వాము నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాము నూనె
Carom Flowers.jpg
వాము మొక్క యొక్క పూలు '
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
ఆస్టేరిడ్స్
Order:
ఏపియేల్స్
Family:
అపియేసియా
Genus:
ట్రాచిస్పెర్ముమ్
Species:
ట్రాచిస్పెర్ముం ఎమ్మి
Binomial name
ట్రాచిస్పెర్ముం ఎమ్మి
Synonyms[1][2]
 • ఎమ్మి కాప్టికమ్ L.
 • క్యారుమ్ కాప్టికమ్ (L.) Link
 • Trachyspermum copticum Link
Ajwain.JPG

వాము నూనె ఒక ఆవశ్యక నూనె.వాము గింజలనుండి ఆవిరి స్వేదన క్రియ ద్వారా ఈ సుగంధ తైలంను ఉత్పత్తి చేస్తారు.వాము నూనెను సుంగంధ తైలంగా, ఔషధ నూనెగా ఉపయోగిస్తారు.వాము గింజలను వంటల్లో ఉపయోగించడంతో పాటు దేశీయ, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.వాము నూనెలో శిలీంధ్ర నాశక, యాంటీ ఆక్సీడేటివ్ గుణాలు మెండుగా ఉన్నాయి.

వాము[మార్చు]

వామును ఇంగ్లీసులో అజవైన్ లేదా కరోమ్ (carom) అంటారు.వృక్షశాస్త్ర పేరు ట్రాచిస్పెర్ముమ్ అమ్మి (కరూమ్ కొప్టికుమ్).వేల సంవత్సరాలుగా వామును వైద్యంలో ఉపయోగిస్తున్నారు.వాము అపియేసి కుటుంబానికి చెందిన మొక్క.[3]

వాము సాగు[మార్చు]

వామును ఎక్కువగా ఇండియా, ఇరాన్, ఈజిప్టు, అఫ్ఘనిస్తాన్, దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు.ఐ పంటను నదుల పరీవాహకప్రాంతాళ తీరం వెంబడి, నల్ల భూముల్లో సాగు చేస్తారు.[4]

నూనె సంగ్రహణ[మార్చు]

వాము గింజల నుండి వాము ఆవశ్యక నూనెను నీటి ఆవిరి స్వేదన క్రియ పద్ధతిలో సంగ్రహణ చేస్తారు. వాములో అరోమాటిక్ రసాయనాలతో పాటు (టెర్పేనులు, పైనెనులు, ఈస్టరు తదితరాలు) కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి.కొవ్వు ఆమ్లాల శాతం 1-2% లోపు ఉంది.కొవ్వు ఆమ్లాలను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్/ద్రావణి శోషణ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. అయితే కొవ్వూఅమ్లాల శాతం గింజలలో చాలా తక్కువగా ఉండటం వలన వాణిజ్య ప్రయోజనాలకై కొవ్వు ఆమ్లాలు ఉన్న నూనె ఉత్పత్తి చెయ్యడం లేదు. కేవలం ఆవ్యక నూనెను మాత్రమే ఉత్పత్తి చెయ్యడం జరుగుతున్నది.[5]

నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ప్రధాన వ్యాసం ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చదవండి

నూనె[మార్చు]

నూనె వర్ణరహితంగా పారదర్శకంగా లేదా బ్రౌన్ రంగులో వుండును. సాల్వెంట్ ఎక్సుట్రాక్షను విధానంలో తీసిన కొవ్వు ఆమ్లాలు వున్న నూనె ముదురు బ్రౌన్ రంగులో వుండును.నీటి కన్న తక్కువ సాంద్రత కల్గి ఉంది.

ఆవశ్యక నూనెలోని రసాయన పదార్థాలు/సమ్మేళనాలు[మార్చు]

వాము నూనె లోని కొన్ని రసాయనాలు

వాము నుండి ఆవిరి స్వేదన క్రియ ద్వారా సంగ్రహణ చేసిన నూనెను గ్యాస్ క్రోమోటో గ్రఫీ ద్వారా విశ్లేషణ చేసినపుడు అందులో 26 వరకు రసాయన సంయోగ పదార్థాలు వున్నట్లు గుర్తించారు. అందులో థైమోల్ ఎక్కువ పరిమాణంలో వుండగా (39.1%), తరువాత స్థానాల్లో p-సైమెన్ (30.8%), గామా టెర్పెనేన్ (23.2%), బీటా –పైనేన్ (1.7%), టేర్పినేన్-4-ఓల్ (0.8%) విన్నవి. మిగావి తక్కువ శాతంలో ఉన్నాయి. అసిటోన్ ద్వారా సంగ్రహించిన నూనెలో 18 రసాయనాలను గుర్తించగా, వాటి శాతం మొత్తం నూనెలో 68.8%వరకు వున్నట్లు నిర్ధారించారు. అందులో కూడా థైమోల్ 39.1% వుండగా, ఒలిక్ ఆమ్లం 10.4%, లినోలిక్ ఆమ్లం 9.6%, గామా-టెర్పినేన్ 2.6%, p-సైమెన్ 1.6%, పామిటిక్ ఆమ్లం 1.6%, క్షైలెన్ 0.1% వరకు ఉన్నాయి.[5] నూనె రంగులేని పారదర్శక ద్రవంగా లేదా బ్రౌన్ రంగులో వుండును.ప్రత్యేకమైన వాసనతో వుండి గాటైన రుచి కల్గి ఉంది.[4] వాము మొక్క పెరిగిన దేశాన్ని, నేల స్వాభావాన్ని బట్టి ఆవశ్యక నూనెలోని రసాయన పదార్థల శాతం మారును.ఒకదేశంలో కూడా ప్రాంతాన్ని బట్తి నూనెలోని రసాయనాల సంఖ్య, పరిమాణం మారును.

