వాడుకరి చర్చ:Kprsastry

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kprsastry గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png
 • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
 • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
 • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

Smile icon.png మాటలబాబు 14:39, 8 ఆగష్టు 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

అంతర్వేది[మార్చు]

అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలొ ఉన్నదనే చర్చ ని ఒక సారి గమనించండి. చర్చ:పశ్చిమ గోదావరి --మాటలబాబు 18:42, 8 ఆగష్టు 2007 (UTC)

బృహత్కార్యం[మార్చు]

శాస్త్రి గారు, తెవికీ కి మీవంటి వారి సహకారం ఎంతో అవసరం.మీకు సహాయం ఏమైనా కావాలా? తెవికీ అక్షరక్రమాలు సరి చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ఊరి గురించి వివరంగా వ్రాయండి, తెవికీ లో అన్ని గ్రామాల పేజీలకు మొలకు వేశారు. వాటిని మొక్కలుగా, వృక్షాలుగా, మహావృక్షాలుగా మలచవలసిన బృహత్కార్యం మనందరి మీద ఉన్నది.--మాటలబాబు 18:12, 9 ఆగష్టు 2007 (UTC)

తూర్పు చాళుక్యులు[మార్చు]

శాస్త్రి గారు దయ చేసి తూర్పు చాళుక్యులు ఈ వ్యాసాన్ని పరీక్షించి అందు అక్షరక్రమాలు సరిచేయగలరా??, మీకు పుణ్యం ఉంటుంది. --మాటలబాబు 21:34, 9 ఆగష్టు 2007 (UTC)

తూర్పు చాళుక్యులు వ్యాసం మీద దృష్టి సారిస్తున్నందుకు ధన్యవాదములు--మాటలబాబు 23:19, 9 ఆగష్టు 2007 (UTC)
తూర్పు చాళుక్యులు వ్యాసం మీద దృష్టి సారించి ,ఓపికగా తప్పులు సరిదిద్దినందుకు ధన్యవాదాలు, మీరు ఇంతటితో ముగించక మీ ఊరి గురించి, మీకు ఆసక్తి ఉన్న విషయాల గురించి వ్రాస్తారని ఆశిస్తున్నాను.ఏమైన సందేహాలు ఉంటే నాచర్చా పేజీలో వ్రాయండి.--మాటలబాబు 11:30, 10 ఆగష్టు 2007 (UTC)

గ్ తర్వాత ం[మార్చు]

గ్ తర్వాత ం (అంటే గం లో గ బదులు గ్ ఉండాలి ) రావాలంటే ఏమిచెయ్యాలి?

కంపశాస్త్రి 09:09,10ఆగస్టు 2007

అలా చేయటం కుదరదు. అయినా ఒక వేళ రాసినా "గ్ం" అనే విధంగా వస్తుంది. అలాగే మీ సంతకంలో ఉన్న "/"ను "|"తో మార్చండి, అప్పుడు సరయిన లింకు వస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:24, 10 ఆగష్టు 2007 (UTC)
అలా రాయడం ఇప్పటికి కుదరడం లేదు. నేను ఓగ్‌ం శివః అని ఒకచోట వ్రాయవలసి వచ్చింది, కాని పని జరగలేదు. మీరు సంతకం పెట్టడానికి ~~~~ఉపయోగించండి, లేదా ఎడిట్ బాక్స్(తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి. ) పై నున్న అడమ వైపు నుండి 10 వ బటన్ నొక్కండి మీసంతకం పడుతుంది.--మాటలబాబు 13:33, 10 ఆగష్టు 2007 (UTC)
ఇంతకి నేను మీకందిన సమాచారం ఏమైన ఉపయోగపడిందా???--మాటలబాబు 15:25, 10 ఆగష్టు 2007 (UTC)
మీ పై కుడి వైపునున్న లింకులలొ నాగురించి చర్చా అనే లింకు ప్రక్కన ఉన్న నా అభిరుచులు మీద క్లిక్కు కొట్టి ముద్దు పేరు వద్ద మీ పేరు వ్రాసుకొంటే సంతకం పెట్టినప్పుడు మీ పేరు టైం పడతాయి.--S172142230149 15:30, 10 ఆగష్టు 2007 (UTC)
అదే ప్రయత్నిస్తున్నాను. --కంపశాస్త్రి ----kaMpasAstri 15:49, 10 ఆగష్టు 2007 (UTC)
ధన్యవాదాలు. --కంపశాస్త్రి --కంపశాస్త్రి 01:09, 13 ఆగష్టు 2007 (UTC)
మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఈ విధంగా చేయవచ్చు(గ్ తర్వాత సున్న రావడానికి)

i+d+<shift+ctrl+2>+x+<left arrow>)+<Shift+Ctrl+1)+<right arrow>+<shift+ctrl+2> --కంపశాస్త్రి 03:24, 13 ఆగష్టు 2007 (UTC)

పొలాస[మార్చు]

పొలాస వ్యాసం చర్చా పేజీలోని విషయాలు వ్యాసం లోకి ఎక్కించండి.మాటలబాబు 22:48, 14 ఆగష్టు 2007 (UTC)

