వాడుకరి చర్చ:Sudharani65
Sudharani65 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:45, 27 మే 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఏదైనా బొమ్మ గురించి చర్చించేటప్పుడు "ఫలాని బొమ్మ" గురించి అని వ్రాయాలి. ఉదాహరణకు Gita-kalamkari-painting.JPG అనే బొమ్మ తీసుకోండి. [[బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మ మొత్తం అక్కడ చూపబడుతుంది. అలా కాకుండా [[:బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మకు లింకు మాత్రమే ఇలా - బొమ్మ:Gita-kalamkari-painting.JPG అని వస్తుంది. రెండవ విధంలో "బొమ్మ"కు ముందుగా ఒక "కోలన్" గుర్తు ఉంది. గమనించండి.
ఇదే విధం మూసలకూ, వర్గాలకూ వాడవచ్చును. ఉదాహరణ - [[:వర్గం:తెలుగు సినిమా దర్శకులు]] మరియు [[:మూస:GFDL-సొంతకృతి]]
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల)
సహాయ అభ్యర్ధన[మార్చు]
{{సహాయం కావాలి}}
- నేను తెలుగు వికీపీడియా లో సభ్యురాలినైనందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈనాటి చిట్కాలో మీరు చెప్పినట్టు ఎలా రాయాలో,,ఇదివరకే రాసినదాన్ని ఎలా మార్చాలో సరైన అవగాహన లేక ఇంతవరకు ఏమీ చెయ్యలేదు. ఎక్కడైనా రాసిఉన్న సమాచారం తప్పుగా కనిపిస్తే మనకి తెలిసిన నిజాన్ని ఎలా రాయాలి. అది కూడా సరైనదేనని ఏమిటి నమ్మకం..అలా అందరూ మార్చేస్తూఉంటే సరైన సమాచారం ఎప్పటికైనా సమకూరుతుందా..
ఇక్కడ నాకు సహాయం కావాలి.
సుధారాణిగారూ! వికీపీడియాకు స్వాగతం. ఇక మీరు వ్రాయడం గురించి. ముందుగా, మీరు తెలుగులో చక్కగా వ్రాయగలుగుతున్నారు గనుక మీరు వికీ ప్రగతికి చాలా తోడ్పడగలరు.
- చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఈ సందేహాన్ని వ్రాసినట్లే ఇతర వ్యాసాలు కూడా వ్రాయవచ్చును లేదా దిద్దవచ్చును. ఏదైనా పేజీలో ఉన్న విషయాన్ని (లేదా అక్షర దోషాలను) మీరు దిద్దాలనుకోండి. ఆ పేజీ పైన "మార్చు" అనే ట్యాబ్‌ను నొక్కండి. ఎడిట్ మోడ్‌లో ఆ పేజీ తెరుచుకుంటుంది. మీరు చేయాల్సిన మార్పులు చేసి తరువాత క్రింద ఉన్న "భద్రపరచు" బటన్ నొక్కండి.
- వికీపీడియా ఒక సెకండరీ రిఫరెన్సు లాంటిది. కనుక ఇతర ప్రాధమిక రచనలలో ఉన్న విషయాలే ఇక్కడ వ్రాయాలి. మీకు ఖచ్చితంగా సరి అని తెలిస్తేనే ఆ విషయం వ్రాయడం ఉత్తమం.
- ఇక అందరూ మార్చేస్తుంటే అనే సంగతి - విజ్ఞానం అనంతం గనుక ఇది ఒక నిరంతర ప్రక్రియగా నేను భావిస్తాను. ఎవరూ ప్రయత్నించకుంటే ఇది ముందుకు సాగదు. ఈనాడు అరకొరగా ఉన్న వ్యాసాలు తరువాత విశేష వ్యాసాలుగా రూపుదిద్దుకుంటాయి. మొలకలనుండే మహావృక్షాలుద్భవిస్తాయి. దీనిని గురించి ఆంగ్ల వికీలో మరింత సమాచారం ఉంది. ఉదాహరణగా en:Wikipedia:Replies to common objections అనే లింకు చూడండి.
- వికీపీడియా:5 నిమిషాల్లో వికీ అనే పేజీ మీకు మార్గదర్శకంగా ఉంటుందనుకొంటాను. చూడగలరు.
