వాడుకరి చర్చ:Thirumalgoud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Thirumalgoud గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Thirumalgoud గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
 • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
 • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
 • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
 • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
 • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  

Nrgullapalli (చర్చ) 14:03, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:54, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:52, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

భాషా లింకులు[మార్చు]

తిరుమల్‌గౌడ్ గారూ, మీరు సృష్టించిన పేజీలకు ఇతర భాషల లింకులు ఇవ్వండి. దాని వలన రెండు ముఖ్యమైన ఉపయోగాలున్నై:

 1. వేరే పేరుతో మరొకరు ఆ పేజీని సృష్టించకుండా ఉండేందుకు పనికొస్తుంది.
 2. మీరు సృష్టించినది వేరేపేరుతో ఈసరికే ఉందేమో దీనిద్వారా తెలుస్తుంది.

__ చదువరి (చర్చరచనలు) 14:05, 25 మార్చి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీ అమూల్యమైన సూచనలు తప్పకుండా పాటిస్తాను సర్ ధన్యవాదలు
Thirumalgoud (చర్చ) 15:54, 25 మార్చి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Thirumalgoud గారూ, మీరు సృష్టించిన పేజీలకు ఇతర భాషల లింకులు ఇవ్వండని పైన చదువరి గారు చెప్పారు. అయినా మీరు ఇతర భాషల లింకులు ఇవ్వడంలేదు. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:24, 8 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన పేజీలు[మార్చు]

తిరుమలగౌడ్ గారూ, మీరు సృష్టిస్తున్న పేజీల్లో కొన్నిటిలో భాష చాలా కృతకంగా ఉంటోంది - బహూశా యాంత్రిక అనువాదం వలన కావచ్చు. యాంత్రికానువాదాలో భాషా కృతకం గానే ఉంటుంది. వాటిని ప్రచురించే ముందు, శ్రద్ధగా పరిశీలించి, దోషాలను సవరించి, భాషను సహజంగా ఉండేలా మార్చి ప్రచురించాలి. లేదంటే కార్లా ఫ్రాక్సీ పేజీలో ఆమెను పురుషుడిగా భావించడం లాంటివి ఉంటాయి. "అంగీకరించిన 35 మంది విద్యార్థులలో చివరిగా ఆమె అందంగా ఉంది.", "స్టాలింగ దృశ్య భాష ఒక డి స్టిజ్ల్ , జపనీస్ ఆర్కిటెక్చర్ , మినిమల్ ఆర్ట్ కాన్సెప్టువల్ ఆర్ట్‌లో పాతుకుపోయింది" లాంటి వాక్యాలు ఇంగ్లీషులో చదివితే తప్ప అర్థం కావు. దయచేసి, వ్యాసాలను ప్రచురించే ముందు వాటిని కూలంకషంగా సవరణలు చేసి వికీయోగ్యంగా మార్చి అప్పుడే ప్రచురించండి. ఈసరికే ప్రచురించినవాటిలో అవసరమైన మార్పులు చేసి వాటిని మెరుగు పరచండి.

అలాగే ఇతర "భాషలు లింకులు" పెట్టండి. నేను రెండు వ్యాసాలకు ఆ లింకులు పెట్టాను. ఆ లింకుల్లేని వ్యాసాలు ఇంకా కొన్ని ఉన్నాయి, పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 09:12, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అలాగే సర్ ఇంకోసారి భాష కృతకంగా ఉంటే సవరించి దోషాలు లేకుండా ప్రచురిస్తాను,మరొకసారి అలాంటివి శ్రద్దగా పరిశీలించి తప్పులు లేకుండా మార్పులు చేస్తాను.
అలాగే వ్యాసాలు పరిశీలించి ఇతర భాషల లింకులు కూడా పెడతాను సర్ ధన్యవాదలు. Thirumalgoud (చర్చ) 15:41, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Thirumalgoud గారూ, మీరు రాస్తున్న వ్యాసాలలో భాషా కృతకంగా ఉంటోంది. సమాచారమంతా యాంత్రికానువాదంతో రాసినట్టుగా ఉంది. యాంత్రికానువాదాన్ని పోలివున్న వ్యాసాలు తొలగించబడుతాయి, గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:43, 6 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగే సర్ తప్పులు సరి చేసుకుంటాను,కృతకంగా ఉన్న భాషా కూడా సరి చేసుకుంటాను,మీ సూచనలు తప్పకుండ పాటిస్తాను,ఇతర భాషాల లింకులు ఇస్తాను,మీ సూచనలకు ధన్యవాదాలు సర్ Thirumalgoud (చర్చ) 04:41, 9 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Thirumalgoud గారూ, పైన చెప్పిన సూచనలు పాటించకుండా మునుపటి మాదిరిగానే వ్యాసాలు రాస్తున్నారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:14, 15 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నాగతిహళ్లి చంద్రశేఖర్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

