వాలి సుబ్బారావు

వికీపీడియా నుండి
(వాలి (కళాదర్శకుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కళాదర్శకుడు వాలి

వాలి సుబ్బారావు "వాలి" అనే పేరుతో కళాదర్శకుడిగా చిరపరిచితుడు.[1] ఇతడు 1914లో జన్మించాడు. ఇతని తండ్రి రంగస్థల నటుడు వాలి వీరాస్వామినాయుడు. అతడికి చిత్రకళపై ఆసక్తి ఉండేది. తండ్రి పెయింటింగ్స్ చూసి సుబ్బారావుకు కూడా చిత్రకళపట్ల ఆసక్తి ఏర్పడింది. ఇతడు ఇంటి వద్దనే చదువుకుని పిమ్మట బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరాడు. అక్కడ ఇతడు కాటూరి వేంకటేశ్వరరావుకు ప్రియశిష్యుడైనాడు. 1932లో ఇతడు డ్రాయింగు పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఇతడు కొండపల్లి దగ్గరలోని విద్యానగరం టీచర్స్ ట్రైనింగ్ స్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ విశేషం ఏమిటంటే ఇతని శిష్యులందరూ ఇతని కంటే వయసులో పెద్దవారే. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత బందరుకు తిరిగి వచ్చి అడివి బాపిరాజు వద్ద శిష్యరికం చేశాడు. కృష్ణా పత్రికలో బొమ్మలు వేసేవాడు. అడివి బాపిరాజు సలహాతో తిరిగి తాడంకి గ్రామంలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అయితే ఇతనికి సినిమాలలో పని చేయాలన్న సంకల్పం బలంగా కలిగి తిరిగి అడివి బాపిరాజు పంచన చేరాడు. అడివి బాపిరాజుకు సినీ నిర్మాత సి. పుల్లయ్యతో స్నేహం ఉండేది. సి.పుల్లయ్య తన చల్‌ మోహనరంగా సినిమాలో ఇతనికి హీరోగా అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా వాలి సుబ్బారావు సినిమా రంగంలో ప్రవేశించాడు.

సినిమా రంగం[మార్చు]

ఇతడికి సినిమాలలో తొలి అవకాశం హీరోగా లభించినా ఇతడికి 'నటన' మీద కంటే 'చిత్రకళ' పట్ల ఉన్న మక్కువతో ఇతడు కళాదర్శకత్వ శాఖలో కృషి చెయ్యసాగాడు. మీరాబాయి సినిమాలో అడివి బాపిరాజు వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 1941లో గూడవల్లి రామబ్రహ్మం ఋష్యేంద్రమణి కథానాయికగా తీసిన పత్ని అనే సినిమాలో ఇతడికి తొలిసారిగా కళా దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. వాలికి మొదటి నుంచి దుస్తులు, అలంకరణల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. మొదటి సినిమాలో ఇతడు కాస్ట్యూమ్‌లో మంచి నైపుణ్యం కనబరచాడన్న పేరు లభించింది. తరువాత ఇతడు స్వతంత్రంగా పలుచిత్రాలకు, ఎ.కె.శేఖర్, ఘోడ్‌గావంకర్ మొదలైన వారితో కలిసి కొన్ని చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశాడు.

సినిమాల జాబితా[మార్చు]

ఇతడు కళాదర్శకుడిగా పనిచేసిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

  1. పత్ని (1942)
  2. గొల్లభామ (1947)
  3. పల్నాటి యుద్ధం (1947)
  4. పల్లెటూరి పిల్ల (1950)
  5. స్త్రీ సాహసము (1951)
  6. దేవదాసు (1953)
  7. రాజు-పేద (1954)
  8. అనార్కలి (1955)
  9. జయం మనదే (1956)
  10. సువర్ణసుందరి (1957)
  11. భట్టి విక్రమార్క (1960)
  12. రాణి రత్నప్రభ (1960)
  13. భీష్మ (1962)
  14. పరమానందయ్య శిష్యుల కథ (1966)
  15. బంగారుతల్లి (1971)
  16. రైతుబిడ్డ (1971)
  17. శ్రీకృష్ణదేవరాయలు (1971) - కాస్ట్యూమ్‌ డైరెక్టర్
  18. సంపూర్ణ రామాయణం (1971) - కాస్ట్యూమ్‌ డైరెక్టర్
  19. అమ్మమాట (1972)

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 December 1971). "కళాదర్శకుడు వాలి". విజయచిత్ర. 6 (6): 43–46.

బయటి లింకులు[మార్చు]