వివిధ దేశాల్లోని వాము నూనెలోవున్న రసాయనాల పట్టిక[6]

వరుస సంఖ్య రసాయన పదార్థాలు ఇరాన్ ఇండియా పాకిస్తాన్
1 ఆల్ఫా –థూజేన్ 0.17-0.4 0.2 --
2 ఆల్ఫా-పైనేన్ 0.06-0.3 0.2-2.29 0.2-2.91
3 బీటా-పైనేన్ 0.39-1.9 1.7-8.12 -
4 p-సైమెన్ 16.16 12.30-30.8 13.5
5 బీటా మైర్సేన్ 0.33=0.7 0.4-1.67 0.6-1.11
6 O- సైమెన్ 19.0 -- 37.44
7 ఆల్ఫా-టెర్పినేన్ -- 0.2-1.32 0.36-2.62
8 ఆల్ఫా పిల్లాన్ద్రేన్ -- -- 0.52
9 బీటా-పిల్లాన్డ్రేన్ 0.4 0.97 0.6-0.91
10 లిమోనేన్ 0.2 0.44 0.57
11 Ý-టెర్పినేన్ 17.52-20.6 23.2-55.75 21.07
12 Ý-టెర్పినోలేన్ -- 0.2 55.63
13 4-టేర్పీనియోల్ 0.1 0.65-0.8 --
14 సబినెన్ 0.02 0.29 0.44
15 సీస్-లిమోనెన్ ఆక్సైడ్ 0.7 -- --
16 సీస్-బీటా టెర్పినియోల్ -- 0.42 0.39
17 p-సైమెన్ -3-ఒల్ -- -- 38.0
18 డోడెకెన్ 0.2 -- --
19 బీటా ఫెన్చైల్ ఆల్కహాల్ 0.1 -- --
20 థైమోల్ 45.9-64.51 15.56-39.1 16.77
21 ఇథైలీన్ మెథాక్రైలేట్ 6.9 -- --
22 p మెంథ్-1-ఎన్-1-ఓల్ -- -- 0.39
23 టెట్రా డేకెన్ 0.2 -- --
24 కార్వాక్రోల్ -- 0.3 --
25 హెక్సా డేకేన్ 1.1 -- --

వాము లోని కొవ్వు ఆమ్లాలు –భౌతిక గుణాలు[మార్చు]

వాము గింజల్లోలో వొలటైల్ రసాయనాలే కాకుండా (ఆవశ్యక నూనె రసాయనాలు) కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి.వాటి పరిమాణం 1.49% వరకు ఉంది. సాల్వెంట్ ఎక్సుట్రాక్సను/ద్రావణి సంగ్రహణ పద్ధతిలో వాము నుండి తీసిన నూనెలోని కొవ్వు ఆమ్లాలను విశ్లేషించి వాటి భౌతిక ధర్మాలను నమోదు చేశారు.కొవ్వు ఆమ్లాలను వాము గింజలనుండి సంగ్రహించుటకు n-హెక్సేనును ద్రావణిగా ఉపయోగించి సాక్సుహెలెట్ పద్ధతిలో నూనెను సంగ్రహించి పరీక్షించడం జరిగింది.[7]

 • వాములోని కొవ్వు ఆమ్లాల పట్టిక [7]
వరుస సంఖ్య ఆమ్లం శాతం
1 పెట్రో సెలీనిక్ ఆమ్లం 9.35
2 ఒలిక్ ఆమ్లం 5.86
3 లినోలిక్ ఆమ్లం 4.79
 • కొవ్వు ఆమ్లాలున నూనె భౌతికగుణాలు[7]
వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 రంగు ముదురు బ్రౌన్
2 వాసన గాటైన వాసన
3 ద్రావణీయత హెక్సెను, క్లోరోఫారమ్,
ఈథేన్, బెంజేను
తదితరాలలో కరుగును.
4 ఆమ్ల విలువ 6.69
5 అయోడిన్ విలువ 79.39
6 పెరాక్సైడ్ విలువ 457.11
7 సపోనిఫికేసన్ విలువ 184.32
8 ఆన్ సపోనిఫైడ్ మ్యాటరు 9.11
9 పెట్రో సెలీనిక్ ఆమ్లంగా ఫ్రీ ఫ్యాటి ఆసిడ్ 48.1