మీరే మైన బ్లాగులు వ్రాస్తారా చెప్పండి, వ్రాస్తే మీబ్లాగు చూడలని ఉంది, దాని ఎడ్రస్ చెప్పండిమాటలబాబు 22:49, 14 ఆగష్టు 2007 (UTC)
ఇంతవరకు వ్రాయలేదు --కంపశాస్త్రి 22:56, 14 ఆగష్టు 2007 (UTC)
చిన్న సూచన:వ్యాసం లొని అక్షర దోషాలు సరిదిద్దేటప్పుడు విభాగాలగా దిద్ద వచ్చు అప్పుడు దిద్దడం సులువు అవుతుంది.(మొత్తం పేజి కాకుండా విభాగం క్రింద) ఇంకో విన్నపం జంధ్యం అనే వ్యాసంలొ ఉన్న అక్షర దోషాలు సరిచేయండి. సభ్యుడు:S172142230149/ఇసుకపెట్టె1 అనే ఈ వ్యాసానికి ఏ పేరు పెట్టాలొ చెప్పండి మాటలబాబు 18:11, 15 ఆగష్టు 2007 (UTC)
జంధ్యం పేజీ లొ తప్పులు సరిచేసినందుకు ధన్యవాదాలు. ఇంకా సమాచారాన్ని చేర్చ దలిస్తే చేర్చండి.నేను బొమ్మలు కూడా పెట్టే పని లొ ఉన్నాను. మళ్లి మళ్ళి ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను మాటలబాబు 19:50, 15 ఆగష్టు 2007 (UTC)
జంద్యం అని ఉండాలి. జంధ్యం అని కాదు.శీర్షిక సరి చెయ్యలేమో.----కంపశాస్త్రి 19:56, 15 ఆగష్టు 2007 (UTC)
మీ అభిరుచులలొ ఇ-మైయిల్ అడ్రస్ ని చేర్చుకొంటే మీకో మైయిల్ చేయాలని ఉంది. మీకు వీలైతే నాకు S172142230149@googlemail.com మైయిల్ చెయ్యండి, ఎందుకు అని అడగకండి, వ్రాస్తే చెబుతాను మాటలబాబు 03:36, 16 ఆగష్టు 2007 (UTC)

మహాభాగవతం[మార్చు]

భాగవత పురాణం , పోతన తెనిగించిన మహాభాగవతం ఒకటే కదా, సందేహం తీర్చుకొంటున్నాను. దేవి భాగవతము, పురాణాలలొ భాగవతము(భాగవత పురాణం) ఒకటే కదా. సందేహం తీర్చగలరు --మాటలబాబు 03:34, 18 ఆగష్టు 2007 (UTC)

భాగవతం (పురాణం)ను పోతన తెనిగించాడు.దేవీ భాగవతం పురాణం కాదు.----కంపశాస్త్రి 04:09, 18 ఆగష్టు 2007 (UTC)

మఠాల గురించి నా వివరణ పూర్తికాలేదు. దయచేసి మార్పులు తరువాత కొనసాగింఛగలరు.vissu 05:10, 19 ఆగష్టు 2007 (UTC)

ధర్మ సందేహం- ఇక్కడ వేదాల గురించి ఉన్న విషయాన్ని సరి చూడగలరు అభిప్రాయాన్ని తెలుపగలరు.మూస:మీకు తెలుసా?1 , ధన్యవాదాలు, మీకు విక్షనరి లొ స్వాగతం పలికాను --మాటలబాబు 01:30, 20 ఆగష్టు 2007 (UTC)

మీ దిద్దుబాట్లు[మార్చు]

శాస్త్రి గారూ, వికీలో మీరు ప్రశంసనీయమైన సేవ చేస్తున్నారు. ముఖ్యంగా భాషా దోషాల సవరణల పరంగా మీ సేవ వికీకి ఎంతో అవసరం. మనం ఈ వారపు వ్యాసం అంటూ వారానికో వ్యాసాన్ని మొదటి పేజీలో ప్రచురిస్తూ వస్తున్నాం, మీరు గమనించే ఉంటారు. సదరు వ్యాసాలపై కూడా ఓ కన్నేసి ఉంచగలరు. ఆ జాబితా ఇక్కడ ఉంది. ఒక సూచన: మీ సంతకంలో మీ సభ్యుని పేజీకి, చర్చాపేజీకి లింకులిస్తే ([[సభ్యుడు:Kprsastry|కంపశాస్త్రి]] -ఇలా) సంతకాన్ని పట్టుకుని మీ చర్చా పేజీకి నేరుగా వెళ్ళే వీలు ఉంటుంది. __చదువరి (చర్చరచనలు) 09:35, 21 ఆగష్టు 2007 (UTC)

సత్యా గారు మీకు రచ్చబండ లొ ఒక ప్రశ్న పెట్టారు. పరిశీలించండి.---మాటలబాబు 02:36, 22 ఆగష్టు 2007 (UTC)

రెండు విషయాలు[మార్చు]

 1. ముక్కామల గ్రామము పేజి లొ కొన్ని మార్పులు చేశాను. పరిశీలించండి. బొమ్మలు లభిస్తే చేర్చండి.
 2. సంతకం పెడితే నీలం రంగు లింకు పడి, లింకు పడేందుకు ఈ పేజిని గమనించండి వికీపీడియా:కస్టమైజేషన్

ధన్యవాదాలు --మాటలబాబు 01:31, 24 ఆగష్టు 2007 (UTC)

ముక్కామల గ్రామము పేజీ లో మీరు చాలా శ్రద్ధ తీసికొని, అందమైన మార్పులు చేసి, ముక్కామల పరపతి ని పెంచారు. ధన్యవాదాలు. అయితే,కొన్ని వాక్యాలు తారుమారు గా పడ్డాయి. దానిని సరి చెయ్యాలి. బొమ్మల విషయం చూస్తాను.సంతకం పెడితే లింకు పడేందుకు చెయ్యవలసినపని చేస్తాను. మరోవిషయం. మీ వెబ్ సైటునుంచి మీకు మెయిలు ఇద్దామని చూస్తే పని జరగలేదు. మన ఈ-మెయిళ్ల కు జాతివైర ముందేమో. ----కంపశాస్త్రి 03:28, 24 ఆగష్టు 2007 (UTC)

