Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2026 17వ వారం

వికీపీడియా నుండి
భారతీయ అంతరిక్ష స్థావరం

భారతీయ అంతరిక్ష స్థావరం (భారతీయ అంతరిక్ష స్టేషన్ - BAS) అనేది ఇస్రో నిర్మించి, నిర్వహించాలని తలపెట్టిన మాడ్యులార్ అంతరిక్ష కేంద్రం. ఈ అంతరిక్ష కేంద్రం 52 టన్నుల బరువుతో, భూమి నుండి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు 3–6 నెలల పాటు ఉండగలరు. మొదట ఈ కేంద్రాన్ని 2030 నాటికి పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే, గగన్‌యాన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగాను, భారతదేశంలో COVID-19 మహమ్మారి కారణం గానూ ఇది 2035 కి వాయిదా పడింది. మొదటి మాడ్యూల్‌ను 2028 లో LVM3 వాహనం మీద ప్రయోగించబడతాయని, మిగిలిన మాడ్యూళ్ళను 2035 నాటికి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్‌లో ప్రయోగించబడతాయనీ 2023 డిసెంబరు నాటికి భావించారు
(ఇంకా…)