వాడుకరి చర్చ:పోటుగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
8 సంవత్సరాల,  1 నెల, 21 రోజులుగా సభ్యుడు.

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

పోటుగాడు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

అనువాదం[మార్చు]

పోటుగాడు గారూ, మీరు సృష్టిస్తున్న వ్యాసాలు, మూసలు పూర్తి ఆంగ్లం లో ఉన్నవి. వాటిని అనువాదం చేయడానికి ప్రయత్నించండి.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 14:09, 17 ఆగష్టు 2013 (UTC)

తప్పకుండా వెంకటరమణ గారూ. ప్రస్తుతము ఒకే రకమైన వర్గానికి చెందిన వ్యాసములను ఆంగ్లవికీ నుండి చేరుస్తున్నాను. ఇవి పూర్తయిన తర్వాత అనువాదం ప్రారంభిస్తాను. మీ సహకారం అందించ మనవి. అలాగే మీకు తెలిసిన ఉపయోగకరమైన అనువాద పనిముట్లు ఉంటే తెలుపగలరు. సూచనకు ధన్యవాదములు --పోటుగాడు (చర్చ) 14:22, 17 ఆగష్టు 2013 (UTC
మీరు గూగుల్ అనువాద పరికరం వాడి చూడండి. http://translate.google.com అనువాదం చేయండి.--117.213.220.58 14:49, 17 ఆగష్టు 2013 (UTC)
మీరు అనువాదం చేయండి.తప్పకుండా సహకరిస్తానుPlume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 15:17, 17 ఆగష్టు 2013 (UTC)


నూనెపై వ్యాసాలు-ప్రింటింగ్[మార్చు]

పోటుగాడు గారు,

మీ మిత్రులు నూనెపైనేను వ్రాసిన వ్యాసాలను ముద్రించదలచినందులకు సంతోషం.వికిపీడియాలో వ్రాసిన వ్యాసాలపై రచయితలకు వ్యక్తిగత హక్కులువుండవు.ఇది వికీపిడియా విధానం.ఎందులకనగా కొన్ని సందర్భాలలో ఒకవ్యాస్యాన్ని అనేకమంది తీర్చిదిద్దివుండవచ్చును.అందువలన కాపీ రైట్ హక్కులసమస్య వుత్పన్నముకాదు.కాకపోతే తెలుగు వీకిపీడియ నుంచి సమాచారం సేకరించాము,ఇందులో పలానా వారి చే వ్రాసిన వ్యాసాలున్నాయని ఆ పుస్తకంలో వ్రాసిన సముచితం.నేను వ్రాసిన వ్యాసాలు కొందరినైన ప్రభావితంచేసినందులకు సంతోషం.పాలగిరి (చర్చ) 10:03, 26 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

తెవికీ లో మంచి వ్యాసాలు రాస్తూ తెవికీ అభివృద్ధికి కృషి చేస్తున్న మీకు ధన్యవాదాలు. ఈకృషి యిలానే కొనసాగించి తెవికీ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని ఆశిస్తూ....Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 14:44, 30 ఆగష్టు 2013 (UTC)

ప్రశంసలకు ధన్యవాదములు వెంకట రమణగారూ. మీ వంటి సహృదయుల సహకారంతో తెవికీలో నా కృషిని మున్ముందు కూడా కొనసాగిస్తానని విన్నవిస్తున్నాను.--పోటుగాడు (చర్చ) 14:35, 31 ఆగష్టు 2013 (UTC)
రచ్చబండలో డా.శేషగిరిరావు బ్లాగులు చేర్చాను. వాటిని ఉపయోగించి వ్యాసాలు తయారుచేయండి. అవి యూనీ కోడ్ లో ఉన్నవి. అవి యధాతథంగా కాపీ,పేస్టు చేసి తయరుచేయవచ్చు. కొద్ది వికీకరణలు చేయగలరు. మీరు యిలానే కృషి కొనసాగించాలని నా ఆకాంక్ష.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 14:40, 31 ఆగష్టు 2013 (UTC)
తప్పకుండా ప్రయత్నిస్తానండి వెంకట రమణ గారూ.--పోటుగాడు (చర్చ) 14:51, 31 ఆగష్టు 2013 (UTC)
దన్యవాదాలు--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 14:53, 31 ఆగష్టు 2013 (UTC)

అంతకు ముందు ఆ తర్వాత[మార్చు]

నమస్కారం. అనుకోకుండా జరిగిన ఈ పుటం యొక్క సృష్టికి నన్ను క్షమించఫ్గలరు. మీరు ఈ రెండు పేజిలని కలపగలరు. ధన్యవాదాలు. Pavanjandhyala (చర్చ) 14:41, 12 అక్టోబర్ 2013 (UTC)

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:57, 23 ఏప్రిల్ 2014 (UTC)

ధన్యవాదాలు Rajasekhar1961 గారు.--పోటుగాడు (చర్చ) 07:54, 26 ఏప్రిల్ 2014 (UTC)

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:35, 26 జూలై 2014 (UTC)

అశ్లీల సాహిత్యం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

అశ్లీల సాహిత్యం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2013 ఆగష్టు 17 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 16:06, 24 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:06, 24 జనవరి 2020 (UTC)

స్వామి నిత్యానంద వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

స్వామి నిత్యానంద వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ శీర్షికతో పేజీ 2013 ఆగష్టు 21 న సృష్టించబడింది. ఇప్పటికీ 1464 బైట్లుతో మొలక గానే ఉంది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించడమైనది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 08:31, 26 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 08:31, 26 జనవరి 2020 (UTC)