విండోస్ టాస్క్ మేనేజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Task Manager
A component of Microsoft Windows
300px
Screenshot of Task Manager under Windows 7
Details
TypeTask manager application
Included withMicrosoft Windows NT 4.0 and onwards
ReplacesSystem Monitor, TASKMAN.EXE

విండోస్ టాస్క్ మేనేజర్ (Windows Task Manager) అనేది మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows) NT శ్రేణి నిర్వహణ వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టమ్)లలో ఉండే ఒక క్రియా నిర్వాహక (టాస్క్ మేనేజర్) అనువర్తనం, ఇది కంప్యూటర్ పనితీరు మరియు అమలవుతున్న అనువర్తనాలు, ప్రక్రియలు మరియు CPU వినియోగం, కమిట్ ఛార్జ్ మరియు మెమోరీ సమాచారం, నెట్‌వర్క్ కార్యకలాపం మరియు గణాంకాలు, లాగ్ అయిన వినియోగదారులు మరియు వ్యవస్థ (సిస్టమ్) సేవలు వంటివాటి గురించి సమగ్ర సమచారాన్ని అందిస్తుంది. ప్రక్రియ ప్రాధాన్యతలను, ప్రాసెసర్ సంబంధాన్ని నిర్దేశించేందుకు, ప్రక్రియలను బలవంతంగా నిలిపివేసేందుకు, విండోస్‌ను షట్‌డౌన్ (మూసివేత), రీస్టాట్ (పునఃప్రారంభం), హైబర్నేట్ (నిద్రాణ స్థితికి పంపడం) లేదా లాగాఫ్ చేసేందుకు కూడా క్రియా నిర్వాహకిని ఉపయోగించవచ్చు. విండోస్ టాస్క్ మేనేజర్ (క్రియా నిర్వాహకి) ను విండోస్ NT 4.0తో పరిచయం చేశారు. దీనికి ముందు వచ్చిన విండోస్ NT వెర్షన్‌లలో టాస్క్ లిస్ట్ (చర్యా జాబితా) అనువర్తనం ఉండేది, దీనిలో అతికొద్ది ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. టాస్క్ లిస్ట్‌కు అమల్లో ఉన్న ప్రక్రియల జాబితాను ప్రదర్శించే మరియు వాటిని నిలిపివేసే లేదా ఒక కొత్త ప్రక్రియను సృష్టించే సామర్థ్యం ఉంటాయి.

మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క పూర్వ వెర్షన్‌లలో (మైక్రోసాఫ్ట్ విండోస్ 3.x, విండోస్ 95, విండోస్ 98) అమల్లో ఉన్న ప్రోగ్రామ్‌లను ప్రదర్శించేందుకు టాస్క్స్‌గా గుర్తించే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. C:\Windows directory నుంచి taskman.exe ఫైల్‌ను అమలు చేయడం ద్వారా ఈ ఫైల్‌ను నిర్వహించవచ్చు.[1]

టాస్క్ మేనేజర్‌ను ప్రారంభించడం[మార్చు]

దస్త్రం:System idle process.png
విండోస్ XPలో టాస్క్ మేనేజర్

ఈ కింది నాలుగు పద్ధతుల్లో ఏదో ఒక దానిని ఉపయోగించి టాస్క్ మేనేజర్‌ను ప్రారంభించవచ్చు:

