Jump to content

వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation

వికీపీడియా నుండి
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
11వ వార్షికోత్సవ సంబరాలు
11th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee

సమావేశపు తొలి రోజు 2015 ఫిబ్రవరి 14-Day 1

[మార్చు]
  • 07 :30 - 08:30am అల్పాహారం
  • 08:30 - 09:00 am నమోదు
  • 09 :00 - 09:30 am స్వాగత కార్యక్రమం(జోతి ప్రజ్వలన, మాతెలుగు తల్లికి మల్లెపూదండ పాట., అధ్యక్షుని ఎన్నిక, అతిధి ఎన్నిక, )
  • 09 :30 -10.30 am పరిచయాలు, ముఖాముఖీ - (విష్ణువర్ధన్)
  • 10 :30 - 11.30 am నిపుణుల ఉపన్యాసం (శ్రీనివాస్ కల్లూరి గారి ఉపన్యాసం)
  • 11.30 - 12:00 pm తేనీటి విరామం
  • 12:00 - 1:00pm గత సంవత్సరం వికీ విజయాలు, సింహావలోకనం (సుజాత)
  • 01:00 - 02:00 pm భోజన విరామం
  • 02:00- 03.30pm నల్లమోతు శ్రీధర్ గారి ఉపన్యాసం.
  • 03:30 - 04:00pm అల్పాహారం
  • 03.30 - 05.00pm సాకం నాగరాజు గార్ల పుస్తక ఆవిష్కరణ, ఉపన్యాసాలు
  • 05:00 7:00 pm క్విజ్
  • 07:30 - 08:30pm రాత్రి భోజనం
  • 08:30 - 10:00 pm తెవికీ చర్చా గోష్టి (ఐచ్చికం)

రెండో రోజు సమావేశము - 2015 ఫిబ్రవరి 15-Day 2

[మార్చు]
  • 08 :00 - ఫలహార సమయం
  • 09 :00 - 11-00 యునీకోడ్ అంటే ఏమిటీ ?
  • 11 :00 - 11-0 కాపీ హక్కులు -వాడుక విధానాలు
  • 11.00 - 11:30 తేనీటి విరామం
  • 11:30 - 12-00 విద్యార్ధులు - వ్యాసాలు (విశ్వనాధ్, పవన్ సంతోష్)
  • 12:00 - 01-00 తెవికీ భవిష్యత్ ప్రణాళీక , తెలుగు వికీపీడియా, మరియు దాని సోదర ప్రాజెక్టులలో 2015 వ సంవత్సరములో చేయవలసిన అభివృద్ధి నిర్ణయించి, నివేదికను సభముందు వుంచి సభ అమోదం పొందాలి. విష్ణువర్ధన్ గారి ఆధ్వర్యంలో
  • 01:00 -02:00 భోజన విరామం
  • 02:00- 04.00 (విష్ణువర్ధన్ - 2 టపిక్స్- సెషన్ + ఒక్కో అర్ధగంట, విశిష్ట వికీపీడియన్ల అనుభవాలు-15 నిమిషాలు)
  • 04:00 - 04:30 - అల్పాహారం
  • 04.30 - 06.30 - సభ ( కశ్యప్ ఆధ్వర్యంలో )
  • 07:30 -08:00 - మిగిలిన వారితో చర్చలు

కార్యక్రమ నివేదిక

[మార్చు]

