వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 30వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దబ్బల రాజగోపాల్ రెడ్డి

దబ్బల రాజగోపాల్ (రాజ్ రెడ్డి) (జననం: 1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించాడు. గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు మరియు కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నాడు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి గా గుర్తింపు పొందాడు. ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం నందు ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడినది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించాడు. విద్యార్థులకు ఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తొలి ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కు ఛైర్మన్ మరియు ఛాన్సిలర్ గా వ్యవహరించాడు. 1999 నుండి 2001 లో యేర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా ఉన్నాడు.

(ఇంకా…)