Jump to content

వికీపీడియా:ఎడిటింగు పద్ధతులు, ఎడిటర్ల రకాలు

వికీపీడియా నుండి

వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు రెండు పద్ధతులున్నాయి. ఒకటి మూలపాఠ్యాన్ని సవరించడం, రెండవది రిచ్‌టెక్స్టు ఎడిటింగు. మూలపాఠ్యాన్ని ఇంగ్లీషులో సోర్స్ అంటారు. బ్రౌజరులో వెబ్‌పేజీని చూపించడానికి హెచ్‌టిఎమ్‌ఎల్ మార్కప్ భాష ఉన్నట్లే, బ్రౌజరులో వికీపీడియా పేజీని చూపించడానికి వికీటెక్స్టు మార్కప్ భాష ఉంది. హెచ్‌టిఎమ్‌ఎల్ భాషను సరళీకరించి సామాన్య వాడుకరులు కూడా రాయగలిగే విధంగా వికీటెక్స్టు మార్కప్‌ను రూపొందించారు. ఉదాహరణకు

  • <a href="https:/ /te.wikipedia.org/wiki/నందమూరి_తారక_రామారావు">నందమూరి తారక రామారావు</a> అనే క్లిష్టమైన హెచ్‌టిఎమ్‌ఎల్ మార్కప్‌ను వికీటెక్స్టులో [[నందమూరి తారక రామారావు]] అని రాస్తే సరిపోతుంది.
  • నందమూరి తారక రామారావు అనే పేరును బొద్దుగా చూపించేందుకు, హెచ్‌టిఎమ్‌ఎల్ భాషలో <b>నందమూరి తారక రామారావు</b> అని రాయాల్సి ఉంటుంది. అదే వికీ టెక్స్టులో '''నందమూరి తారక రామారావు''' అని రాస్తే చాలు.

ఇలాంటి వికీటెక్స్టును సవరించే పద్ధతిని మూలపాఠ్యాన్ని సవరించే పద్ధతి అంటారు. దీనికి లింకు "మూలపాఠ్యాన్ని సవరించు" అని ఉంటుంది. ఈ పద్ధతిలో ఎడిటింగు చేసేందుకు, వాడుకరులు వికీమార్కప్ నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఇక రెండవ పద్ధతి విజువల్ ఎడిటింగు (దృశ్య) పద్ధతి. పేజీ ఎలా కనబడుతుందో, దిద్దుబాట్లు చేసేటపుడు కూడా అలాగే కనిపిస్తుంది. అంటే మైక్రోసాఫ్టు వర్డ్ లాగా ఇది కూడా రిచ్ టెక్స్టులో ఉంటుందన్నమాట. ఈ పద్ధతిలో దిద్దుబాటు చేసేందుకు ఎటువటి మార్కప్ నేర్చుకోవాల్సిన పనిలేదు. సామాన్య పాఠకులు, వాడుకరులు కూడా దిద్దుబాటు చేసెయ్యవచ్చు.

ఇకపోతే ఎడిటర్ల గురించి.. "ఎడిటరు" అంటే దిద్దుబాటు చేసేందుకు వీలు కలిగించే ఉపకరణం. వికీపీడియాలో మూడు రకాలైన ఎడిటర్లున్నాయి - వికీటెక్స్టు ఎడిటరు, 2010 వికీటెక్స్టు ఎడిటరు, విజువల్ ఎడిటరు, 2017 విజువల్ ఎడిటరు. రెండు రకాలైన ఎడిటింగు పద్ధతులను ఏయే ఎడిటర్లలో చేయవచ్చో, అందుకు అభిరుచుల్లో ఎలా సెట్టింగులు చేసుకోవాలో ఈ ఇపుడు చూద్దాం.