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలలో పాల్గొన్న వారు

[మార్చు]
క్ర. సం పేరు వాడుకరి పేరు ఈ-మెయిల్
1 రాజశేఖర్ రాజశేఖర్ nationalpathlab@yahoo.co.in
2 ఇ.భాస్కరనాయుడు ఇ.భాస్కరనాయుడు ellankiBhaskearanaidu@gmail.com
3 టి. సుజాత టి. సుజాత sujathathummapudi@gmail.com
4 సుల్తాన్ ఖాదర్ సుల్తాన్ ఖాదర్
5 పాలగిరి రామకృష్ణారెడ్డి పాలగిరి
6 విశ్వనాధ్.బి.కె. విశ్వనాధ్ viswanath000@gmail.com
7 టి. విష్ణువర్ధన్ విష్ణు vishnu@cis-india.org
8 గుళ్ళపల్లి నాగేశ్వర రావు గుళ్ళపల్లి నాగేశ్వర రావు nrgullapalli@gmail.com
9 వై.వి.ఎస్. రెడ్డి వై.వి.ఎస్. రెడ్డి
10 శ్రీరామమూర్తి శ్రీరామమూర్తి
11 మురళిమోహన్ స్వరలాసిక mmkodihalli@gmail.com
12 సి. భాస్కరరావు సి. బి. రావు cbraoin@gmail.com
13 మల్లాది కామేశ్వరరావు మల్లాది కామేశ్వరరావు
14 కొంపెల్ల శర్మ కొంపెల్ల శర్మ kbssarma@gmail.com
15 కృపాల్ కశ్యప్ కశ్యప్ kasyap.p@gmail.com
16 పవన్ సంతోష్ పవన్ సంతోష్ pavansanthosh.s@gmail.com
17 నాయుడిగారి జయన్న నాయుడుగారి జయన్న naidu9962@gmail.com
18 ప్రణయ్‌రాజ్ వంగరి ప్రణయ్‌రాజ్ వంగరి pranayrajvangari@gmail.com
19 రాజ్ పల్గుణ్ రాజ్ పల్గుణ్ raj.palgun13@gmail.com
20 ఎం. మల్లేశ్వర నాయక్ nayak malleswaraonayak@gmail.com
21 గోపి మొగిలి గోపి మొగిలి
22 డి. రాయ్ కుమార్ roy.d royesua@gmail.com
23 ఎ. మస్తాన్ వలీ Annammasatanvali annammastanvali18@gmail.com
24 ఇ. నాగేశ్వర రావు nageswara rao nani elinageswararao@gmail.com
25 పి. వెంకటేష్ venkateshpusalapati1@gmail.com
26 తరుణ్ సత్య తరుణ్ సత్య
27 డి. జానీ బాషా D. JANIBASHA dudekulajanibasha786@gmail.com
26 ఎం. యాసిన్ yasinmoghal94@gmail.com
29 టి. సూర్య కిరణ్ surya.111.kiran@gmail.com
30 బాబావలీ vali.baba111@gmail.com
31 కల్లూరి శ్రీనివాసరావు
32 శ్రీధర్
33 మల్లాది దివ్య మల్లాది దివ్య
34 విజయ విశ్వనాధ్ విజయ విశ్వనాధ్
35 ఆచార్య మాదిరెడ్డి అండమ్మ ఆచార్య మాదిరెడ్డి అండమ్మ
36 వల్లూరి హారిక వల్లూరి హారిక
37 దివ్య అనూష దివ్య అనూష
38 యువరాణి యువరాణి
39 వెన్నెల వెన్నెల

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలు 2015, ఫిబ్రవరి 14న తిరుపతి లోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకొరకు ఇ.భాస్కరనాయుడు అధ్యక్షునిగా ఒక కార్య నిర్వహక వర్గం, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపికమండలి కొరకు వైజాసత్య అధ్యక్షునిగా ఒక కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగాయి. గత సంవత్సరం జరిగిన దశాబ్ది ఉత్సవాల మాదిరిగానే 11వ వార్షికోత్సవాలను కూడా జరపాలని అనుకున్నా బడ్జెట్ కారణాల వల్ల తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు మత్రమే జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించడం జరిగింది మరియు ఉత్సవాలకు ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నారు. అలా మొదలైన కార్యక్రమ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఫిబ్రవరి 13న

[మార్చు]
తెవికీ 11వ వార్షికోత్సవాల్లో తెలుగు వికీపీడియన్లు

13వ తేదీన తిరుపతికి చేరుకున్న వాడుకరులు - విష్ణువర్ధన్, ఇ.భాస్కరనాయుడు, టి. సుజాత, కశ్యప్, గుళ్ళపల్లి నాగేశ్వర రావు, విశ్వనాధ్, మల్లాది కామేశ్వరరావు, కొంపెల్ల శర్మ లు.