నాగతిహళ్లి చంద్రశేఖర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

యాత్రికానువాదం, భాష కృతంగా ఉంది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నాగతిహళ్లి చంద్రశేఖర్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:15, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:15, 15 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అరవింద్ మాలగట్టి వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

అరవింద్ మాలగట్టి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరవింద్ మాలగట్టి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:17, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:17, 15 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కార్లా ఫ్రాక్సీ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

కార్లా ఫ్రాక్సీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కార్లా ఫ్రాక్సీ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:20, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:20, 15 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:23, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:23, 15 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కృతక భాష గురించి మరొకసారి[మార్చు]

తిరుమలగౌడ్ గారూ, మీరు ప్రచురిస్తున్న వ్యాసాల్లో ఉంటున్న కృతక భాష గురించి మీతో ప్రణయ్ రాజ్ గారు, నేను చర్చించి ఉన్నాం. మీరు కూడా సహృదయంతో స్పందించారు, మెరుగుపరుస్తానన్నారు. అయితే గత రెండు మూడు రోజుల్లో మీరు ప్రచురించిన వ్యాసాల్లోని భాషను చూస్తే, ఇంకా కృతకభాష అలానే ఉంది. ఇలాంటి భాష వలన వికీ నాణ్యత దిగజారడమే గాక, దాన్ని మెరుగుపరచేందుకు ఇతర వాడుకరుల సమయం వృథా అవుతుంది.

అనువాదంలో సహజమైన భాషను రాయడమనేది ప్రధానమైన సూత్రం. పైగా తెలుగు భాషలో ఉన్న విజ్ఞానసర్వస్వంలో ప్రచురించే వ్యాసాల్లో అసలు తెలుగే సరిగ్గా ఉండకపోతే, వ్యాకరణ నియమాలనే పాటించకపోతే, ఇక ఆ వ్యాసానికి అర్థమేముంది? అది ఉండీ ప్రయోజనమేముంది? ఏవో అక్కడక్కడా దోషాలుంటే దాని గురించి మనం మాట్టాడుకోనక్కర్లేదండి.. కానీ గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసంలో ఉన్న కింది వాక్యాలు చూడండి

 1. "అలెగ్జాండ్రోవ్ 1930లలో జాలీ ఫెలోస్ అతని భార్య లియుబోవ్ ఓర్లోవా నటించిన ఇతర సంగీత హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించినప్పుడు అతని స్వంత హక్కులో ప్రధాన దర్శకుడయ్యాడు." ఇన్ హిస్ ఓన్ రైట్ అనేదాన్ని అతని స్వంత హక్కులో అని అనువదిస్తే దాన్ని ప్రచురించేస్తామా?
 2. "తొమ్మిదేళ్ల వయస్సు నుండి, అలెగ్జాండ్రోవ్ ఎకటెరిన్‌బర్గ్ ఒపేరా థియేటర్‌లో బేసి ఉద్యోగాలు చేశాడు" - బేసి ఉద్యోగాలు అనే హాస్యాస్పదమైన అనువాదాన్ని ప్రచురించెయ్యడం సబబేనా?
 3. "చీకటి విలన్‌ల గుంపు మా శ్రామికులు ఉల్లాసంగా ఉన్న వ్యక్తులపై దాడి చేసింది..."
 4. 1941 అక్టోబరు చివరిలో, ఇతర మోస్ఫిల్మ్ ఉద్యోగులతో, అలెగ్జాండ్రోవ్ ఓర్లోవా అల్మా-అటా, కజఖ్ ఎస్ ఎస్ ఆర్ కి తరలించబడ్డారు.
 5. త్వరలో దర్శకుడిని స్థానిక స్టూడియోను నడపడానికి అజర్‌బైజాన్ బాకుకు పంపారు.
 6. అక్కడ అలెగ్జాండ్రోవ్ అతని భార్య "జర్మన్ ఫాసిస్ట్ దండయాత్రకు వ్యతిరేకంగా సోవియట్ ప్రజల పోరాటాన్ని పేలవంగా ప్రతిబింబించినందుకు" థియేటర్లలో విడుదల చేయకుండా నిషేధించబడిన ఎ ఫ్యామిలీ అనే చిత్రాన్ని రూపొందించారు.