 1. టాస్క్‌బార్‌పై ఉండే కంటెక్స్ట్ మెనును ఉపయోగించి, దానిలో "స్టార్ట్ టాస్క్ మేనేజర్" ఎంచుకోవడం.
 2. కంట్రోల్+షిఫ్ట్+ఎస్కేప్ (Ctrl+Shift+Esc) మీటల మేళనాన్ని ఉపయోగించడం.
 3. విండోస్ NT, విండోస్ 2000, మరియు విండోస్ విస్టా (Windows Vista) లలో, (కంట్రోల్+ఆల్ట్+డిలీట్ (Ctrl+Alt+Del) ) మీటల మేళనాన్ని ఉపయోగించి విండోస్ సెక్యూరిటీ డయలాగ్‌ను ప్రారంభించిన తరువాత, దానిలో "టాస్క్ మేనేజర్"పై క్లిక్ చేయాలి. విండోస్ XP మరియు విండోస్ 7లలో కంట్రోల్+షిఫ్ట్+ఎస్కేప్ (Ctrl+Shift+Esc) మీటల మేళనంతో నేరుగా టాస్క్ మేనేజర్‌ను ప్రారంభించవచ్చు, వెల్‌కమ్ స్క్రీన్‌ను (స్వాగత తెరను) నిష్క్రియాత్మకం చేసినట్లయితే కంట్రోల్+ఆల్ట్+డిలీట్ (Ctrl+Alt+Delete) ద్వారా కూడా దీనిని ప్రారంభించవచ్చు.
 4. ఒక కమాండ్ లైన్ (ఆజ్ఞాపన), GUI (C:\Windows\System32\taskmgr.exeలో ఉండే) లేదా ఒక షార్ట్‌కట్ (అడ్డదారి) నుంచి "Taskmgr.exe"ని ప్రారంభించడం.

లక్షణ జాబితాలు[మార్చు]

అప్లికేషన్స్[మార్చు]

టాస్క్ మేనేజర్‌లో అప్లికేషన్స్ (అనువర్తనాలు) ట్యాబ్ ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రోగ్రామ్‌ల జాబితాను ప్రదర్శిస్తుంది. ఈ ట్యాబ్‌పై ఒక ప్రక్రియ కనిపించాలా వద్దా అనేది ఒక నిబంధనల సమితి ద్వారా నిర్ణయించబడుతుంది. టాస్క్ బార్ ప్రవేశం ఉన్న దాదాపుగా అన్ని అనువర్తనాలు ఈ ట్యాబ్‌పై కనిపిస్తాయి, అయితే అన్నిసార్లు ఇదే పరిస్థితి ఉండదు.

జాబితాలోని ఒక అనువర్తనంపై (మిగిలిన వాటి నడుమ) మౌస్ కుడి-వైపు క్లిక్ చేయడం ద్వారా ఆ అనువర్తనాన్ని ప్రదర్శించే (స్విచ్ అయ్యే), అనువర్తనాన్ని మూసివేసే వీలుతోపాటు, ప్రాసెసెస్ ట్యాబ్‌లో ఈ అనువర్తన సంబంధ ప్రక్రియ ప్రదర్శించబడుతుంది.

అప్లికేషన్స్‌లో ఎండ్ టాస్క్ అనే చర్యను ఎంచుకోవడం ద్వారా ఒక అనువర్తనాన్ని నిలిపివేసేందుకు దానికి ఒక విజ్ఞప్తి పంపబడుతుంది. ప్రాసెసెస్ ట్యాబ్‌లో ఎండ్ ప్రాసెస్ అనే చర్యను ఎంచుకున్నప్పుడు జరిగే క్రియకు ఇది భిన్నంగా ఉంటుంది.

ప్రాసెసెస్[మార్చు]

ప్రాసెసెస్ (ప్రక్రియలు) ట్యాబ్ ద్వారా కంప్యూటర్‌పై అమలు అవుతున్న అన్ని ప్రక్రియలకు సంబంధించిన ఒక జాబితా ప్రదర్శించబడుతుంది. ఇతర ఖాతాల సేవలు మరియు ప్రక్రియలకు సంబంధించిన జాబితా కూడా దీనిలో ప్రదర్శించబడుతుంది. విండోస్ XPకి ముందు వరకు, 15 అక్షరాల కంటే ఎక్కువ పొడవున్న ప్రక్రియల పేర్లు కత్తిరించబడేవి.[2]