అరుణం[మార్చు]

అరుణం (సంస్కృతము) అనే మిరు సృష్టించిన పేజి వికీపీడియా లొ అత్యంత పెద్ద పేజిలలొ ఇది ఒకటి. ఈ పేజిలొ HTML లేదు అది కూడా ఉంటే చాలా పెద్ద పేజి అయిపొతుంది. వికీపీడియా కి మీ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అత్యంత పెద్ద పేజిలగుర్చి ఈ లింకుల్ చూడండీ పొడవు పేజీలు. మీ కష్టపడి ఒకసారిగా చేర్చిన వ్యాసము సుమారు 91,000 బైట్లు--మాటలబాబు 05:16, 26 ఆగష్టు 2007 (UTC)

కావ్యాల పాఠాలను వికీసోర్స్‌లో ఉంచగలరు[మార్చు]

శాస్త్రిగారూ! నమస్కారం. మీ కృషిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా అక్షర దోషాలను ఓపికగా దిద్దుతున్నందుకు. అయితే సంస్కృత కావ్య పాఠాలను వికీలో ఉంచడం మన విధానం కాదు. అందుకు వికీసోర్స్ సరైన స్థానం. మళ్ళీ ఇక్కడినుండి వికీసోర్స్‌కు మార్చే అవసరం లేకుండా నేరుగా అటువంటి కావ్యాలను వికీసోర్స్‌లోనే ఉంచమని కోరుతున్నాను. కావ్యాలను "గురించిన" వ్యాసాలు మాత్రం వికీపీడియా లో వ్రాయగలరు. మేఘ సందేశం (సంస్కృతం) వ్యాసంలో జరిగిన మార్పులు మీరు గమనించారు గదా! - --కాసుబాబు 06:40, 28 ఆగష్టు 2007 (UTC) సరే. వికీసోర్స్ లో ఉంచడమెలాగో నేర్చుకుంటాను.----కంపశాస్త్రి 21:08, 28 ఆగష్టు 2007 (UTC)

చంద్ర గ్రహణం[మార్చు]

ఈ రోజు చంద్ర గ్రహణం మరియు శ్రావణ పూర్ణిమ. అమెరికా ఐరోపా ఖండాలలొ చంద్రగ్రహణం--మాటలబాబు 23:26, 28 ఆగష్టు 2007 (UTC)

దిద్దుబాట్లు[మార్చు]

అయ్యా మీరు చేస్తున్న దిద్దుబాట్ల కు అభినందనలు.చర్చా పేజిలొ ఉండే విషయాలలొ వర్ణక్రమాలు సరిగా లేకపోయినా దిద్దుబాట్లు చేయవద్దు .వాటిని దిద్దడం వల్ల ఉపయోగం లేదు. వ్యాసము పేజి లొ దిద్దుబాట్లు చొరవ చేయండి. తెలిసిన విషయాన్ని వ్యాసములొ చేర్చండి. వ్యాసము లొ దిద్ది చర్చా పేజిలొ వివరణ వ్రాస్తే సరిపోతుంది--మాటలబాబు 04:49, 29 ఆగష్టు 2007 (UTC)

మహాశివరాత్రి[మార్చు]

ఒకసారి మహాశివరాత్రి వ్యాసాన్ని చూసి అవసరమైన మార్పులు చేయగలరు--మాటలబాబు 07:12, 30 ఆగష్టు 2007 (UTC) శాస్త్రి గారు నేను ఇప్పుడు రామేశ్వరము వ్యాసము మీద పనిచేస్తున్నాను. మీరు ఇప్పుడు స్పృశించవద్దు స్పృశిస్తే దిద్దుబాటు ఘర్షణ వచ్చే అవకాశం ఉన్నది--మాటలబాబు 03:00, 2 సెప్టెంబర్ 2007 (UTC)

ఒక విన్నపం ఒక సందేహాం[మార్చు]

విన్నపం

[[...]] లింకులు మనము భవిష్యత్తు లొ వ్యాసలు వ్రాయగలము అనే పదాలకు మాత్రమే ఇవ్వమని విన్నపం

సందేహం

చదివేస్తే ఉన్న మతి పోయిందని చదువు ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందేమో, తెలుగు పూర్తిగా మరచి పోతున్నాను క్షీర సాగర మథనం లొ ఇది సరా లేక క్షీర సాగర మధనం సరా దయచేసి సందేహం తీర్చగలరు--మాటలబాబు 15:50, 4 సెప్టెంబర్ 2007 (UTC)

మథనము అంటే చిలకడం (చల్ల చిలకడం) అని అర్థం.----కంపశాస్త్రి 16:12, 4 సెప్టెంబర్ 2007 (UTC)
చదవేస్తే అని ప్రయోగం. చదవడంకోసం పంపిస్తే అని అర్థం. చదువుకోవడానికి ముందు ఉన్న జ్ఞానం చదువు ప్రారంభించిన తర్వాత మందగించిందని భావం.----కంపశాస్త్రి 16:28, 4 సెప్టెంబర్ 2007 (UTC)
ఒక వ్యాసం లోఏదైనా ప్రత్యేక మైన పదం గాని , పదబంధం గాని (క్షీర సాగర మథనం వంటిది) మొదటి సారి వచ్చినప్పుడు దానిని ... లింకు లో సూచిస్తే, ఆ పదం వెతుకు పెట్టె లో చేరి , భవిష్యత్తు లో ఆ పదం ఏయే వ్యాసాలలో వచ్చిందో తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. ఆ విధంగా తెవికి సెర్చి ఇంజిను గా పనికి వస్తుందని నా అభిప్రాయం. భవిష్యత్తు లో వ్రాయబోయే వ్యాసాలకే [[...]] ఈ లింకు ఉండాలనడం సబబు కాదేమో.----కంపశాస్త్రి 16:54, 4 సెప్టెంబర్ 2007 (UTC)
మీరు చెప్పినది సబబు గానే ఉన్నది అలాగే కానియ్యండి Yes check.svg--మాటలబాబు 17:55, 4 సెప్టెంబర్ 2007 (UTC)

