వికాస్ స్వరూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vikas Swarup
VikasSwarup.jpg
జననం: 23 జూన్ 1961, 1962
వృత్తి: Novelist, Civil servant
జాతీయత:India భారత
శైలి:Realism
వెబ్‌సైటు:http://www.vikasswarup.net/index_files/page0001.htm

వికాస్ స్వరూప్ (హిందీ: विकास स्वरूप; ఉర్దు: ترقی ضابطہ), భారతదేశానికి చెందిన ఒక నవల రచయిత మరియు దూత. ఈయన టర్కీ, యునైటెడ్ స్టేట్స్, ఇథియోపియా, గ్రేట్ బ్రిటిన్ మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలో పనిచేసారు. అతను రచించిన Q & A మరియు సిక్స్ సస్పేక్ట్స్ అనే నవలలు చాలా ప్రసిద్ధి చెందాయి.

ప్రారంభ జీవితం[మార్చు]

వికాస్ స్వరూప్, ఉత్తర ప్రదేశ్ లోని అల్లహాబాద్ లో ఒక న్యాయవాదుల కుటుంబములో జన్మించారు. అతను తన పాఠశాల జీవితాన్ని బోయ్స్ హై స్కూల్ & కాలేజీ, అలహాబాద్ లో గడిపారు. పై చదువులను అలహాబాద్ విశ్వవిద్యాలయములో కొనసాగించారు. అక్కడ మనస్తత్వ శాస్త్రం, చరిత్ర మరియు తత్వశాస్త్రం పాఠములు చదివాడు.

వృత్తి జీవితం[మార్చు]

వికాస్ స్వరూప్,IFSలో 1986లో చేరాడు.

ప్రస్తుతం అతను జపాన్ లో ఒసాకా-కోబేకు భారతదేశము యొక్క కాన్సుల్-జనరల్ గా, ఆగుస్ట్ 2009 నుంచి వ్యవహరిస్తున్నారు. గతములో అతను అంకారా, వాషింగ్టన్ DC, అడ్డిస్ అబాబా, లండన్ మరియు ప్రేతోరియా లలో పనిచేసారు.

అతని మొదటి నవల అయిన Q & A, ముంబై లోని ఒక నిరుపేద వైటర్, చరిత్రలోనే అతి పెద్ద క్విజ్ షో యొక్క విజేతగా ఏ విధంగా మారాడో వివరిస్తుంది. భారతదేశము మరియు విదేశాలలో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు పొందిన ఈ నవల 43 వివిధ భాషలలో అనువదించబడింది. ఈ పుస్తకము కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ వారిచే ఉత్తమ తొలి పుస్తకముగా ఎంపిక చేయబడింది. ఇది దక్షిణ ఆఫ్రికా యొక్క ఎక్స్క్లూసివ్ బుక్స్ బోకే ప్రైజ్ 2006ను మరియు 2007 పారిస్ బుక్ ఫీర్ లో ప్రి గ్రాండ్ పబ్లిక్ ను గెలుచుకుంది. ఈ నవల హీత్రూ ట్రేవల్ ప్రాడక్ట్ అవార్డ్ 2009లో ఉత్తమ ట్రేవల్ రీడ్ (కల్పనాకథ) గా ఎన్నుకోబడింది.

ఈ నవల ఆధారంగా తీసిన ఒక BBC రేడియో నాటకం, సోనీ రేడియో అకాడెమి అవార్డ్స్ 2008లో మరియు IVCA క్లారియాన్ అవార్డు 2008 లోనూ ఉత్తమ నాటకంగా బంగారు పతకం గెలిచింది. ఆడియో పుస్తకాన్ని హర్పర్ కాలిన్స్ ప్రచురించారు. దీనికి కెర్రీ షెల్ స్వరం అందించారు. ఉత్తమ కల్పనాకథ ఆడియో పుస్తకముకు ఇచ్చే ఆడీ బహుమతిని ఈ ఆడియో పుస్తకం గెలిచింది. UKకు చెందిన ఫిలిం4 చలనచిత్ర హక్కులను కొని, డాని బోయిల్ దర్శకత్వంలో, స్లండాగ్ మిలియనీర్ అనే పేరుతొ చలనచిత్రం విడుదల చేసింది. ముందుగా USలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. టొరోంటో చలనచిత్రోత్సవం, ఈ చిత్రం పీపిల్స్ చాయిస్ అవార్డ్ ను గెలిచింది. బ్రిటిష్ ఇండిపెన్డెంట్ ఫిలిం అవార్డ్స్ 2008లో మూడు అవార్డులను గెలిచింది (ఉత్తం చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు అత్యుత్తమ నూతన నటుడు). నేషనల్ బోర్డ్ అఫ్ రివ్యూ స్లండాగ్ మిలియనీర్ ను 2008కు ఉత్తమ చిత్రంగా ఎన్నుకున్నారు. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ లో ఆరు ప్రతిపాదనలలో ఐదింటిని ఈ చిత్రం గెలిచింది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో, ఉత్తమ దర్శకుడు, చిత్రం, స్క్రీన్ ప్లే & స్కోర్ మరియు ఏడు BAFTA అవార్డ్స్ లను గెలిచింది. ఈ చిత్రానికి 10 ఆస్కార్ ప్రతిపాదనలు లభించాయి. వాటిలో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడుతో సహా 8ని గెలిచింది. ది NY టైమ్స్ నివేదిక నుండి: ఈ చిత్రము నుండి ఏ నటుడు బహుమతులకు ఎన్నుకోబడలేదు కాని పై స్థాయి అవార్డులను మినహాయించి ఇతర అవార్డులలో అనేక అవార్డులను ఈ చిత్రం గెలిచింది. వాటిలో సినిమాటోగ్రఫి, సౌండ్ మిక్సింగ్, స్కోర్ మరియు చిత్ర ఎడిటింగ్ విభాగాలు ఉన్నాయి. 2004లో The Lord of the Rings: The Return of the King అనే చిత్రం 11 అవార్డులు గెలిచిన తరువాత, అత్యదిక ఆస్కార్లు గెలిచింది స్లండాగ్ చిత్రమే. స్లండాగ్ 8 ఆస్కార్లు గెలిచింది.[1] ఈ చిత్రం UKలో 2009 జనవరి 9న మరియు భారతదేశంలో జనవరి 23న విడుదల చేయబడింది.