జాబితాలోని ఒక ప్రక్రియపై మౌస్ కుడి-వైపు క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియల యొక్క ప్రాధాన్యతను మార్చవచ్చు, అంతేకాకుండా ప్రాసెసర్ సంబంధాన్ని నిర్దేశించేందుకు (ఏ CPU(లు)పై ప్రక్రియను అమలు చేయాలో నిర్దేశించడం) మరియు ప్రక్రియను నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. ఎండ్ ప్రాసెస్ అనే చర్యను ఎంచుకోవడం ద్వారా విండోస్ తక్షణమే సంబంధిత ప్రక్రియను నిలిపివేస్తుంది. "ఎండ్ ప్రాసెస్ ట్రీ" అనే చర్యను ఎంచుకున్నట్లయితే విండోస్ తక్షణమే సంబంధిత ప్రక్రియ మరియు ఈ ప్రక్రియ చేత పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించబడిన ప్రక్రియలన్నీ నిలిపివేయబడతాయి. అప్లికేషన్స్ ట్యాబ్ నుంచి ఎండ్ టాస్క్‌ను ఎంచుకోవడం మాదిరిగా కాకుండా, ఎండ్ ప్రాసెస్‌ను ఎంచుకునే సమయంలో ప్రోగ్రామ్‌కు మూసివేయబడే ముందు దానిని క్రమపరిచేందుకు హెచ్చరిక లేదా అవకాశం ఏదీ ఇవ్వడం జరగదు. ఇదిలా ఉంటే టెర్మినేట్‌ప్రాసెస్‌కు (ప్రక్రియను మూసివేయడానికి) పిలుపునిచ్చిన ఒక ప్రక్రియకు భిన్నంగా ఉండే ఒక భద్రతా సందర్భం పరిధిలో అమలయ్యే ఒక ప్రక్రియకు కిల్ కమాండ్ (ఆదేశం) సౌకర్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది.[3]

డిఫాల్ట్‌గా (స్వయంచాలకంగా) ప్రాసెసెస్ ట్యాబ్‌లో ప్రక్రియ అమలు అవుతున్న వినియోగదారు ఖాతా, CPU పరిమాణం, మరియు ప్రస్తుతం వినియోగించబడుతున్న మెమోరీ పరిమాణం ప్రదర్శించబడతాయి. వ్యూ మెను నుంచి సెలెక్ట్ కాలమ్స్...ను ఎంచుకోవడం ద్వారా అనేక ఇతర కాలమ్‌లు (వరుసలు) ప్రదర్శించబడతాయి.

పెర్ఫామెన్స్[మార్చు]

వ్యవస్థ పనితీరు గురించి, ముఖ్యంగా మొత్తం CPU వినియోగ పరిమాణం మరియు ఎంత మొత్తంలో మెమోరీ ఉపయోగించబడుతుందో వివరాలు వంటి మొత్తం గణాంకాలను పెర్ఫామెన్స్ (పనితీరు) ట్యాబ్ ప్రదర్శిస్తుంది. ఈ రెండు విలువల యొక్క ఇటీవలి వినియోగపు పట్టిక కూడా ప్రదర్శించబడుతుంది. నిర్దిష్ట ప్రదేశాల మెమోరీ గురించి వివరాలు కూడా చూడవచ్చు.

