వారణాసి భానుమూర్తి రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వారణాసి భానుమూర్తి రావు తెలుగు రచయిత[1]

జీవిత విశేషాలు[మార్చు]

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో 1956 లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు ,వచన గేయాలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 50 కథానికలు, 600 దాకా వచన గేయాలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో జీవన గతులు అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం, జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా[2] లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "సాగర మథనం ", 2005 లో " సముద్ర ఘోష" అనే కవిత సంకలాల్ని ప్రచురించాడు[3].అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.[4].వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు రాచపల్లి కథలు అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ కథా సంకలనంగా తెస్తున్నారు.అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను సంస్కార సమేత రెడ్డి నాయుడు తెలుగు వారి కోసం రాస్తున్నాడు. కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు.సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. "సారంగ సాహిత్య మాసపత్రికలో - పుష్పించిన మనిషి - కవిత".[permanent dead link]
  2. http://www.gotelugu.com. "vaanademudaa | Gotelugu.com". http://www.gotelugu.com. Retrieved 2020-04-21. External link in |website= (help)[permanent dead link]
  3. "Display Books of this Author". www.avkf.org. Archived from the original on 2015-05-26. Retrieved 2020-04-21.
  4. "వారణాసి భానుమూర్తి రావు".[permanent dead link]