Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 47వ వారం

వికీపీడియా నుండి
వీరపాండ్య కట్టబ్రహ్మన

వీరపాండ్య కట్టబ్రహ్మన (కట్టబొమ్మన్, జగవీర పాండ్య సుబ్రహ్మణ్య కట్టబొమ్మన్) 18శతాబ్దానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఇతను పాలేగార్లలో ఒకడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని కాదని వారికి విరుద్ధంగా తిరుగుబాటు చేసాడు. ఇతడిని 39 ఏళ్ళ వయస్సులో సా.శ. 1799లో అక్టోబరు 16వ తేదీన బ్రిటిష్ వారు బంధించి ఉరి తీసారు. ఇతను తెలుగు మాట్లాడే రాజకంబళం నాయకర్ తెగలో జన్మించాడు. రాజకంబళంలో తొక్లగొల్ల శాఖకి చెందినవారు. రాజకంబళం అంటే తమిళనాడులో స్థిరపడ్డ గొల్లవారు. వీరిని యాదవ నాయుడు అంటారు. విజయనగర సామ్రాజ్య కాలం లో కొందరు గుత్తి, బళ్లారి, రాయలసీమ ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి కొందరు దొడ్డి గొల్ల (యాదవ) కులస్థులు తమిళనాడు వలసపోయారు . వారిని దొడ్డియ నాయకర్‌గా మొదట పిలిచారు. కొన్ని సంవత్సరాల తరువాత దొడ్డియ నాయకర్ అనే పేరు తొట్టియా నాయకర్ అయింది. ఆలా వీరిని రజకంబాల నాయకర్ లేక తొట్టియా నాయకర్ అని పిలుస్తారు. అళగియ వీరపాండ్యపురం (ప్రస్తుత ఒట్టపిడారం) ను పాలించిన జగవీరపాండ్యన్ (రాజకంబళ నాయక రాజవంశం) మండలిలో మంత్రిగా ఉన్న జెట్టిబొమ్ము అప్పటి తెలుగు ప్రాంతమైన బళ్ళారి నుంచి వచ్చాడు. తెలుగులో వీరత్వం అనే అర్థం వచ్చే జెట్టిబొమ్ము అనే పదం ఆ తర్వాత కట్టబొమ్ముగా మారి తమిళంలో కట్టబొమ్మన్‌గా మారింది. జగవీర పాండ్యన్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించిన మొదటి (ఆది) కట్టబొమ్మన్‌ను కట్టబొమ్మన్ అని పిలుస్తారు. అతను బొమ్మన్ కుటుంబానికి మొదటి బొమ్మన్.
(ఇంకా…)