CPU గ్రాఫ్ (రేఖాచిత్రాన్ని) రెండు భాగాలుగా విభజించే ఒక ఆప్షన్ ఉంటుంది; అవి కెర్నెల్ మోడ్ టైమ్ మరియు యూజర్ మోడ్ టైమ్. అనేక డివైస్ డ్రైవర్‌లు (పరికర చోదకాలు) మరియు ఆపరేటింగ్ సిస్టమ్ (నిర్వహణ వ్యవస్థ) యొక్క ప్రధాన భాగాలు కెర్నెల్ మోడ్ (కెర్నెల్ అమరిక) లో అమలవుతాయి, వినియోగదారు అనువర్తనాలు యూజర్ మోడ్ (వినియోగదారు అమరిక) లో అమలవుతాయి. వ్యూ మెను నుంచి షో కెర్నెల్ టైమ్స్ అనే క్రియను ఎంచుకోవడం ద్వారా ఈ ఆప్షన్‌ను ప్రారంభించవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రారంభించినప్పుడు CPU వినియోగ రేఖా చిత్రంలో ఒక పచ్చని మరియు ఒక ఎరుపు ప్రదేశం కనిపిస్తుంది. ఎరుపు ప్రదేశం కెర్నెల్ అమరికలో గడిపిన కాల పరిమాణాన్ని, పచ్చని ప్రదేశం వినియోగదారు అమరికలో గడిపిన కాల పరిమాణాన్ని ప్రదర్శిస్తాయి.

నెట్‌వర్కింగ్[మార్చు]

నెట్‌వర్కింగ్ ట్యాబ్ కంప్యూటర్‌లో ఉన్న ప్రతి నెట్‌వర్క్ అడాప్టర్‌కు సంబంధించిన గణాంకాలను ప్రదర్శిస్తుంది. స్వయంచాలకంగా అడాప్టర్ పేరు, నెట్‌వర్క్ వినియోగ శాతం, లింక్ స్పీడ్ మరియు నెట్‌వర్క్ అడాప్టర్ స్థితితోపాటు, ఇటీవలి కార్యకలాప పట్టిక ప్రదర్శిస్తుంది. వ్యూ మెను నుంచి సెలెక్ట్ కాలమ్స్...ను ఎంచుకోవడం ద్వారా మరిన్ని ఆప్షన్స్ ప్రదర్శించబడతాయి.

యూజర్స్[మార్చు]

ప్రస్తుతం కంప్యూటర్‌పై సెషన్ కలిగివున్న మొత్తం వినియోగదారులను యూజర్స్ ట్యాబ్ ప్రదర్శిస్తుంది. సర్వర్ కంప్యూటర్‌లపై టెర్మినల్ సేవలు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌కు అనుసంధానమై అనేక మంది వినియోగదారులు ఉండవచ్చు. విండోస్ XP నుంచి, ఫాస్ట్ యూజర్ స్విచ్చింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి ఏకకాలంలో కంప్యూటర్‌లోకి ప్రాప్తి పొందిన పలువురు వినియోగదారులు ఉండవచ్చు. ఈ ట్యాబ్ నుంచి వినియోగదారులకు అనుసంధానాన్ని తొలగించడం లేదా లాగ్ ఆఫ్ చేయవచ్చు.

టినీ ఫుట్‌ప్రింట్ అమరిక[మార్చు]

టాస్క్ మేనేజర్ (క్రియా నిర్వాహకి) లో అమల్లో ఉన్న క్రియల యొక్క సమగ్ర వివరాలను ప్రదర్శించే ఒక వినియోగదారు ఇంటర్‌ఫేస్ (అంతర్ముఖం) ఉంటుంది. ఎటువంటి మెను ఆప్షన్స్ లేదా ట్యాబ్‌లు లేకుండానే ఈ అమరిక ద్వారా టాస్క్ మేనేజర్‌లో ఒక ప్రత్యామ్నాయ అంతర్ముఖం ఉంటుంది. ఏ అనువర్తనాలు అమలవుతున్నాయో ఇది ప్రదర్శిస్తుంది మరియు ఇదే సమాచారాన్ని సమగ్ర వివరాలు ప్రదర్శిస్తున్నప్పుడు అప్లికేషన్స్ ట్యాబ్‌లో కూడా చూడవచ్చు. దీనిని టినీ ఫుట్‌ప్రిట్ అమరికగా పిలుస్తారు. టాస్క్ మేనేజర్‌లోని కొన్ని ప్రదేశాల్లో రెండుసార్లు-క్లిక్ (డబుల్ క్లిక్) చేయడం ద్వారా ఒక అమరిక నుంచి మరో అమరికకు మారవచ్చు.[4]

