వాడుకరి చర్చ:Shreya-IIITH Indic Wiki Project

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Shreya-IIITH Indic Wiki Project గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Shreya-IIITH Indic Wiki Project గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 09:29, 20 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా కృషికి సూచనలు

[మార్చు]

User:Shreya-IIITH Indic Wiki Project గారు, మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకొని రచనలు చేస్తున్నందులకు సంతోషం. అయితే మీ తొలి రచనలు(ఉదా:క్వాల్కమ్) సాంకేతిక అంశాలపై అనువాదాలు లాగా వున్నాయి. మీరు తొలి 500 మార్పులు, ఇప్పటికే వున్న వ్యాసాలపై చేస్తే, మీకు తెవికీ పై అవగాహన పెరుగుతుంది. ఆ తరువాత అనువాద వ్యాసాలు మెరుగుగా చేయగలుగుతారు. మీరు అనువాదానికి ఏ ఉపకరణం వాడుతున్నారో తెలియదు. ఇప్పటికే భాషాదోషాల గురించి సభ్యులు వ్యాస చర్చలో హెచ్చరించారు. అనువాదాల నాణ్యత నియంత్రణ గురించి ప్రస్తుతం తెలుగు వికీలో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని మీ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, మీరు మీ సహచర సభ్యులు తగు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాను. అన్నట్లు చర్చా పేజీలో సంతకం చేయాలి. స్వాగత విభాగంలో అంశాలను చదవండి. సందేహాలుంటే అడగండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:03, 22 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

క్వాల్కమ్

[మార్చు]

క్వాల్కం పేజీ సృష్టించినందుకు ధన్యవాదాలు. అందులో మీరు ఇంగ్లీషు వికీపీడియా పేజీలను మూలాలుగా ఇచ్చారు. అలా ఇవ్వకూడదు. వికీపీడియా వ్యాసంలో మరో వికీపీడియా వ్యాసాన్ని (ఏ భాషైనా సరే) మూలంగా వాడకూడదు. నేను ఆ మూలాలను తీసేసి సముచితమైన మూలాలను ఇచ్చాను. ఆ మూలాలు మరెక్కడివో కాదు, ఇంగ్లీషు వికీపీడియా లోని క్వాల్కామ్ పేజీ లోని "మూలాలను" కాపీ చేసి తెచ్చి ఇక్కడ పెట్టాను. అందులో తప్పేమీ లేదు, అలా పెట్టెయ్యొచ్చు. ఇకపై మీరూ అలాగే చెయ్యండి. పోతే.. క్వాల్కం చరిత్ర విభాగాన్ని బులెట్ పాయింట్లుగా కంటే, మామూలు పాఠ్యంగా రాస్తే బాగుండేది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 15:11, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.