Jump to content

వికీపీడియా:తెవికీ వార్త/2010-07-01/వికీపీడియా వెక్టర్ రూపం

వికీపీడియా నుండి
తెవికీ వార్త
తెవికీ వార్త
వికీపీడియా వెక్టర్ రూపం

వికీపీడియా వెక్టర్ రూపం

రచన:రవిచంద్ర, జులై 1, 2010

వికీపీడియా కొత్తగా వాడటం మొదలు పెట్టినప్పుడు మీ కు కష్టంగా అనిపించలా? రకరకాల గుర్తుల భాషతో తికమకపడ్డారా లేదా? అయితే ఇకముందు ఆ ఇబ్బందులు లేవు, ఎందుకంటే వెక్టర్ రూపం అందుబాటులోకి రానుంది.

వికీపీడియాని వాడుకరులకు సౌలభ్యం పెంచడం కోసం వికీపీడియా వాడుక సౌలభ్యత జట్టు డిసెంబర్ 2009 నుండి కృషి చేస్తున్నది. దాని ఫలితంగా వికీపీడియా రూపం మోనోబ్లాక్ నుండి వెక్టర్ గా మారుతోంది. ఇంగ్లీషు వికీపీడియా లో మే 13, 2010న అమలయ్యింది. తెలుగు వికీపీడియా లో ప్రయోగాత్మక పరీక్ష (బీటా) అమలులో వుంది.త్వరలో మార్పు అమలవుతుంది.

ఈ మార్పులు ముఖ్యంగా కొత్తగా వికీలోకి వచ్చేవారికి ఎక్కువ లంకెలతో గందరగోళ పరచకుండా అవసరమైనంత మేరకే లంకెలు ఉండే టట్లుగా జాగ్రత్త తీసుకున్నారు. ఉదాహరణకు ఎడమ వైపున ఉన్న సహాయము, పరికరాల పెట్టె, ఇతర భాషలు మొదలైన మెనూ లు అప్రమేయంగా (డీఫాల్టు) దాచబడి ఉంటాయి. వికీలో సమాచారం కోసం వచ్చేవారికి అత్యంత ముఖ్యమైనవి వెతకడం కోసం ఓ పెట్టె. అందుకనే ఇంతకు ముందు ఎడమవైపున ఉన్న దాన్ని ప్రముఖంగా కనిపించేలా పుట పై భాగంలో చేర్చడం జరిగిండి.

కొన్ని ముఖ్యమైన మార్పులు.
  • మెరుగైన నావిగేషన్ వ్యవస్థ: సరికొత్త రూపంలో ఒక వ్యాస పుటను చూస్తున్నారా లేక దాని చర్చా పేజీ చూస్తున్నారా, ఒక పేజీని వీక్షిస్తున్నారా లేక దిద్దుబాటు చేస్తున్నారా అన్నది సులభంగా అర్థమవుతుంది. తరచు అవసరం లేని తరలించు నిర్వాహకులకు అందుబాటులో ఉండే తొలగించు, సంరక్షించు లను అప్రమేయంగా దాచి ఉంచారు. ఇవి అవసరమైనప్పుడు మౌసు ను కుడి వైపు చివరన క్రింది వైపు సూచించే బాణం గుర్తు దగ్గరకు తీసుకెళితేనే కనిపిస్తాయి.
మెరుగైన నావిగేషన్
  • సులభతరమైన దిద్దుబాట్లు: పేజీలో దిద్దుబాట్లు చేయడం చాలా తేలిక. శీర్షికలు, జాబితాలు, ప్రత్యేక అక్షరాలు మొదలైనవి ఒక్క నొక్కుతో వ్యాసంలో చేర్చేయవచ్చు. ఈ పరికరాలన్నీ ఒక్కసారిగా చూపించకుండా కేవలం అవసరమైన వాటినే చూసుకునే అవకాశం కల్పించారు. దిద్దుబాటులో ఏ సహాయం కావాలన్నా పక్కనే ఉన్న సహాయం అన్న మెనూ నుంచి పొందవచ్చు.
  • సరికొత్త శోధన పరికరం: పై భాగాన ఉన్న శోధన పెట్టె ఇప్పుడు మరింత వేగవంతమైంది. ఒక పదం టైపు చేస్తుండగానే ఆ పదం వ్యాసం పేరులో కలిగిన పేర్లన్నీ జారుడు జాబితా (డ్రాప్ డౌన్ లిస్ట్) లో చూపబడతాయి.
సులభతరమైన దిద్దుబాట్లు
వేగవంతమైన శోధన పెట్టె


