వానపాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వానపాము
Lumbricus terrestris, the Common European Earthworm
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Lumbricina
కుటుంబాలు

  Acanthodrilidae
  Criodrilidae
  Eudrilidae
  Glossoscolecidae
  లుంబ్రిసిడే
  మెగాస్కోలిసిడే

వానపాములు (ఆంగ్లం Earthworms) అనెలిడా వర్గానికి చెందిన జీవులు. వీటిని ఆలిగోకీటా తరగతిలో లుంబ్రిసినా ఉపక్రమంలో ఉంచారు. విశ్వవ్యాప్తంగా ఆలిగోకీటాకు చెందిన 3,100 జాతులను గుర్తించగా అందులో 1,800 జాతుల వానపాములున్నాయి. వీనిలో 40 జాతులు భారతదేశంలో ఉన్నాయి. మనదేశంలోని వానపాముల్లో దక్షిణ భారతదేశంలోని ద్రవిడా గ్రాండిస్ (Drawida grandis) అతి పెద్ద వానపాము. ఇవి నేలను సారవంతం చేసి వ్యవసాయానికి సహాయపడతాయి.

వర్గీకరణ

[మార్చు]

ముఖ్యమైన కుటుంబాలు

[మార్చు]

భారతదేశపు వానపాము

[మార్చు]

ఫెరిటిమా ప్రజాతికి చెందిన వానపాముల్ని భారతదేశపు వానపాములుగా గుర్తిస్తారు. ఇవి 13 జాతులున్నాయి. అందులో ఫెరిటిమా పోస్తుమా అనేది మనదేశంలో లభించే సాధారణ వానపాము.

ఫెరిటిమా పోస్తుమా ఎక్కువగా తేమగల నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇవి కుళ్ళుతున్న జీవపదార్ధాలు, బంకమట్టి లేదా ఇసుక నేలల్లో ఉంటాయి. కాబట్టి ఆహారం దొరికే నేలపై పొరల్లోనే ఉంటాయి. వేసవికాలంలో నేల పొడిగా ఉండటం వల్ల లోతుగా బొరియలు చేసుకొని జీవిస్తుంది. వర్షం కురిసి బొరియలు నీటితో నిండినప్పుడు ఇవి బయటకు వస్తాయి. వీటి ఉనికిని అది నేలమీద విడుదలచేసే క్రిమి విసర్జనాల సహాయంతో గుర్తుపట్టవచ్చును. ఇవి నిశాచర జీవులు.

వానపాము తారు మీదుగా పాకుతోంది.

వీని దేహం స్థూపాకారంగా సుమారు 150 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసాన్ని కలిగివుంటుంది. ఉదరతలం కంటే పృష్ఠతలం ప్రార్ఫిరిన్ (Porphyrin) అనే పదార్థం ఉండటం వలన ముదురు రంగులో ఉంటుంది. ఇది వానపామును అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తుంది. వానపాము పూర్వాంతం మొనదేలి ఉండగా పరాంతం మొండిగా ఉంటుంది. పూర్వాంతంలో నోటి రంధ్రం ఉంటుంది. దేహమంతా వలయాకారపు ఖండితాలు 100 నుండి 120 వరకు ఉంటాయి. చివరి ఖండితంలో పాయువు ఉంటుంది. వానపాములో ప్రతి ఖండితం మధ్య కైటిన్ తో చేసిన శూకాలు ఖండితం చుట్టూ ఉంటాయి. ఈ రకమైన శూకాల అమరికను పెరికీటైన్ అమరిక అంటారు.

వలయ కండరాలు ఏకాంతర సంకోచ వ్యాకోచాలు జరుపుతూ వానపాము గమనాన్ని జరుపుతుంది. శూకాలు, శరీర కుహరద్రవం గమనంలో సహకరిస్తాయి. గమనం జరుపుతున్నపుడు విస్తరణ (Extention), లంగరు (Anchoring), సంకోచం (Contraction) అనే మూడు ప్రక్రియలు వానపాము దేహంలో జరుగుతాయి.

ఆర్ధిక ప్రాముఖ్యం

[మార్చు]

వానపాములు మానవుల కెంతో ఉపయోగకరమైనవి. చేపలకు ఎరగాను, అక్వారియమ్ లో చేపలకు, భూమి మీద కప్పలు, తొండలు, పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. వర్మి కంపోస్టు .. వానపాములను పెంచి వాటికి ఆహారంగా పేడ, ఇతరత్రా వ్యవసాయ రద్ది పదార్తాలను వేసి నీళ్ళు చల్లు తుంటే కొంత కాలానికి వాన పాములు మేతగావేసిన వ్వర్థ పదార్థాలను తిని విసర్జిస్తాయి అదే వర్మి కంపోస్టు. ఇది పైరులకు చాల బలాన్నిస్తుంది. దీని తయారిని ప్రభుత్వం కూడా ప్రొత్స హించి సబ్సిడిని కూడా ఇస్తున్నది. వాన పాముల వలన ఇది అతి ముఖ్య ఉపయోగము. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు వ్యాధికి చికిత్సగా యునానీ వైద్యంలో వానపాములను ఉపయోగిస్తారు.

ఇవి చదవండి

[మార్చు]
  • Edwards, Clive A. (Ed.) Earthworm Ecology. Boca Raton: CRC Press, 2004. Second revised edition. ISBN 0-8493-1819-X
  • Lee, Keneth E. Earthworms: Their Ecology and Relationships with Soils and Land Use. Academic Press. Sydney, 1985. ISBN 0-12-440860-5
  • Stewart, Amy. The Earth Moved: On the Remarkable Achievements of Earthworms. Chapel Hill, N.C.: Algonquin Books, 2004. ISBN 1-56512-337-9
"https://te.wikipedia.org/w/index.php?title=వానపాము&oldid=3858156" నుండి వెలికితీశారు