వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 45వ వారం
| విస్కాన్సిన్ |
|---|
విస్కాన్సిన్ అనేది అమెరికాలోని ఒక రాష్ట్రం. ఇది అమెరికాలోని ఉత్తర-మధ్య ప్రాంతంలో ఉన్న గ్రేట్ లేక్స్ ప్రాంతాలలో ఉంది. దీనికి పశ్చిమసరిహద్దులో మిన్నసోటా, నైరుతిసరిహద్దులో అయోవా, దక్షిణసరిహద్దులో ఇల్లినాయిస్, తూర్పుసరిహద్దులో మిచిగాన్ సరస్సు, ఈశాన్యసరిహద్దులో మిచిగాన్, ఉత్తరసరిహద్దులో సుపీరియర్ సరస్సు ఉన్నాయి. వైశాల్యపరంగా దేశమొత్తం విస్తీర్ణంలో 23 వ అతిపెద్ద రాష్ట్రంగానూ అత్యధిక జనాభా కలిగిన 20 వ రాష్ట్రంగానూ ఉంది. రాష్ట్ర రాజధాని మాడిసన్, అతిపెద్ద నగరం మిల్వాకీ మిచిగాన్ సరస్సు పశ్చిమతీరంలో ఉంది. రాష్ట్రం 72 కౌంటీలుగా విభజించబడింది. విస్కాన్సిన్ రాష్ట్రం భౌగోళికంగా వైవిధ్యమైనది. మంచుయుగంలో హిమానీనదాలు డ్రిఫ్ట్‌లెస్ ఏరియాను మినహాయించి మిగిలిన ప్రాంతం మొత్తాన్ని ప్రభావితం చేసాయి. రాష్ట్రంలోని పశ్చిమ భాగాన్ని ఉత్తర పర్వతప్రాంతాలు, పశ్చిమ ఎగువభూములు, మద్య మైదానప్రాంతాలు ఆక్రమించాయి. మిచిగాన్ సరస్సు ఒడ్డుకు లోతట్టు ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. గ్రేట్ లేక్స్ తీరప్రాంతం పొడవులో విస్కాన్సిన్ తీరప్రాంతం రెండవ స్థానంలో (ప్రథమ స్థానంలో మిచిగాన్ ఉంది) ఉంది.
19-20 వ శతాబ్దాల ప్రారంభంలో ఈ రాష్ట్రంలోకి చాలా మంది యూరోపియన్ పౌరులు ప్రవేశించి స్థావరాలు ఏర్పరచుకున్నారు.
|