మరేమైనా సందేహాలుంటే ఇక్కడ గాని లేదా నా చర్చాపేజీలో గాని వ్రాయగలరు. --కాసుబాబు 17:12, 19 సెప్టెంబర్ 2009 (UTC)
పట్రాయని[మార్చు]
నేను సాలూరుకు చెందినవాడిని. ఇక్కడి సంగీత పాఠశాల గురించి పట్రాయని వారి గురించిన నాకు చాలా కుతూహలంగా ఉన్న విషయాలు తెలియజేస్తున్నారు. ఈ బ్లాగ్ స్పాట్ ను ఎవరు నిర్వహిస్తున్నారు. వారి ఫోన్ నంబరు తెలియజేస్తే నాకు వారితో మాట్లాడాలని ఉన్నది. పట్రాయని వారి కుటుంబం గురించిన వివరాలు చర్చా పేజీలో గాని ప్రధాన పేజీలో గాని రాయండి. నేను దానిలోని తప్పుల్ని సవరిస్తాను. భయపడవద్దు.Rajasekhar1961 05:26, 15 ఫిబ్రవరి 2011 (UTC)
- వ్యాసాలలోని దోషాల్ని సవరించాను. దయచేసి పట్రాయని పండితుల ఫోటోలు చేర్చండి.Rajasekhar1961 08:14, 7 అక్టోబర్ 2011 (UTC)
- రెండు మంచి చిత్రపటాలు చేర్చినందుకు ధన్యవాదాలు. పట్రాయని పేజీలోనే పట్రాయనివారి వంశానికి చెందిన సమాచారాన్ని చేర్చితే బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 09:59, 7 అక్టోబర్ 2011 (UTC)
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మా వ్యాసం మొదలుపెట్టాను. మంచి సమాచారాన్ని చేర్చండి.Rajasekhar1961 12:23, 7 అక్టోబర్ 2011 (UTC)
మీ సలహాలు[మార్చు]
వ్యాసాలలో మార్పులు తగిన దృష్టాంతాలతో మీరే చెయ్యవచ్చు. అలాగే ఒక వ్యాసం గురించి మార్పులు దాని చర్చాపేజీలో రాయండి. మీరు రచ్చబండలో రాసిన వాటిని నేను అయాపేజీలకు మారుస్తాను. --అర్జున 04:13, 21 ఫిబ్రవరి 2012 (UTC)
{{సహాయం కావాలి}}
సహాయం అందించబడింది
కేంద్ర సాహిత్య అకాడమీ బహమతి పొందిన రచయితల పేర్లో తెలుగు విభాగంలో ఇల్లింద సరస్వతీదేవి అని సమాచారం లేని పేజీ గా ఉంది. అయితే ఇల్లిందల సరస్వతీదేవి అనే పేరుతో మరో పేజ్ ఉంది. కనుక ఆ రచయితల పేర్లలో ఈ లింక్ ఇవ్వాలి. ఇల్లందల అని ఉంది ప్రధాన వ్యాసంలో ఇల్లిందుల అనేది సరైన రూపం.
- మీరు కోరినట్లు ఇల్లిందుల సరస్వతీదేవి పేజీ సరైన పేరుతో ప్రధాన వ్యాసంగా యున్నది. పరిశీలించండి.-- కె.వెంకటరమణ⇒✉ 15:46, 16 జనవరి 2015 (UTC)
{{సహాయం కావాలి}}
సహాయం అందించబడింది
నాయకుడు అంటే అలంకారికులు ఇచ్చిన నిర్వచనం, లక్షణాలు వివరించాలనుకున్నాను. అయోమయ నివృత్తి అని వస్తోంది. అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. నాయకుడు (సినిమా) అనే పేజ్ ఉంది కనుక ఇక్కడ నాయకుడు అనే కొత్త పేజ్ సృష్టించడంలో ఇబ్బంది ఉండదనుకుంటున్నాను. కానీ ఎలా
- మీరు నాయకుడు అనే వ్యాసం ప్రారంభించండి. మీరు నాయకుడి గూర్చి వివరాలను చేర్చి అందులో విస్తరించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 15:37, 16 జనవరి 2015 (UTC)
శ్రీధరమల్లె వేంకటస్వామి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

శ్రీధరమల్లె వేంకటస్వామి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- విషయం సంగ్రహం, మూలాలు లేవు, లింకులు లేవు, దీనిని వ్యాసంగా పరిగణించలేము
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 12:58, 26 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 12:58, 26 జూన్ 2018 (UTC)
వేంకటాచల కవి పరిమి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

వేంకటాచల కవి పరిమి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- దీనిని వ్యాసంగా పరిగణించలేము. మొలక, మూలాలు లేవు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 16:16, 13 జూలై 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 16:16, 13 జూలై 2018 (UTC)
పున:స్వాగతం[మార్చు]
సుధారాణి గారూ,
మీకు పున:స్వాగతం. తెవికీలో మరింత సమాచారాన్ని చరుస్తూ ముందుకు సాగుతారని భావిస్తూ ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 03:41, 5 డిసెంబరు 2018 (UTC)