వికీపీడియా ఉత్సవానికి ఉదయీ ఇంటర్‌నేషనల్ హొటల్లో గదుల నిర్వహణ పూర్తి అయ్యాక, మీటింగ్ కొరకు, భోజనాది ఏర్పాట్ల కొరకు హొటల్ యాజమాన్యంతో కశ్యప్, విశ్వనాధ్లు మంతనాలు పూర్తిచేసారు. తదనంతరం భోజనాలకు అందరూ హాజరై కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ఇ.భాస్కరనాయుడు గారు తిరుపతి రచయితల సంఘం అద్యక్షులు అయిన సాకం నగరాజ గారిని వికీ మిత్రులకు పరిచయం కావించారు. ఆయన తమ కార్యక్రమాలను వివరించి వికీలో తాము కూడా పాల్గొనాలని అభిప్రాయం వ్యక్తం చేసారు. అనంతరం రెండురోజుల ప్రోగ్రాం తయరుచేసుకొని. బేనర్స్, పోస్టర్స్ ప్రింటింగ్ కొరకు ఇవ్వడం జరిగింది.

11వ వార్షికోత్సవంను ప్రారంభస్తున్న పవన్ సంతోష్

14 వతేదీ కార్యక్రమాలు

[మార్చు]

13వ తేదీన వచ్చిన వికీపీడియన్లు మరియు 14వ తేదీ ఉదయం వచ్చిన వికీపీడియన్లు అంతా కలిసి హోటల్ లోని భోజనశాలలో అల్పాహారం ముగించుకొని, 4వ అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి చేరుకున్నారు. కార్యక్రమం కొంత నిలకడగా, కొద్దిగా ఆలస్యంగానూ ప్రారంభమైనది.

తెలుగు వికీపీడియా 11 సంవత్సరాలు పూర్తిచేసుకుని 61వేలకు పైగా వ్యాసాలతో 11వ వార్షికోత్సవం ప్రారంభించుకోవడం పట్ల ప్రారంభోపన్యాసం ద్వారా పవన్ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.

తదనంతరం జ్యోతిప్రజ్వలనకు ఆహ్వానం పలికారు.

జ్యోతి ప్రజ్వలన చిత్రమాలిక

ప్రారంభ సభ

[మార్చు]

ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగంగా టి. సుజాత, రాజశేఖర్, ఎల్లంకి భాస్కరనాయుడు, స్వరలాసిక, సుల్తాన్ ఖాదర్ లు జ్యోతిని వెలిగించారు. ఇతర వికీపీడియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను విద్యార్థి మహిళా వికీపీడియన్లైన దివ్య అనూష, యువరాణి, వెన్నెల లు ఆలపించారు.

వికీ ఫ్రెండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విష్ణువర్ధన్

ప్రారంభ సభలో భాగంగా ముఖపరిచయం లేని వారితో కొత్త పరిచయం ఏర్పరుచుకోవడం అనేది ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పరిచయం చేసుకోవడం ద్వారా వాళ్ళగురించి, వికీపీడియాతో వారి యొక్క అనుభవం గురించి, ప్రస్తుతం వారు వికీపీడియాలో చేస్తున్న పని గూర్చి తెలుసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇలా ఈ కార్యక్రమంలో అందరూ కలిసిపోయి పెద్దాచిన్నా అనే భేదం లేకుండా సాగింది. దాదాపుగా గంటల తరబడి జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, పాల్గొనేలా ప్రోత్సాహం కలిపించాలి అని తెలియజేశారు. విష్ణువర్ధన్ గారు ఈ కార్యక్రమంను ముందుండి నడిపారు.

నిపుణుల ఉపన్యాసం - 1 (శ్రీనివాస్ కల్లూరి గారి ఉపన్యాసం)

[మార్చు]

కల్లూరి శ్రీనివాస్ గారు అన్నమాచార్యులు కీర్తనలు వికీపీడియాలో చేర్చడానికి జరుగుతున్న కృషిని గురించి వివరించారు. అన్నమయ్య కీర్తనలలో 28 భాగాలు అన్ని అందుబాటులో ఉండగా 29 వ భాగం మాత్రం చింపి ఉన్నాయని అయన తెలియజేశారు. అయితే ఈయన, కొంతమంది సభ్యులు కలిసి వాటన్నిటిని కలిపి ఒకే భాగంగా చేశారు. పూర్ణదయాళ్ అనే ఒక బ్యాంక్ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి 14000 కీర్తనలను అను ఫాంటు నందు టైపు చేసి వీరికి అందించారు. వీటన్నిటిని కలిపి మార్చి 17వ తేదీన 200 పుస్తకాలన్నీ కూడా అచ్చువేసి కొంతమందికి ఉచితంగా అందజేస్తామన్నారు.