వికీటెక్స్టు ఎడిటింగు

[మార్చు]
  1. వికీటెక్స్టు ఎడిటరు: పూర్తిగా వికీటెక్స్టు మార్కప్ భాష రాస్తూ చేసే ఎడిటరు.
  2. 2010 వికీటెక్స్టు ఎడిటరు: పై ఎడిటరు లాగానే ఇందులో కూడా వికీటెక్స్టు మార్కప్ రాయాల్సి ఉంటుంది. కానీ ఈ మార్కప్‌ లోని ముఖ్యమైన అంశాల కోసం పరికరాలను చేర్చి ఒక పరికరాల పట్టీని (టూల్ బార్) రూపొందించారు. ఇందులోని పరికరం బొమ్మపై నొక్కినపుడు దానికి సంబంధించిన మార్కప్ దానంతట అదే పేజీలో వచ్చి చేరుతుంది.

విజువల్ ఎడిటింగు

[మార్చు]
  1. విజువల్ ఎడిటరు: విజువల్ ఎడిటింగు కోసం ఉద్దేశించిన రిచ్‌టెక్స్టు ఎడిటరు. దీనిలో మార్కప్ రాయాల్సిన అవసరం లేదు.
  2. 2017 విజువల్ ఎడిటరు: ఇది కూడా పై ఎడిటరు లాంటిదే. ఇందు లోనూ మార్కప్ రాయాల్సిన అవసర్5అం లేదు. అయితే ఇందులో వికీటెక్స్టు మార్కప్‌ ఎడిటరు కూడా ఇమిడ్చి ఉంటుంది. ఎడిటరును మార్చకుండానే, ఎడిటింగు పద్ధతిని పార్చుకోవచ్చు.

విజువల్ ఎడిటింగుకు సంబంధించినంత వరకూ రెండింటి లోనూ అది ఒకే విధంగా ఉంటుంది.

1. సాంప్రదాయిక వికీటెక్స్టు ఎడిటరు మాత్రమే

[మార్చు]
బొమ్మ-1
బొమ్మ-2

ఈ ఎడిటరును పెట్టుకునేందుకు అభిరుచుల్లో ఎలా సెట్టింగులు పెట్టుకోవాలో బొమ్మ-1 చూపిస్తుంది. ఆ సెట్టింగులు పెట్టుకుంటే ఎడిటరు ఎలా కనిపిస్తుందో బొమ్మ-2 చూపిస్తుంది. విజువల్ ఎడిటరును అసలు ఎంచుకోలేదు కాబట్టి అది కనిపించదు. కేవలం వికీటెక్స్టు ఎడియ్టరు మాత్రమే కనిపిస్తుంది. ఇందులో మార్కప్ భాషను పూర్తిగా వాడుకరే రాయాల్సి ఉంటుంది.


పైన చూపిన బొమ్మలను చేర్చేందుకు వికీటెక్స్టు ఎడిటరులో కింది మార్కప్ భాషను రాసాం:

{|
|[[దస్త్రం:Editor settings only Wikitext editor no toolbar.png|thumb|400px|బొమ్మ-1]]
|[[దస్త్రం:Pure Wikitext editor no toolbar.png|thumb|400px|బొమ్మ-2]]
|}

2. వికీటెక్స్టు ఎడిటరు, టూల్‌బారుతో సహా

[మార్చు]
బొమ్మ-3
బొమ్మ-4

ఇది కూడా వికీటెక్స్టు ఎడిటరు మాత్రమే. కాకపోతే ఇందులో పరికరాల పట్టీ ఉంటుంది. కొంత మార్కప్‌ను ఈ పరికరాలు వాడి రాయవచ్చు.

పై బొమ్మలను చేర్చేందుకు వికీటెక్స్టు ఎడిటరులో కింది మార్కప్ భాషను రాయాలి:

{|
|[[దస్త్రం:WIkitext editor toolbar active in settings.png|thumb|400px|బొమ్మ-3]]
|[[దస్త్రం:WIkitext editor with toolbar active.png|thumb|400px|బొమ్మ-4]]
|}

అయితే ఇదంతా స్వయంగా రాయలేదు, పైనున్న పరికరాల పట్టీ లోంచి -

  1. పట్టికను చేర్చే టూల్‌ను వాడి పట్టికను చేర్చాం
  2. తరువాత బొమ్మను చేర్చే టూల్‌ను వాడి మొదటి బొమ్మను చేర్చాం
  3. ఆ తరువాత బొమ్మను చేర్చే టూల్‌ను వాడి రెండవ బొమ్మను చేర్చాం

దాంతో వికీటెక్స్టు మార్కప్ దానంతటదే తయారైంది.

