వికీపీడియా:ఆంధ్ర లొయోలా కళాశాలలో అధ్యాపకులతో కార్యక్రమం ముసాయిదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • స్పెసిమన్లు, ప్రయోగాలు, ఇతర అకడమిక్ అంశాల ఆర్కైవ్ లు స్వేచ్ఛా లైసెన్సులోకి విడుదల చేయడం - కాలికట్ మెడికల్ కళాశాల ప్రాజెక్టుపై ఒక కేస్ స్టడీ
    • ప్రెజంటేషన్
  • టెరిషరీ రీసోర్సులు (విజ్ఞాన సర్వస్వ పరమైన వ్యాసాలు) సృష్టించడం మరియు అది మీ మౌలిక పరిశోధనల్లో, పరిశోధక వ్యాసాల రచనల్లో శైలి, స్పష్టత మెరుగుపరిచేందుకు ఎలా ఉపకరిస్తుంది.
    • కార్యశాల
    • వీలైనంత వరకూ పాల్గొన్నవారికి అవసరమయ్యే మూలాలను అందించి వారితో వ్యాసాలు అభివృద్ధి చేయించడం జరుగుతుంది.
  • స్వేచ్ఛా లైసెన్సుల్లో లభించే విజ్ఞాన శాస్త్ర పరమైన ఆకరాలను డిజిటల్ రీసోర్సులు అభివృద్ధి చేసేందుకు ఉపయోగించడం.
    • కార్యశాల
    • కామన్స్, వికీ స్పీసీస్ వంటి ప్రాజెక్టుల్లో లభించే సమాచారాన్ని, ఫోటోలను తెలుగు వికీపీడియా అభివృద్ధికి వినియోగించడంపై కార్యశాల.
  • కామన్స్, తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి తమ బోధనా కార్యకలాపాల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా ఎలా కృషిచేయవచ్చని భావిస్తున్నారంటూ పాల్గొన్నవారిని ప్రశ్నించే ఇంటరాక్టివ్ కార్యక్రమం.
  • తమ వద్ద నున్న ఫోటోలు, ఆర్కైవుల్లో ఏవి కామన్స్ లోకి చేర్చి, వికీపీడియాను మెరుగుపరచ వచ్చన్న చూసి, సేకరించేలా యాక్టివిటీ
  • విద్యా బోధనా ఉపకరణంగా వికీపీడియా: విద్యార్థుల మదింపులో వికీపీడియాను ఉపయోగించడం.
    • ప్రెజంటేషన్
    • ప్రస్తుతం క్రైస్ట్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర లొయోలా కళాశాల వంటిచోట్ల సాగుతున్న వికీపీడియా విద్యా కార్యక్రమం గురించి వివరించి, వారి విద్యాబోధనలోనూ వికీపీడియా రచనను ఎలా వినియోగించుకోవచ్చు అన్న అంశం తెలియజేయడం.
  • అల్లుకున్న విజ్ఞాన వలయం - స్వేచ్ఛా లైసెన్సుల్లో లభించే పుస్తకాలను మూలాలుగా వాడి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేయడం.
    • కార్యశాల
    • తెలుగు వికీసోర్సులో పుస్తకాలను వినియోగించి తెలుగు వికీపీడియాలో వ్యాసాలు అభివృద్ధి చేయించడం.
  • స్వేచ్ఛా అంతర్జాలంలోకి పుస్తక విజ్ఞానం - స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడుదల చేసి, వికీసోర్సులోకి విలువైన విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అందించడం.