వాడుకరి చర్చ:Sri chaithu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Vijayalakshmi7474 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Vijayalakshmi7474 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 10:11, 19 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సూర్యోదయం-సూర్యాస్తమయం[మార్చు]

వివరణ:

 సూర్యరశ్మి పై  గడియారం పెరుగుతున్నపుడు, ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి, పడమర దిక్కున అస్తమిస్తాడు.

సూర్యోదయం ఉపయోగాలు:

  సూర్యోదయంకన్నా ముందు నిద్ర లేచి, సూర్యకాంతులు మానవ శరీరం పై పడటం వలన ‘డి ‘ విటమిన్ లభిస్తుందని అంటారు.
 బ్రహ్మ సమయం లో నీటి లో సాక్షాత్తు సూర్య భగవానుడు ఉంటాడని భారతీయ సాంప్రదాయ నమ్మకం.
 సూర్యోదయం కాక  ముందు లేచి స్నానం చేయడం వళ్ళ సూర్యుని యొక్క శక్తి మానవ శరీరంలోనికి వస్తుందని, అది ఆరోగ్యాన్ని కలిగిస్తుందని అంటారు.
 బ్రహ్మగారు సృష్టికి ముందు తపస్సు చేసారని. సూర్యోదయం తో సృష్టి మొదలు అనుకుంటే సూర్యోదయం 
  చెట్లకు సగం సూర్యకాంతి నుంచి ఆహార పోషకాలు అందుతాయని శాత్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యోదయం సమయంలో మనము చేసే పనికి  సత్పలితాలు లభిస్తుందంట(అంటే మంచి ఫలితాలు ఇస్తుందంటారు).
  సూర్యోదయం కన్నా ముందు సమయాన్ని బ్రహ్మ సమయం అని పిలుస్తారు. బ్రహ్మ సమయం లో సకల తీర్ధాలు నీటిలో వుంటాయని అంటారు. కన్నా ముందు సమయం బ్రహ్మ సమయం అంటారు(బ్రహ్మముహూర్తం లో ధ్యానం లో ఊహాపరితమైన పని చేయడం వల్ల ఆ పనికి 41 రోజులలొ కార్య రూపం రావచ్చు అని, మనస్ఫూర్తిగా చేయడం వాళ్ళ కార్య ఫలితం జరుగుతుందని అంటారు.

సూర్యభగవానుడి చరిత్ర :

  కశ్యపు మహర్షి, అదితి  అను దంపతులకు జన్మించిన వాడు సూర్య భగవానుడు(ఆదిత్యుడు).
  దేవదూత అయినా అదితిని, ఆమె కోరిక మేరకు సూర్యుడు ఆమె గర్భమున జన్మించాడు.
  సూర్యుడికి సంధ్యాదేవి, ఛాయాదేవి, పద్మిని అను ముగ్గురు భార్యలు కలరు.
  మొదటి భార్య అయినా సంధ్యాదేవి గర్భమున ముగ్గురు బిడ్డలు జన్మించారు. వారు మనువు, యముడు, యమునా అను పేర్లతో పిలవబడ్డారు . సూర్యుని కుమారుడైన మానవునిచే  పరిపాలించడం వలన మనము మానవులం అయ్యామని అంటారు.
   హిందువులు సూర్యుడి ని   ప్రపంచానికే  ఆత్మ గా   భావిస్తారు. సంధ్యా  వందనం చేసే సమయం లో, కలశ లోని నీటిని సూర్యుడికి సమర్పించేటప్పుడు, వక్రీభవనం వలన, సూర్యుడి నుంచి వచ్చే కాంతి, రంగు లను ఉత్పత్తి  చేస్తాది. ఈ రంగులు, కంటికి చాలా  ఉపయోగపడతాయి, శరీరాన్ని జీవచేతనత్వము చేస్తాయి మరియు మానవులను ఆహ్లాదపరంగా ఉంచుతాయని నమ్మకము. సూర్యకిరణాలు శరీరంలోని ఏడు చక్రాలకు జీవచేతనాన్ని ఇస్తాయని హిందువులు నమ్ముతారు.