  • మంత్రదండాలు: వికీపీడియా అంతర్గత లంకెలను, బయటి లంకెలను వ్యాసంలో చేర్చడానికి ఒక విజార్డ్ సమకూర్చబడింది. ఇది మొదట్లో వికీ మార్కప్ గురించి పెద్దగా పరిచయం లేని వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పట్టికలను చేర్చడం కోసం ఒక విజార్డ్ రూపొందించారు. ఈ విజార్డ్ పట్టికలో ఎన్ని అడ్డు వరుసలు, ఎన్ని నిలువ వరుసలు కావాలో ముందుగా తీసుకుని దానికి తగ్గ పట్టికను తయారు చేస్తుంది.
లంకెల మంత్రదండం
పట్టిక మంత్రదండం
నావిగేషన్ పాపప్
  • నావిగేషన్ పాపప్స్: వికీలో ఏదైనా పేజీని వీక్షిస్తున్నపుడు ఏదైనా లంకె మీద నొక్కకుండానే సంక్షిప్తంగా ఆ పుటలో ఏముందో తెలుసుకోవాలంటే నావిగేషన్ పాపప్స్ ఉపయోగపడతాయి. వీటిని ఇంతకు ముందు ఎనేబుల్ చేసుకోవడానికి ప్రత్యేకమైన జావాస్క్రిప్ట్/CSS ను తమ వాడుకరి పేజీకి ఉపపేజీగా చేర్చుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని నా అభిరుచులు→ఉపకరణాలు లోకి వెళ్ళి నావిగేషన్ పాపప్స్ అనే చెక్ బాక్సును టిక్ చేయడం ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు.
+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
  • తేవీకీ నీ తయరూ చేయడమ్ లొ మన వాల్ల్లందరికి అభిణనందనలు.

తెలుగు టిక్ పెట్టె

పాత రూపంలో తెలుగు వికిపీడియా టైపింగ్ ని నిలుపుచేయడానికి ఒక టిక్ పెట్టె వుండేది. అది ఏమయింది?. అర్జున 03:25, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అవును అది ఇప్పుడు కనిపించడం లేదు. దీన్ని గురించి కొద్దిగా పరిశీలించాలి. --రవిచంద్ర (చర్చ) 06:50, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఫైర్ ఫాక్స్ వంటి అధునాతన ఎక్స్‌ప్లోరర్లలో తెలుగు ఎడిట్ చేయడానికి బాక్స్ లేదు. కాని ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో తెలుగు ఎడిట్ బాక్స్ పని చేస్తుంది.--t.sujatha 15:50, 19 సెప్టెంబర్ 2010 (UTC)
మీరు వాడే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విడుదల రూపము తెలియచేయండి. --అర్జున 04:40, 21 సెప్టెంబర్ 2010 (UTC)
అర్జునరావు గారూ నేను వాడేది. " mycrosoft internet explorer ". అది సాధారణంగా ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటుంది. --t.sujatha 06:28, 21 సెప్టెంబర్ 2010 (UTC)
మీరు దాని చివరి మెనూలో about అనే దానిపై నొక్కితే వర్షన్ వివరాలు ఒక కొత్త విండో లో కనపడతాయి. అవి తెలపండి. అదీ మీరు వెక్టర్ రూపము తోనే వాడుతున్నది లేనిదీ గమనించండి.-- అర్జున 06:38, 21 సెప్టెంబర్ 2010 (UTC)