వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 25వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈము

ఈము (ఆంగ్లం Emu) ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు. ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరంపై దట్టంగా ఈకలు ఉంటాయి. ఇవి పొడుగాటి కాళ్ళతో 6 అడుగుల ఎత్తు, 45-50 కి.గ్రా. బరువుంటాయి. ఇవి 25-30 సంవత్సరాలు జీవిస్తాయి మరియు శాకాహారులు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. వీటిని మాంసం, నూనె మరియు చర్మం కోసం మనదేశంలో కూడా పెంచుతున్నారు. ఈము పక్షులు రేటైట్ జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి.

(ఇంకా…)