తుపాను / తుఫాను[మార్చు]

తుఫాను కాదు, తుపాను అని అనుకుంటున్నాను. అందుకే హిందూ పత్రిక వ్యాసంలో దాన్ని తుపానుగా మార్చాను. ఒక్కసారి సరిచూడగలరు. __చదువరి (చర్చరచనలు) 15:46, 7 సెప్టెంబర్ 2007 (UTC)

తుఫాను అంటే పెద్ద గాలివాన. ఇది అన్య దేశ్య పదం. తూఫాన్ అనే ఉర్దూ పదం నుంచి వచ్చిందనుకుంటాను.----కంపశాస్త్రి 16:28, 7 సెప్టెంబర్ 2007 (UTC)
మీరన్నది నిజం, అది వేరే భాష నుండి మనకొచ్చింది. కానీ ఈ నిఘంటువు చూడండి. __చదువరి (చర్చరచనలు) 16:50, 7 సెప్టెంబర్ 2007 (UTC)
అన్యదేశ్యం కనుక రెండు విధాలుగానూ,అంతేకాక, హలంతంగా తుపాన్, తుఫాన్ అని కూడా వాడవచ్చునేమో. ధన్యవాదాలు.----కంపశాస్త్రి 17:12, 7 సెప్టెంబర్ 2007 (UTC)

అనువాదం[మార్చు]

అనువాదం చేసిన ఆంగ్ల భాగాన్ని తొలగించేయండి.--మాటలబాబు 16:16, 8 సెప్టెంబర్ 2007 (UTC)

పద్యాలు పాదాలుగా వ్రాసేటప్పుడు. పాదాలుగా వ్రాసి , పద్య ప్రారంభం లొ <poem> పద్యం అయ్యాక </poem> అని పెడితే వ్రాసింది పద్యరూపంగా ఉంటుంది.--మాటలబాబు 16:51, 14 సెప్టెంబర్ 2007 (UTC)
ధన్యవాదాలు. దీనికోసం ఇందాకటినుంచి పరిశ్రమ చేస్తున్నాను.----కంపశాస్త్రి 16:56, 14 సెప్టెంబర్ 2007 (UTC)
వీలైతే హంపి వ్యాసములొ మిగిలిన అనువాదం పూర్తి చేసి అనువాద మూస తొలగించండి. ధన్యవాదాలు--మాటలబాబు 17:44, 16 సెప్టెంబర్ 2007 (UTC)
ధన్యవాదాలు అనువదము పూర్తి చేసినందుకు--194.176.105.40 02:33, 18 సెప్టెంబర్ 2007 (UTC)

సందేహం[మార్చు]

క్రొత్త లొ కొత్త ఏది సరి?
వ్రాశాడు లేదా వ్రాసాడు ఏది సరి?
క్రొత్త పదాన్ని కొత్త అని కూడా వాడుతున్నారు. కనుక రెండు సరి అయినవేనని చెప్పాలి.
వ్రాశాడు, వ్రాసాడు పదాలు రెండూ దోషయుతాలే. 'వ్రాయు' అనే అర్థంలో 'రాయు' అని కూడా వాడుతున్నారు. తెలుగు అకాడమీ వారు కూడా 'రాయు' అనే వాడాలని నియమం 'చేశారు'. చేసేదేమున్నది? వాడడమే.----కంపశాస్త్రి 19:29, 19 సెప్టెంబర్ 2007 (UTC)

గరుత్మంతుడు వ్యాసము చర్చా పేజిలొ ఒక ప్రశ్న పెట్టాను చూడండి.--మాటలబాబు 04:17, 21 సెప్టెంబర్ 2007 (UTC)

ఎక్కడకైనా వెళ్ళారా[మార్చు]

మూడు-నాలుగు రోజుల నుండి కనిపించడం లేదు ఎక్కడకైనా వెళ్ళారా???--మాటలబాబు 20:07, 1 అక్టోబర్ 2007 (UTC)

I was in the USA for four months and returned back to Visakhapatnam, a week days ago. I am tired. But that is not the point. I am not getting the telugu script (RTS) to edit the essays. I am trying to download the necessary software.In USA there was no problem but here all the troubles start. Thank you very much for the enquiry.----కంపశాస్త్రి 21:04, 2 అక్టోబర్ 2007 (UTC)

సంకీర్ణ సంఖ్యలు[మార్చు]

అర్యా ! సంకీర్ణ సంఖ్యలు వ్యాసాన్ని పునః ప్రాణ ప్రతిష్ట చేశాను. విస్తరించగలరేమో చూడండి--బ్లాగేశ్వరుడు 14:15, 4 నవంబర్ 2007 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:21, 29 ఏప్రిల్ 2008 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

రేడియో వ్యాసాన్ని బాగా విస్తరించాను. అందులో దోషాలను సవరిస్తున్నందుకు ధన్యవాదాలు( కె.వి.రమణ- చర్చ 16:34, 17 ఫిబ్రవరి 2013 (UTC))

రైలు వ్యాసాన్ని బాగా విస్తరించవలసి ఉంది. వేగంగా టైప్ చేయటం వల్ల అనేక దోషాలు వచ్చినట్లు గమనించితిని. అందులో దోషాలను సవరిస్తున్నందుకు ధన్యవాదాలు.  కె. వి. రమణ. చర్చ 23:16, 23 మార్చి 2013 (UTC)

