వాల్ట్ డిస్నీ సంస్థ
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Script error: No such module "Pp-move-indef".
ది వాల్ట్ డిస్నీ కంపెనీ (బరువు త్తగాలి) (సాధారణంగా డిస్నీ గా సూచించబడుతుంది) ఆదాయపరంగా ప్రపంచంలోని అతి పెద్ద మాధ్యమ మరియు వినోదాల మిశ్రమ సంస్థ.[4] 1923 అక్టోబరు 16న సోదరులైన వాల్ట్ డిస్నీ మరియు రాయ్ డిస్నీలచే డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియో గా స్థాపించబడిన ఈ సంస్థ, 1929లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్, Ltd. గా తిరిగి ప్రారంభించబడింది, మరియు 1938లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో బహిరంగ ప్రజానీకానికి వర్తకంలో భాగం కల్పించబడింది. లైవ్-యాక్షన్ చిత్ర నిర్మాణం, టెలివిజన్, మరియు ప్రయాణ రంగాలలోకి ప్రవేశించక ముందు వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ తనకు తానే అమెరికన్ అనిమేషన్ పరిశ్రమలో ఒక నాయకుడిగా స్థాపించుకుంది. 1986లో తన ప్రస్తుత పేరును పెట్టుకున్న ఈ సంస్థ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ తన ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించింది మరియు నాటకం, రేడియో, ప్రచురణ, మరియు ఆన్ లైన్ మాధ్యమం వంటి విభాగాలను ప్రారంభించింది. దీనికి తోడు, మరింత పక్వత చెందిన విషయాన్ని అమ్మడానికి దాని సహ-సంబంధ సంస్థలు మరియు దాని జాతీయ బ్రాండెడ్ సంస్థలకు బదులు సంస్థ తన నూతన విభాగాలను సృష్టించింది.
ఈ సంస్థ తన చిత్ర స్టూడియో ఉత్పత్తుల గురించి ప్రసిద్ధి చెందింది, వాల్ట్ డిస్నీ మోషన్ పిక్చర్స్ గ్రూప్, నేడు హాలీవుడ్లోని అతి పెద్ద మరియు ప్రసిద్ధ స్టూడియోలలో ఒకటి . డిస్నీ, ABC ప్రచార టెలివిజన్ నెట్‌వర్క్; డిస్నీ ఛానల్, ESPN, మరియు ABC ఫామిలీ వంటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్‌లు; ప్రచురణలు, వర్తకం, మరియు నాటక విభాగాలు వంటి వాటిని స్వంతం చేసుకొని నిర్వహిస్తోంది; ప్రపంచవ్యాప్తంగా 11 థీమ్‌పార్క్‌లకు స్వంతదారు మరియు అనుమతిదారుగా ఉంది. ఈ సంస్థ 1991 మే 6 నుండి డౌ జోన్స్ ఇన్డస్ట్రియల్ ఏవరేజ్ యొక్క భాగంగా ఉంది. సంస్థ యొక్క ప్రారంభ మరియు ప్రసిద్ధి చెందిన కార్టూన్ అయిన మిక్కీ మౌస్, వాల్ట్ డిస్నీ సంస్థ యొక్క అధికారిక చిహ్నం.
విషయ సూచిక
- 1 సంస్థాగత చరిత్ర
- 1.1 1923–28: నిశ్శబ్ద యుగం
- 1.2 1928–34: మిక్కీ మౌస్ అండ్ సిల్లీ సింఫనీస్
- 1.3 1934–45: స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ మరియు IIవ ప్రపంచయుద్ధం
- 1.4 1946–54: యుద్ధానంతరం మరియు టెలివిజన్
- 1.5 1955–65: డిస్నీలాండ్
- 1.6 1966–71: వాల్ట్ మరియు రాయ్ డిస్నీ మరణం మరియు వాల్ట్ డిస్నీ వరల్డ్ ప్రారంభం
- 1.7 1972–84: నాటకరంగ అసౌకర్యం మరియు నూతన నాయకత్వం
- 1.8 1984–2004: ఐస్నెర్ యుగం
- 1.9 2005–ప్రస్తుతం: ఐగెర్ యుగం
- 2 సంస్థ విభాగాలు
- 3 కార్యనిర్వాహక నిర్వహణ
- 4 ఆర్ధిక గణాంకాలు
- 5 విమర్శలు
- 6 సంపూర్ణ స్వాధీనాలు
- 7 వీటిని కూడా చూడండి
- 8 సూచనలు
- 9 మరింత చదవడానికి
- 10 బాహ్య లింకులు
సంస్థాగత చరిత్ర[మార్చు]
1923–28: నిశ్శబ్ద యుగం[మార్చు]
1923 ప్రారంభంలో, మిస్సౌరీలోని, కాన్సాస్ నగరానికి చెందిన అనిమేటర్ వాల్ట్ డిస్నీ, అలిస్'స్ వండర్ లాండ్ పేరుతో ఒక సంక్షిప్త చిత్రాన్ని నిర్మించారు, దీనిలో బాలనటి వర్జీనియా డేవిస్ అనిమేటెడ్ పాత్రలతో సంభాషిస్తుంది. చిత్ర పంపిణీదారు మార్గరెట్ J. విన్క్లర్, అలిస్'స్ వండర్ లాండ్ పై ఆధారపడి నిర్మించే అలిస్ కామెడీస్ మొత్తం శ్రేణిని పంపిణీ చేసే ప్రణాళికలతో డిస్నీని సంప్రదించారు. ఒప్పందంపై సంతకం చేసిన తరువాత, వాల్ట్ మరియు అతని సోదరుడు రాయ్ డిస్నీ, లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాకు తరలివెళ్లారు. 1923 అక్టోబరు 16న వారు తమ పినతండ్రి అయిన రాబర్ట్ డిస్నీ గారేజ్‌లో తమ స్వంత దుకాణాన్ని అధికారికంగా ప్రారంభించి, డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియో యొక్క ఆరంభం చేసారు.[5] కొన్ని నెలలలోనే, ఈ సంస్థ లాస్ ఏంజెల్స్‌లోని ఒక రియాల్టీ కార్యాలయ వెనుక భాగంలోకి మారింది, ఇక్కడే అలిస్ కామెడీస్ నిర్మాణం 1927 వరకు కొనసాగింది.[6] 1926లో, ఈ స్టూడియో లాస్ ఏంజెల్స్ జిల్లాలోని సిల్వర్ లేక్ ప్రాంతంలోగల హిపెరియన్ అవెన్యూలో నూతనంగా నిర్మించబడిన సౌకర్యవంతమైన స్టూడియోలోకి మారింది .[6]
అలిస్ హాస్యరచనలు ముగిసిన తరువాత, యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా విన్క్లర్ పిక్చర్స్ పంపిణీ చేసిన తన ప్రారంభ పాత్ర అయిన ఓస్వాల్డ్ ది లక్కీ రాబిట్‌తో ప్రారంభించి, డిస్నీ అన్ని- కార్టూన్ శ్రేణులను అభివృద్ధిపరచారు. ఫిబ్రవరి 1928న, విన్క్లర్ భర్త చార్లెస్ మింట్జ్ వారి పంపిణీ సంస్థను చేపట్టి, ఈ ఒప్పందాన్ని వదలుకునే నాటికి, డిస్నీ, ఓస్వాల్డ్ యొక్క 26 భాగాలను మాత్రమే పూర్తిచేసారు. తన స్వంత అనిమేషన్ స్టూడియో కొరకు మింట్జ్ ఒక్క ఉబ్ ఇవేర్క్స్ను తప్ప డిస్నీ యొక్క అనిమేటర్లు అందరినీ నియమించుకున్నాడు.[5]
1928–34: మిక్కీ మౌస్ అండ్ సిల్లీ సింఫనీస్[మార్చు]
1928లో, ఓస్వాల్డ్ ది లక్కీ రాబిట్ యొక్క నష్టాల నుండి బయటపడటానికి, వాల్ట్ డిస్నీ మరియు ఉబ్ ఇవేర్క్స్, మిక్కీ మౌస్‌ను సృష్టించారు. మిక్కీని చూపిన కార్టూన్ అయిన డిస్నీ యొక్క మొదటి శబ్దచిత్రం స్టీమ్ బోట్ విల్లీ, 1928 నవంబరు 18న విడుదలైంది. ఇది ప్లేన్ క్రేజీ మరియు ది గల్లోపిన్' గుచో తరువాత వచ్చిన మూడవ మిక్కీ మౌస్ కార్టూన్. ఇది సమకాలిక శబ్దం కలిగిన మొదటి కార్టూన్.[7] లీ డే ఫారెస్ట్ యొక్క ఫోనోఫిలిం వ్యవస్థను ఉపయోగించి పవర్స్ సృష్టించిన పాట్ పవర్స్' సినిఫోన్ వ్యవస్థను డిస్నీ ఉపయోగించారు.[8] ప్రస్తుతం ది బ్రాడ్వే థియేటర్ అయిన న్యూ యార్క్ నగరంలోని B. S. మాస్'స్ కాలనీ థియేటర్‌లో స్టీం బోట్ విల్లీ మొదటి ప్రదర్శన జరిగింది.
డిస్నీ, మిక్కీ మౌస్ మరియు ఇతర పాత్రలతో కార్టూన్లను సృష్టించడం కొనసాగించి, సిల్లీ సింఫనీస్ శ్రేణిని ప్రారంభించారు, ఇది "మిక్కీ మౌస్ ప్రెజంట్స్ ఎ వాల్ట్ డిస్నీ సిల్లీ సింఫనీ"గా ప్రచారం చేయబడింది. 1932లో డిస్నీ టెక్నికలర్ తో (1935 చివరివరకు) రంగులలో కార్టూన్లను నిర్మించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఫ్లవర్స్ అండ్ ట్రీస్ (1932)తో ఇది ప్రారంభమైంది. డిస్నీ, పవర్స్' సెలెబ్రిటి పిక్చర్స్ (1928–1930), కొలంబియా పిక్చర్స్ (1930–1932), మరియు యునైటెడ్ ఆర్టిస్ట్స్ (1932–1937)ల ద్వారా చిత్రాలను విడుదల చేసారు. మిక్కీ మౌస్ మరియు సిల్లీ సింఫనీ శ్రేణుల ప్రజాదరణ డిస్నీని పూర్తి నిడివి కలిగిన అనిమేషన్ గురించి ఆలోచించేలా చేసింది.
1934–45: స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ మరియు IIవ ప్రపంచయుద్ధం[మార్చు]
అనిమేషన్ సరిహద్దులను మరింత జరిపివేయాలనే నిర్ణయంతో, డిస్నీ 1934లో తన పూర్తి నిడివి అనిమేటెడ్ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. గ్రిం బ్రదర్స్ యొక్క జానపద కథపై ఆధారపడిన స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ పూర్తవడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది, డిసెంబరు 1937లో మొదటిసారి ప్రదర్శించబడిన ఈ చిత్రం 1939 నాటికి అత్యధిక వసూళ్లను చేసిన చిత్రంగా నిలిచింది.[9] 1937లో డిస్నీ యొక్క ఉత్పత్తికి పంపిణీని చేపట్టిన RKO రేడియో పిక్చర్స్ ద్వారా స్నో వైట్ విడుదలైంది,[10] దీనికి ముందు యునైటెడ్ ఆర్టిస్ట్స్, డిస్నీ యొక్క సంక్షిత చిత్రాల భవిష్యత్ టెలివిజన్ హక్కులను పొందడానికి ప్రయత్నించారు.[11]
స్నో వైట్ నుండి వచ్చిన లాభాలను ఉపయోగించి, డిస్నీ, బర్బాంక్, కాలిఫోర్నియాలో ఒక నూతన51-acre (210,000 మీ2) స్టూడియో సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 1939 నాటికి నిర్మాణం పూర్తయి వ్యాపారం ప్రారంభించబడిన ఈ నూతన వాల్ట్ డిస్నీ స్టూడియోస్‌లోనే ఈ నాటికీ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. తరువాత సంవత్సరంలో, వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ వ్యాపారం కొరకు తన మొదటి బహిరంగ ప్రతిపాదనను అందించింది.
ఈ స్టూడియో సంక్షిప్త అనిమేటెడ్ చిత్రాలను మరియు చలన చిత్రాలను విడుదల చేయడం ప్రారంభించి, పినోచియో (1940), ఫ్యాంటసియా (1940), డంబో (1941), మరియు బాంబి (1942) వంటి వాటిని విడుదల చేసింది. IIవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో బాక్స్-ఆఫీస్ లాభాలు తగ్గడం మొదలైంది. పెర్ల్ హార్బర్పై దాడి తరువాత యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలో ప్రవేశించడంతో, అనేకమంది డిస్నీ అనిమేటర్లు సైనిక దళాలలో చేరారు, స్టూడియో కూడా తాత్కాలికంగా U.S.సైన్యం యొక్క అధీనంలోకి వెళ్ళింది. U.S. ప్రభుత్వం ఈ స్టూడియోను శిక్షణ మరియు ప్రచార చిత్రాలను రూపొందించడానికి నియమించి, డిస్నీకి అవసరమైన నిధులను సమకూర్చింది. విక్టరీ త్రూ ఎయిర్ పవర్ వంటి చలనచిత్రాలు మరియు ఎడ్యుకేషన్ ఫర్ డెత్ (రెండూ 1943కి చెందినవే) వంటి సంక్షిప్త చిత్రాలు యుద్ధ ప్రయత్నానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి తీయబడ్డాయి. ఈ స్టూడియో యొక్క పాత్రలు కూడా ఈ ప్రయత్నంలో భాగాస్వాములయ్యాయి, అకాడెమి అవార్డు పొందిన డెర్ ఫ్యుహరర్ ఫేస్ (1943)తో సహా డోనాల్డ్ డక్ అనేక సంక్షిప్త హాస్య ప్రచార చిత్రాలలో కనిపించింది.
1946–54: యుద్ధానంతరం మరియు టెలివిజన్[మార్చు]
యుద్ధం జరుగుతుండగా మరియు ముగిసిన తరువాత, పరిమిత సిబ్బంది మరియు తక్కువ నిర్వహణా మూలధనంతో, 1940ల లోని డిస్నీ చలనచిత్రాలలో అధికభాగం, ది త్రీ కాబల్లెరోస్ (1944) మరియు మెలోడి టైం (1948) వంటివి "సమూహ చిత్రాలు," లేదా సంక్షిప్త చిత్రాల కలయికగా ఉండి, బాక్స్-ఆఫీస్ వద్ద బాగా ఆడలేకపోయాయి. అదే సమయంలో, ఈ స్టూడియో లైవ్-యాక్షన్ చిత్రాలను మరియు డాక్యుమెంటరీలను నిర్మించడం ప్రారంభించింది. సాంగ్ ఆఫ్ ది సౌత్ (1946) మరియు సో డియర్ టు మై హార్ట్ (1948) అనిమేటెడ్ విభాగాలను కలిగి ఉండగా, ట్రూ-లైఫ్ అడ్వెంచర్స్ శ్రేణి సీల్ ఐల్యాండ్ (1948) మరియు ది వానిషింగ్ ప్రయరీ (1954) వంటి చిత్రాలను కలిగి ప్రజాదరణ పొందడంతో పాటు అనేక పురస్కారాలను కూడా గెలుచుకుంది.
1950లో సిండరెల్లా విడుదల చలన చిత్ర నిడివిగల అనిమేషన్ విపణిలో విజయవంతం కాగలదని నిరూపించింది. ఆ కాలంలో విడుదలైన ఇతర చిత్రాలలో యుద్ధానికి ముందు నిర్మాణంలో ఉన్న అలిస్ ఇన్ వండర్ లాండ్ (1951) మరియు పీటర్ పాన్ (1953), మరియు డిస్నీ యొక్క మొదటి పూర్తి లైవ్ యాక్షన్ చలనచిత్రం ట్రెజర్ ఐలాండ్ (1950) ఉన్నాయి. పూర్తి స్థాయి నటన ఉన్న ఇతర డిస్నీ ఆరంభ చిత్రాలలో ది స్టొరీ ఆఫ్ రాబిన్ హుడ్ అండ్ హిజ్ మెర్రీ మెన్ (1952),ది స్వోర్డ్ అండ్ ది రోజ్ (1953), మరియు 20,000 లీగ్స్ అండర్ ది సీ (1954) ఉన్నాయి. 1953లో డిస్నీ, RKOతో పంపిణీ ఒప్పందాన్ని ముగించుకొని, తన స్వంత పంపిణీ సంస్థ అయిన బ్యునా విస్టా డిస్ట్రిబ్యూషన్‌ను స్థాపించారు.[10]
డిసెంబరు 1950లో, వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ మరియు ది కోకా-కోల కంపెనీ, డిస్నీ యొక్క మొదటి టెలివిజన్ కార్యక్రమమైన NBC టెలివిజన్ నెట్వర్క్ యొక్క ప్రత్యేకం యాన్ అవర్ ఇన్ వండర్ లాండ్ కొరకు జతకట్టాయి. అక్టోబరు 1954లో, ABC నెట్వర్క్ డిస్నీ యొక్క మొదటి ధారావాహిక డిస్నీలాండ్ ను ప్రారంభించింది, ఇది సర్వకాలాల్లోనూ దీర్ఘకాలం-నడచిన ప్రైం టైం ధారావాహికగా మారింది.[12] డిస్నీలాండ్ , డిస్నీకి కొత్తవాటిని ప్రవేశపెట్టడానికి మరియు పాత వాటిని ప్రదర్శించడానికి ఒక వేదిక అయింది, మరియు అనహీం, కాలిఫోర్నియా స్థావరంగా డిస్నీ యొక్క తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నిధులను అందించి అభివృద్ధి పరచడానికి ABC, డిస్నీ యొక్క భాగస్వామిగా మారింది.
1955–65: డిస్నీలాండ్[మార్చు]
1954లో, వాల్ట్ డిస్నీ తన డిస్నీలాండ్ శ్రేణిని డిస్నీలాండ్ పార్క్ ఏర్పాటుకు తెర తీయడానికి ఉపయోగించుకున్నారు, తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో వినోదం పొందాలనే కోరిక నుండి ఈ భావన ఉద్భవించింది. 1955 జూలై 18న, వాల్ట్ డిస్నీ సాధారణ ప్రజానీకం కొరకు డిస్నీలాండ్‌ను ప్రారంభించారు. 1955 జూలై 17న, ఆర్ట్ లింక్ లెటర్ మరియు రోనాల్డ్ రీగన్ అతిధేయులుగా ఒక ప్రత్యక్ష టెలివిజన్ ప్రసారంలో డిస్నీలాండ్ చూపబడింది. ప్రారంభంలో కొంత తడబడినప్పటికీ, డిస్నీలాండ్ అభివృద్ధి కొనసాగించి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షించింది. 1959లో జరిగిన ఒక పెద్ద విస్తరణలో అమెరికా యొక్క మొదటి మోనోరైల్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
1964 న్యూ యార్క్ వరల్డ్'స్ ఫెయిర్ కొరకు, వివిధ సమర్పకుల కొరకు డిస్నీ నాలుగు ప్రత్యేక ఆకర్షణలను రూపొందించారు, వీటిలో ప్రతి ఒక్కటీ ఏదో ఒక రూపంలో డిస్నీలాండ్‌కు దారిని కనుగొంటుంది. ఈ సమయానికి, వాల్ట్ డిస్నీ రెండవ డిస్నీ థీమ్ పార్క్ కొరకు రహస్యంగా నూతన స్థలాన్ని కూడా వెదకుతున్నారు. నవంబరు 1965లో, ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరానికి వెలుపల ఖరీదు చేసిన వేల ఎకరాలలో థీమ్ పార్కులు, హోటళ్ళు మరియు ఒక నమూనా నగరంతో "డిస్నీ వరల్డ్" ప్రకటించబడింది.
1950ల కాలమంతా డిస్నీ తన నైపుణ్యాలను టెలివిజన్‌పై కేంద్రీకరించటం కొనసాగించింది. వారమంతా కొనసాగే దాని బాలల కార్యక్రమం ది మికీ మౌస్ క్లబ్, యువ "మౌస్కెటీర్స్"తో 1955లో ప్రదర్శన ప్రారంభించి గొప్ప విజయాన్ని సాధించింది, దాని వలెనె ఫెస్ పార్కర్ నటించిన డేవీ క్రోకెట్ మినీ ధారావాహిక డిస్నీలాండ్ సంకలన కార్యక్రమంలో ప్రసారమై విజయవంతమైంది. రెండు సంవత్సరాల తరువాత, జోర్రో శ్రేణి కూడా అంతే ప్రజాదరణ పొంది, ABCలో రెండు సీజన్లు విజయవంతంగా నడవడంతో పాటు, డిస్నీలాండ్ శ్రేణిలో ప్రత్యేక భాగాలుగా కూడా ప్రసారమైంది. ఆ విధమైన విజయాన్ని పొందినప్పటికీ, వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ 1960లలో టెలివిజన్ వ్యాపారాలలో చాలా తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టింది, దీర్ఘకాలం కొనసాగి, తరువాతి కాలంలో ది వండర్ ఫుల్ వరల్డ్ ఆఫ్ డిస్నీగా పిలువబడిన సంకలన శ్రేణి దీనికి ఒక మినహాయింపు.
డిస్నీ యొక్క ఫిలిం స్టూడియోలు కూడా పనితో కూడి ఉండి, ఈ కాలంలో సంవత్సరానికి సగటున ఐదు నుండి ఆరు చిత్రాలను విడుదల చేసాయి. 1950లు మరియు 1960లలో సంక్షిప్త చిత్రాల నిర్మాణం బాగా మందగించినప్పటికీ, ఈ స్టూడియో అనేక ప్రసిద్ధ అనిమేటెడ్ చిత్రాలను విడుదల చేసింది, వీటిలో లేడీ అండ్ ది ట్రాంప్ (1955), స్లీపింగ్ బ్యూటీ (1959) మరియు చిత్రలేఖనాలను అనిమేషన్ సెల్స్‌కు బదిలీ చేయడానికి నూతన జెరోగ్రఫీ ప్రక్రియను ఉపయోగించిన వన్ హండ్రెడ్ అండ్ వన్ డాల్మేషియన్స్ (1961) ఉన్నాయి. డిస్నీ యొక్క లైవ్-యాక్షన్ చిత్రాలు అనేక రకాల విభాగాలకు విస్తరించాయి, చారిత్రక కల్పన అయిన (జానీ ట్రెమైన్, 1957), పిల్లల పుస్తకాల అనుసరణ అయిన (పోలియన్న, 1960) మరియు ఆధునిక యుగ హాస్యాలైన (ది షాగీ డాగ్ 1959) ఉన్నాయి. 1960లలో డిస్నీ యొక్క అత్యంత విజయవంతమైన చిత్రం యాక్షన్/అనిమేటెడ్ మేరీ పాపిన్స్ యొక్క సంగీత అనుసరణ, ఇది జూలీ ఆండ్రూస్‌కు ఉత్తమ నటి పురస్కారంతో పాటు అనేక అకాడెమి పురస్కారాలను పొందింది.
1966–71: వాల్ట్ మరియు రాయ్ డిస్నీ మరణం మరియు వాల్ట్ డిస్నీ వరల్డ్ ప్రారంభం[మార్చు]
1966 డిసెంబరు 15న, వాల్ట్ డిస్నీ ఊపిరితిత్తుల కాన్సర్‌తో మృతిచెందారు, మరియు రాయ్ డిస్నీ సంస్థ యొక్క ఛైర్మన్, CEO, మరియు అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఆయన మొట్టమొదట చేపట్టిన చర్యలలో ఒకటి తన సోదరుని మరియు ఆయన దృష్టిని గౌరవిస్తూ డిస్నీ వరల్డ్‌కు "వాల్ట్ డిస్నీ వరల్డ్,"గా పేరు మార్చడం.
1967లో, వాల్ట్ నిర్మాణంలో చురుకుగా పాల్గొన్న చివరి రెండు చిత్రాలు విడుదలయ్యాయి: అనిమేటెడ్ చిత్రం ది జంగిల్ బుక్ మరియు సంగీత పరమైన ది హాపీయెస్ట్ మిలియనీర్ . ఈ స్టూడియో 1960ల చివరిలో అనేక హాస్యచిత్రాలను విడుదల చేసింది, వీటిలో ది లవ్ బగ్ (1968) మరియు డిస్నీ ప్రవేశపెట్టిన మరొక యువ నటుడు కర్ట్ రస్సెల్ నటించిన ది కంప్యూటర్ వోర్ టెన్నిస్ షూస్ (1969) ఉన్నాయి. 1970లు డిస్నీ యొక్క మొదటి "వాల్ట్-అనంతర" అనిమేటెడ్ చిత్రం ది అరిస్టోకాట్స్ తో ప్రారంభమయ్యాయి, దీని తరువాత 1971లో సంగీతపరమైన బెడ్ నాబ్స్ అండ్ బ్రూంస్టిక్స్ విడుదలైంది.
1971 అక్టోబరు 1న వాల్ట్ డిస్నీ వరల్డ్ ప్రజలకు తెరువబడింది, అదే నెలలో తరువాత రాయ్ డిస్నీ దీనిని వ్యక్తిగతంగా అంకితమిచ్చారు. రెండు నెలల తరువాత, 1971 డిసెంబరు 20న రాయ్ డిస్నీ గుండె పోటుతో మృతి చెందారు, సంస్థ నియంత్రణ రాయ్‌చే తర్ఫీదు పొందిన డాన్ టాటుం, కార్డ్ వాకర్, వాల్ట్ అల్లుడైన రాన్ మిల్లర్‌ల చేతిలోకి వచ్చింది.[13]
1972–84: నాటకరంగ అసౌకర్యం మరియు నూతన నాయకత్వం[మార్చు]
1970లలో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్, ఎస్కేప్ టు విచ్ మౌంటైన్ (1975) మరియు ఫ్రీకీ ఫ్రైడే (1976) వంటి కుటుంబ చిత్రాలను విడుదల చేయడం కొనసాగించినప్పటికీ, ఇంతకు ముందు వాటి వలె ఈ చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద అంత బాగా ఆడలేదు. ఏదేమైనా, రాబిన్ హుడ్ (1973), ది రేస్క్యూయర్స్ (1977), మరియు ది ఫాక్స్ అండ్ ది హౌండ్ (1981) చిత్రాలతో అనిమేటెడ్ స్టూడియో విజయాన్ని సాధించింది.
స్టార్ వార్స్ యొక్క ప్రజాదరణతో ప్రేరణ పొంది, డిస్నీ స్టూడియో శాస్త్రీయ కాల్పనిక సాహసం ది బ్లాక్ హోల్ ను 1979లో నిర్మించింది.ది బ్లాక్ హోల్, PG రేటింగ్‌ను పొందిన డిస్నీ యొక్క మొదటి విడుదలలో ఒకటి, మొదటి చిత్రమైన టేక్ డౌన్ కూడా 1979లోనే విడుదలైంది. ఈ చిత్రాలు మరియు ధైర్యంతో కూడిన మరొక నవకల్పన అయిన PG-రేటెడ్ డిస్నీ చిత్రం ట్రాన్ (1982), డిస్నీ CEO రాన్ మిల్లర్‌కు పెద్ద వారి కోసం చిత్రాలను నిర్మించడానికి టచ్ స్టోన్ పిక్చర్స్ సృష్టించడానికి దారిచూపాయి. టచ్ స్టోన్ మొదటి విడుదల హాస్యచిత్రమైన స్ప్లాష్ (1984) బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.
ది వండర్ ఫుల్ వరల్డ్ ఆఫ్ డిస్నీ ప్రధాన సమయంలో ముఖ్యమైన కార్యక్రమంగా ఉండటంతో పాటు, 1970లలో బృంద కార్యక్రమాలైన ది మౌస్ ఫ్యాక్టరీ వంటి సంకలన ధారావాహిక మరియు స్వల్ప కాలం కొరకు మిక్కీ మౌస్ క్లబ్ లతో డిస్నీ టెలివిజన్‌కు తిరిగివచ్చింది. 1980లలో, నూతనంగా ఏర్పడుతున్న వీడియో కేసెట్ విపణి యొక్క ప్రయోజనాన్ని పొందడానికి డిస్నీ, వాల్ట్ డిస్నీ హోమ్ వీడియోను ప్రారంభించింది. 1983 ఏప్రిల్ 18న ది డిస్నీ ఛానెల్ ఒక చందా-ఆధార కేబుల్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ప్రారంభించి, దాని పురాతన చిత్రాల శ్రేణిలో చిత్రాలు మరియు TV ధారావాహికలతో పాటు, అనేక కార్యక్రమాలు మరియు కుటుంబసమేతంగా చూడదగిన త్రి-పక్ష కార్యక్రమాలను అందించింది.