విండోస్ విస్టా మార్పులు[మార్చు]

విండోస్ టాస్క్ మేనేజర్‌ను కొత్త సౌకర్యాలతో విండోస్ విస్టాలో నవీకరించడం జరిగింది, అవి:

 • ప్రస్తుతం అమల్లో ఉన్న సేవలను చూసేందుకు మరియు/లేదా మార్చేందుకు మరియు ఏదైనా సేవను ప్రారంభించేందుకు మరియు నిలిపివేసేందుకు మరియు UAC ఫైల్‌ను మరియు ఒక ప్రక్రియ యొక్క రిజిస్ట్రీ వర్చువలైజేషన్‌‍ను పనిచేయించేందుకు/నిలిపివేసేందుకు ఒక "సర్వీసెస్" ట్యాబ్ ఉంటుంది.
 • పూర్తి పేరు మరియు ప్రక్రియ మార్గం మరియు దాని DEP మరియు వర్చువలైజేషన్ స్థాయిని చూసేందుకు కొత్త "డిస్క్రిప్షన్" వరుస ద్వారా వీలు కల్పిస్తుంది.
 • ఏదైనా ప్రక్రియపై కుడివైపు-క్లిక్ చేయడం ద్వారా, నేరుగా అమలు చేయదగిన ప్రక్రియ ధర్మాలు (ప్రాపర్టీస్) లేదా ప్రక్రియ ఉన్న డైరెక్టరీ (ఫోల్డర్) ని తెరవవచ్చు.
 • ఇతర అనుసంధాన వినియోగదారులను లాగాఫ్ చేయడం లేదా సందేశాలు పంపడం వంటి కొన్ని క్రియలు నిర్వహించేందుకు తప్పనిసరిగా అడ్మినిస్ట్రేటివ్ హక్కుల పరిధిలో అమలు చేయాల్సి ఉండటంతో, రిమోట్ మూలాలు లేదా వైరస్‌ల నుంచి జరిగే దాడికి టాస్క్ మేనేజర్ తక్కువ దుర్బలత్వాన్ని కలిగివుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ (అనుమతి) హక్కులు మరియు ఈ ప్రత్యేక అనుమతులను ఇచ్చేందుకు వినియోగదారు తప్పనిసరిగా "ప్రాసెసెస్" ట్యాబ్‌లోకి వెళ్లి, "షో ప్రాసెసెస్ ఫ్రమ్ అదర్ యూజర్స్"ను క్లిక్ చేయాలి. అందరు వినియోగదారుల నుంచి ప్రక్రియలను ప్రదర్శించేందుకు అడ్మినిస్ట్రేటర్‌లతోసహా వినియోగదారులందరూ ఒక UAC ప్రేరేపణను అంగీకరించాలి, UAC నిషిద్ధపరిచినప్పుడు మాత్రం ఇటువంటి అవసరం ఉండదు. అడ్మినిస్ట్రేటర్‌గా లేని వినియోగదారులు ముందుకు వెళ్లేందుకు ప్రేరేపించబడినప్పుడు, వారు తప్పనిసరిగా అడ్మినిస్ట్రేటర్ ఒక పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సివుంటుంది.
 • ఏదైనా అమల్లో ఉన్న ప్రక్రియపై కుడివైపు-క్లిక్ చేయడం ద్వారా, ఒక డంప్‌ను సృష్టించడం సాధ్యపడుతుంది. ఒక అనువర్తనం లేదా ఒక ప్రక్రియ స్పందించినప్పుడు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది, అందువలన మరింత సమాచారం పొందేందుకు డంప్ ఫైల్‌ను ఒక డీబగర్‌లో తెరవవచ్చు.
 • షట్‌డౌన్ మెనులో స్టాండ్‌బై, హైబర్నేట్, టర్న్ ఆఫ్, రీస్టార్ట్, లాగాఫ్ ఉంటాయి, స్విచ్ యూజర్ ఆప్షన్ తొలగించబడి ఉంటుంది.
 • పెర్ఫామెన్స్ ట్యాబ్, సిస్టమ్ అప్‌టైమ్‌ను ప్రదర్శిస్తుంది.

