Jump to content

వాడుకరి చర్చ:Suryajyothi Sampara

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: క్రొత్త పుస్తకం చేర్చడానికి గల సందేహం టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: Suryajyothi Sampara

స్వాగతం

[మార్చు]
Suryajyothi Sampara గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Suryajyothi Sampara గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • పై బొమ్మపై నొక్కి తెలుగు వికీపీడియాను పరిచయం చేసే పుస్తకం చూడండి.
    వికీపీడియాలో రచనలు ఎలా చెయ్యాలో చెప్పే పుస్తకం చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:27, 19 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

@Nrgullapalli గారికి నా ధన్యవాదాలు 🙏😊. ఆలస్యంగా స్పందించి, జవాబు ఇస్తున్నాను. అందుకు మన్నించగలరు. నేను కూడా వికీపీడియాలో సభ్యురాలిగా అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. Suryajyothi Sampara (చర్చ) 15:23, 24 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

శ్రావణ శుక్రవారం

[మార్చు]

నమస్కారం మేడం. శ్రావణ శుక్రవారం వ్యాసంలో మీరు చేసిన మార్పులు చూసాను. నన్ను బాగా ఆకట్టుకున్నది దోషాల్లేని భాష. మరొకటి ఏంటంటే.. కొత్త సమాచారం చేర్చి ఊరుకోకుండా పాత సమాచారాన్ని సరిదిద్ది మెరుగుపరచారు. అందుకు నా ధన్యవాదాలు. మీ మొదటి దిద్దుబాటును చక్కగా మొదలుపెట్టినందుకు అభినందనలు కూడా. ఈ వ్యాసాన్ని ఇంకా పలు విధాలుగా మెరుగుపరచాల్సి ఉంది. బహుశా, ఇప్పటి వరకు చేసిన మార్పులపై సముదాయం సూచనల కోసం మీరు ఆగి ఉండవచ్చు. ఇక ఆగనక్కరలేదు, దిగ్విజయంగా ముందుకు నడవండి.

వ్యాసాన్ని మెరుగుపరచడంలో కింది సూచనలను పరిశీలించండి:

  • మూలాల్లేవు. అది పెద్ద లోటు ఈ వ్యాసానికి. సరైన మూలాల కోసం వెతకండి.
  • వ్యాసం ఆకృతిని సరిదిద్దాలి. ఆ నేవిగేషను మూస మధ్యలో ఉంది గదా.. దాన్ని కిందకి తీసుకువెళ్ళాలి
  • ఈ వ్యాసం నుండి ఇతర తెవికీ (తెలుగు వికీపీడియా) వ్యాసాలకు లింకులు ఇవ్వాలి. కనీసం మూడైనా లింకులు ఉంటే బాగుంటుంది. మూడుకు పైన ఎన్నైనా ఇవ్వవచ్చు.
  • ఈ వ్యాసానికి ఇన్‌కమింగు లింకులు (ఈ వ్యాసాన్ని చేరుకోడానికి, వేరే వ్యాసాలలో ఇచ్చే లింకులు) పెద్దగా లేవు. పెంచాలి.

పరిశీలించండి. పోతే -

  • ఒక ప్రశ్న - అవడ, పెరుగ్గారె - ఈ రెండు ఒకటే కాదా?
  • ఒక సంగతి - మనం చేసుకునే వ్రతాల్లో చాలావరకు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినవేనంట. రామాయణం కూడా! మీకు తెలిసే ఉంటుంది. నేను గరికిపాటి నరసింహారావు గారు చెప్పగా విన్నాను. __

చదువరి (చర్చరచనలు) 09:12, 27 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