సూర్యాస్తమయాలు:

   చిన్న పెద్ద వయస్సు భేధాన్ని మరిచి ప్రతి ఒక్కరు ఇష్టపడే ప్రాంతము సముద్రతీరం. సముద్రతీర ప్రాంతాలల్లో ఇసుక లో గవ్వ లను ఏరుకోవడం, దగ్గరనుంచి అలలలో పోటీ పడుతూ తుల్లింతాలు ఆడటం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. అటువంటి సముద్రతీరాలలో సూర్యాస్తమయాలు చాల అందంగా కనిపిస్తూవుంటాయి. కేవలం సముద్రతీరాలే కాకుండా సరస్సులు, నదీతీర ప్రాంతాలు పర్వత శిఖరము కూడా సూర్యాస్తమయ సమయంలో సప్త వర్ణాలశోభితంగా వెలుగొందుతాయి. అలా అందమైన సూర్యాస్తమయ సమయం కి ఇంట్లో దీపారాధన చేయటం మంచిది అని అంటారు(భారతీయ సాంప్రదాయ ప్రత్యేకత)

సూర్యుడు ఎర్రగా ఉండటానికి గల కారణం:

   సూర్య కిరణాలు భూమి వాతావరణం లో  మానవుని కంటికి చేరేవరుకు ప్రయాణించే దూరాలు  మారుతూ ఉంటాయి. సూర్యకిరణాలు మన కంటికి చేరడానికి ఉదయం, సాయంత్రవేళల్లో ఎక్కువ సమయం తీసుకుంటాయి.
   సూర్యుడు ఉదయించే సమయాలలో దగ్గరగా ఉండుట వలన సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు నడి నెత్తి పైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరం పాటు  ప్రయాణించి  మన కంటికి చేరుతాయి.  అలాంటి  సమయాలలో సూర్యుడి  రంగు మామూలు గానే ఉంటుంది.
  సూర్యకిరణాలు వాతావరణం లో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరి పోయే ఎరుపురంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడంవల్ల సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

సూర్యుని గురించి మరి కొన్ని వాక్యాలు :

  జాతి ,మత భేదాలు   లేకుండా పశుపక్షాదులందరికి సూర్య భగవానుడు ఒకే విధముగా కాంతిని ప్రసరింపజేస్తాడు.
 దక్షిణాయనం ముగించుకొని , ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వ దినాలను మనము జరుపుకుంటున్నాము.
 అందులో ఒకటి సంక్రాంతి. రెండవది  రధసప్తమి.
 రధసప్తమి అనేది సూర్యుని కి సంబంధించిన జన్మ తిధి.
 పేదవాడు, ధనికుడు అనే తేడా లేకుండా అందరికీ  ఒకే విధమైన వెలుగును నింపుతాడు.  కనుక, రథసప్తమిని మనము పండుగగా జరుపుకుంటాము.
 అరణ్యవాసం సమయం లో ధర్మరాజు సూర్యభగవానుని ప్రార్ధించగా, ప్రసన్నమైన సూర్యుడు ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు.
 సత్రాజిత్తుడు  అను రాజు సూర్య భగవానున్ని  ప్రార్ధించి  శమంతకమణి ని పొందుతాడు. అది రోజూ  స్వర్ణం(బంగారం) ప్రసాదిస్తుంది అని సూర్యభగవానుడు అనుగ్రహించాడు.
 జీవుడు పుట్టుక, పోషణకు అవసరమైన వన్నీ  సూర్యుని నుంచే లభిస్తున్నాయి. శరీరంలో 24 తత్వాలు ఉంటాయని సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి  చైతన్యవంతం చేస్తే జ్ఞానం లభిస్తుంది అని చెబుతున్నారు(ఋషులు,యోగులు).
 సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్రాలను అభ్యసించాడు.
 సూర్యుడే గురువు అని, సూర్యకాంతి  జ్ఞానం అని చెబుతున్నారు (ఋషులు,యోగులు) Sri chaithu (చర్చ) 12:35, 19 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]