వారసుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వారసుడు
(1993 తెలుగు సినిమా)
Varasudu poster.jpg
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం డి.కిషోర్
కథ కుకు కొహ్లి
చిత్రానువాదం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం నటశేఖర కృష్ణ,
అక్కినేని నాగార్జున ,
నగ్మా
సంగీతం రాజ్ - కోటి
ఛాయాగ్రహణం ఛోటా కె. నాయుడు
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

వారసుడు 1993 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, నగ్మా, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్-కోటి సంగీతాన్నందించారు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. కిషోర్ నిర్మించాడు. ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. ఇది హిందీ చిత్రం ఫూల్ ఔర్ కాంటేకు రీమేక్. అదేమో మలయాళ చిత్రం పరంపరపై ఆధారపడింది. [1] [2] [3]

కథ[మార్చు]

వినయ్ (నాగార్జున) చదువుతున్న కళాశాల లోకి కీర్తి (నాగ్మా) కొత్త విద్యార్థిగా చేరుతుంది. వండీ (శ్రీకాంత్) కూడా అదే కాలేజీలో విద్యార్థి. అతని పాత్ర నెగటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. సినిమా మొదటి సగం ఎక్కువగా హీరో, హీరోయిన్ల ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. వినయ్‌ను విలన్ల (శ్రీకాంత్ తండ్రి, అతని స్నేహితుడు) నుండి రక్షిస్తాడు. కాని వినయ్ ధర్మ తేజను ద్వేషిస్తాడు. ధర్మ తేజ వినయ్ తండ్రి అనే విషయాన్ని వెల్లడిస్తూ విరామం వస్తుంది.

అతను స్మగ్లరని, భార్యను చంపాడనీ తన తండ్రిపై వినయ్ చేసిన ఆరోపణతో సినిమా ద్వితీయార్థం సీరియస్‌గా మారుతుంది. వినయ్, కీర్తి పెళ్ళి చేసుకుంటారు. వినయ్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు ధర్మ తేజ వంశీని కాల్చివేస్తాడు. అయితే, వినయ్‌పై విలన్ల పగ అలాగే ఉంటుంది. ఇంతలో, వినయ్ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేస్తారు. సహాయం కోసం కీర్తి, ధర్మతేజ వద్దకు వెళ్తుంది.

చిన్నారిని కిడ్నాప్ చేసినది ధర్మతేజే నని వినయ్ తెలుసుకుంటాడు. వివరణ కోరినప్పుడు, ధర్మ తేజ తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి భార్యను విడిచిపెట్టిన తన గతం గురించి వివరిస్తాడు. వినయ్, ధర్మ తేజ ఇప్పుడు ఏకమౌతారు. విలన్లు దీనిపై మరింత కోపగిస్తారు. వినయ్ కొడుకును ఇప్పుడు విలన్లు కిడ్నాప్ చేసి క్లైమాక్స్‌కు దారితీస్తారు.

తారాగణం[మార్చు]

 • అక్కినేని నాగార్జున
 • నగ్మా
 • కృష్ణ
 • తనికెళ్ళ భరణి
 • శ్రీకాంత్
 • బ్రహ్మానందం
 • గుమ్మడి
 • వినోద్ బాల
 • గీత - నాగార్జున తల్లి

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."పాపా హల్లో హల్లో"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:01
2."ధింతనకా"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:50
3."సిలకలాగా"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:50
4."చం చం చం"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:29
5."డేంజర్ యమ డేంజర్"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:23
Total length:24:33

మూలాలు[మార్చు]

 1. Varasudu (1993) - Full Cast & Crew - IMDb
 2. Varasudu (1993) - Telugu Full Movie - YouTube
 3. Varasudu Telugu Movie Review Nagarjuna Krishna Nagma Superstar
"https://te.wikipedia.org/w/index.php?title=వారసుడు&oldid=3576750" నుండి వెలికితీశారు