దిద్దుబాట్లు[మార్చు]

శాస్త్రి గారికి నమస్కారం. నా చిన్న నాట సోషలు పాఠాలు నాకు అస్సలు బోధపడేవి కావు. (ఈ పిరియడు భోజన విరామం తర్వాత కావటం వలనో, నాకు ఆసక్తి లేకనో తెలియదు గాని, బాగా నిద్ర వచ్చేది.) భౌగోళికం ఫర్వాలేదు గానీ, చరిత్ర, పౌర, అర్థ శాస్త్రాలు నా జీవితంలో కొరకరాని కొయ్యలుగా మిగిలిపోయాయి. అయితే చదివిన ఎం.బీ.ఏ లో బాగా కాదు గానీ, కొద్దో గొప్ఫో ఇవి వంట బట్టాయి. అవి ఎంత ముఖ్యమో సమాజాన్ని అర్థం చేసుకొనే ఇప్పటి నా ప్రయత్నంలో నాకు అర్థమవుతోంది. అందుకే మెల్లగా వీటికి సంబంధించిన వ్యాసాలు అనువాదం చేద్దామని అనుకొంటున్నాను. (అలా అయినా మరిన్ని విషయాలని అర్థం చేసుకొనవచ్చునని!). ఐ ఎం ఎఫ్ కి తెలుగు అనువాదాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలిసో తెలియకో ఇలాంటి వాటికి నన్ను క్షమించి, నన్ను సరిదిద్ది మీ సలహాలు సూచనలు అందజేయవలసినదిగా మనవి.శశి (చర్చ) 13:09, 19 మార్చి 2013 (UTC)

శుద్ధి చేయండి[మార్చు]

కంప శాస్త్రి గారికి, భర్తృహరి మరియు సుభాషిత త్రిశతి వ్యాసములను విస్తరించితిని. సరియైన తెలుగు పదములు వ్రాయలేకపోయాను. ఆ వ్యాసములను దయచేసి సరిచేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 16:33, 29 మార్చి 2013 (UTC)

సిద్ధాంతము - వాదము[మార్చు]

భౌతిక శాస్త్ర వివిధ గ్రంధాలలో Geo centric theory, Heleo centric theory లకు "భూ కేంద్రక సిద్ధాంతం" మరియు "సూర్య కేంద్రక సిద్ధాంతం" అని ఉన్నది. మీరు భౌతిక శాస్త్ర పారిభాషిక పద కోశమునందు సిద్ధాంతము కు బదులుగా "వాదము" అని మార్చారు. సిద్ధాంతం మరియు వాదం అనే పదాలను ఉపయోగించడంలో గల భేదాలను తెలియ జేయండి. ఏ పదమైనా ఉపయోగించవచ్చా!--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 18:00, 7 ఏప్రిల్ 2013 (UTC) సిద్ధాంతము = Theorem (ఒక ప్రతిపాదన, అంగీకరించబడిన సాధనలను ఉపయోగించి, ఉపపత్తి ద్వారా నిరూపితమైతే అది సిద్ధాంతమవుతుంది. దానికి తిరుగు లేదు.) వాదము = Theory ( ఇది ఒక విషయానికి సంబంధించి ఒకరి దృక్పథం. కాలక్రమేణా ఇది మార్పులకు లోను కావచ్చు. విశాల విశ్వానికి, లేదా ఖగోళానికి భూమి కేంద్రము అనేది ఒక దృక్పథం. కాలక్రమేణా, ఈ అభిప్రాయం మారి, ఖగోళానికి సూర్యుడు కేంద్రము అనే వాదం బయలుదేరింది. నాస్తిక వాదము ఇలాంటిదే.) కంపశాస్త్రి 18:25, 7 ఏప్రిల్ 2013 (UTC).

వివరణ[మార్చు]