నమస్కారం గురువుగారు🙏😊. మొదటగా... శిక్షణా తరగతిలో, నేను సవరించడానికి ప్రయత్నం చేసిన వ్యాసాన్ని ఒకసారి మీరు పరిశీలించాలని, నేను మిమ్మల్ని అడిగిన నా అభ్యర్ధనను గుర్తుంచుకుని పరిశీలించి చూడడమే కాకుండా, (నేను అంత బాగా పని చేయక పోయినప్పటికీ), నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ మీరు ఓపికగా రాసిన ఈ ఉత్తరానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙇‍♀️ 🙏. నాకు కొంచెం ఒంట్లో బాగులేక పోవడం కారణంగా నేను నిన్న శిక్షణా తరగతి కి హాజరు కాలేక పోయాను. మీరు పంపిన ఈ ఉత్తరాన్ని కూడా చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను, అందుకే ఆలస్యంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాను,మన్నించండి.
అయితే, నేను ఈ వ్యాసంలో చేసిన సవరణల విషయానికి వస్తే, మీరు శిక్షణలో భాగంగా, అసలు మూలాలు ఎలా ఇవ్వాలో చెప్పినప్పుడు, వాటిని ఎలా బడితే అలా ఇతర సోషల్ మీడియాలోనివీ అవీ ఇవ్వకూడదు, ఆ లంకెలు వికీపీడియా కి ఆమోద యోగ్యమైనవే ఇవ్వాలని చెప్పారు కదా! అందుకని ఎందుకొచ్చిన సాహసం అని 😬😁 నేను సాధారణంగా ఉండే అంశాలే చేర్చాను. అందుకే శివ పార్వతుల సంవాదం,పురాణం అని ప్రస్తావించాను.అప్పుడు అక్కడ వ్యాసంలో ఉన్న విషయాలకి ప్రామాణికత ఏమిటి అనే ప్రశ్న తలెత్తకుండా జాగ్రత్త తీసుకున్నాను(ఉదా:- ఏ సమయంలో పూజ చేయాలి,కలశం పెట్టుకోవాలి) అలాంటి నియమాలూ నిబంధనలేమీ రాయలేదు. ఎందుకంటే ఇవి అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి, అంతేకాకుండా అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా మూలాలు ఇవ్వాలి కాబట్టి. ఈ వ్యాసం మొదలుపెట్టిన సమయంలో అప్పుడున్న నా లక్ష్యం ఏమిటంటే, ఈ వ్యాసాన్ని ఎలాగోలా విస్తరించాలి ఐదువేల బైట్లు కి పెంచాలి అన్నది. అందుకే ఈ వ్యాసానికి ఐతే అంత మూలాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో అని ఈ వ్యాసం ఎంచుకున్నాను. ఇది నా ప్రథమ ప్రయత్నం. అసలు సరిగా చేస్తున్నానో లేదో లేక ఏమైనా పొరపాటున తప్పు చేసి అసలు వ్యాసం తొలగించేస్తున్నానేమోనని నా భయం. మీరు ఫర్వాలేదు అని చెప్పాకా ధైర్యం కలిగింది. ఇంక ఆవడ , పెరుగు వడ ఒకటే అయినప్పటికీ(అక్షరాలు స్పేస్ తో కలుపుకొని ఎక్కువ కదా అని అనుకున్నాను). కొన్ని సవరణలు చేసి ఎలా అయినా ఆ వ్యాసాన్ని ఐదువేల బైట్లకు పెంచాలి🫣, కేవలం అలా వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి , నా మొదటి ప్రయత్నం చేశాను. ఈసారి మీరు చెప్పిన సూచనలు పాటిస్తూ,మరింత శ్రద్ధగా,సరిగా చేయడానికి ప్రయత్నిస్తాను👍😊. మీ ఆశీర్వాదాలను కోరుతూ... మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు 🙇‍♀️ 🙏. Suryajyothi Sampara (చర్చ) 15:37, 28 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
"అక్షరాలు స్పేస్ తో కలుపుకొని ఎక్కువ కదా " - 😊👍__ చదువరి (చర్చరచనలు) 22:52, 28 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
నమస్కారం గురువుగారు🙏😊. ఈరోజు నేను నా పేరుతో ఒక పేజీని సృష్టించాను. ఒకసారి మీరు ఆ పేజీని వీక్షించ వలసిందిగా నా విన్నపం. అంతేకాక నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటంటే... 1)ఇలా నా పేజీలో ఏమైనా నా సొంతంగా రాసుకోవచ్చా?
2)నేను నా మొబైల్ లో గూగుల్ కీబోర్డ్ యాప్ ద్వారా తెలుగుని టైప్ చేస్తున్నాను. అయితే ఇంక ఏ ఇతర యాప్ వాడినా కూడా పదాలు క్రింద ఎరుపురంగు గీత లాంటిది రావట్లేదు కానీ ఈ వికీపీడియాలో మాత్రం కొన్ని పదాలు క్రింద ఎరుపురంగులో గీతను చూపిస్తోంది ఎందుకు?
3)అమ్మ, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మొదలైన కొన్ని పదాలకు మూలాలు ఇద్దామని, అంతర్గత లింక్ ఇద్దామని ప్రయత్నం చేసాను, కానీ ఎందుకో అవడం లేదు. బహుశా మీరు చెప్పినవి మర్చిపోయాను అనుకుంటాను😔😞. మీరు శిక్షణలో నేర్పించిన మూలాలు ఎలా ఇవ్వాలి, వర్గాలు ఎలా ఇవ్వాలో మళ్ళీ తెలుసుకోవాలంటే ఎలా?

4)అయిపోయిన క్లాసులోని పాఠాలను మళ్ళీ వినే అవకాశం ఇంకేమైనా ఉందా? ప్రస్తుతానికి ఇవి నా సందేహాలు😬😁. ఈ సందేహాలను కూడా ఎక్కడ, ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. మీరు పంపిన సందేశానికి ప్రత్యుత్తరం అని చూపిస్తున్న దగ్గర ఇలా అడుగుతున్నాను. ఇందులో తప్పులు ఉంటే మన్నించండి 🙏😊 Suryajyothi Sampara (చర్చ) 11:36, 29 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

క్రొత్త పుస్తకం చేర్చడానికి గల సందేహం

[మార్చు]

నేను, ఈ వికీపీడియాలో శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాసిన "చిలకమర్తి ప్రహసనాలు" అనే పుస్తకం వెతికి చూస్తే కనబడలేదు. నా దగ్గర ఉన్న ఆ పుస్తకాన్ని ఇందులో చేర్చాలనుకుంటే ఎలా? Suryajyothi Sampara (చర్చ) 12:27, 29 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం