వింజమూరి వరదరాజ అయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింజమూరి వరదరాజయ్యంగార్

వింజమూరి వరద రాజ అయ్యంగార్ సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, సంగీత సాహిత్య వక్త, రచయిత, పరిశోధకులు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1915 జూలై 15న గుంటూరులో గుంటూరు పుర ప్రముఖులు, ప్రముఖ న్యాయవాది, మునిసిపల్‌ చైర్మన్‌ వింజమూరి భావనాచారి, ఆయన సతీమణి కనకవల్లి తాయార్‌లకు జన్మించారు. ముక్త్యాల సంస్థాన సంగీత విద్వాంసులు పిరాట్ల శంకరశాస్త్రి గారి వద్ద సహోదరి శకుంతల సంగీతం నేర్చుకునే సమయంలో, పసిత నంలోనే వీరికి కూడా సంగీతంలో ఆసక్తి కలిగింది. అది గమనించిన గురువు ఆ పిల్లవానికి కూడా సం గీత పాఠం ఆరంభించారు. వింజమూరి గురువు గారి పాఠాలని అయస్కాంతంలా ఆకర్షించి గ్రహిం చేవారు. ఏడేళ్ల వయస్సులో వారి తొలి కచ్చేరి మైసూ రు ఆస్థాన విద్వాంసులు వీణ శేషణ్ణ సమక్షంలో జరి గింది. పళ్లెం పూర్ణప్రజ్ఞ వద్ద సంస్కృతం, ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ బీఏ పట్టభద్రులయ్యారు. 1935లో వీరికి విమలాదేవితో వివాహం జరిగింది. 1936లో మదరాసు వెళ్లి వరదాచార్యర్ వద్ద శిష్యు డిగా చేరారు. మదరాసు విశ్వవిద్యాలయంలో సంగీ త విద్వాన్ కోర్సులో అత్యుత్తమ శ్రేణిలో ముగించారు. ఆయన భారతదేశంలోనే కాక, బర్మా, సిలోన్, మలేషియా, రంగూన్ వంటి పలు చోట్ల 1945 నుంచి అనేక వేల కచ్చేరీలు చేశారు.[1]

ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి సంగీత కళాశాలను హైదరాబాద్‌లో స్థాపించి దానికి తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అనేక సం గీత విద్యాసంస్థల స్థాపనకి కారకుల య్యారు. ఆకాశవాణిలో సంగీత విభాగ ప్రయోక్తగా వివిధ ప్రసారాలను సృష్టించారు.[1]

ఆకాశవాణిలో

[మార్చు]

ఆయన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో కర్ణాటక సంగీత విభాగం అసిస్టెంటు ప్రొడ్యూసస్ర్ గా 1965 నుండి ఒక దశాబ్ది కాలం పనిచేశారు. వీరిది గుంటూరు జిల్లా. గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన వీరి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాల రూపొందించాయి. వీరు 1994 ప్రాంతంలో కాల ధర్మం చెందారు. వీరి కుమారులు శ్రీ వి. గోవింద రాజన్ I.A.S అంధ్ర రాష్ట్ర ప్రభుత్వ్ కార్య దర్శిగా వ్వవ్హరించారు. కేంద్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఆకాశవాణిలో సంగీత విభాగ ప్రయోక్తగా పనిచేసిన సందర్భంలో వింజమూరి అనేక ప్రయోగాలు చేశారు. 1943లోనే ‘గానలహరి’ అనే సంగీత శిక్షణ కార్యక్రమాన్ని మదరాసు కేంద్రం నుంచి ప్రారంభించారు. వింజమూరి ఆరంభించిన మరో అద్భుతమైన ప్రసారం ‘రాగ లక్షణం’. దాని ద్వారా స్వర రంజని, ఊర్మిక, గంభీర వాణి, వివర్ధిని, మేఘరంజని వంటి అపూర్వ రాగ లక్షణాలను సోదాహరణంగా ప్రసంగాలను చేసారు. దానిలో రాగం యొక్క లక్ష్య లక్షణాలు, జనక జన్యాది విషయాలు, ఆ రాగ అపూర్వ ప్రయోగాలు వివరించి, పలు వాగ్గేయకారుల రచనలకు ఉదాహరణగా చూపి ప్రేక్షకుల అభివృద్ధికి తోడ్పడ్డారు. వారు ‘లయ విన్యాసం’ అనే పేరిట నిర్వహించిన ప్రసారంలో లయ పితామహ కోలంక వేంకటరాజు (మృదంగం), లాల్గూడి జయరామన్‌ (వైలెన్‌) వంటి అనేక సుప్రసిద్ధ విద్వాంసులను దేశంలో పలు ప్రదేశాల నుంచి పిలిపించి వారితో లయ ప్రకరణం చేయించి ప్రసారం చేశారు. ‘సంగీత రచయితలు’ అనే కార్యక్రమంలో మార్గదర్శి శేషయ్యంగార్‌, ముత్తయ్య భాగవతార్‌, మైసూర్‌ సదాశివరావ్‌ వంటి ప్రసిద్ధ సంగీత వాగ్గేయకారులను గురించి, వారి జీవితం, వారిరచనల విశిష్టత, ప్రత్యేకత, వారు సృష్టించిన నూతన రాగాలు మొదలైన విషయాలతో ప్రసంగాలు చేశారు. ‘భక్తిరంజని’ కార్యక్రమం పేరున మొట్టమొదటగా అన్నమాచార్య కీర్తనలకు వర్ణమెట్టు కట్టి (1945) ప్రచారం చేసింది వింజమూరి వారే. అదే కాక పురంధర దాస, కనకదాస, రామదాస, తూము నరసింహదాసు, నారాయణ తీర్థ మొదలైన అజ్ఞాత వాగ్గేయకారుల రచనలు ప్రసారం చేసి వారిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.[2]

పురస్కారాలు

[మార్చు]
  • గానకళానిధి
  • 22వ ఏట శృంగేరిస్వామి వద్ద గానవిద్యా విశారద బిరుదు
  • గాయకరత్న,
  • సంగీత జ్యోతి,
  • గాన కళా ప్రపూర్ణ,
  • సంగీత లహరి,
  • డాక్టరేట్‌

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "గానకళానిధి డా॥వింజమూరి". సంధ్యా రంగన్ గిరి, (వింజమూరి కుమార్తె). Sakshi. 4 July 2015. Retrieved 5 June 2016.
  2. గానవిజ్ఞానసర్వస్వం వింజమూరి, 15-07-2015, -సంధ్యా రంగన్‌ గిరి[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]