 • మీ సూచన బాగున్నది. అయితే "భూ కేంద్రక సిద్ధాంతం" అనేది టోలమీ ప్రతిపాదించాడు. ఇది అనేక సంవత్సరములు అందరి ఆమోదం పొందినట్లు చారిత్రక ఆధారాలున్నవి. అందువల్ల అది వాదమే కాదు సిద్ధాంతం కూడా. అప్పటి శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన విషయమని గుర్తించాలి. అందరూ గుర్తించి ఆమోదిస్తే అది సిద్ధాంతమనుటలో తప్పేముంటుంది? ఆ కాలంలో నిరూపణ చేయుటకు తగిన పనిముట్లు గానీ యితర ఆధారములు గానీ లేవు. ఆ కాలంలో భూమి పై కొన్ని పరికల్పనలు చేసి సైద్ధాంతీకరించారని గమనించాలి. సూర్య కేంద్రక సిద్ధాంతం కోపర్నికస్ కనుగొన్న నాటికి కూడా ఋజువు చేయుటకు తగిన ఆధారాలు లేవు. కానీ శాస్త్రీయ ఆలోచనల ఆధారంగానే పరికల్పన చేశాడు. మొదట్లో దీనిని ఎవరూ ఆమోదించలేదు. మత పెద్దలు వ్యతిరేకించారు. ఆయన ఆ సిద్ధాంతాన్ని బహిర్గతం చేయక పోయినా ఆయన మరణానంతరం బహిర్గతం అయినది. ఇది కూడా సిద్దాంతమే అవుతుంది. ఈ రెండు సిద్దాంతముల మధ్య సారూప్యములు విశ్లేషించి ఏది సరైనదో తెలుసుకొనుటకు టైకోబ్రాహి అనే శాస్త్రవేత్త కృషి చేశాడు. ఆయన సూర్య కేంద్రక సిద్ధాంతం సరైనది అని కొన్ని ఆధారాలతో నిరూపించినా, ఆయన శిష్యుడు కెప్లర్ కొన్ని గమన నియమాలతో ఋజువు చేశాడు. కానీ ఖచ్చితంగా గెలీలియో గెలీలి టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఈ సిద్ధాంతముల వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
 • విజ్ఞాన శాస్త్రంలో ప్రస్తుతం ఉన్న విషయాలు కూడా ఖచ్చితమైనవని చెప్పలేము. అవి మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు పదార్థం మూడు స్థితులలో ఉంటుంది అని మనకు విదితమే. కాని నాల్గవ స్థితి ప్లాస్మా స్థితి కూడా ఉన్నదని కనుగొన్నారు. అదే విధం గా దైవ కణాలను కూడా కనుగొనేందుకు కృషి జరుగుతుంది. అందువల్ల ఏ విషయాన్ని శాస్వతంగా సిద్ధాంతీకరించలేము. కానీ ప్రస్తుత పరిస్థితులకు అందరి ఆమోద యోగ్యమైనదే సిద్ధాంతం అని గమనించాలి.
 • ఎవరైనా వ్యక్తి అతని అభిప్రాయాలను (ఇతరుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా) వ్యక్తీకరిస్తే దానిని వాదం అనవచ్చును. ఉదాహరణకు "idealism" ఆదర్శవాదము. అదేవిధంగా "Hinduism", "jainism", "Taoism" ఇటువంటివి కొంతమంది సమూహాలలో గల వ్యక్తుల అభిప్రాయాల తో ముడిపడి ఉంటాయని గమనించాలి.
 • ఒక పదం వేర్వేరు శాస్త్రాలలో వేర్వేరు అర్థాలనిస్తుంది అని గమనించాలి. అన్నింటిని ఒకే గాటన కట్టకూడదని గమనించాలి. ఉదాహరణకు గ్రీకు అక్షరమైన డెల్టా "Δ" అనునది గణిత శాస్త్రంలో స్వల్పమైన మార్పుకు, త్రిభుజానికి గుర్తు. భౌతిక శాస్త్రములో స్వల్పమైన మార్పుకు గుర్తు, రసాయన శాస్త్రంలో ఒక రసాయన చర్యలో వేడి చేయుట(ఉష్ణం అందిచుట) గుర్తుగానూ, సాంఘిక శాస్త్రంలో నది సముద్ర ప్రాంతంలో కలిసే ప్రాంతాన్ని సూచించవచ్చు.
 • మీరు తెలియ జేసిన అర్థం సరియైనదె కావచ్చు. అది గణిత శాస్త్రానికి సరిపోతుంది. కానీ భౌతిక శాస్త్రానికి సరిపడదని గమనించాలి. అందువల్ల అనేక గ్రంధాలలో, పారిభాషిక పదాలలో, తెలుగు అకాడమీ పుస్తకాలలో కూడా భూ కేంద్రక సిద్ధాంతమ మరియు సూర్య కేంద్రక సిద్ధాంతం అని ఉన్నదని మీరు దయచేసి గమనించగలరు.
 • మీరు ఐన్ స్టీన్ వ్యాసంలో కూడా అనేక సందర్భాలలో "సాపేక్ష సిద్ధాంతం" కు బదులు "సాపేక్ష వాదం" అని సరిదిద్దుతున్నారు. మీరు వాటిని మార్చి భౌతిక శాస్త్ర పదాల అమరికను మార్చవద్దని మనవి.
 • భౌతిక శాస్త్రం విషయాలలో వాక్యాల కూర్పులో మార్పులు చేయండి. వాటి అక్షరాల కూర్పును మార్చవలదని మనవి. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 16:28, 8 ఏప్రిల్ 2013 (UTC)

CIS-A2K వారి ధన్యవాదాలు[మార్చు]

శాస్త్రిగారు 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు చాలా కృషి చేసారు. చాలా ధన్యవాదాలు.--విష్ణు (చర్చ)18:43, 7 ఏప్రిల్ 2013 (UTC)

చర్చలకై సహాయం[మార్చు]

dear friend, i want to talk with you personally about some clarifications on some concepts. Please send your phone number to my mail address which is in my page. Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 13:42, 8 ఏప్రిల్ 2013 (UTC)

ఫోను నెంబరు[మార్చు]

ఆర్యా, 0891-2754987 నా ఫోను నెంబరు. కంపశాస్త్రి 15:14, 8 ఏప్రిల్ 2013 (UTC)

Dimensions[మార్చు]

 • గణిత శాస్త్రంలో "రేఖాగణితం" ఒక విభాగం అని విదితమే. అందులో కొన్ని రేఖా చిత్రాలు ఉదాహరణకు దీర్ఘ చతురస్రం, చతురస్రం, వృత్తము వంటివాటికి సమతల పటాలు. వీటికి ఎత్తు ఉండవు. వీటిని two dimensional figures అంటారు. అనగా "ద్విమితీయ పటాలు". కొన్ని వస్తువులు అనగా స్తూపం, గోళం, ఘనము, వంటివాటికి పొడవు,వెడల్పులతో పాటు ఎత్తు అనే కొలత ఉంటుంది. అవి సమతల పటాలు కావు. వాటిని three dimensional objects అంటాము, అనగా త్రిమితీయమైనవి. అందువలన గణిత భాష వేరుగా ఉంటుంది. కనుక మీరు సరిచేసిన విషయాలను పునఃస్థాపన చేయండి.
 • గణిత భాష వేరుగా ఉంటుంది. అది సాధారణ భాషకు కొన్ని పదములు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు "If the powers are equal the bases area equal" అనే వాక్యం ఉందనుకోండి. సాధారణంగా మనం power అనగా శక్తి అనీ, base అనగా ఆధారము అనీ అనుకుంటాం. కానీ అలా కాదు. ఘాతాంకాలు అనే భావములు బోధించునపుడు power అనగా ఘాతం అనీ base అనగా భూమి అనీ అర్థం. పై వాక్యానికి ఘాతములు సమానమైన భూములు సమానం అని అర్థం వస్తుంది. గణిత భాష తెలియక పోతే "శక్తులు సమానమైన ఆధారాలు సమానమవుతాయి" అనే తప్పు వాక్యాన్ని చేర్చవలసి ఉంటుంది.
 • గణిత భాషలో పదాలను సాధ్యమైనంత వరకు చర్చించి మార్చండి. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 18:32, 9 ఏప్రిల్ 2013 (UTC)

