వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/2025/తెవికీ విస్తరణ -గూగుల్ సహకారం/కంటెంట్ మెరుగుదల-ఎడిటథాన్-1
(నవంబరు 11 నుంచి డిసెంబరు 10)
వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/2025/తెవికీ విస్తరణ - గూగుల్ / WMF సహకారం/ ప్రాజెక్టులో భాగంగా , ఇదే సంవత్సరం డిసెంబరు 10 తెవికీ 22 వ జన్మదినోత్సం సందర్బంగా ఈ ఎడిటథాన్-1 నిర్వహించబడుతుంది. ముఖ్యముగా ఈ ప్రాజెక్టు కంటెంట్ అభివృద్ది ఎడిట్ థాన్ దృష్టిలో పెట్టుకుని నిర్వహించబడుతుంది.ఇది వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ సహకారంతో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
ఎడిట థాన్ ఉద్ధేశ్యం
[మార్చు]- కొత్త వాడుకరుల చేరిక ఎడిటింగ్ మెలకువలు నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది.
- ఎడిటథాన్లలో ఒక నిర్దిష్టమైన అంశంపై దృష్టి పెట్టడం వలన, ఆ అంశానికి సంబంధించిన వ్యాసాలలో సమగ్రత, నాణ్యత వేగవంతంగా పెరుగుతుంది పెరుగుతాయి.
- ఎడిటథాన్‌లో పాల్గొనడం వలన విశ్వసనీయ మూలాలను కనుగొనడం, సమాచార అక్షరాస్యత, తెలుగులో టైపింగ్ వంటి సాంకేతిక అంశాలపై పట్టు లభిస్తుంది.
- సామూహికంగా పనిచేయడం వలన సామాజిక బంధాలు పెరుగుతాయి, వికీపీడియా సభ్యుల మధ్య సహకారం మెరుగుపడుతుంది.
- జ్ఞాన అంతరాన్ని తగ్గించడం తెలుగు వికీపీడియాలో లేని లేదా తక్కువగా ఉన్న అంశాల (ఉదాహరణకు: స్థానిక చరిత్ర, మహిళల చరిత్ర, కళలు, సామాజిక న్యాయం మొదలైనవి)పై వ్యాసాలు రాయడానికి ఎడిటథాన్‌లు ఒక ముఖ్య సాధనంగా పనిచేస్తాయి.
- ఒక లక్ష్యం కోసం ఒక సమూహంగా పనిచేయడం, తోటి వాడుకరులతో నేరుగా లేదా ఆన్‌లైన్‌లో సంభాషించడం వలన సభ్యులలో ఉత్సాహం పెరుగుతుంది.
ఈ ప్రాజెక్టు లక్ష్యం
[మార్చు]తెవికీలోని గత వ్యాసాలను అభివృద్ధి చేయటం- కనీసం 1000 వ్యాసాలు
కాలపరిమితి
[మార్చు]2025 నవంబరు 11 నుండి 2025 డిసెంబరు 10 వరకు (తెవికీ 22 జన్మదినోత్సవం నాటివరకు)
ఎడిటథాన్ లో అభివృద్ధి చేయవలసిన వ్యాసాల జాబితా
[మార్చు]వనరులు
[మార్చు]- ఇంటర్నెట్ ఆర్కైవ్స్ https://archive.org/
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం గ్రంథాలయం: http://www.sundarayya.org/books
- పత్రికలు మొదలయిన వనరుల కొరకు ఇమెయిల్ చేయగలరు - contact@tewikipedia.org
ఎడిటథాన్ లో చేపట్టవలసిన ముఖ్య చర్యలు
[మార్చు]| లోపం రకం | లోపం వివరం | ఎలా సవరించాలి |