భద్రతా సమస్యలు[మార్చు]

కంప్యూటర్ వైరస్‌లు మరియు ఇతర మాల్వేర్ రకాలకు టాస్క్ మేనేజర్ ఒక సాధారణ లక్ష్యంగా ఉంటుంది: ఎక్కువగా మాల్వేర్, టాస్క్ మేనేజర్ ప్రారంభమైన వెంటనే మూసివేస్తుంది, తద్వారా ఇది వినియోగదారులకు కనిపించకుండా ఉంటుంది. జోటోబ్ మరియు స్పైబోట్ వంటి వార్మ్‌లు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి, ఉదాహరణకు.[5] గ్రూప్ పాలసీని ఉపయోగించి, టాస్క్ మేనేజర్‌ను నిర్వీర్యపరచడం సాధ్యపడుతుంది. అనేక రకాల మాల్వేర్, రిజిస్ట్రీలో కూడా ఈ విధాన అమరికను క్రియాశీల పరుస్తుంది రూట్‍కిట్‌లు టాస్ మేనేజర్‌లో కనిపించకుండా తమనుతాము నియంత్రించుకుంటాయి, అందువలన దీనిని ఉపయోగించుకొని అవి వాటి దిశ మరియు నిలిపివేతలను అడ్డుకుంటాయి.

పరిభాష[మార్చు]

అప్లికేషన్స్ ట్యాబ్[మార్చు]

 • టాస్క్ మేనేజర్ అనువర్తనం లేదా క్రియను ఒక నిర్దిష్ట త్రెడ్‌కు చెందిన విండోగా గుర్తిస్తుంది. అన్ని విండోలు ఈ విధంగా ప్రదర్శించబడవు. ఉదాహరణకు, మోడల్ డైలాగ్‌లు (ఒక ప్రత్యేక త్రెడ్ లేని విండోలు) కనిపించవు. అందవలన అనేక డైలాగ్‌లు మరియు దోష సందేశాలు కనిపించవు. మొదటి వరుసలో ఉపయోగించే టాస్క్ (క్రియ) అనే పదం గందరగోళం కలిగిస్తుంది, ఎందుకంటే అక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై టాస్క్‌లు (క్రియలు) యొక్క స్పష్టమైన భావం ఉండదు, కాలానుగుణంగా అమలయ్యేందుకు టాస్క్ షెడ్యూలర్‌లో అమర్చిన క్రియలు మాత్రమే కనిపిస్తాయి.
 • స్టేటస్ వరుస ఒక విండోకు చెందిన త్రెడ్ యొక్క స్థితిని విండోస్ సందేశ సంవిధానం ప్రకారం ప్రదర్శిస్తాయి. ఒక అనువర్తనం యొక్క స్థితి అమలువుతున్నట్లు కనిపించినప్పుడు, విండోస్ సందేశాలకు త్రెడ్ బాధ్యత వహిస్తుందని ఇది సూచిస్తుంది. నాట్ రెస్పాడింగ్ (స్పందించడం లేదు) అనే స్థితి కనిపించినప్పుడు, ఆ సమయంలో విండోస్ సందేశాలకు త్రెడ్ బాధ్యత వహించడం లేదని అర్థం చేసుకోవచ్చు. I/O విజ్ఞప్తులు లేదా అమల్లోని గణన-కు చెందిన సంకేతం వంటి ఇతర సందర్భాలకు ఇది వేచివున్నట్లు సూచించబడుతుంది (కొన్నిసార్లు "బ్లాక్డ్" (నిషిద్ధపరిచినట్లు) సూచించబడుతుంది).