1970లు మరియు 1980లలో సంస్థ తన దృష్టిని ఎక్కువగా వాల్ట్ డిస్నీ వరల్డ్ పై కేంద్రీకరించింది. 1978లో, డిస్నీ నిర్వాహకులు రెండవ వాల్ట్ డిస్నీ వరల్డ్ థీమ్ పార్క్, EPCOT సెంటర్ ను 1982లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. వాల్ట్ డిస్నీ యొక్క స్వప్నమైన భవిష్యత్ నమూనా నగరంతో ప్రేరణ పొందిన, EPCOT సెంటర్ ఒక "శాశ్వత వరల్డ్'స్ ఫెయిర్"గా అన్ని ప్రధాన అమెరికన్ సంస్థల ప్రదర్శనలతో పాటు, ఇతర దేశాల సంస్కృతులపై ఆధారపడిన దుకాణాలను కలిగి ఉంటుంది. జపాన్‌లో, ఓరియెంటల్ లాండ్ కంపెనీ, యునైటెడ్ స్టేట్స్ వెలుపల మొదటి డిస్నీ థీమ్ పార్క్ ఏర్పాటుకు వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ తో భాగస్వామ్యం ఏర్పరచుకొని, ఏప్రిల్ 1983 లో టోక్యో డిస్నీలాండ్‌ను ప్రారంభించింది.
డిస్నీ ఛానెల్ మరియు నూతన థీమ్ పార్క్ ఏర్పాట్లు విజవంతమైనప్పటికీ, వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ ఆర్థికంగా చితికిపోయింది. దాని చిత్రాల సంకలనం విలువైనదే, కానీ ప్రస్తుత విజయాలు చాలా తక్కువగా ఉండటంతో పాటు దాని నాయకత్వ జట్టు ఇతర స్టూడియోలతో, ప్రత్యేకించి 1979 లో డిస్నీని వదలి వెళ్ళిన డాన్ బ్లుత్‌తో పోటీ పడలేకపోయారు. 1984లో, ఆర్థికవేత్త సాల్ స్టీన్బర్గ్ వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ కొరకు ఒక ప్రతికూల స్వాధీన వేలాన్ని, దాని వివిధ ఆస్తులను ఆమ్మే ఉద్దేశంతో ప్రారంభించారు. డిస్నీ స్నేహపూర్వక పెట్టుబడిదారుల సహాయంతో ఈ వేలాన్ని విజయవంతంగా ఎదుర్కొంది, సిడ్ బాస్ మరియు రాయ్ డిస్నీ యొక్క కుమారుడైన రాయ్ ఎడ్వర్డ్ డిస్నీలు మైకేల్ ఐస్నెర్ మరియు జేఫ్ఫ్రీ కట్జెంబర్గ్‌లను పారామౌంట్ పిక్చర్స్ నుండి మరియు ఫ్రాంక్ వెల్స్‌ను వార్నర్ బ్రదర్స్ నుండి సంస్థకు నాయకత్వం వహించడానికి తీసుకువచ్చారు.
1984–2004: ఐస్నెర్ యుగం[మార్చు]
- ఇవి కూడా చూడుము, 1984-2004 టైంలైన్ ఆఫ్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ క్రింద.
1966లో వాల్ట్ మరణం నుండి, వాల్ట్ డిస్నీ కంపెనీ సంస్థలచే అనేక స్వాధీన ప్రయత్నాల నుండి స్వల్ప తేడాతో తప్పించుకుంది. దాని వాటాదారులైన సిడ్ బాస్ మరియు రాయ్ E. డిస్నీ, ఐస్నెర్ మరియు మాజీ వార్నర్ బ్రదర్స్ అధికారి ఫ్రాంక్ వెల్స్‌ను రాన్ W. మిల్లర్‌లను 1984లో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకువచ్చారు.
1980ల రెండవ అర్ధభాగం మరియు 1990ల ప్రారంభంలో డిస్నీ తిరిగి బలోపేతం చేయబడింది. హూ ఫ్రేమ్డ్ రోగర్ రాబిట్ (1988), మరియు తరువాత, ది లిటిల్ మెర్మెయిడ్ (1989)తో ప్రారంభించి, దాని ఫ్లాగ్ షిప్ అనిమేషన్ స్టూడియో వాణిజ్యపరమైన మరియు విమర్శనాత్మక విజయాలను సాధించింది. దానికి తోడు, అడ్వెంచర్స్ ఆఫ్ ది గుమ్మీ బేర్స్, డక్ టేల్స్ మరియు గర్గోయ్ల్స్ వంటి భారీ ఖర్చుతో కూడిన మరియు ప్రసిద్ధి చెందిన శ్రేణి ద్వారా ఈ సంస్థ టెలివిజన్ అనిమేషన్‌లోకి విజయవంతంగా ప్రవేశించింది, ఈ చిత్రాలు సాధారణంగా మాధ్యమంలోని కళాత్మక ప్రమాణాలను పెంచాయని ప్రశంసించబడ్డాయి. 1993లో డిస్నీ స్టూడియో ఛైర్మన్ జేఫ్ఫ్రీ కట్జెంబర్గ్ మిరమాక్స్ ఫిల్మ్స్ స్వాధీనం చేసుకోవడంతో డిస్నీ తన పెద్దల చిత్రాల నిర్మాణాన్ని విస్తృతం చేసుకుంది. డిస్నీ, ABC మరియు ESPNలతో సహా అనేక ఇతర మాధ్యమ వనరులను స్వంతం చేసుకుంది.
1990ల ప్రధమభాగంలో, ఐస్నెర్ మరియు అతని భాగస్వాములు "ది డిస్నీ డికేడ్" ప్రణాళికను రూపొందించారు, దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నూతన పార్కులు, ప్రస్తుత పార్కుల విస్తరణలు, నూతన చిత్రాలు, మరియు నూతన మధ్యమ పెట్టుబడులు ఉంటాయి. కొన్ని ప్రతిపాదనలు అనుసరించబడినప్పటికీ, అధికభాగం అమలుకు నోచుకోలేదు. వీటిలో యూరో డిస్నీ రిసార్ట్ (ప్రస్తుతం డిస్నీలాండ్ పారిస్), డిస్నీ-MGM స్టూడియోస్ (ప్రస్తుతం డిస్నీ'స్ హాలీవుడ్ స్టూడియోస్), డిస్నీ'స్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్, డిస్నీ-MGM స్టూడియోస్ పారిస్ (2002లో వాల్ట్ డిస్నీ స్టూడియోస్ పార్క్గా ప్రారంభించబడింది), మరియు హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్ ఫ్రాంచైస్‌తో సహా అనేక ఇతర చిత్ర ప్రకల్పనలు ఉన్నాయి.
వెల్స్ 1994లో ఒక విమాన ప్రమాదంలో మరణించారు (చేతితో-గీయబడి సర్వకాలాలలోను అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచిన ది లయన్ కింగ్, ఆయన స్మృతికి అంకితం ఇవ్వబడింది). ఇది జరిగిన కొంతకాలానికే, వెల్స్ మరణం వలన ఖాళీ అయిన స్థానంలో ఐస్నెర్ తనను నియమించనందుకు కట్జెంబర్గ్ రాజీనామా చేసి, స్టీవెన్ స్పీల్బర్గ్ మరియు డేవిడ్ గెఫ్ఫెన్ భాగస్వాములుగా డ్రీమ్‌వర్క్స్ SKGని స్థాపించారు. దానికి బదులుగా, ఐస్నెర్ తన స్నేహితుడు మరియు క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ యొక్క వ్యవస్థాపకులలో ఒకరైన మైకెల్ ఒవిట్జ్‌ను, డిస్నీయొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కనిష్ఠ ప్రమేయంతో అధ్యక్షుడిగా నియమించాడు (ఆస్కార్-విజేత అయిన నటుడు సిడ్నీ పోయిటియర్, హిల్టన్ హోటల్స్ కార్పోరేషన్ యొక్క CEO స్టీఫెన్ బోల్లెన్బాక్, మాజీ U.S. సెనేటర్ జార్జ్ మిచెల్, యేల్ డీన్ రాబర్ట్ A. M. స్టెర్న్, మరియు ఐస్నెర్‌కు పూర్వం ఉన్న రేమొండ్ వాట్సన్ మరియు కార్డ్ వాకర్ ఆ సమయంలో బోర్డు సభ్యులుగా ఉన్నారు). ఒవిట్జ్ కేవలం 14 నెలలు మాత్రమే ఉండి, డిసెంబరు 1996లో ఒక "దోష రహిత తొలగింపు" ద్వారా, ఒవిట్జ్ యొక్క వీడ్కోలు సమయంలో $38 మిలియన్ల నగదు మరియు 3 మిలియన్ల స్టాక్ ఐచ్చికాలతో సుమారు $100 మిలియన్ల వీడ్కోలు పేకేజ్‌తో డిస్నీని వదలివెళ్లారు. ఒవిట్జ్ ఉదంతం ఒక దీర్ఘకాలం నడచిన వ్యుత్పన్న దావాకు దారితీసింది, ఇది దాదాపు 10 సంవత్సరాలు కొనసాగి. చివరకు జూన్ 2006 ముగిసింది. డెలవరె కోర్ట్ ఆఫ్ చాన్సేరీ యొక్క చాన్సెలర్ విలియం B. చండ్లేర్, III, ఐస్నెర్ యొక్క ప్రవర్తనను "ధన ప్రతినిధిత్వ స్థానంలో బాధ్యతలు అప్పగించబడిన వారి నుండి వాటాదారులు ఆశించి మరియు కోరుకునేదాని కంటే చాలా తక్కువ..."గా ప్రవర్తించారని వర్ణించినప్పటికీ, ఐస్నెర్ మరియు ఇతర మిగిలిన డిస్నీ బోర్డ్ చట్టాన్ని ఉల్లంఘించనందువలన (వాటాదారులకు సంస్థ యొక్క అధికారులు మరియు బోర్డ్ బాధ్యత వహించే రక్షణ విధి) వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.[14]
"డిస్నీని రక్షించండి" ప్రచారం మరియు ఐస్నర్ ఉద్వాసన[మార్చు]
2003లో, డిస్నీ యొక్క సహా-స్థాపకుడు రాయ్ O. డిస్నీ కుమారుడు మరియు వాల్ట్ డిస్నీ యొక్క సోదరుని కుమారుడైన రాయ్ E. డిస్నీ, సంస్థ యొక్క వైస్ ఛైర్మన్ మరియు వాల్ట్ డిస్నీ ఫీచర్ అనిమేషన్ ఛైర్మన్‌గా తన పదవులకు రాజీనామా చేసారు, ఐస్నెర్ యొక్క సూక్ష్మ నిర్వహణ, ABC టెలివిజన్ నెట్వర్క్ యొక్క అపజయాలు, థీమ్ పార్క్ వ్యాపారంలో పిరికితనం, వాల్ట్ డిస్నీ సంస్థను ఒక "క్రూరమైన, ఆత్మ-లేని" సంస్థగా మార్చడం, మరియు ఒక స్పష్టమైన వారసత్వ ప్రణాళికను రూపొందించడాన్ని తిరస్కరించడం, వాటితో పాటు 2000 నుండి ప్రారంభించి వరుస బాక్స్ ఆఫీస్ చిత్ర అపజయాలను ఆయన నిందించారు.