నూనె ఉపయోగాలు[మార్చు]

 • వాము నూనె శిలీంద్ర నాశని. వాము నూనెను శిలీంద్రలైన ఆస్పర్గిల్లుస్ నైజర్, ఆస్పర్గిల్లుస్ ఫ్లావుస్, ఆస్పర్గిల్లుస్ ఒరైజ, ఆస్పర్గిల్లుస్ ఆర్చెరియస్, ఫుసరియుమ్ మోనోలిఫోర్మ్, ఫుసరియుమ్ గ్రామినియరామ్, పెన్సిలియమ్ సిట్రిఉం, పెన్సిలియమ్ వీరిదికాటుమ్, పెన్సిలియమ్ మాడ్రిటి, కురువలరియా లూనట శిలీంధ్రాలను (fungus) ప్రభావవంతంగా నాశనం చేసినట్లు గుర్తించారు.[5]
 • వాము నూనెను ఫార్స్లే నూనె (Parsley oil), థైమ్ నూనె (Thyme oil),, స శాజ్ ఆయిల్ (sage oil) లతో మిశ్రమంచేసి కలిపి ఉపయోగిస్తారు.[4]

నూనె యొక్క వైద్యపరమైన ఉపయోగాలు[మార్చు]

 • శ్వాసనాళాల వాపుకు, ఆస్తమాకు:వాము నూనెను రెండు చుక్కలు ఏదైనా కారియారు/వాహక నూనెలో (carrier oil) /వ్యాపకంనూనె కలిపి (నువ్వుల నూనె వంటివి), అరకప్పు డిస్టిల్ వాటరులో కలిపి ఆరోమా థెరపీ చేసిన ఉపశమనం కల్గును. లేదా ఒక చిక్క నూనెను టీ స్పూను కారియారు ఆయిల్లో కలిపి చాటికి వీపుకు, గొంతుకు మర్దనచేసిన ఉపశమనం కల్గును.[3]
 • దగ్గుకు:ఒక చుక్క వాము నూనెను ఒక ఔన్సు నీటిలో కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించిన గొంతు గరగరను నొప్పిని తగ్గించును.[3]
 • జ్వరం:ఒక చుక్క నూనెను ఒక టీస్పూను కారియారు ఆయిల్‌లో కల్పి పాదాల అడుగు (sole) భాగంలో/అరికాలు మర్దన చేసిన స్వర తీవ్రతను తగ్గించును.[3]
 • కీళ్ళవాత నొప్పులు, నాడీ సంబంధమైన నొప్పి:1% వాము ఆవశ్యక నూనెను కారియారు ఆయిల్లో కలిపి కీళ్లవాత నొప్పులున్న చోట మర్దన చేసిన నొప్పులు తగ్గును.అలాగేనాడీ సంబంధమైన నొప్పి ( Neuralgia Pain) వున్నచోట కూడా మర్దన చేసిన ఉపశమనం కల్గును.[3]
 • తలనొప్పి, మిగ్రైన్:1% వాము నూనె వున్న కారియారు నూనెను ఒకటి రెండు చుక్కలను కణతలు, నుదురు, మెడ వెనుక రాసిన తలనొప్పి మిగ్రైన్ నుండి ఊరట కల్గును.
 • జీర్ణ వ్యవస్థ :జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది ఉన్న ఒక చుక్క వాము నూనె, రెండు చుక్కల దిల్ల్ నూనెను ఒక టీ స్పూన్ కారియారు ఆయిల్ (వాహక నూనె/నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటిది) లో మిశ్రమం చేసి పొత్తి కడుపు నుండి పొట్ట వరకు నెమ్మదిగా రుద్దిన ఉపశమనం వచ్చును.[3]
 • కడుపులో పుళ్లు:పొట్టలోని పుండ్ల వాలన కలుగునొప్పి నివారణకై 1% వాము నూనె కల్గిన కారియారు నూనెను పొత్తి కడుపు, పొట్ట మీద రాసిన నొప్పి తగ్గును. ఇలా రాయడం వలన మలబద్ధాకాన్ని కూడా తగ్గించును.[3]

వాడుకలో జాగ్రత్తలు[మార్చు]

నూనెలోథైమోల్ అధిక పరిమాణంలో వుండటం వలన అధిక గాఢత నూనె చర్మాన్ని, మ్యుకస్ పొర కణాలను బాధించ/ రేగించ (irritation) వచ్చును.అందుచే మొదట ఒక చుక్క నూనెను కారియారు నూనెలో కలిపి చర్మం మీద ఒక చోట రాసి, రెండు గంటలవరకు వేచి వుండి దాని ప్రభావాన్ని గమనించి, ఎటువంటి దుష్ప్రభావం లేకున్నచో తరువాత ఉపయోగించాలి.[3]

బయటి వీడియో లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వాము_నూనె&oldid=3234954" నుండి వెలికితీశారు