వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 4
స్వరూపం
- 1889 : సాలార్జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్జంగ్) జననం.(మ.1949).
- 1934 : రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం (జ.1867).
- 1941 : భారతదేశ రసాయన శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ జననం (మ.2001).
- 1944 : భారతీయ శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు కిడాంబి రఘునాథ్ జననం (మ.2003).
- 1974 : సత్యేంద్రనాథ్ బోస్ మరణం. భారతదేశ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు (జ.1894).
- 1998 : తెలుగు కవి, పరిశోధకుడు ఆరుద్ర మరణం (జ.1925).
- 1946 : గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జననం.(మ.2020). (చిత్రంలో)
- 1984 : భారతీయ నటి, జాతీయ ఉత్తమ నటి పురస్కార విజేత ప్రియమణి జననం.
- 2001 : భారత దేశ రసాయన శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ మరణం (జ.1941).
- 2004 : భారత లోక్‌సభ సభాపతి గా సోమనాథ్ ఛటర్జీ పదవిని స్వీకరించాడు.
- 2006 : భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ మరణం (జ.1932).
- 2019: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్'లో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి ప్రపంచం రికార్డు సాధించాడు.