అన్నమయ్య చేసిన సంకీర్తనలన్ని రేకుల రూపంలో తంజావూరు గ్రంథాలయంలో ఉందనీ, ఒకే కీర్తన ఐదారుసార్లు, ఒక్కొక్క రాగంలో ఉంటుందని తెలియజేశారు. అన్నమయ్య కీర్తనలన్ని కూడ ఒక సీడీ రూపంలో పొందుపరచడం జరిగిందనీ, ఇవన్నీకూడా కీర్తన రూపంలో మాత్రమే కాకుండా వ్యాసరూపంలోకూడా చదవేందుకు ఆస్కారం ఉంటుందనీ, అన్నమాచార్యుల సంకీర్తనలో భార్యభర్తల మధ్య సంబంధాన్ని, భాదలను గురించి వివరించి మరియు అదే విధంగా ఎవరు ఎవరితో ఏ విధంగా మెలగాలో ఉంటుందని అన్నారు.

అన్నమయ్యగారి సంకీర్తనలమీద ఎంతోమంది మేధావులు అనేకమైన విమర్శలు, ప్రశ్నలు వెళ్ళువలా చేశారు. అన్నమయ్య సంకీర్తనలు 29 volumes ఉండగా అందులో 26 volumes ను అన్నమయ్య స్వయంగా రచించడం జరిగింది. ఇదులో 5 ఆధ్యాత్మిక సంకిర్తనలు 21 శృంగార కీర్తనలు రచించడం జరిగింది వీటికి ముందు పీటికను వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మరియు రాళ్ళ పల్లి అనంతకృష్ణశాస్త్రి గారు రచించారని తెలియజేయడం జరిగింది. అన్నమయ్య సంకీర్తనలన్ని కూడా తిరుమల తిరుపతి దేవ స్థానంనందు భద్రంగావుయ్య న్నాన తెలియజేయడం జరిగింది. ఇంతటితో రెండవ భాగం ముగిసింది. కల్లూరి శ్రీనివాస్ గారు అన్నమయ్య వంశంలో పన్నెండవ తరం వారైన శ్రీ.............................. గారిని తీసుకొచ్చి సభకు పరిచయం చేశారు. వీరి రాక సభకు ప్రత్యేక ప్రాధాన్యతను సమకూర్చింది.

అనంతరం మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సులో నల్లమోతు శ్రీధర్

నిపుణుల ఉపన్యాసం - 2 (నల్లమోతు శ్రీధర్ గారి ఉపన్యాసం)

[మార్చు]

మధ్యాహ్న భోజన విరామం తర్వాత సెషన్ ప్రారంభమైంది. ఇందులో కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకులు, సాంకేతిక నిపుణులైన నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతిక విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంపై 1996 నుండి దాదాపు లక్షకు పైగా వ్యాసాలను రాశారు. వికీపీడియా ఇంకా బాల్య దశలోనే ఉందని, ఇంకా చాలా వ్యాసాలు రావాలని అన్నారు. "అను ఫాంట్" కి మరియు "యూనికోడ్" మధ్య భేదాలను వివరించారు. ఆ రేండిటికి మధ్య భేదాలను వివరిస్తూ అనేక ప్రశ్నోత్తరాలు రావడం జరిగింది. "యూనికోడ్" కి "అనూ" కి మధ్య వున్నటువంటి లాభాలు మరియు నష్టాలు ఏంటో అడిగి తెలుసుకోవడం జరిగింది. అను ఫాంట్ ఉపయోగం ఏమనగా ఖర్చు ఎక్కువ మరియు ఉచితం కాదని "యూనికోడ్" వలన స్వంతగా ఎవరికివారు అచ్చు వేయడానికి యునిక్వర్ట్ చాలా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ రెండిటి మధ్య భేధాన్ని వివరిస్తూ అనేక రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. వక్త మరియు ప్రేక్షకులకు మధ్య "అనూ" మరియు "యూనికోడ్" గురించి వాగ్వాదాలు జరిగాయి. ఈ విధంగా మధ్యాహ్న విభాగం ముగిసింది.

సత్యవేడు శాసన సభ్యులు శ్రీ తలారి ఆదిత్య గారికి జ్ఞాపికను అందజేస్తున్న టి. సుజాత/ఎల్లంకి భాస్కర నాయుడు/వేదికపై వున్న వారు శ్రీ సం.వెం.రమేస్, డా. సాకం నాగరాజ, మరియు ఆచార్య రంగనాయకులు.

