృవీకరించడం సులభమవుతుంది. కొత్త పద్ధతిలో ముఖ్యంగా తెలుసుకోవలసినవి, మీరు ఫొటో ఏ వ్యాసంలో వాడదలచుకున్నారో ఆ వ్యాసం పేరు, ఆ ఫోటో మీరు తీసినదైతే, తీసిన తేదీ, మరియు తగిన లైసెన్స్ సమాచారం. ఒకవేళ మీరేదైనా పొరబాటు సమాచారం నింపితే ఆ తరువాత ఫొటో పేజీలో సవరణలు చేయవచ్చు దీనిని గురించి మరింత తెలుసుకోటానికి ఫొటో ఎక్కించే ప్రయత్నం చేయండి. సందేహాలుంటే ఆ ఎక్కింపు చర్చా పేజీలో రాయండి. --అర్జున (చర్చ) 00:25, 12 డిసెంబర్ 2013 (UTC)
పై సమాధానం పై మీ స్పందన తెలపండి. ఇంకే సందేహాలు లేకపోతే ఆ పైన గల మూసను అచేతనంచేయండి లేక అచేతనం చేయమని కోరండి. --అర్జున (చర్చ) 10:31, 14 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:32, 13 డిసెంబర్ 2013 (UTC))

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:43, 14 డిసెంబర్ 2013 (UTC))

పతకం[మార్చు]

నిస్సార్ గారూ, పతక ప్రధానమునకు ధన్యవాదములు. నా కృషిని గుర్తించి మీరు అందించిన ఈ పతకం తెవికీలో మరిన్ని రచనలు చేసేందుకు నన్నెంతగానో ప్రోత్సహించినదని సవినయముగా తెలియచేసుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:38, 20 డిసెంబర్ 2013 (UTC)

గుంబద్ పేజీ సృష్టి విషయమై[మార్చు]

వాడుకరి:అహ్మద్ నిసార్ గారు, మీరు గుమ్మటం అనే వ్యాసం ఉన్నప్పటికీ గుంబద్ అనే వ్యాసాన్ని సృష్టించారు. దయచేసి గమనించి, రెంటినీ విలీనం చేయగలరు. ఈ మధ్య నా వల్ల కూడా ఇలాంటి తప్పు ఒకటి జరిగింది. మనం వ్యాసం సృష్టించే ముందు ఆ వ్యాసం యొక్క అనేక రూపాలలో వెతికి దొరకని పక్షంలో మాత్రమే కొత్త వ్యాసాలు సృష్టించగలం, లేదా పాత వ్యాసాన్ని అభివృద్ధి పరచగలమని తెలియచేస్తున్నాను. -రహ్మానుద్దీన్ (చర్చ) 04:28, 27 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:30, 28 డిసెంబర్ 2013 (UTC)

శుభాకాంక్షలు[మార్చు]

తెవికీకి మీరు చేసిన కృషికి గానూ కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియనుగా ఎన్నికయినందుకు శుభాకాంక్షలు.--రహ్మానుద్దీన్ (చర్చ) 11:18, 28 డిసెంబర్ 2013 (UTC)

అస్సలామలేకుం నిస్సార్ భాయ్,
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మున్ముందు కూడా తెవికీలో మీకృషి ఇలాగే కొనసాగాలని, ఆ శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:59, 28 డిసెంబర్ 2013 (UTC)

వాడుకరి:అహ్మద్ నిసార్ గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:40, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:54, 28 డిసెంబర్ 2013 (UTC)
అహ్మద్ నిసార్ గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:17, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..విశ్వనాధ్ (చర్చ) 08:32, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలీ మరియు అలీ[మార్చు]

నమస్కారం Ahmed Nisar గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Ahmed Nisar గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 07:08, 1 జనవరి 2014 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

వీరతాడు ఇచ్చినందుకు ధన్యవాదాలు వైజాసత్య (చర్చ) 07:08, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారికి

2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...

అభినందనలతో... కార్యవర్గం

మరిన్ని వివరాలు ఈ పేజీలలో

మీరు [[వర్గం:ఎకేశ్వరవాదం]] అనే క్రొత్త వర్గం సృష్టించారు. [[వర్గం:ఏకేశ్వరవాదం ]] ఉండాలేమో పరిశీలించండి. అక్షరదోషం ఉన్నట్లనిపిస్తుంది.----కె.వెంకటరమణ (చర్చ) 06:42, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదం[మార్చు]

అహ్మద్ నిసార్ గారికి, నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.08:40, 22 జనవరి 2014 (UTC)