3. విజువల్ ఎడిటరు, సాంప్రదాయిక సోర్సు ఎడిటరు వేరువేరుగా

[మార్చు]
బొమ్మ-5
బొమ్మ-6
బొమ్మ-7

బొమ్మలో చూపిన సెట్టింగులను పెట్టుకుంటే విజువల్ ఎడిటరు కనిపిస్తుంది. అదే సమయంలో సాంప్రదాయిక వికీటెక్స్టు ఎడిటరు కూడా అందుబాటులో ఉంటుంది. దిద్దుబాటు చేస్తూ మధ్యలో ఒక పద్ధతి నుండి రెండో పద్ధతికి మారుతూ ఉండవచ్చు. పై బొమ్మలను చేర్చిన దిద్దుబాటును ముందు విజువల్ ఎడిటరుతో మొదలుపెట్టి మధ్యలో మూలపాఠ్యం దిద్దుబాటుకు మారాం.

4. విజువల్ ఎడిటరు లోనే సోర్సు ఎడిటరు కూడా

[మార్చు]
బొమ్మ-8
బొమ్మ-9
బొమ్మ-10

విజువల్ ఎడిటరు లోనే సోర్సు ఎడిటరు కూడా ఉండే సౌకర్యం ఇది. దీన్నే 2017 విజువల్ ఎడిటరు అంటారు. ఇందులో కూడా రెండు ఎడిటింగు పద్ధతులుంటాయి. అయితే, వికీటెక్స్టు ఎడిటింగు పద్ధతి కోసం సాంప్రదాయిక వికీటెక్స్టు ఎడిటరు కాకుండా, విజువల్ ఎడిటరు లోనే వికీటెక్స్టు ఎడిటింగు సౌకర్యం ఉంటుంది.

దిద్దుబాటు వికల్పాలలో దేన్ని చూపించాలి

[మార్చు]
ఎడిటరును ఎంచుకునే వికల్పాలు

పైన చూపిన రెండు రకాల దిద్దుబాటు పద్ధతుల్లో ఏ పద్ధతి కనబడాలి అనేదాన్ని వాడుకరి తన అభిరుచుల్లో నిశ్చయించుకోవచ్చు. ఎంచుకోడానికి కింది వికల్పాలున్నాయి. అవి:

  • క్రిందటిసారి వాడిన ఎడిటరును గుర్తుంచుకో - కిందటిసారి వాడిన ఎడిటరునే మళ్ళీ చూపిస్తుంది
  • వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు - విజువల్ ఎడిటరు చేతనమైన పేరుబరుల్లో (ఉదా: ప్రధానబరి, సహాయం వగైరా) దాన్నే చూపిస్తుంది. ఇతర పేరుబరుల్లో (అన్ని చర్చ పేజీలూ, వికీపీడియా వగైరా) వికీటెక్స్టు ఎడిటింగునే చూపిస్తుంది.
  • ఎల్లప్పుడూ వీకీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు - ఎప్పుడూ వికీపాఠ్యం సవరించు ట్యాబునే చూపిస్తుంది
  • దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు - రెండు దిద్దుబాటు ట్యాబ్‌లనూ చూపిస్తుంది. కావలసినదాన్ని ఎంచుకోవచ్చు

పై అన్ని సందర్భాల్లోనూ, దిద్దుబటు చేస్తూ మధ్యలో ఒక ఎడిటింగు పద్ధతి నుండి మరోదానికి మారవచ్చు.