2004 మార్చి 3లో జరిగిన డిస్నీ యొక్క సాంవత్సరిక వాటాదారుల సమావేశంలో, ఒక ఆకస్మిక మరియు అనూహ్య సంఘటనలో డిస్నీ వాటాదారులలో 43%, ముఖ్యంగా బోర్డు యొక్క మాజీ సభ్యులైన రాయ్ డిస్నీ మరియు స్టాన్లీ గోల్డ్ నేతృత్వంలో, ఐస్నెర్‌ను తిరిగి బోర్డుకు ఎన్నుకోవడానికి తమ ప్రతినిధులను ఆపివేశారు. అప్పుడు డిస్నీ యొక్క బోర్డు మిచెల్‌కు అధ్యక్షతను అప్పగించింది. ఏదేమైనా, బోర్డు వెంటనే ఐస్నెర్‌ను ముఖ్య కార్యనిర్వహణ అధికారి పదవి నుండి తొలగించలేదు.
2005 మార్చి 13న ఐస్నర్, తన ఒప్పందం పూర్తవడానికి ఒక సంవత్సరం ముందే CEO పదవి నుండి దిగిపోతానని ప్రకటించారు. సెప్టెంబరు 30, ఐస్నెర్ కార్యనిర్వహణ అధికారి మరియు బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసి సంస్థతో తన పూర్వ సంబంధాలన్నిటినీ తెంచుకున్నారు, సంస్థ యొక్క విమానాన్నిమరియు బర్బాంక్ ప్రధాన కార్యాలయంలోని కార్యాలయాన్ని ఉపయోగించడం వంటి ఒప్పందం ప్రకారం పొందిన సౌకర్యాలను వదులుకున్నారు. ఐస్నెర్ స్థానాన్ని దీర్ఘకాలం నుండి ఆయన సహాయకుడిగా ఉన్న రాబర్ట్ ఐగెర్ భర్తీ చేసారు.
2005–ప్రస్తుతం: ఐగెర్ యుగం[మార్చు]
![]() | This విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. (February 2010) |
2005 జూలై 8న వాల్ట్ డిస్నీ యొక్క సోదరుని కుమారుడు, రాయ్ E. డిస్నీ వాల్ట్ డిస్నీ సంస్థకు సలహాదారుడిగా, నాన్ ఓటింగ్ డైరెక్టర్, ఎమెరిటస్ పేరుతో తిరిగి వచ్చారు. వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్, డిస్నీలాండ్ పార్క్ యొక్క 50వ వార్షికోత్సవాన్ని జూలై 17 న జరుపుకుంది మరియు సెప్టెంబరు 12న హాంగ్ కాంగ్ డిస్నీలాండ్ను ప్రారంభించింది. వాల్ట్ డిస్నీ ఫీచర్ అనిమేషన్ 3-Dని ఉపయోగించి సంస్థ యొక్క మొదటి చిత్రమైన చికెన్ లిటిల్ను విడుదల చేసింది. అక్టోబరు 1న రాబర్ట్ ఐగెర్ CEOగా మైకెల్ ఐస్నేర్ స్థానాన్ని ఆక్రమించారు. మిరమాక్స్ సహా-వ్యవస్థాపకులు బాబ్ వీన్స్టీన్ మరియు హార్వే వీన్స్టీన్ కూడా తమ స్వంత సంస్థ స్థాపన కొరకు ఈ సంస్థను వీడి వెళ్లారు.
పిక్సర్‌తో డిస్నీ సంబంధం బలహీనపడుతోందని గమనించిన సంస్థ అధ్యక్షుడు మరియు CEO రాబర్ట్ ఐగర్, పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్ యొక్క అధినేతలు స్టీవ్ జాబ్స్ మరియు ఎడ్ కాట్ముల్‌లతో విలీనం యొక్క సంభావ్యతల గురించి మధ్యవర్తిత్వం ప్రారంభించారు. 2006 జనవరి 23న డిస్నీ, పిక్సర్ మొత్తం చెల్లించిన వాటా విలువ $7.4 బిలియన్లకు కొంటుందని ప్రకటించబడింది. మే 5న ఈ ఒప్పందం చివరి రూపు దాల్చింది; దీని వలన సంభవించిన ముఖ్యమైన ఫలితాలలో పిక్సర్ యొక్క CEO మరియు 50.1% వాటాదారు, స్టీవ్ జాబ్స్, 7%తో డిస్నీ యొక్క అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు మరియు డిస్నీబోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల యొక్క సభ్యుడు కావడం ఉంది.[15][15][16] ఎడ్ కాట్ముల్, పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్ యొక్క అధ్యక్షుడు అయ్యారు. పిక్సర్ యొక్క మాజీ ఎక్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, జాన్ లస్సేటర్, వాల్ట్ డిస్నీ అనిమేషన్ స్టూడియోస్ మరియు పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్ రెండిటికీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కావడంతో పాటు వాల్ట్ డిస్నీ ఇమాజినీరింగ్ యొక్క ప్రిన్సిపల్ క్రియేటివ్ అడ్వైజర్ అయ్యారు .[16]
ప్రధాన నిర్వాహకుడు మరియు అతిపెద్ద వాటాదారుగా సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు, డైరెక్టర్ ఎమెరిటస్ రాయ్ E. డిస్నీ 2009 డిసెంబరు 16న కడుపులో కేన్సర్‌తో మృతిచెందారు. ఆయన మరణసమయంలో, ఆయన సుమారు 1% డిస్నీ వాటాలతో 16 మిలియన్ల విలువను కలిగి ఉన్నారు. ఆయన సంస్థను నడపడంలో చురుకుగా పాల్గొన్న మరియు దానిలో పనిచేసిన డిస్నీ కుటుంబం యొక్క చివరి వ్యక్తిగా పరిగణించబడతారు.
2009 డిసెంబరు 31న డిస్నీ, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్కార్పొరేషన్‌ను $4.24 బిలియన్లకు కొనుగోలు చేసింది. డిస్నీ తమ స్వాధీనం మార్వెల్ ఉత్పత్తులను ఏ విధంగాను ప్రభావితం చేయదని, మరియు మార్వెల్ పాత్రల స్వభావం ఏ విధంగాను మార్పు చెందవని ప్రకటించింది.[17]
అక్టోబరు 2009న, డిస్నీ ఛానెల్ ప్రెసిడెంట్ రిచ్ రాస్, డిక్ కుక్ స్థానంలో ఐగెర్‌చే నియమింపబడి, నవంబరులో మరింత కుటుంబ సన్నిహిత ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించే విధంగా సంస్థను పునర్నిర్మించడం ప్రారంభించారు. తరువాత జనవరి 2010లో, డిస్నీ, టచ్ స్టోన్ పరిమాణాన్ని తగ్గించి మిరమాక్స్‌ను మూసివేయాలని నిర్ణయించింది, కానీ ఒక నెల తరువాత, వారు మిరమాక్స్ పేరును మరియు 700-చిత్రాల గ్రంథాలయాన్ని అమ్మడం ప్రారంభించారు. మార్చి 12న, 2007లో డిస్నీ కొనుగోలు చేసిన ఇమేజ్ మూవర్స్ డిజిటల్, రాబర్ట్ జెమెకిస్ యొక్క సంస్థ మూతపడింది. ఏప్రిల్ 2010లో డిస్నీ యొక్క గ్రామీణ సంగీత సంస్థ అయిన లిరిక్ స్ట్రీట్ మూసివేయబడింది. మే 2010లో ఈ సంస్థ పవర్ రేంజర్స్ బ్రాండ్‌తో పాటు, దాని 700-భాగాల గ్రంథాలయాన్ని కూడా హయిమ్ సబన్‌కు తిరిగి అమ్మివేసింది. జూన్‌లో, ఈ సంస్థ జెర్రీ బ్రక్ హీమర్ యొక్క చిత్ర ప్రణాళిక కిల్లింగ్ రోమెల్ ను రద్దు చేసింది. సెప్టెంబరు 2010లో డిస్నీ ఇంటరాక్టివ్ స్టూడియోస్ కుదించబడింది. నవంబరులో, రెండు ABC కేంద్రాలు అమ్మివేయబడ్డాయి.
2010లో టాంగ్లెడ్ విడుదలతో, ఎడ్ కాట్ముల్ ఈ విధంగా అన్నారు "రాజకుమారి" శైలి చిత్రాలు ఇప్పటికి విరామం తీసుకున్నాయి, "ఎవరో ఒకరు దానిపై కొత్తగా తీయవలసిన అవసరం ఉంది … కానీ మా వద్ద సంగీత లేదా జానపదకథలు వరుసలో లేవు." [18] ప్రేక్షకుల కూర్పు మరియు ప్రాధాన్యతలలో తేడాల వలన తాము రాజకుమారి యుగ చిత్రాల నుండి బయటపడాలని చూస్తున్నామని కూడా ఆయన వివరించారు.
