వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2026 34వ వారం
| జాజికాయ |
|---|
జాజికాయ అనేది మిరిస్టికా జాతికి చెందిన చెట్ల విత్తనం, లేదా విత్తనం నుండి పొందిన పొడ. ఇది ఒక సుగంధ ద్రవ్యం. సువాసనగల జాజికాయ అనేది ముదురు ఆకులతో కూడిన సతత హరిత వృక్షం. దీని పండ్ల నుండి రెండు సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తారు. ఒకటి విత్తనం నుండి వచ్చే జాజికాయ, మరొకటి విత్తనాన్ని కప్పిఉంచే పొరనుంచి వచ్చే జాపత్రి. వాణిజ్యపరంగా ఉత్పత్తి అయ్యే జాజికాయ నూనె, వెన్నలకు కూడా ఇదే మూలం. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్ లోని బండా దీవులు జాజికాయ, జాపత్రి ఉత్పత్తికి ప్రధానమైనవి. ఇక్కడే నిజమైన జాజికాయ చెట్టు స్థానికంగా పెరుగుతుంది. ఆహారపు సుగంధ ద్రవ్యాలుగా సాధారణంగా ఉపయోగించే జాజికాయ, జాపత్రిలను వాటి మానసిక, కామద్దీపక ప్రభావాల కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. అయితే దీనికి వైద్యపరమైన ఆధారాలు లేవు. అధిక మోతాదులో తీసుకుంటే తీవ్రమైన సైకోసిస్ తో పాటు గర్భధారణ, మానసిక పరిస్థితుల సమయంలో తీవ్రమైన విష ప్రభావాలను కలిగిస్తాయి.
జాజికాయ య్యూస్ అని పిలవబడే టోర్రేయా జాతికి చెందిన కోనిఫెర్‌లు కూడా ఒకే విధమైన రూపాన్ని కలిగి తినదగిన విత్తనాలను కలిగి ఉంటాయి. కానీ వీటికి జాజికాయతో దగ్గరి సంబంధం లేదు. వీటిని సుగంధ ద్రవ్యంగా ఉపయోగించరు.
|