| విషయపరమైన లోపాల విస్తరణ | తగినంత సమాచారం లేకపోవడం | వ్యాసానికి సంబంధించిన విశ్వసనీయ మూలాల నుండి సమగ్రమైన సమాచారాన్ని సేకరించి, కొత్త పేరాగ్రాఫ్‌లను లేదా విభాగాలను జోడించడం. సమాచారం కనీసం 5000 బైట్లు ఉండేటట్లు విస్తరించండి. |
| పరిచయ పేరా మెరుగుదల | వ్యాసం ప్రారంభ పేరా ఆ వ్యాసం దేని గురించి అనేది ఒక్క పేరాలో స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పాలి. ఇది నాణ్యతకు అత్యంత ముఖ్యం. | |
| నిష్పాక్షికత లోపించడం | వ్యాసంలోని విషయాన్ని వ్యక్తిగత అభిప్రాయాలు లేకుండా, నిష్పాక్షిక కోణం ఉండేలా మార్చడం. వివాదాస్పద అంశాలను రెండు వైపుల అభిప్రాయాలను సమతుల్యంగా ప్రస్తావించడం. | |
| అనవసరమైన లేదా అసంబద్ధ సమాచారం | వ్యాస శీర్షికకు నేరుగా సంబంధం లేని వాక్యాలను లేదా పేరాగ్రాఫ్‌లను తొలగించడం లేదా వాటిని వేరే సంబంధిత వ్యాసంలోకి తరలించడం. | |
| వికీ శైలి, అక్షరదోషాలు | భాషా, వ్యాకరణ దోషాలు | వికీశైలి పాటించటం, అక్షర దోషాలు, వ్యాకరణ లోపాలను జాగ్రత్తగా సరిచేయడం. వ్యాసంలోని భాషను స్పష్టంగా, సరళంగా, అధికారికంగా, ఉండేలా మార్చడం. ఒకే పదాన్ని పదే పదే వాడకుండా పర్యాయపదాలను ఉపయోగించడం. |
| మూలాల లోపాలు | మూలాలు లేకపోవడం | వ్యాసంలోని ప్రతి వాస్తవానికి మద్దతుగా విశ్వసనీయమైన మూలాలను కనుగొని, వాటిని పాదసూచిక రూపంలో మూలాలు అనే విభాగంలో చేర్చడం. |
| విశ్వసనీయత లేని మూలాలు | బ్లాగులు, సోషల్ మీడియా లేదా వ్యక్తిగత వెబ్‌సైట్‌ల వంటి విశ్వసనీయత లేని మూలాల స్థానంలో పుస్తకాలు, పత్రికలు, లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వంటి విశ్వసనీయ మూలాలను చేర్చడం. | |
| మీడియా ఫైల్స్ | మీడియా ఫైల్స్ చేర్పు, సవరణ | వ్యాసానికి తగినట్లుగా కాపీరైట్ సమస్యలు లేని, వికీమీడియా కామన్స్ నుండి సేకరించిన తగిన చిత్రాలను లేదా మీడియా ఫైళ్ళను వ్యాసంలో, సమాచారపెట్టెలో చేర్చడం. |
| ఇతరాలు | వికీ మార్కప్ లోపాలు | సరైన వికీ మార్కప్‌ను ఉపయోగించి వ్యాస శీర్షికలను (== శీర్షిక ==), బొద్దు అక్షరాలను ('''బొద్దు'''), లింకులను చేర్చటం. |
| వర్గీకరణ లేకపోవడం | వ్యాసం దేనికి సంబంధించినదో తెలుపుతూ, కనీసం రెండు లేదా మూడు సరైన వర్గాలను వ్యాసం అడుగున చేర్చడం. | |
| సమాచార పెట్టె లేకపోవడం | వ్యాసానికి సరిపోయే సమాచార పెట్టె లోకపోతే పెట్టెను చేర్చటం, సంపూర్తిగా అనువదించటం, అందులో ముఖ్య వివరాలను నింపడం. | |
| నిర్వహణ మూసలు, నోటీసులు | వ్యాసాలలో ఉన్న {{మూలాలు లేవు}}, {{శుద్ధి చేయాలి}}, {{వికీకరణ}} వంటి నోటీసు మూసలను తొలగించడానికి అవసరమైన సవరణలు పూర్తి చేయాలి.