సంస్థ విభాగాలు[మార్చు]
ది వాల్ట్ డిస్నీ కంపెనీ నాలుగు విభాగాలుగా పనిచేస్తుంది: ది వాల్ట్ డిస్నీ స్టూడియోస్ లేదా స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్, ఇది సంస్థ యొక్క చిత్రాలు, రికార్డింగ్ పేరు, నాటక రంగ విభాగాలను కలిగి ఉంటుంది; పార్క్స్ అండ్ రిసార్ట్స్, ఇది సంస్థ యొక్క థీమ్ పార్క్‌లను, విలాసవంతమైన ఓడలను, మరియు ఇతర ప్రయాణ సంబంధ ఆస్తులను చూపుతుంది; డిస్నీకన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఆట వస్తువులు, వస్త్రాలు, మరియు డిస్నీ-యాజమాన్య ఆస్తులపై ఆధారపడిన ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, మరియు మీడియా నెట్ వర్క్స్, ఇది సంస్థ యొక్క టెలివిజన్ మరియు ఇంటర్‌నెట్ కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
వినోద సంబంధమైన దాని ప్రధాన విభాగాలలో వాల్ట్ డిస్నీ మోషన్ పిక్చర్స్ గ్రూప్, డిస్నీ మ్యూజిక్ గ్రూప్, వాల్ట్ డిస్నీ థియేట్రికల్, డిస్నీ-ABC టెలివిజన్ గ్రూప్, రేడియో డిస్నీ, ESPN Inc., డిస్నీ ఇంటరేక్టివ్ మీడియా గ్రూప్, డిస్నీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, మరియు మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. దాని విడుదులు మరియు విభిన్న యాజమాన్యాలలో వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్, డిస్నీలాండ్ రిసార్ట్, వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్, టోక్యో డిస్నీ రిసార్ట్, డిస్నీలాండ్ పారిస్, యూరో డిస్నీ S.C.A., హాంగ్ కాంగ్ డిస్నీలాండ్ రిసార్ట్, డిస్నీ వెకేషన్ క్లబ్ మరియు డిస్నీ క్రూయిస్ లైన్ ఉన్నాయి.
కార్యనిర్వాహక నిర్వహణ[మార్చు]
అధ్యక్షులు[మార్చు]
- 1923–1966: వాల్ట్ డిస్నీ
- 1966–1971: రాయ్ ఓ. డిస్నీ
- 1968–1972: డాన్ టాటం
- 1971–1977: కార్డ్ వాకర్
- 1980–1984: రాన్ డబ్ల్యు. మిల్లర్
- 1984–1994: ఫ్రాంక్ వెల్స్
- 1995–1997: మైఖేల్ ఒవిట్జ్
- 2000–ప్రస్తుతం: రాబర్ట్ ఐగెర్
ముఖ్య కార్యనిర్వాహక అధికారులు[మార్చు]
- 1929–1971: రాయ్ ఓ. డిస్నీ
- 1971–1976: డాన్ టాటం
- 1976–1983: కార్డ్ వాకర్
- 1983–1984: రాన్ డబ్ల్యు. మిల్లర్
- 1984–2005: మైఖేల్ ఐస్నెర్
- 2005–ప్రస్తుతం: రాబర్ట్ ఐగెర్
బోర్డు ఛైర్మన్లు[మార్చు]
1945 నుండి 1960 వరకు వాల్ట్ మరియు రాయ్ డిస్నీలు బోర్డ్ యొక్క ఛైర్మన్ పదవిని పంచుకున్నారు. కంపెనీ యొక్క సృజనాత్మక అంశాలలో దృష్టి కేంద్రీకరించటానికై వాల్ట్ 1960లో ఛైర్మన్ హోదాను వదులుకున్నాడు. రాయ్ ఓ. డిస్నీ ఛైర్మన్ మరియు CEO హోదాలను ఉంచుకున్నాడు.
- 1945–1960: వాల్ట్ డిస్నీ
- 1945–1971: రాయ్ ఓ. డిస్నీ (కో-ఛైర్మన్ 1945–1960)
- 1971–1980: డాన్ టాటం
- 1980–1983: కార్డ్ వాకర్
- 1983–1984: రేమాండ్ వాట్సన్
- 1984–2004: మైఖేల్ ఐస్నెర్
- 2004–2006: జార్జ్ జె. మిచెల్
- 2007–ప్రస్తుతం: జాన్ ఈ. పెప్పెర్, జూ.
బోర్డ్ యొక్క వైస్ ఛైర్మన్లు[మార్చు]
- 1984–2003: రాయ్ E. డిస్నీ
- 1999–2000: శాంఫోర్డ్ లిట్వాక్ (కో-వైస్ ఛైర్మన్)
===చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్
===
- 1984–1994: ఫ్రాంక్ వెల్స్
- 1997–1999: సాన్ఫోర్డ్ లిట్వాక్[1] (యాక్టింగ్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్)
- 2000–ఇప్పటివరకు: రాబర్ట్ ఐగెర్
ఆర్ధిక గణాంకాలు[మార్చు]
ఆదాయాలు[మార్చు]
(USD మిలియన్లలో) | ||||||
సంవత్సరం | వాల్ట్ డిస్నీ స్టూడియో ఎంటర్టైన్మెంట్[Rev 1] | డిస్నీ కన్జ్యూమార్ ప్రోడక్ట్స్[Rev 2] | వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్ |
డిస్నీ మీడియా నెట్వర్క్స్[Rev 3] | వాల్ట్ డిస్నీ ఇంటర్నెట్ గ్రూప్ / డిస్నీ ఇంటరేక్టివ్ మీడియా గ్రూప్[Rev 4][Rev 5] | మొత్తం |
---|---|---|---|---|---|---|
1991[19] | 2,593.0 | 724 | 2,794.0 | 6,111 | ||
1992[19] | 3,115 | 1,081 | 3,306 | 7,502 | ||
1993[19] | 3,673.4 | 1,145.1 | 3,440.7 | 8,529 | ||
1994[20][21][22] | 4,793 | 1,798.2 | 3,463.6 | 359 | 10,414 | |
1995[20][21][22] | 6,001.5 | 2,150 | 3,959.8 | 414 | 12,525 | |
1996[21][23] | 10,095[Rev 2] | 4,502 | 4,142[Rev 6] | 18,739 | ||
1997[24] | 6,981 | 3,782 | 5,014 | 6,522 | 174 | 22,473 |
1998[24] | 6,849 | 3,193 | 5,532 | 7,142 | 260 | 22,976 |
1999[24] | 6,548 | 3,030 | 6,106 | 7,512 | 206 | 23,402 |
2000[25] | 5,994 | 2,602 | 6,803 | 9,615 | 368 | 25,402 |
2001[26] | 7,004 | 2,590 | 6,009 | 9,569 | 25,790 | |
2002[26] | 6,465 | 2,440 | 6,691 | 9,773 | 25,360 | |
2003[27] | 7,364 | 2,344 | 6,412 | 10,941 | 27,061 | |
2004[27] | 8,713 | 2,511 | 7,750 | 11,778 | 30,752 | |
2005[28] | 7-1 | 2.83 | 9-7 | 13,000 | 31,944 | |
2006[28] | 7,529 | 2,193 | 9,925 | 14,368 | 34,285 | |
2007[29] | 7,491 | 2,347 | 10,626 | 15,046 | 35,510 | |
2008[30] | 7,348 | 2,415 | 11,504 | 15,857 | 719 | 37,843 |
2009[31] | 6,136 | 2,425 | 10,667 | 16,209 | 712 | 36,149 |
2010[32] | 6,701 | 2,678 | 10,761 | 17,162 | 761 | 38,063 |
- ↑ పేరు పొందిన చిత్రాలు కూడా
- ↑ 2.0 2.1 1996లో క్రియేటివ్ కంటెంట్ లో విలీనం చేయబడింది
- ↑ 1994 నుండి 1996 వరకు ప్రసారం
- ↑ వాల్ట్ డిస్నీ ఇంటర్నెట్ గ్రూప్, 1997 నుండి 2000 వరకు, తరువాత డిస్నీ మీడియా నెట్వర్క్స్ తో విలీనం చేయబడింది
- ↑ డిస్నీ ఇంటరాక్టివ్ మీడియా గ్రూప్, WDIG మరియు డిస్నీ ఇంటరాక్టివ్ స్టూడియోస్ ల విలీనంతో 2008 లో ప్రారంభమైంది
- ↑ ABC యొక్క కొనుగోలు తరువాత
నికర ఆదాయం[మార్చు]
(USD మిలియన్లలో ) | ||||||
సంవత్సరం | వాల్ట్ డిస్నీ స్టూడియో ఎంటర్టైన్మెంట్[NI 1] | డిస్నీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్[NI 2] | వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్ |
డిస్నీ మీడియా నెట్వర్క్స్[NI 3] | వాల్ట్ డిస్నీ ఇంటర్నెట్ గ్రూప్[NI 4] / డిస్నీ ఇంటారాక్టివ్ మీడియా గ్రూప్[NI 5] | మొత్తం |
---|---|---|---|---|---|---|
1991[19] | 318 | 229 | 546 | 1,094 | ||
1992[19] | 508 | 283 | 644 | 1,435 | ||
1993[19] | 622 | 355 | 746 | 1,724 | ||
1994[20][21] | 779 | 425 | 684 | 77 | 1,965 | |
1995[20][21] | 998 | 510 | 860 | 76 | 2.445 | |
1996[21] | 1,598[NI 2] | 990 | 747 | −300[NI 6] | 3,035 | |
1997[24] | 1,079 | 893 | 1,136 | 1,699 | -56 | 4,312 |
1998[24] | 769 | 801 | 1,288 | 1,746 | −94 | 3,231 |
1999[24] | 116 | 607 | 1,446 | 1,611 | −93 | 3,231 |
2000[25] | 110 | 455 | 1,620 | 2,298 | −402 | 4,081 |
2001[26] | 260 | 401 | 1,586 | 1,758 | 4,214 | |
2002[26] | 273 | 394 | 1,169 | 986 | 2,286 | |
2003[27] | 620 | 384 | 957 | 1,213 | 3,174 | |
2004[27] | 662 | 534 | 1,123 | 2,169 | 4,488 | |
2005[28] | 207 | 543 | 1,178 | 3,209 | 5,137 | |
2006[28] | 729 | 618 | 1,534 | 3,610 | 6,491 | |
2007[29] | 1,201 | 631 | 1,710 | 4,285 | 7,827 | |
2008[30] | 1,086 | 778 | 1,897 | 4,942 | −258 | 8,445 |
2009[31] | 175 | 609 | 1,418 | 4,765 | −295 | 6,672 |
2010[32] | 693 | 677 | 1,318 | 5,132 | −234 | 7,586 |
- ↑ పేరు పొందిన చిత్రములు కూడా
- ↑ 2.0 2.1 1996లో క్రియేటివ్ కంటెంట్ లో విలీనమైంది
- ↑ 1994 నుండి 1996 వరకు ప్రసారం
- ↑ 1997 నుండి 2000 వరకు వాల్ట్ డిస్నీ ఇంటర్నెట్ గ్రూప్, తరువాత డిస్నీ మీడియా నెట్ వర్క్స్తో విలీనమైంది.