నేను సరిగానే సరిచేశాను.కంపశాస్త్రి 18:47, 9 ఏప్రిల్ 2013 (UTC)

నాకు పదాల మధ్య భేదాలు తెలియటం లేదు. "ద్విమితీయ" అనే పదాన్ని "ద్విపరిమాణీయ" అని మార్చారు. రెండూ ఒకే అర్థాన్ని యిస్తాయా? మీ అభిప్రాయం చెబితే గణిత శాస్త్ర పరంగా వివరణ యిస్తాను. Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 00:36, 10 ఏప్రిల్ 2013 (UTC)
 • పరిమాణము అనే పదాన్ని సాంకేతికంగా dimension అనే సాంకేతిక పదానికి పర్యాయపదం గా వాడుతారు. మితి అంటే హద్దు. ద్విమితి అనేది గరిష్టం గా రెండు అని చెపుతుంది. అది రెండు కావచ్చు, ఒకటి కావచ్చు, లేదా సున్న కూడా కావచ్చు. ద్విపరిమాణము అనేది కచ్చితంగా రెండు అని చెపుతుంది. త్రిపరిమాణము అంటే మూడవ పరిమాణము. ద్విపరిమాణ రేఖాగణితము, త్రిపరిమాణ జ్యామితి వంటివి ఉపయోగం లో ఉన్నాయి. n-వ పరిమాణపు అంతరాళాలు (n ధన పూర్ణాంకము) అనే పదం వాడుకలో ఉంది. కంపశాస్త్రి 14:09, 10 ఏప్రిల్ 2013 (UTC)

వివరణ[మార్చు]

శాస్త్రిగారూ, మీరు తెలిపిన వివరణ బాగుంది.దానికి నాకు కొన్ని సందేహాలున్నాయి.

మితి[మార్చు]

మితి అను పదం గ్రీకు పదం "మెట్రాన్" నుండి వచ్చినది. ఆ భాషలో మెట్రాన్ అనగా "కొలత" అని అర్థము. దానిపై ఆధారపడిన పదాలను తెలియజేస్తాను.

   • Geometry : Geo= earth, metron = measure భూమి కొలతల శాస్త్రం = రేఖా గణితం = జ్యామితి
   • Trigonometry : త్రికోణమితి.
   • Biometry : జీవ పరిమాణమితి యిలా అనేకమైన పదాలు ఉన్నాయి.
 • వీటిని బట్టి మితి అనగా కొలత అని అర్థం. కనుక "ద్విమితీయ" అనే పదానికి అర్థము రెండు అక్షాలు గల సమతల జ్యామితి కి చెందిన పటాలు అని అర్థం. అనగా రెండు నిరూపకాక్షాలతో కూడిన చట్రంలో ఉన్న పటాలు. అనగా సమతల పటాలని అర్థం, కానీ తెలుగు వ్యవహార భాషలో లాగ మితి అనగా పరిమితి అనే అర్థం ఇచట రాదని గమనించాలి. ఈ లింకు చూడండి. [1]]

పరిమాణం[మార్చు]

యిది వస్తువు యొక్క కొలత అని అర్థం యిచ్చిననూ వస్తువు పరిమాణం పొడవులోనూ, ఘనపరిమానం లో ను యిలా అనేక భౌతిక శాస్త్ర అంశాలను పరిమాణంగా తీసుకోవచ్చు.

 • దీనిని గణితంలో ఒక సమీకరణం ax2 + bx +c అనే దానిలో బహుపది పరిమానం "2" అంటారు.
 • అందువల్ల సాధారన తెలుగు నిఘంటువుల ప్రాప్తికి గణిత పదాలను మార్చవలదని నా అభిప్రాయం. దీనిపై మీ వివరన యివ్వగలరు.
 • నేను వాడిన పదం సాంకేతికార్థం లోనే గాని తెలుగు నిఘంటువు ప్రకారం కాదు. 'బహుపది పరిమాణం' అనేదానికి సాంకేతికమైన నిర్వచనం ఉంటుంది. మీరు సూచించిన బహుపదిలో a సున్న అయితే పరిమాణం 2 కాదు. కంపశాస్త్రి 15:34, 10 ఏప్రిల్ 2013 (UTC)
మీరు తెలియజేసిన నిర్వచనం అక్షర సత్యము. కానీ నేను అనేక గణిత గ్రంధములు, పారిభాషిక పదకోశాలను కూడా పరిశీలించాను. అందువలన ఆ వృత్తము అనే వ్యాసంలో "ద్విమితీయం' అనే ఉన్నది. కనుక ఆ వ్యాసంలో రెండు పదాలను వాడితే అనగా ద్విమితీయ లేక ద్విపరిమాణీయ అని వాడితే ఎలా ఉంటుంది? ద్విమితీయ అనే పదంలొ "మితి" అనగా కొలత అని అర్థం.ఆ పదం ఉపయోగించిననూ తప్పు కాదు. మీరు సహృదయంతో పరిశీలించగలరు.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 15:43, 10 ఏప్రిల్ 2013 (UTC)
 • నాకేమీ అభ్యంతరం లేదు.కంపశాస్త్రి 16:17, 10 ఏప్రిల్ 2013 (UTC)

