Jump to content

వికీపీడియా:తెవికీ వార్త/2010-09-24/మాటామంతీ-కాసుబాబు

వికీపీడియా నుండి
తెవికీ వార్త
తెవికీ వార్త
మాటామంతీ-కాసుబాబు

మాటామంతీ-కాసుబాబు

కాసుబాబు, సెప్టెంబరు 24, 2010
  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
దస్త్రం:Telugu Wikipedian Kasu Babu.jpg
వాడుకరి:కాసుబాబు
జూలై 31, 2006న సభ్యునిగా చేరాను. నేను 517వ సభ్యుడిని. ఇంగ్లీషు వికీపీడియా కూడా అంతకు కొద్ది రోజుల ముందే పరిచయం. ఏదో వెతుకులాటలో తెలుగు వికీపీడియా లింకుకు అనుకోకుండా చేరుకొన్నాను. ఇదేదో క్రొత్తగా అనిపించింది. అంతకు ముందు ఒకటి రెండు నెలలుగా కావ్యనందనం వెబ్ సైటునుండి పోతన ఫాంట్ దించుకొని తెలుగులో టైపింగ్ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రాక్టీసు వికీపీడియాలో కూడా చేయవచ్చుననిపించింది. అప్పటికి తెలుగు వికీ ఎడిట్ బాక్స్‌లో నేరుగా తెలుగు టైపు చేసే సదుపాయం లేదు. ఎక్కువ మంది లేఖినిలో తెలుగు టైపు చేసుకొని, దానిని కత్తిరించి తెలుగు వికీలో అతికిస్తున్నారనుకొంటాను. కాని నేను లేఖినిని వాడలేదు. అయితే లేఖిని ఉందని మాత్రం తెలుసు.
అప్పటినుండి వికీ ప్రస్థానంలో నా కృషిని వాడుకరి:కాసుబాబు/వికీ డైరీలో సంక్షిప్తంగా వ్రాశాను. మీకు ఆసక్తి ఉంటే ఆ పేజీ చూడగలరు.


  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
పైన చెప్పిన లింకు (వాడుకరి:కాసుబాబు/వికీ డైరీ) చూడండి. నేను తెలుగు వికీలో దాదాపు అన్ని అంశాలలోనూ పని చేశాను. సినిమాలు, సాహిత్యం, భౌగోళికం, గ్రామాలు, వ్యక్తులు నేను పని చేసిన ముఖ్యమైన అంశాలు. వికీపీడియా:ఈ వారం బొమ్మ, వికీపీడియా:ఈ వారం వ్యాసం శీర్షిక నిర్వహణ, క్రొత్త సభ్యులకు మార్గదర్శకాలు కూడా నేను తరచు దృష్టి పెట్టే విషయాలు.
  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
ఒక ఆరు మాసాలనుండి నా స్వకార్యాల కారణంగా వికీలో కృషి తక్కువైంది. ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం మాత్రమే చూస్తున్నాను. మరో ఆరు నెలల వరకూ ఇలాగే కొనసాగవచ్చును. తరువాత మళ్ళీ నా పని పెంచగలనని అనుకొంటున్నాను. ఇంతకు ముందు కుప్పలు తెప్పలుగా ఉన్న అనేక ఆంగ్ల వ్యాసాలను అనువదించాను. ప్రస్తుతం మూడు ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. (1) గూగుల్ యాంత్రిక అనువాదం ద్వారా ఇతరులు కూర్చిన వ్యాసాలను వికీకరించడం (2) వర్గీకరణను క్రమబద్ధం చేయడం (3) గ్రామాల వ్యాసాలను అభివృద్ధి చేయడం. గ్రామాల వ్యాసాల అభివృద్ధిపై నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. వికీ నాణ్యతను పెంచడానికి అవి ఎంతో అవుసరం.
  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
ఎక్కువగా వాడేవి (1) [[::en:: | ఆంగ్ల వికీ]] (2) ఇంటర్నెట్ ఆర్చీవు లో పుస్తకాలు (3) వార్తా పత్రికలు (4) వికీ కోసమే నేను కొన్న కొన్ని పుస్తకాలు.