- ↑ డిస్నీ ఇంటరాక్టివ్ మీడియా గ్రూప్, WDIG మరియు డిస్నీ ఇంటరాక్టివ్ స్టూడియోస్ యొక్క విలీనం వలన ఏర్పడింది
- ↑ WDIGతో కలసిలేదు, రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఆర్ధికపరమైన మార్పుల కారణంగా డిస్నీ $300M నష్టాన్ని నివేదించింది
విమర్శలు[మార్చు]
డిస్నీ యొక్క అనిమేటెడ్ కుటుంబ చిత్రాలలో కొన్ని వాటిలో లైగింకపరమైన సూచనలు దాగి ఉన్నాయనే కారణంపై నిందించబడ్డాయి, వాటిలో ది లిటిల్ మెర్మెయిడ్ (1989), అల్లాడిన్ (1992), మరియు ది లయన్ కింగ్ (1994) ఉన్నాయి. ది రెస్క్యూయర్స్ (1977) మరియు హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్ (1988) యొక్క కొన్ని రూపాలలో దాగున్న లైంగికపరమైన ఉదాహరణలు వాటిని వెనుకకు తీసుకోవడానికి మరియు ఆ విధమైన విషయాన్ని తొలగించడానికి దారితీసాయి.[33]
కాథలిక్ లీగ్ వంటి కొన్ని మత శ్రేయో సంఘాలు ప్రీస్ట్ (1994) మరియు డాగ్మా (1999) చిట్టాలను వ్యతిరేకించాయి.[34] డిస్నీ-యాజమాన్యంలోని హైపిరియన్ ప్రెస్ చే ప్రచురించబడిన గ్రోయింగ్ అప్ గే అనే పుస్తకం మరియు ఆ విధమైన ప్రచురణలు, వాటితో పాటు స్వ-లింగ గృహ భాగస్వాములకు సంస్థ యొక్క ప్రయోజనాల విస్తరణ, కాథలిక్ లీగ్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ USA, అమెరికన్ ఫామిలీ అసోసియేషన్ మరియు ఇతర సాంప్రదాయ సంస్థలచే డిస్నీ మరియు దాని ప్రచారకర్తల బహిష్కరణను ప్రోత్సహించింది.[34][35][36] 2005 నాటికి ఈ సంస్థలలో అధికభాగం బహిష్కరణలను ఎత్తివేసాయి.[37] ఈ సాంఘిక వివాదాలకు తోడు, ఈ సంస్థ తమ వస్తువులను ఉత్పత్తి చేసే కార్మాగారాలలో పని పరిస్థితులకు సంబంధించి మానవ హక్కులను ఉల్లంఘించిందని కూడా నిందించబడింది.[38][39]
సంపూర్ణ స్వాధీనాలు[మార్చు]
- 1993 – మిరమాక్స్ ఫిల్మ్స్1
- 1995 – డిక్2
- 1996 – కాపిటల్ సిటీస్/ABC, జంబో పిక్చర్స్
- 2001 – ఫాక్స్ ఫామిలీ వరల్డ్‌వైడ్, సబన్ ఎంటర్‌టైన్‌మెంట్
- 2004 – ది మప్పెట్స్3 మరియు బేర్ ఇన్ ది బిగ్ బ్లూ హౌస్ ల యొక్క వస్తువులు మరియు యాజమాన్యం
- 2006 – పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్, ఓస్వాల్డ్ ది లక్కీ రాబిట్ మరియు డిస్నీచే నిర్మించబడిన 26 కార్టూన్ల యజమాన్యం4
- 2007 – న్యూ హోరైజన్ ఇంటరాక్టివ్, ఇమేజ్ మూవర్స్5
- 2009 – మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్
- 2010 – తపులౌస్ ఇన్కార్పొరేషన్., ప్లేడం
- 2011 - టుగెదర్విల్లె
1మిరమాక్స్ 2010లో ఫిల్మ్‌యార్డ్ హోల్డింగ్స్, LLCకి అమ్మబడింది.
2 డిక్ 2000 నవంబరు 17న యాన్డి హేవార్డ్ కు తిరిగి అమ్మబడింది మరియు కుకీ జార్ గ్రూప్ 2008 జూలై 23న DiCతో విలీనమైంది.
3 సోనీ పిక్చర్స్ యాజమాన్యంలోని ది మప్పెట్స్ టేక్ మన్హట్టన్, మప్పెట్స్ ఫ్రమ్ స్పేస్, మరియు కెర్మిట్'స్ స్వామ్ప్ యియర్స్, మరియు NBC యూనివర్సల్ యాజమాన్యంలోని ఇట్స్ ఎ వెరీ మెర్రీ మప్పెట్ క్రిస్టమస్ మూవీ లను మినహాయించి. ది మప్పెట్స్ సృష్టికర్తలైన జిమ్ హేనసన్ ప్రొడక్షన్స్, ఫ్రాగిల్ రాక్ యజమానులుగా మిగిలిపోయారు. సెసేం స్ట్రీట్స్ మప్పెట్స్ 2001లో లాభాపేక్ష లేని సెసేం వర్క్ షాప్ కి అమ్మబడ్డాయి.
4 విన్క్లర్ ప్రొడక్షన్స్ మరియు ఇప్పటికీ NBC యాజమాన్యంలో ఉన్న వాల్టర్ లాంట్జ్ ఓస్వాల్డ్ కార్టూన్స్ మినహాయించి.
5 డిస్నీ యొక్క స్వాధీనం తరువాత ఇమేజ్ మూవర్స్ డిజిటల్ గా పేరు మార్చబడింది:.
వీటిని కూడా చూడండి[మార్చు]
- వాల్ట్ డిస్నీ స్టూడియోలకు ఒక పర్యటన
- డిస్నీ అనిమేటెడ్ చలన చిత్రాల మూల విషయం
- డిస్నీ ఛానల్
- డిస్నీ విశ్వవిద్యాలయం
- డిస్నీఫికేషన్
- డిస్నీ యాజమాన్యంలోని ఆస్తుల జాబితా
- డిస్నీ అనిమేటెడ్ పాత్రల జాబితా
- డిస్నీ అనిమేటెడ్ సంక్షిప్త చిత్రాల జాబితా
- డిస్నీ యొక్క థియేట్రికల్ అనిమేటెడ్ చిత్రాల జాబితా
- డిస్నీ చలనచిత్రాల జాబితా
- డిస్నీ యొక్క లైవ్-యాక్షన్ షార్ట్స్ యొక్క జాబితా
- డిస్నీ గృహ వినోద జాబితా
- డిస్నీ టెలివిజన్ ధారావాహికల జాబితా
- విభాగాల వారీగా డిస్నీ వీడియో గేమ్స్ జాబితా
- వాల్ట్ డిస్నీ
సూచనలు[మార్చు]
- ↑ "Company History". Corporate Information. The Walt Disney Company. Retrieved 2008-08-30.
- ↑ "2010 Form 10-K, Walt Disney Company". United States Securities and Exchange Commission. Cite web requires
|website=
(help) - ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "2008 10-K". Retrieved 2009-02-12. Cite web requires
|website=
(help) - ↑ Siklos, Richard (2009-02-09). "Why Disney wants DreamWorks". CNN/Money. Retrieved 2009-02-09. Cite news requires
|newspaper=
(help) - ↑ 5.0 5.1 "Company History". Cite web requires
|website=
(help) - ↑ 6.0 6.1 "The Walt Disney Studio History". Cite web requires
|website=
(help) - ↑ డిస్నీషార్ట్స్.org
- ↑ బ్రాడ్వే థియేటర్ బ్రాడ్వే | ది షుబెర్ట్ ఆర్గనైజేషన్
- ↑ Gabler, Neal (2007). Walt Disney: The Triumph of the American Imagination. New York: Random House. pp. 276–277. ISBN 0-679-75747-3.
- ↑ 10.0 10.1 "Chronology of the Walt Disney Company". islandnet.com. Cite web requires
|website=
(help) - ↑ "Cinema: Man & Mouse". TIME.com. 27 December 1937. Retrieved 17 May 2010.
- ↑ "Company history (continued)". Cite web requires
|website=
(help) - ↑ "Company History (continued)". Cite web requires
|website=
(help) - ↑ In re The Walt Disney Company Derivative Litigation, 907 A.2d 693 (Del. Ch. August 9, 2005).
