వాడుకరి చర్చ:Madhu yadav jangili

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Madhu yadav jangili గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Madhu yadav jangili గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:07, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బేతాళ కథలు[మార్చు]

ప్రారంభం:::

సమస్త మానవాళికి అన్న పానీయాలను సమకూర్చే పరమేశ్వరునికి ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో అత్యంత సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు ఒక మహరాజు..

ఆయన పూర్వజన్మ సుకృతం... ఆ ఆలయ శంకుస్థాపన ముహూర్త బలమో గానీ పరమశివుడు పార్వతి సమేతుడై స్వయంగా వచ్చి విగ్రహ ఏర్పాటుకు బ్రహ్మత్వం వహించాడు.

     ఆనాటి నుండి శివపార్వతులిద్దరూ ప్రతి మాసశివరాత్రి కి ఆలయానికి వచ్చి రాత్రంతా జాగారం చేసి పోతుండేవారు.
 భక్తులకు ఆ ఆలయం కొంగుబంగారమైవరాలనిచ్చే పుణ్యక్షేత్రమై వర్దిల్లసాగింది.
    ఒక మహ శివరాత్రినాడు పార్వతి సమేతుడై పరమేశ్వరుడు ఆ ఆలయానికి విచ్చేసారు.. 
 ఆ సమయంలో.... కన్నులు బరువెక్కి కంటి మీదకు

నిద్ర ముంచుకొస్తున్న పార్వతి ""నాథా! ఈ కన్నుల బరువును అపలేకపోతున్నను.ఈ నిద్ర దూరం కావడానికి కథా కాలక్షేపం కావాలి. ఆ కథలు మునుపెన్నడూ ఎవ్వరూ విననివి, తెలియనివి అయి ఉండాలి, చెప్పే మీకు, వినే నాకు తప్ప ఎప్పటికి ఎవ్వరికి తెలిసి ఉండరాదు అంటూ కోరింది...

 పరమశివుడు తన అర్ధనారీశ్వరి కోరికను అంగీకరిస్తూ...
 దేవీ! నీవు కొరినట్లే అటువంటి కథలనే చెబుతాను. కానీ కథ చివరన ఒక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధానం చెప్పాలి. సరేనా?? అన్నాడు.
 పార్వతీదేవి సరేనంటు తలాడించింది.
   ఆ దేవాలయానికి విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు పుజాదికలను నిర్వహిస్తున్నాడు. ఆనాడు శివరాత్రి పర్వదినం కావడం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల అతడికి ఆలస్యం అయింది. గర్భగుడి తలుపులు మూసి బయట చిందరవందరగా ఉన్న ఆలయగదులని శుభ్రం చేస్తుండగా పార్వతి పరమేశ్వరుల సంభాషణ అతని చెవినపడింది.
ఆహా! ఏమి నా భాగ్యం శివపార్వతులను కనులారా చూసి తరించే అవకాశం దొరికింది కదా అనుకుని గర్భగుడి తలుపులకు ఉన్న రంద్రాలనుండి పార్వతి పరమేశ్వరులను దర్శంచుకోని ఆ తర్వాత శివుడు పార్వతికి చెప్పే కథలన్నీ విన్నాడు.
 ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు.
  ఆమె నమ్మలేదు.నీవు చెప్పేది అబద్దం అంది.
 ఆమెను నమ్మించేదుకు పార్వతికి శివుడు చెప్పిన కథలు ప్రశ్నసమాధానాలతో చెప్పేసాడు.
 ఆడవారి నోట్లో రహస్యం అవగింజంతైన దాగదు కదా..
ఆ బ్రాహ్మణుడు భార్య చుట్టు పక్కల అమ్మలక్కలందరికి ఆ కథలను ప్రశ్న సమాధానాలతో సహా చెప్పేసింది..
ఈ కథలు ఆ నోటా ఆ నోటా లోకమంతా పాకాయి.
త్రిలోకసంచారియిన నారదునికి ఈ కథల సంగతి తెలిసింది లోకసంచారి కలహ బోజప్రియుడు కదా...

ఇంకేముంది.. ఈ విషయం తిన్నగా పోయి పార్వతికి చెప్పాడు.

నేను నా భర్తను లోకంలో ఇంతకు ముందెన్నడూ లేనివి, ఎవ్వరూ విననివీ.. ఎవ్వరికి ఎప్పటికీ తెలియని కథలు భులోకవసులందరికి తెలిసాయి. అంటే నా పతి చెప్పిన కథలన్నీ ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నావెనా..? అనుకుంది.
 పరమేశ్వరునిపై అలిగింది.. అలిగి నిలదీసింది..

కంగుతిన్న శంకరుడు తన దివ్యదృష్టితో చూసి బ్రాహ్మణుడి ఉందంతం తెలుసుకున్నాడు. జరిగింది పార్వతికి వివరించి బ్రాహ్మణుడిని బేతలుడిగా చెట్టును అశ్రాయించుకు బ్రతకమని శపించాడు. తను చేసిన తప్పు తెలుసుకున్న బ్రాహ్మణుడు శివుడిని శరణువేడాడు.

బొలశంకరుడు అతడిపై జాలితో "30వేల సంవత్సరాలు అలాగే పడివుండు. నిన్ను వశం చేసుకోవడానికి విక్రమార్కుడు అనే రాజును ఒక మాంత్రికుడు వినియోగించుకుంటాడు. అప్పుడు అతడికి ఈ కథలు చెప్పి సమాధానం చెప్పమను. అతడు సమాధానం చెప్పలేనిది చివరి కథ. ఆ తర్వాత అతనికి మాంత్రికుడి పన్నాగం చెప్పు.నీవు రాజు వశం అయ్యి అతను జీవించినంత కాలం అతనికి సేవచేసి అతడు స్వర్గానికి వచ్చినపుడు నీవు కూడా శాపవిముక్తి పొంది స్వర్గాన్ని చేరుకో" అంటూ శాపవిమోచ మార్గం ఉపదేశించి అంతర్థానం అయ్యాడు.. ఆ బ్రాహ్మణుడు బేతాళుడై ఆనాటి నుంచి శివుని ఆజ్ఞ మేరకు చెట్టును ఆశ్రయించుకొని విక్రమార్కుని రాకకోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగడు.

Madhu yadav jangili (చర్చ) 15:52, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]