వ్యాసంలో చాలావరకు ఇలాంటి వాక్యాలే ఉంటే ఆ వ్యాస నాణ్యత ఎలా ఉంటుందో చూడండి.

మీరు వికీపీడియాలో విశేషంగా వ్యాసాలు ప్రచురిస్తూ దాని విస్తరణలో దోహదపడుతున్నారు. అయితే భాషను మెరుగుపరచుకుంటే, వికీపీడియాను నాణ్యంగా అభివృద్ధి చెయ్యడంలో కూడా పాలుపంచుకోవచ్చు. దాన్ని సగర్వంగా ప్రకటించుకోనూ వచ్చు. పరిశీలించండి. మీరు ప్రచురించిన వ్యాసాలను మెరుగుపరచి ఆ తరువాత మరిన్ని కొత్త వ్యాసాలను ప్రచురించమని నా విజ్ఞప్తి. పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 04:45, 16 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రివాల్వర్ (టీవీ సిరీస్) వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

రివాల్వర్ (టీవీ సిరీస్) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

అర్థం పర్థం లేని కృతక భాష. ఉదాహరణకు: "చాలా మంది ప్రదర్శనను రూపొందించడానికి బయలుదేరారు,కానీ ఇది దానికి విరుద్ధంగా ఉంది కొత్త వేవ్లో ఉన్న సంగీత దృశ్యాలకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను ఎన్నో చేశారు - అయితే ఇందులో డైర్ స్ట్రెయిట్స్ లిండిస్‌ఫార్నే వంటి ఇతర ప్రధాన స్రవంతి కళాకారులు కూడా ఉన్నారు. "

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రివాల్వర్ (టీవీ సిరీస్) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 01:33, 22 మే 2022 (UTC) చదువరి (చర్చరచనలు) 01:33, 22 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాసాల్లో భాష నాణ్యతపై దృష్టి పెట్టండి[మార్చు]

తిరుమలగౌడ్ గారూ, మీరు సృష్టిస్తున్న వ్యాసాల్లో భాష కృతకం గానే ఉంటోంది. గతంలో ఈ విషయంపై మీతో ఇతర వాడుకరులు చర్చించారు. అయినప్పటికీ పెద్దగా మార్పులేదు. వ్యాసాల్లో ఉండాల్సిన కనీస లక్షణం -తప్పుల్లేకుండా ఉండే తెలుగు. దానిపై మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీరు సృష్టిస్తున్న వ్యాసాలను సరిచేసేందుకు/వాటిలో చెయ్యాల్సిన పనులను గుర్తించి ట్యాగులు చేర్చేందుకు ఇతర వాడుకరులు సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇది వికీపీడియా అభివృద్ధికి దోహదం చెయ్యదు. దయచేసి మరిన్ని కొత్త వ్యాసాలను దోషపూరిత భాషతో సృష్టించడం ఆపండి. పాత వ్యాసాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:30, 22 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022[మార్చు]

నమస్కారం

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.

మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీ కామన్స్ లో ఫోటోల ఎక్కింపు[మార్చు]

నమస్కారం, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ పోటీలో భాగంగా కాపీరైట్స్ ఉన్న ఫోటోలను మీరు వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు కూడా చేర్చడంలేదు. మీరు కామన్స్ లో ఎక్కించిన నువ్వే నా శ్రీమతి సినిమా పోస్టర్ కు తొలగింపు మూస చేర్చబడింది. కాపీరైట్స్ ఉన్న ఫోటోలు వికీకామన్స్ నుండి తొలగించబడుతాయి. అప్పుడు వ్యాసాలలోని ఫోటో లింకు తెగిపోతుంది. మీరు పడిన శ్రమంతా వృధా అవుతుంది. సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:13, 9 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నమస్కారం,సర్ అలాగే సర్ మీ సూచనలు పాటిస్తాను,సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలను.
ధన్యవాదాలు Thirumalgoud (చర్చ) 09:20, 9 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]