  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
నచ్చినవి:- (1) వికీలో పని చేయడంలో చాలా మజా ఉంది. (2) యువకులు చాలా మంది ఉత్సాహంగా పని చేయడం శుభశూచకం. (3) తెలుగు భాషను పట్టించుకొనేవాడు లేడన్న ఊకదంపుడు కంటే ఇలాంటి ఏదో ఒక కృషి ద్వారా మనవంతు ప్రయత్నం చేస్తున్నాము.
నచ్చనివి: (1) చురుకుగా కృషి చేసేవారి సంఖ్య చాలా తక్కువ (2) కొందరు సభ్యులకు త్వరగా కోపం వస్తుంది.


  • వికీ ఉపయోగపడిన విధం
ఇప్పటి వరకూ అయితే నేను గోళ్ళు గిల్లుకుంటూ కూచోవడం లేదనే తృప్తి కలిగింది. అంతే కాదు. కొంతకాలం క్రితం నేను పుస్తకాలు ధారాళంగా చదివేవాడిని. ఒక పదేళ్ళ క్రితం ఆ అలవాటు మరుగున పడింది. మళ్ళీ వికీలో పని చేయడం మొదలు పెట్టినాక "విజ్ఞానం" అనే అవధులు లేని సంపదకు ద్వారాలు మళ్ళి తెరుచుకొన్నాయి. దిద్దుబాట్ల సమయంలోను, రిసెర్చి సమయంలోను అనేక క్రొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతే కాదు. వికీలో పని చేయడంలో చాలా మజా ఉంది.
  • తెవికీ భవిష్యత్తుకి కలలు
కలలకేమి చాలా ఉంటాయి. వాస్తవంలోకి వద్దాము. నా అభిప్రాయంలో తెలుగు వికీ కి తెలుగు సినిమా రంగం ఒక ఆదర్శం. ఎన్ని లోపాలున్నా, ఎంత పరిమితమైన ప్రేక్షకులున్నా గాని తెలుగు సినిమా రంగం తన ఉనికిని వైభవంగా కొనసాగిస్తున్నది. అలాగే తెలుగు వికీ కూడా తెలుగువారు అభిమానించే సైటులాగా రూపు దిద్దుకోవాలని నా కోరిక.
  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు
వికీలో పని చేస్తున్నందుకు మీకు నా వందనములు. నా కోరికల గురించి సినిమా పేర్లతో చెప్పాలంటే పదండి ముందుకు. సర్దుకుపోదాం రండి. కలసి ఉంటే కలదు సుఖం.జయం మనదే. పైన చెప్పినట్లుగా గ్రామాల వ్యాసాల అభివృద్ధిపై నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. వికీ నాణ్యతను పెంచడానికి అవి ఎంతో అవుసరం. వీటి అభివృద్ధికి చేయూతనిమ్మని ప్రత్యేకంగా అర్ధిస్తున్నాను.
  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
నేను ఒమన్ లో ఉంటాను. ఇక్కడికి, భారత దేశానికి గంటన్నర మాత్రమే తేడా. ఇక్కడ నేను అధికంగా రాత్రి 10 నుండి 12 గంటలవరకు (అంటే ఇండియాలో రాత్రి 11:30 నుండి 01:30 వరకు) వికీ పనులు చూసుకొంటూ ఉంటాను.
  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
నా చర్చా పేజీ, మరియు ఈమెయిల్ కూడా ఓకే.
  • తెవికీ వార్త చదువరులకి సందేశం
శుభాకాంక్షలు. నమస్కారాలు. ఈ శీర్షిక మొదలు పెట్టిన అర్జునరావు గారికి ప్రత్యేకించి అభినందనలు.
+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
వ్యాఖ్యలు లేవు. మీరే మొదటి వ్యాఖ్య చేయవచ్చు.!