- ↑ 15.0 15.1 Holson, Laura M. (January 25, 2006). "Disney Agrees to Acquire Pixar in a $7.4 Billion Deal". The New York Times. Retrieved 2010-01-17. Cite news requires
|newspaper=
(help) - ↑ 16.0 16.1 "Pixar Becomes Unit of Disney". The New York Times & The Associated Press. May 6, 2006. Retrieved 2010-01-17. Cite news requires
|newspaper=
(help) - ↑ Jay Cochran (August 31, 2009). "Disney Announces Acquisition of Marvel Entertainment Inc". enewsi.com. Unknown parameter
|http://www.enewsi.com/news.php?catid=
ignored (help); Cite news requires|newspaper=
(help) - ↑ "ది డిస్నీ ఫెయిరీ టేల్ హాస్ యాన్ అన్ హాపీ ఎండింగ్," సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ 29 నవంబర్ 2010.
- ↑ 19.0 19.1 19.2 19.3 19.4 19.5 "SEC Info - Disney Enterprises Inc - 10-K - For 9/30/93". secinfo.com. Cite web requires
|website=
(help) - ↑ 20.0 20.1 20.2 20.3 డిస్నీ సాంవత్సరిక నివేదిక 1995 - ఆర్ధిక ముఖ్యాంశాలు
- ↑ 21.0 21.1 21.2 21.3 21.4 21.5 "Disney Annual Report 1996 - Management's Discussion and Analysis of Financial Condition and Results of Operations". Cite web requires
|website=
(help) - ↑ 22.0 22.1 "Disney Enterprises Inc · 10-K · For 9/30/95". secinfo.com. Cite web requires
|website=
(help) - ↑ "Walt Disney Co · 10-K405 · For 9/30/96". secinfo.com. Cite web requires
|website=
(help) - ↑ 24.0 24.1 24.2 24.3 24.4 24.5 "Disney Annual Report 1999 - Management's Discussion and Analysis of Financial Condition and Results of Operations". corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 25.0 25.1 "Disney Annual Report 2000" (PDF). corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 26.0 26.1 26.2 26.3 "Disney Annual Report 2002" (PDF). corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 27.0 27.1 27.2 27.3 "Disney Annual Report 2004" (PDF). corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 28.0 28.1 28.2 28.3 "Disney Annual Report 2006 - Financial Highlights". corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 29.0 29.1 "Disney Annual Report 2007 - Financial Highlights". corporate.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 30.0 30.1 "Disney Factbook 2008 - Financial Information p. 50" (PDF). amedia.disney.go.com. Cite web requires
|website=
(help) - ↑ 31.0 31.1 "Disney 2009 Annual Report - Business Segment Results" (PDF). p. 31. Cite web requires
|website=
(help) - ↑ 32.0 32.1 "Disney 2010 Fourth Quarter" (PDF). p. 2. Cite web requires
|website=
(help) - ↑ "Disney (Disney Films)". snopes.com. Retrieved 2009-07-15. Cite web requires
|website=
(help) - ↑ 34.0 34.1 "75 Organizations Asked To Join Showtime Boycott". Catalyst Online. Catholic League. 2001-05-29. Retrieved 2008-08-29.
- ↑ "Disney Boycott Expands". Catalyst. Catholic League. 1996. Retrieved 2008-08-29. Unknown parameter
|month=
ignored (help) - ↑ "Petitions and Boycott Stir Disney". Catalyst Online. Catholic League. 1997. Retrieved 2008-08-29. Unknown parameter
|month=
ignored (help) - ↑ "Southern Baptists end 8-year Disney boycott". MSNBC.com. 2005-06-22. Retrieved 2010-01-08. Cite web requires
|website=
(help) - ↑ "Beware of Mickey: Disney's Sweatshop in South China". Centre for Research on Multinational Corporations. 2007-02-10. మూలం నుండి 2007-02-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-30. Cite web requires
|website=
(help) - ↑ Staff writer (2001-06-20). source "Disney's duds are tops in sweatshop labour, Oxfam" Check
|url=
value (help). CBC.com. Retrieved 2008-08-30.
మరింత చదవడానికి[మార్చు]
- బిల్డింగ్ ఎ కంపెనీ: రాయ్ ఓ. డిస్నీ అండ్ ది క్రియేషన్ ఆఫ్ యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంపైర్, బాబ్ థామస్, 1998
- బిల్డింగ్ ఎ డ్రీమ్; ది ఆర్ట్ ఆఫ్ డిస్నీ ఆర్కిటెక్చర్, బెత్ డన్లప్, 1996, ISBN 0-8109-3142-7
- కల్ట్ ఆఫ్ ది మౌస్: కెన్ వుయ్ స్టాప్ కార్పోరేట్ గ్రీడ్ ఫ్రమ్ కిల్లింగ్ ఇన్నోవేషన్ ఇన్ అమెరికా?, హెన్రీ M. కారోసెల్లి, 2004, టెన్ స్పీడ్ ప్రెస్
- డిస్నీ: ది మౌస్ బిట్రేడ్, పీటర్ స్క్వీజేర్
- ది డిస్నీ టచ్: హౌ ఎ డేరింగ్ మేనేజ్మెంట్ టీమ్ రివైవ్డ్ యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంపైర్, బై రాన్ గ్రోవర్ (రిచర్డ్ D. ఇర్విన్, Inc., 1991), ISBN 1-55623-385-X
- ది డిస్నీ వెర్షన్: ది లైఫ్, టైమ్స్, ఆర్ట్ అండ్ కామర్స్ ఆఫ్ వాల్ట్ డిస్నీ, రిచర్డ్ స్కికెల్, 1968, రివైస్డ్ 1997
- డిస్నేయన: వాల్ట్ డిస్నీ కలెక్షన్స్, సెసిల్ మున్సీ, 1974
- డిస్నీఐజేషన్ ఆఫ్ సొసైటీ : అలన్ బ్రిమన్, 2004
- డిస్నీవార్, జేమ్స్ B. స్టీవర్ట్, సైమన్ & షుస్టర్, 2005, ISBN 0-684-80993-1
- డోనాల్డ్ డక్ జాయిన్స్ అప్; ది వాల్ట్ డిస్నీ స్టూడియో డ్యూరింగ్ వరల్డ్ వార్ II, రిచర్డ్ షేల్, 1982
- హౌ టు రీడ్ డోనాల్డ్ డక్: ఇంపీరియలిస్ట్ ఐడియాలజీ ఇన్ ది డిస్నీ కామిక్ ISBN 0-88477-023-0 (మార్క్సిస్ట్ క్రిటిక్) ఏరిఎల్ డార్ఫ్మాన్, అర్మాండ్ మట్టెల్ఆర్ట్, డేవిడ్ కుంజ్లె (అనువాదకుడు).
- ఇన్సైడ్ ది డ్రీమ్: ది పర్సనల్ స్టొరీ ఆఫ్ వాల్ట్ డిస్నీ, కాథరిన్ గ్రీనే & రిచర్డ్ గ్రీనే, 2001
- ది కీస్ టు ది కింగ్డం: హౌ మైకెల్ ఐస్నర్ లాస్ట్ హిజ్ గ్రిప్, కిమ్ మాస్టర్స్ (మారో, 2000)
- ది మాన్ బిహైండ్ ది మేజిక్; ది స్టొరీ ఆఫ్ వాల్ట్ డిస్నీ, కాథరిన్ & రిచర్డ్ గ్రీనే, 1991, రివైస్డ్ 1998, ISBN 0-7868-5350-6
- మారీడ్ టు ది మౌస్, రిచర్డ్ E. ఫోగ్లేసోర్గ్, యేల్ యూనివర్సిటీ ప్రెస్.
- మౌస్ టేల్స్: ఎ బిహైండ్-ది-యియర్స్ లుక్ ఎట్ డిస్నీలాండ్, డేవిడ్ కోయ్నిగ్, 1994, రివైస్డ్ 2005, ISBN 0-9640605-4-X
- మౌస్ ట్రాక్స్: ది స్టొరీ ఆఫ్ వాల్ట్ డిస్నీ రికార్డ్స్, టిం హోల్లిస్ అండ్ గ్రెగ్ ఎహ్ర్బార్, 2006, ISBN 1-57806-849-5
- స్టార్మింగ్ ది మేజిక్ కింగ్డం: వాల్ స్ట్రీట్, ది రైడర్స్, అండ్ ది బాటిల్ ఫర్ డిస్నీ, జాన్ టేలర్, 1987 న్యూ యార్క్ టైమ్స్
- ది స్టొరీ ఆఫ్ వాల్ట్ డిస్నీ, డైనే డిస్నీ మిల్లర్ & పీట్ మార్టిన్, 1957
- టీమ్ రోడెంట్, కార్ల్ హియసేన్.
- వాల్ట్ డిస్నీ: యాన్ అమెరికన్ ఒరిజినల్, బాబ్ థామస్, 1976, రివైస్డ్ 1994, ISBN 0671223321
- వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బై మైకెల్ ఐస్నర్ విత్ టోనీ స్క్వార్ట్జ్ (రాండం హౌస్, 1998), ISBN 978-0375500718
బాహ్య లింకులు[మార్చు]
- CS1 errors: missing periodical
- గూగుల్ అనువాద వ్యాసాలు
- Missing redirects
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- విస్తరణ కోరబడిన వ్యాసములు from February 2010
- విస్తరణ కోరబడిన అన్ని వ్యాసములు
- Articles using small message boxes
- Official website different in Wikidata and Wikipedia
- అమ్యూజ్మెంట్ పార్క్ సంస్థలు
- బర్బాంక్, కాలిఫోర్నియా
- కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ స్థావరంగా ఉన్న సంస్థలు
- డిస్నీ
- డౌ జోన్స్ పారిశ్రామిక సగటు
- యునైటెడ్ స్టేట్స్ యొక్క వినోద సంస్థలు
- ఐరిష్ అమెరికన్ చరిత్ర
- యునైటెడ్ స్టేట్స్ యొక్క మీడియా సంస్థలు
- 1923 స్థాపితాలు