దిద్దుబాట్లు[మార్చు]

శాస్త్రిగారు,

నేను ప్రారంభించిన కొన్నివ్యాసాలలోని అక్షరదోషాలను,పదదోషాలను సరిదిద్దుతున్నందులకు ధన్యవాదాలు.పాలగిరి (చర్చ) 03:05, 13 ఏప్రిల్ 2013 (UTC)

కూరగాయలు అనే వ్యాసంపై చర్చించండిPlume pen w.gif కె.వెంకటరమణ చర్చ 04:02, 18 ఏప్రిల్ 2013 (UTC)

సందేహం[మార్చు]

శాస్త్రి గారికి నమస్కారములు,

తెవికీ లో [[వర్గం:స్వాతంత్ర్య సమరయోధులు]] మరియు [[వర్గం:స్వాతంత్ర సమరయోధులు]] అనే రెండు వర్గాలు కలవు. భాషా పరంగా ఏది సరియైనది?--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 09:51, 23 ఏప్రిల్ 2013 (UTC)
స్వాతంత్ర్యము అనే పదము సరి అయినది.కంపశాస్త్రి 09:59, 23 ఏప్రిల్ 2013 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

శాస్త్రి గారూ, 2007 నుండి విరామం లేకుండా తెలుగు వికీలో అక్షర దోషాలు దిద్ది వ్యాసాల నాణ్యతను మెరుగుపరుస్తున్నందుకు మీకు తెవికీ చాలా ఋణపడి ఉంది. ఇప్పడు అమెరికాలో ఉన్నారా? విశాఖలో ఉన్నారా? --వైజాసత్య (చర్చ) 05:17, 3 మే 2013 (UTC)

 • ధన్యవాదాలు. విశాఖపట్టణం లోనే నివాసం. ఒక్క చిన్న విషయం. తెవికీ ఒకళ్లకు ఋణపడి ఉండదు. కంపశాస్త్రి 06:40, 3 మే 2013 (UTC)
నిజమే, మంచి మాట చెప్పారు. --వైజాసత్య (చర్చ) 18:07, 4 మే 2013 (UTC)

మహావీరాచార్యుడు[మార్చు]

మహావీరాచార్యుడు వ్యాసంలో గ్రాంథిక పదములను వ్యవహారికంగా మార్చి శుద్ధి చేయ మనవి.నమస్కారములతో --Quill and ink.svg కె.వెంకటరమణ చర్చ 03:49, 4 జూన్ 2013 (UTC)

రాజబాబు జననం- చరిత్రలో ఈరోజు అక్టోబరు 20[మార్చు]

శాస్త్రి గారూ,
రాజబాబు జననాన్ని చేర్చాను. కానీ మొదటి పేజీలో చూపించడం లేదు. దయచేసి మొదటి పేజీలోని ఈ విభాగాన్ని రిఫ్రేష్ చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:24, 20 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా స్వయం శిక్షణ భాషాదోషాలు సరిచేయుటకు సహాయం[మార్చు]

వికీపీడియా స్వయంశిక్షణ మరియు తదుపరి పుటలలో భాషా మరియు అనువాద దోషాలను (కొంత అనువాదం మన స్థానిక పరిస్థితులకు తగ్గునట్లు మార్చబడింది. వ్యక్తుల పేర్లు, సంబంధిత సంస్థల పేర్లు, వివరాలు లాంటివి) సరిచేయుటకు సహాయం చేయమని కోరిక. --అర్జున (చర్చ) 04:36, 15 నవంబర్ 2013 (UTC)

ఆంధ్ర విశ్వవిద్యాలయం[మార్చు]

శాస్త్రి గారికి నమస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు కళాప్రపూర్ణ వ్యాసాల్ని ఒకసారి చూచి ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయడానికి మీ సూచనలు మరియు సలహాలు అందజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:00, 15 నవంబర్ 2013 (UTC)

 • విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలు మరియు అవి స్థాపించబడిన సంవత్సరం చేర్చాను. తెలుగు అనువాదం చేయమని విన్నపము.Rajasekhar1961 (చర్చ) 03:39, 16 నవంబర్ 2013 (UTC)

వికీపీడియా:2013 కొలరావిపుప్ర[మార్చు]

Kprsastry గారు,వికీపీడియా:2013 కొలరావిపుప్ర కై మీ పేరును ప్రతిపాదించడమైనది.దయచేసి మీ సమ్మతి తెలియచెయ్యండి.Palagiri (చర్చ) 14:19, 2 డిసెంబర్ 2013 (UTC)

 • అభ్యంతరం లేదు. కాని, ఇంకా పేర్లు ప్రతిపాదితమైతే, నాపేరును నిర్నిబంధంగా తొలగించండి. కంపశాస్త్రి 05:08, 3 డిసెంబర్ 2013 (UTC)
వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Kprsastry పేజీలో మీ సమ్మతిని తెలియజేస్తూసంతకం చేయండి--కె.వెంకటరమణ (చర్చ) 13:56, 4 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:31, 13 డిసెంబర్ 2013 (UTC))

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
కంపశాస్త్రి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో అచ్చుతప్పుల దిద్దుబాట్ల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
 • ధన్యవాదాలు. కంపశాస్త్రి 01:10, 17 ఫిబ్రవరి 2014 (UTC)

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా తెవికీ లోతు, నాణ్యత అభివృద్ధి చేయడంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 12:21, 26 జూలై 2014 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.