ప్రాసెసెస్ ట్యాబ్[మార్చు]

 • ప్రాసెసెస్ ట్యాబ్‌పై మెమోరీ యూసేజ్ వరుస వాస్తవానికి ప్రక్రియ యొక్క పనిచేస్తున్న సమితి. ప్రక్రియకు దాని యొక్క పనిచేస్తున్న సమితిపై అతికొద్ది ఉంటుంది లేదా ఎటువంటి నియంత్రణ ఉండదు, ఒక ప్రక్రియ ఎంత మెమోరీని ఉపయోగిస్తుందో గుర్తించేందుకు ఈ వరుస ఉపయోగపడదు.
 • VM సైజ్ వరుస (డిఫాల్ట్‌గా ఇది కనిపించదు) అనేది ప్రక్రియ ఉపయోగించే వాస్తవ మెమోరీ పరిమాణం కాదు; ఇది వాస్తవానికి ప్రక్రియ యొక్క స్వీయ బైట్‌లు.
 • రెండు-అంకెల పద్ధతిలో సరిపోయే విధంగా CPU వినియోగాన్ని తగ్గించడం ద్వారా CPU వరుసను గణించవచ్చు, అయితే ఇది సరైన గణన కాదు. ఒక ప్రక్రియ 0.9% CPUను వినియోగిస్తున్నట్లయితే, అది టాస్క్ మేనేజర్‌లో 00గా సూచించబడుతుంది.
 • సిస్టమ్ ఐడల్ ప్రాసెస్ అనేది విండోస్ లోడ్ అయినప్పుడు సృష్టించబడ మొట్టమొదటి ప్రక్రియ, దీనికి ఎల్లప్పుడూ ప్రాసెస్ ID 0 ఉంటుంది. వ్యవస్థలోని ప్రతి CPUకు సిస్టమ్ ఐడల్ ప్రాసెస్‌లో ఒక త్రెడ్ ఉంటుంది. CPUకు చేసేందుకు మరే పని లేనప్పుడు, విండోస్ షెడ్యూలర్ అమలు కోసం CPU సంబంధిత ఐడల్ త్రెడ్‌ను ఎంచుకుంటుంది. ఈ ప్రక్రియలో మొత్తం CPU సమయం ఉపయోగించని మొత్తం CPU సమయాన్ని కూడా చూపిస్తుంది. విండోస్ NT యొక్క ప్రారంభ వెర్షన్‌లలో ఐడల్ త్రెడ్‌లు ప్రధానంగా ఒక "హాల్ట్ (విశ్రాంతి)" ఆదేశం యొక్క కొద్ది ఐడల్ లూప్‌లుగా ఉంటాయి; తరువాతి విండోస్ వెర్షన్‌లలో, ఐడల్ త్రెడ్‌లు CPU శక్తి నిర్వహణ యొక్క మరింత అధునాతన పద్ధతులను ఉపయోగించారు.

మెనులో "వ్యూ", తరువాత "సెలెక్ట్ కాలమ్స్..."లను ఎంచుకోవడం ద్వారా వినియోగదారు లేయవుట్‌ను అమర్చవచ్చు. ముప్పై వరకు వేర్వేరు వరుసలు (విండోస్ వెర్షన్ ఆధారంగా) ప్రదర్శించేలా చేయవచ్చు, వివిధ మెమోరీ మరియు I/O ఆప్షన్స్ మరియు ఉపయోగంలో ఉన్న హాండిళ్లు మరియు త్రెడ్‌ల సంఖ్యతో సహా ప్రదర్శించేలా అమర్చవచ్చు.