| |
| అంతర్వికీ లింకులు | వ్యాసంలోని ముఖ్య పదాలకు సరైన అంతర్వికీ లింకులను (ఒక తెలుగు వికీ వ్యాసం నుండి మరొక తెలుగు వికీ వ్యాసానికి లింక్ చేయడం) చేర్చి, సమాచారం సులువుగా అందుబాటులో ఉండేలా చేయాలి. | |
| అనాథ పేజీలు (ఒంటరి పేజీలు) | వికీపీడియాలోని ఇతరపేజీలనుండి లింకులులేనియెడల కలపాలి |
పాల్గోనేవారి సంతకం
[మార్చు]- ఉదయ్ కిరణ్ (చర్చ) 10:56, 8 నవంబరు 2025 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 11:57, 8 నవంబరు 2025 (UTC)
- చదువరి (చర్చ • రచనలు) 15:00, 8 నవంబరు 2025 (UTC)
- మురళీకృష్ణ.ఎమ్ (చర్చ) 02:14, 9 నవంబరు 2025 (UTC)
- Srinivasrjy (చర్చ) 05:07, 11 నవంబరు 2025 (UTC)
- Kalasagary (చర్చ) 05:38, 12 నవంబరు 2025 (UTC)
- మరల. జస్వంత్ (చర్చ) 06:02, 14 నవంబరు 2025 (UTC)
- ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:59, 15 నవంబరు 2025 (UTC)
- Pravallika16 (చర్చ) 11:05, 25 నవంబరు 2025 (UTC)
ప్రభాకర్ గౌడ్చర్చ 03:12, 19 నవంబరు 2025 (UTC)- Kasyap (చర్చ) 04:20, 19 నవంబరు 2025 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 06:32, 19 నవంబరు 2025 (UTC)
- --V.J.Suseela (చర్చ) 07:07, 20 నవంబరు 2025 (UTC)
- --WikiPBR (చర్చ) 13:43, 24 నవంబరు 2025 (UTC)
- --NARENDRA SEEDI (చర్చ) 14:34, 24 నవంబరు 2025 (UTC)
- --Vgouripathi (చర్చ) 14:45, 24 నవంబరు 2025 (UTC)
- --నాగ మోహన్ కుమార్ శర్మ (చర్చ) 24 నవంబరు 2025
- కంకల మహేశ్వరి (వాడుకరి చర్చ:కంకల మహేశ్వరి)4:07, 25 నవంబర్ 2025(UTC)
- --Ramani chenna (చర్చ) 04:11, 25 నవంబరు 2025 (UTC)
గమనికలు
[మార్చు]- వాడుకరులు అవసరమైతే అనువాద పరికరం ఉపయోగించుకోవచ్చు, కానీ యాంత్రికానువాదంలో ఉండే లోపాలను/కృత్రిమత్వాన్నీ సవరించిన తరువాత మాత్రమే ప్రచురించాలి. లేనట్లైతే పోటీకి అంగీకరించబడదు.
- దిద్దుబాటు సారాంశం: ప్రతి దిద్దుబాటునూ భద్రపరచే ముందు, దిద్దుబాటు సారాంశం స్పష్టంగా రాయాలి. (ఉదా: "కొత్త మూలాల ఆధారంగా సమాచారం చేర్చబడింది", "అక్షరదోషాల సవరణ").
- జాబితాలో సవరించబడిన వ్యాసం ఎదురుగా దిద్దుబాటు సారాంశం విభాగం కింద ఉప కాలాలలో
మార్క్ చేసి, చివరలో ఎడిటథాన్ కర్తపేరు రాయగలరు - అభివృద్ధి పరచిన వ్యాసం చర్చాపేజీలో సమీక్ష, మూల్యాంకనం, నివేదికల కొరకు {{గూగుల్ సహకారం 2025 ఎడిటథాన్-1 అభివృద్ధి వ్యాసాలు}} అనే మూసను చేర్చగలరు. ప్రత్యేకంగా వర్గం:తెవికీ గూగుల్ వ్యాసాల ప్రాజెక్ట్ చేర్చవద్దు.
- మీ దిద్దుబాటు పూర్తయిన తరువాత వ్యాసాన్ని సమీక్ష/మూల్యాంకనం కొరకు ఈ ఫౌంటెన్ టూల్ లింకులో సమర్పించండి
- ఫౌంటెయిన్ పరికరంలో తాత్కాలికంగా తిరస్కరించిన వ్యాసాలను తగువిధంగా మెరుగుపరచి మళ్ళీ సమర్పించదలిస్తే, వాటిని మళ్ళీ సమర్పించిన వ్యాసాలు పేజీలో సమర్పించాలి.
పరిశీలన, మూల్యాంకనం
[మార్చు]ఎడిటథాన్ చివరి దశలో, సమర్పించిన వ్యాసాన్ని నిర్ణేతలు పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించబడిన, మెరుగుపరచబడిన వ్యాసాలను మాత్రమే పరిగణననలోకి తీసుకొని స్వీకరిస్తారు. నిర్ణేతల బృందానిదే తుది నిర్ణయం.
మూల్యాంకనం చేసాక -
- పోటీకి స్వీకరించిన వ్యాసాలు వర్గం:ఎడిటథాన్-1 పోటీకి స్వీకరించిన వ్యాసాలు వర్గం లోకి చేరతాయి.
- పోటీకి స్వీకరించని వ్యాసాలు వర్గం:ఎడిటథాన్-1 పోటీకి తాత్కాలికంగా స్వీకరించని వ్యాసాలు. ఎందుకు స్వీకరించలేదో, ఆ కారణం వ్యాసపు చర్చ పేజీలో రాసి ఉంటుంది. పోటీ ముగిసే లోపు తగు మార్పుచేర్పులు చేస్తే వాటిని మళ్ళీ మూల్యాంకన చేసే అవకాశం ఉంది.
- ఇంకా మూల్యాంకన చెయ్యని వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు.
