వార్కరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏక్ తారా, కాషాయ జెండా చేతపట్టుకుని ఆలంది నుండి పండరీపురానికి యాత్ర చేస్తున్న వార్కరీ

వార్కరీ హిందూ మతంలో ఒక భక్తి సాంప్రదాయం. వార్కరీ అంటే యాత్రికుడు అని అర్థం. ఈ సాంప్రదాయం మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో బాగా కనిపిస్తుంది. వార్కరీలు పండరీపురంలో నెలకొని ఉన్న విఠలుని ఆరాధిస్తారు. విఠోబాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావిస్తారు. ఈ భక్తి సాంప్రదాయంలో ముఖ్యమైన వారు జ్ఞానేశ్వరుడు, నామదేవుడు, తుకారాం, ఏకనాథుడు, చొక్కమేళా మొదలైన వారు. వీరందరికీ సంత్ అనే బిరుదు కూడా ఉంది.

ఈ సాంప్రదాయంలో ముఖ్యమైన విధులు విఠోబాను పూజించడం, నీతి నియమాలతో ఒక కర్తవ్యపూరిత జీవితాన్ని గడపటం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండటం, శాకాహారం భుజించటం, నెలలో రెండు ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విద్యార్థి దశలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించడం, కులం పేరిట, ధనం పేరిట ఎవరినీ తక్కువగా చూడకపోవడం, హిందూ గ్రంథాలు పఠించడం, హరిపథ్ను ప్రతీ రోజూ మననం చేసుకోవడం, ప్రతి రోజు భజనలు, కీర్తనలు చేయడం మొదలైనవి.

ప్రభావం[మార్చు]

సా.శ. పదమూడవ శతాబ్దం నుంచే ఈ వార్కరీ సాంప్రదాయం హిందూ మతంలో భాగంగా ఉంది. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం వేళ్ళూనుకున్న సమయంలో ఈ పంథా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వార్కరీలు సుమారు యాభై మంది భక్త కవులు (సంత్ లు) 500 ఏళ్ళ పాటు రాసిన ఆధ్యాత్మిక రచనలను 18వ శతాబ్దానికి చెందిన ఒక పౌరాణిక చరిత్రలో గ్రంథస్తం చేశారు. వార్కరీలు ఈ సంత్ లు అందరూ ఆధ్యాత్మికంగా ఒకే వారసత్వానికి చెందిన వారని భావిస్తారు.[1]

గమనికలు[మార్చు]

  1. Schomer, Karine; McLeod, W. H., eds. (1987). The Sants: Studies in a Devotional Tradition of India. Motilal Banarsidass. pp. 3–4. ISBN 9788120802773.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వార్కరీ&oldid=4010963" నుండి వెలికితీశారు