పెర్ఫామెన్స్ ట్యాబ్[మార్చు]

 • CPU గ్రాఫ్‌పై ఇంటరప్ట్స్ మరియు DPC సమయం ప్రదర్శించబడతాయి, సిస్టమ్ పూర్తిగా నిష్క్రియాత్మకంగా ఉన్నట్లు ప్రాసెసెస్ ట్యాబ్ చూపిస్తున్నప్పుడు పెర్ఫామెన్స్ ట్యాబ్ గణనీయమైన CPU వినియోగాన్ని ప్రదర్శిస్తే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.
 • విండోస్ విస్టాకు ముందు, రెండో గ్రాఫ్‌కు PF యూసేజ్ మరియు పేజ్ ఫైల్ యూజేజ్ హిస్టరీ అనే పేర్లు ఉన్నాయి, వాస్తవానికి ఇది కమిట్ ఛార్జ్ మరియు కమిట్ ఛార్జ్ హిస్టరీకి ప్రాతినిధ్యం వహిస్తుంది.
 • విండోస్ మెమోరీ మేనేజర్ ఒక పంచబడిన మెమోరీ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఉత్తమ పనితీరును సాధించేందుకు భౌతిక మెమోరీని అనుకూలపరుస్తుంది. పలు ప్రక్రియలు ఉపయోగించుకునే DLLల వంటి మ్యాప్ చేసిన ఫైల్‌లు భౌతిక మెమోరీలో ఏక సమయంలో గుర్తించబడతాయి, తరువాత అన్ని ప్రక్రియలకు పంచబడతాయి. ప్రతి ప్రక్రియకు ప్రత్యేకంగా మోమోరీ వినియోగాన్ని లెక్కిస్తున్నప్పుడు, అన్ని ప్రక్రియా వర్కింగ్ సెట్‌ల మొత్తం సాధారణంగా అమల్లో ఉన్న వాస్తవ మోమోరీ కంటే ఎక్కువగా ఉంటుంది.

విండోస్ 9x కింద క్రియలు[మార్చు]

విండోస్ 9xలో కంట్రోల్+ఆల్ట్+డిలీట్ నొక్కినప్పుడు ఒక క్లోజ్ ప్రోగ్రామ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అంతేకాకుండా, విండోస్ 9xలో టాస్క్స్ (TASKMAN.EXE) అని పిలిచే ఒక ప్రోగ్రామ్, విండోస్ డైరెక్టరీలో ఉంటుంది. TASKMAN.EXE మూలాధారంగా ఉంటుంది, దీనిలో కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. విండోస్ టాస్క్ మేనేజర్‌ను పోలిన ప్రక్రియ మరియు నెట్‌వర్క్ పర్యవేక్షణ అమర్పులు విండోస్ 9xలో సిస్టమ్ మోనిటర్ సౌకర్యం కలిగివుంటుంది. (అంతేకాకుండా, ఎక్స్‌ప్లోరర్ ప్రక్రియ నిలిపివేయబడినప్పుడు టాస్క్స్ ప్రోగ్రామ్‌ను డెస్క్‌టాప్‌పై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు.)

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రాసెస్ ఎక్స్‌ప్లోరర్
 • యాక్టివిటీ మోనిటర్

సూచనలు[మార్చు]

 1. కంప్యూటర్ హొప్ వెబ్ సైట్.
 2. మాజిక్ 15తో గెట్‌ప్రాసెసెస్‌బై‌నేమ్ విత్ విండోస్ 2000[permanent dead link]
 3. http://support.microsoft.com/kb/155075
 4. "Task Manager Menu Bar and Tabs Are Not Visible", Help and Support, Microsoft, 2007-05-07, retrieved 2007-08-07
 5. టాస్క్ మేనేజర్, MSCONFIG, ఆర్ REGEDIT డిజప్పియర్స్ వైల్ ఓపెనింగ్

బాహ్య లింకులు[మార్చు]

మూస:Windows Components