వాడుకరి చర్చ:MYADAM ABHILASH

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

MYADAM ABHILASH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

MYADAM ABHILASH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 09:12, 22 జనవరి 2021 (UTC)

అభినందనలు[మార్చు]

మైదాం అభిలాష్ గారు, అభినందనలు, మీరు చాలా బాగా రాశారు కాకపోతే అక్కడ కాదు రాసేది. మీకు ఈ సందేశం అందితే పైన ఉన్న సమాచారం అంతా చదివి ఇక్కడ స్పందించండి. మీకు సహాయం చేయగలను. అన్నీ చదవండి. స్పందించండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:48, 2 ఫిబ్రవరి 2021 (UTC)

ఎక్కడ రాయాలో దయచేసి తెలుపగలరు MYADAM ABHILASH (చర్చ) 02:19, 3 ఫిబ్రవరి 2021 (UTC)

సహాయం[మార్చు]

కార్ల్ రోజర్స్ అనే పేజీ సృష్టిస్తున్నపుడు సోర్స్ ఎడిటర్ ఓపెన్ కావట్లేదు.నా మొబైల్ సమస్యా?లేకపోతే సైట్ సమస్యా అర్థం కావటం లేదు దయచేసి ఎవరైనా సహాయం అందించగలరు.MYADAM ABHILASH (చర్చ) 06:03, 29 మే 2021 (UTC)

అంతర్వికీ లింకులు[మార్చు]

అభిలాష్ గారూ, వికీపీడియాలో విస్తారంగా దిద్దుబాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాసాల్లో ఒక ముఖ్యమైన అంశం అంతర్వికీ లింకు. ఈ వ్యాసం ఇతర భాష వికీపీడియాల్లో కూడా ఉంటే వాటికి ఇచ్చే లింకులను అంతర్వికీ లింకులు అంటాం. అన్ని భాషల వ్యాసాలకూ లింకు ఇవ్వనక్కర్లేదు.. ఒక్క భాషలో ఇస్తే చాలు, అన్ని భాషలకూ అదే ఇచ్చుకుంటుంది. ఇలా లింకులివ్వడం వలన ఇతర భాషల వ్యాసాల్లో (ముఖ్యంగా ఇంగ్లీషులో) ఎక్కువ సమాచారం ఏదైన ఉంటే చదివే వీలు పాఠకులకు ఉంటుంది. వ్యాసానికి చక్కని విలువ చేకూరుతుంది. మరీ ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర విషయాలను రాసినపుడు ఈ లింకులు మరింత ఉపయోగం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లింకులు ఎవరు బడితే వాళ్ళు ఇవ్వలేరు; ఉదాహరణకు యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనే పేజీకి ఇంగ్లీషులో పేరు ఏమిటో వెతికితే నాకు తెలీలేదు - ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనే పేరుతో పేజీ లేదక్కడ, Law of effect అనే పేరుతో ఉంది. కానీ ఈ రెండూ ఒకటో కాదో నాకు తెలియలేదు. విషయం గురించి తెలిసినవాళ్ళకు ఇది సులువు -మీరైతే అది సరిగ్గా చెప్పగలరు. అంచేత మీరు రాసే వ్యాసాలకు అంతర్వికీ లింకులు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి.

ఆ లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "అంతర్వికీ లింకులు" విభాగం చూడండి. సందేహమేమైనా ఉంటే అడగండి. అడిగినపుడు [[వాడుకరి:Chaduvari]] అని నాకు లింకు ఇస్తే నన్ను మీరు ప్రస్తావించినట్లుగా నాకు నోటిఫికేషను వస్తుంది. లేకపోతే మీరు నన్ను అడిగిన సంగతి నాకు తెలియకుండా పోతుంది.

ఒకవేళ ఈ లింకులు మీరు ఈసరికే ఇస్తూ, పై వ్యాసంలో పొరపాటున మిస్సై ఉంటే, నా ఈ సలహాను పట్టించుకోనక్కర్లేదు. __ చదువరి (చర్చరచనలు) 06:46, 8 జూన్ 2021 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

వాడుకరి:Chaduvari గారూ అంతర్వికీ లింకులు ఎలా చేర్చాలో మీరు ఇచ్చిన సందేశం ద్వారా తెలుసుకొని, నేను రాసిన వ్యాసాలన్నింటికీ అంతర్వికీ లింకులు చేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే యత్నదోష అభ్యసన సిద్ధాంతం నకు Trial and error అనే ఆంగ్ల వ్యాసం అంతర్వికీ లింకుగా ఇవ్వవచ్చు. ఈ పని కూడా చేస్తాను.

నేను, వ్యాసాలన్నీ మొబైల్ లో డెస్క్టాప్ వ్యూ లో రాస్తున్నాను అందుకని ఈ పని చేయడం కాస్త ఆలస్యం కావచ్చు అయినప్పటికీ త్వరగానే పూర్తిచేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను రాస్తున్న వ్యాసాలలో ఏమైనా సవరణలు చేసుకోవాల్సిన అంశాలు ఉంటే తెలపండి. ఈ అంతర్వికీ లింకుల గురించి తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.MYADAM ABHILASH (చర్చ) 09:02, 8 జూన్ 2021 (UTC)

ధన్యవాదాలండి.__ చదువరి (చర్చరచనలు) 01:28, 10 జూన్ 2021 (UTC)