వాడుకరి చర్చ:Tewiki.vasu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Tewiki.vasu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Tewiki.vasu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 12:29, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన వ్యాసాలు వాడుకరి ఉప పేజీలకు తరలింపు[మార్చు]

మీరు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయాలన్న ప్రయత్నం చేయడం సంతోషకరం, అభినందనీయం. అయితే, ఆ వ్యాసాలు పదిమందికీ పనికివచ్చే వ్యాసాలుగా ఉండాలి కాబట్టి అనువదించేప్పుడు సహజమైన భాష రాయడానికి ప్రయత్నించండి. గూగుల్ అనువాద ఉపకరణం వాడి అనువాదం చేసే క్రమంలో చాలా అసహజమైన భాష వచ్చి చేరుతుంది. దాన్ని మార్చకుండా చిన్న చిన్న మార్పుచేర్పులు చేసి ప్రచురిస్తే, ఎవరికీ అర్థం కాక బుర్ర బద్దలుకొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్నే నాణ్యత లేమి అంటారు. తెలుగు వికీపీడియాలో రాసే భాష సరళంగా, చదివేవారికి అర్థమయ్యేలా ఉండాలి. యాంత్రికంగా, అసహజంగా ఉండకూడదు. మీరు రాస్తున్న భాషలోని "యొక్క" వంటి పదాలు, "బడు" ప్రయోగాలు, పదజాలం సమస్యలు, కొన్ని భాషాదోషాలు కూడా కనిపిస్తున్నాయి. వికీపీడియా:శైలి/భాష చూడండి.

వ్యాసాలను తొలగించకుండా మీ వాడుకరి పేరుబరి (నేమ్‌స్పేస్‌) లోకి తరలించాను. దయచేసి మీ అనువాద ఉపకరణంలో అనువదించేప్పుడు తెలుగు శీర్షికగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని పాత పేర్లు కాకుండా దానికి మీ వాడుకరి పేరు తగిలించి (ఉదాహరణకు వాడుకరి:Tewiki.vasu/నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) మార్పుచేర్పులు చేసుకోండి. దీన్ని ప్రయోగశాలలో మార్పుచేర్పులు చేయడం అనుకోవచ్చు. అలాకాక అసహజమైన భాషతో పేజీ సృష్టిస్తే, పేజీ తొలగింపు చేయాల్సి రావడం, ఇతర చర్యలు తీసుకోవాల్సి రావడం తప్పకపోవచ్చు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:36, 26 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. ఈ వ్యాసం గూగుల్ అనువాద ఉపకరణం వాడి చేసినది కాదు. ఆంగ్లంలో చదివి తెలుగులో రాయ డానికి చేసిన ప్రయత్నం. ఆన్ని విషయాలను తెలుగులొ రాయడానికి ప్రయత్నం చేసాను.ఈ సవరణలో భాషాదోషాలు తెలిసినంతవరకు తొలగించాను. "యొక్క" వంటి పదాలు, "బడు" ప్రయోగాలు తొలగించాను. ఈ వ్యాసం లో అసహజ భాష వున్నట్టు అనిపించడం లేదు (I may be biased as an initiator of the page). Let me know if I am still missing something. --వాడుకరి:tewiki.vasu

వికీపీడియాలో ప్రయోగాల పేరిట కృతక భాష[మార్చు]

వాసు గారూ, నమస్కారం అండీ. ఇటీవల నేను కొన్ని నిర్వహణాపరమైన పనులు చేసే క్రమంలో కశ్యప్ గారి చర్చా పేజీలో అసహజమైన భాష, కాపీహక్కుల ఉల్లంఘన వంటివాటిపై అవగాహన కల్పిస్తూ రాశాను. ఆయన ప్రతిస్పందనగా అవును నేను చేసున్న చాలా వాటిలో కృత్రిమ భాష ఉంటోంది , ఎందుకంటే గత మూడు నెలల నుండి రాసున్న నా వ్యాసాలను చాలా వరకు యాంత్రిక అనువాదాలు , వీటిని చాలా వరకు నేను వివిధ అనువాద ఉపకరణాలు పరీక్షించటానికి లేదా నేను ట్రైన్ చేస్తున్న కొంత మంది కొత్తవారికి నా చర్చా పేజి తో సహా ఇక మంచి , చెడ్డ ఉదాహరణలు గా చూపించటానికి వాడుతుంటాను. అని రాశారు. ఆయన వాడుకరి పేజీ ప్రకారమూ, ఆయన రచ్చబండలో రాసిన ప్రకారమూ శిక్షణా సమావేశాలు మరియు వర్క్‌షాపులు నిర్వహించడం ఐఐఐటీ కన్సల్టెంటుగా ఆయన బాధ్యత కనుక కోర్స్ కరెక్షన్‌కి ఉపయోగపడుతుందని మీకు తెలియబరుస్తున్నాను. వికీపీడియా మొదటి పేరుబరిని ప్రయోగాల కోసం వాడకూడదనీ, అందుకోసం ప్రయోగశాల వాడుకోవచ్చనీ ట్రైనర్లకు తెలియజెప్పగలరు. నిజానికి, ఈ విషయం శిక్షకులు తమ వికీ విద్యార్థులకు చెప్పవలిసిన మొదటి పాఠం, అలా చెప్పి వారికి ఓ ప్రయోగశాల ఏర్పరచడం అన్నది శిక్షణలో ఒక మంచి ప్రారంభం. అందుకు భిన్నంగా ఇక్కడ శిక్షకుడే వరుస వ్యాసాలు సృష్టిస్తూ వాటిలో తాను చేర్చిన కృత్రిమభాషను ప్రయోగాలని చెప్తే ఈ వ్యాసాలను బాధ్యతాయుతంగా నోటీసులు పెట్టి, చర్చలు ప్రారంభించిన వ్యక్తికి వినడం కాస్త చేదైన అనుభవమే అనుకోండి. పైగా, ఇలా చేయడమేమీ తప్పు కాదన్న సంకేతం విద్యార్థి వికీపీడియన్లకు వెళ్ళడం మొదటికి మోసం కాగలదు. ఇదంతా ప్రణాళిక ఉద్దేశించి ఉండదనీ, శిక్షకుడు తెలియక చేసివుంటాడని సద్భావం కొద్దీ విశ్వసిస్తున్నాను. ఏదేమైనా ఇదొక అనుభవంగా తీసుకుంటారని ఆశిస్తూ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 10:10, 14 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:47, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)