వికీపీడియా:ఖాతా సృష్టికర్తలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖాతా సృష్టికర్త వాడుకరి గుంపు లోని వాడుకరులు, తమను అభ్యర్ధించినవారి కోసం పెద్ద సంఖ్యలో ఖాతాలను సృష్టించే హక్కు ఉంటుంది. వికీపీడియాలో ఇందుకోసం ఒక పరికరం ఉంది. దాన్ని వాడి ఖాతాలను సృష్టించే అనుమతి ఈ గుంపు లోని వాడుకరులకు ఈ హక్కుతో లభిస్తుంది.

ఖాతా సృష్టికర్తలు చేయగల పనులు[మార్చు]

ఖాతా సృష్టికర్తలు అనే ఈ గుంపు లోని వాడుకరులకు కింది పనులు చేయగలిగే స్తోమత చిక్కుతుంది:

  • 24 గంటల్లో ఆరు ఖాతాలకు మించి[1] Special:CreateAccount ద్వారా గానీ ఇతర ఉపకరణాల ద్వారా గానీ సృష్టించవచ్చు (noratelimit ఫ్లాగ్).
  • "anti-spoof" చెక్ ను అతిక్రమించవచ్చు, ఇప్పటికే ఉన్న ఖాతా పేర్లతొ పోలిన పేర్లతో ఖాతాలను సృష్టించవచ్చు (override-antispoof ఫ్లాగ్).
  • "blacklist" చెక్ ను అతిక్రమించి బ్లాక్‌లిస్టులో ఉన్న పేర్లతో ఖాతాలను సృష్టించవచ్చు (tboverride-account ఫ్లాగ్).
  1. ఈ పరిమితిని అవసరమైన సందర్భాల్లో (పదేపదే దురుపయోగం జరిగినపుడు), మరింతగా కుదించవచ్చు