ఎడిటథాన్ నిర్వహణ
[మార్చు]ప్రోత్సాహక బహుమతులు
[మార్చు]అంగీకరించబడిన వ్యాసాలు మాత్రమే బహుమతులకు పరిగణిస్తారు.
బహుమతులు వోచర్ల రూపంలో మాత్రమే అందచేయబడుతాయి
- మొదటి బహుమతి - రు.4000
- రెండవ బహుమతి - రు.3000
- మూడవ బహుమతి - రు.2000
- ప్రోత్సాహక బహుమతులు (6)- రు.1000
- ▶మొదటి, రెండవ, మూడవ బహుమతులకు అర్హులైన వారు ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే (ఒకే సంఖ్యలో వ్యాసాలు ఉంటే) ఆ బహుమతి మొత్తాన్ని అందరికి సమానంగా పంచుతారు.
- ▶కార్యక్రమ నిర్వాహకులు, మూల్యాంకనం చేసినవారు వ్యాసాల సవరణలో పాల్గొన్నప్పటికీ బహుమతులకు పరిగణించబడరు.
సందేహాలు, అభిప్రాయాలు, చర్చలు విభాగం చర్చాపేజీలోకి తరలించడమైనది. గమనించగలరు.
నివేదిక
[మార్చు]ఈ ఎడిటతాన్ ను యర్రా రామారావుగారు నిర్వహించారు.Chaduvari గారు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. నిబంధనలను అనుసరించి ఫౌంటెన్ టూల్ లో మొత్తం తొమ్మిది మంది వాడుకరులు పోటీలో పాల్గొని 173 వ్యాసాలు సమర్పించారు. దాంట్లోనుండి పోటీకి నాణ్యతా ప్రమాణాలననుసరించి స్వీకరించిన వ్యాసాలు 139. ఈ ఎడిటతాన్ లో నిర్వాహకులు యర్రా రామారావుగారు, ప్రాజెక్ట్ నిర్వహణలో భాగస్వామి అయిన V.J.Suseela పోటీ నుంచి స్వచ్చందంగా విరమించుకోవడంతో ప్రోత్సాహక బహుమతులకు అర్హులైన 7 మంది పేర్లు పాయింట్ల వారీగా ఈ క్రింద ఇచ్చాను.
- Pravallika16 - 56 పాయింట్లు - మొదటి బహుమతి
- Muralikrishna m - 46 పాయింట్లు - రెండవ బహుమతి
ప్రోత్సాహక బహుమతులు
- Srinivasrjy - 8 పాయింట్లు
- Ramani chenna - 3 పాయింట్లు
- Vgouripathi - 1 పాయింట్
- Kalasagary - 1 పాయింట్
- WikiPBR - 1 పాయింట్
ఈ క్రింది వికీమీడియన్లు తమ వ్యాసాలను (46) ఫౌంటెన్ టూల్లో, పోటీలో సమర్పించకుండా వ్యాస విస్తరణలో పాల్గొన్నారు. వారి వివరాలు -
- కె.వెంకటరమణ - 33 వ్యాసాలు
- Rajasekhar1961 - 6 వ్యాసాలు
- Suryajyothi Sampara - 5
- నాగ మోహన్ కుమార్ శర్మ - 2
సభ్యులు ఈ నివేదికను పరిశీలించి ఆమోదం తెలియచేస్తే - బహుమతులు, అర్హులైన వాడుకరులు వివరాలను బాలర్క్ ఫౌండేషన్ వారికి ఇమెయిల్ పంపవచ్చు. ఈ ఎడిటతాన్ ద్వారా సుమారు 20% వ్యాసాలు మాత్రము విస్తరింపచేయడం జరిగింది. మిగిలినవి వేరు చేసి విస్తరణకు జాబితా చేసి పెడితే కొత్త వారికీ కూడా ప్రాక్టీస్ సెషన్ కి ఇవ్వవచ్చేమో పరిశీలించండి. వచ్చే ఎడిటతాన్ కి కొత్త వ్యాసాలు నాణ్యతతో రాయగలరు అనుకుంటున్నాను. సహకరించిన వికీమీడియన్లందరికి ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 13:10, 15 డిసెంబరు 2025 (UTC)
- @సుశీల గారూ నివేదికను ప్రకటించినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 04:40, 19 డిసెంబరు 2025 (UTC)
బహుమతులు
[మార్చు]విజేతలకు వోచర్ల రూపంలో బహుమతులు పంపినట్లు బాలార్క ఫౌండేషన్ నుంచి 2026, జనవరి 29న ఇమెయిల్ సందేశం అందింది. V.J.Suseela (చర్చ) 13:46, 1 ఫిబ్రవరి 2026 (UTC)