వికాస్ స్వరూప్ రచించిన రెండవ నవల అయిన సిక్స్ సస్పేక్ట్స్ ను ట్రాన్స్ వరల్డ్ సంస్థ ప్రచురించింది. ఇది 2008 జూలై 28న విడలయింది. ఈ నవల 25 కంటే ఎక్కువ ఇతర బాషలలో అనువాదించబడుతున్నది. ఈ నవల యొక్క US వెర్షన్ ను, మినోటార్ బుక్స్ ప్రచురించింది. ఈ నవలను చిత్రంగా అనుకరించడానికి BBC నిర్ణయించింది. ట్రైన్స్పాటింగ్, షాలో గ్రేవ్, ది బీచ్ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రచించిన జాన్ హాడ్జ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. స్టార్ ఫీల్డ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

స్వరూప్ రచించిన ‘ఎ గ్రేట్ ఈవంట్’ అనే లఘు కథ, ‘ది చిల్రెన్స్ అవర్స్: స్టోరీస్ అఫ్ చైల్డ్ హుడ్’ అనే బాల్యం గురించిన కథమాలలో ప్రచురించబడింది. దీని ఉద్దేశం, సేవ్ ది చిల్రన్ కు సహాయం చేయడం మరియు పిల్లల పై హింసకు వ్యతిరేకంగా పోరాడడం.

ఆక్స్ ఫోర్డ్ లిటెరరి ఫెస్టివల్, టురిన్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్, ఆక్లాండ్ రైటర్స్ కాన్ఫెరెన్స్, సిడ్నీ రైటర్స్ ఫెస్టివల్, న్యూ ఢిల్లీలో కీతాబ్ ఫెస్టివల్, ఫ్రాన్స్ లో సెయింట్ మాలో ఇంటర్నేషనల్ బుక్ & ఫిలిం ఫెస్టివల్, జోహన్నేస్బర్గ్ లోని యునివర్సిటీ అఫ్ ది విట్వతెర్స్రాండ్ లోని 'వర్డ్స్ ఆన్ వాటర్' లిటెరరి ఫెస్టివల్, భారతదేశములోని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ మరియు దక్షిణాఫ్రికాలోని ఫ్రాన్స్చ్చోక్ లిటెరరి ఫెస్టివల్ లలో వికాస్ స్వరూప్ పాల్గొన్నారు. 2009లో, 33వ కైరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఇంటర్నేషనల్ కాంపెటిషణ్ ఫర్ ఫీచర్ డిజిటల్ ఫిల్మ్స్ కు జూరీ సభ్యుడుగా ఆయన పాల్గొన్నారు.

TIME, ది గార్డియన్, ది టెలిగ్రాఫ్ (UK), అవుట్లుక్ పత్రిక (ఇండియా) మరియు లిబెరేషణ్ (ఫ్రాన్స్) లలో ఆయన రచనలు రాశారు.

2010 సెప్టెంబర్ 21న, దక్షిణాఫ్రికా లోని అతిపెద్ద విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే అతిపెద్ద దూరవిద్యా సంస్థలలో ఒకటైన యునివర్సిటీ అఫ్ సౌత్ ఆఫ్రికా (UNISA), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (హోనిరిస్ కాసా) డిగ్రీని ప్రిటోరియాలో జరిగిన ఒక పట్టబద్రులకు పట్టా బహుకరించే సమావేశంలో స్వరూప్ కు బహుకరించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వికాస్ స్వరూప్ అపర్ణను వివాహం చేసుకొన్నారు. వారికి ఆదిత్య, వరుణ్ అని ఇద్దరు కుమారులు.[2]

గ్రంథ పట్టిక[మార్చు]

  • Q & A
  • సిక్స్ సస్పెక్ట్స్

లఘు కథలు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. "ఆస్కార్ సేరిమని లో ‘స్లండాగ్’ వంటి రాత్రి", మైకేల్ సైప్లీ మరియు డేవిడ్ కర్ చే, ది న్యూ యార్క్ టైమ్స్ , ఫెబ్. 23, 2009. 2-23-09న తీయబడింది .
  2. http://www.guardian.co.uk/books/2009/jan/16/danny-boyle-india

భేటీలు మరియు కథనాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]