ముఖ్య అతిధి

[మార్చు]

సత్యవేడు శాసన సభసభ్యులు 'ఆదిత్య' గారు వికీపీడియా 11వ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైనారు. నేటి యువతంతా ఆంగ్ల భాషపై మోజతో తెలుగును మర్చిపోయి ఆంగ్ల భాషవైపు మొగ్గు చూపుతున్నారని.. అలా కాకుండ తెలుగు అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. తెలుగు దేశం యొక్క మానిఫెస్టోను తెలుగు వికీపీడియాలో చేర్చేందుకు అయన సహకరిస్తానని తెలిపారు. నేడు తెలుగు భాషను రక్షించేటువంటి భాధ్యత అందరిపైనా ఉందని ఆయన సభలో తెలియజేశారు. ఇదే విధంగా వికీపిడియా గురించి అవగాహన కల్పించేలా కృషిచేయాలని ఆయన తెలియజేశారు. అనంతరం తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ ఉపాధ్యక్షులైన టి. సుజాత గారు ఆదిత్య గారికి 11వ వార్షికోత్సవ జ్ఞాపికను అందజేశారు.

గత సంవత్సరం వికీ విజయాలు, సింహావలోకనం

[మార్చు]

కొమ్మర్రాజు లక్ష్మణరావు అవార్డు గ్రహిత టి. సుజాత గారు గత సంవత్సరం వికీపీడియా సాధించిన విజయాలను గురించి ఈ సభలో మాట్లాడారు. తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం - 2013 ను గురించి మరియు దశాబ్ది మహోత్సవాలను గురించి పేర్కొన్నారు. ఆఫ్ వికీ, ఆన్ వికీలలో చురుకుగా పాల్గొన్నవారి శ్రమ మరియు వారు సాధించిన విజయాల గురించి వివరించారు. అంతేకాకుండా హైదరాబాదులో జరిగినన పుస్తక మహోత్సవాలలో భాగంగా తెలుగు వికీపీడియా ప్రదర్శనశాలను గురించి దానియందు సాధించిన విజయాలను గుర్చి పేర్కొన్నారు. వికీ శిక్షణ శిబిరాలను నిర్వహించటంలో సహ వికీపీడియన్లు చేసిన కృషిని కొనయాడారు. విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో, కె.బి.యన్ కళాశాలలందు శిబారలను నిర్వహించి విజయాన్ని సాధించారని అందులో పాల్గొన్న విధ్యార్ధిని, విద్యార్ధులను అభినందించారు. వారికి ప్రోత్సాహించిన అధ్యాపకులకు అభినందనలు కళాశాలల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా ఇంకా వికీపీడియా అభివృద్ధికి కృషి చేయాలని, ప్రోత్సాహించాలని కోరారు.

సాకం నాగరాజు గార్ల పుస్తక ఆవిష్కరణ, ఉపన్యాసాలు

[మార్చు]

ఈ కార్యక్రమంలో ఆచార్య రంగ నాయకులు, డా. సాగం నాగరాజు మరియు సం.వెం.రమేష్ లు అతిధులుగా విచ్చేశారు. విష్ణువర్ధన్ గారు వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా మట్లాడారు, దేశం మొత్తంమీద వికీపీడియాను అభివృద్ధి పరచడానికి నాలుగు పట్టణాలు ముందున్నాయని అయన పేర్కొనారు. అవి ఏమనగా, బెంగుళూరు, హైదరాబాదు, తిరుపతి, విజయవాడ పట్టణాలను గురించి తెలియజేస్తూ ఆ ప్రాంతాలనుండి వచ్చిన వారందరిని అభినందిస్తూ వికీపీడియా అభివృద్ధి పరిచేందుకు ఇంకా ప్రోత్సాహం అందించాలని మిగిలిన వారికి అవగాహన కల్పించమని కోరారు. వికీపీడియాకు సంబంధించిన ఎలాంటి సందేహాలు వచ్చినా వారిని సంప్రదించవచ్చని , అందుకు వారు, వారియొక్క సిబ్బంది సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.

ఆచార్య రంగ నాయకులు మాట్లాడుతూ..... ............. ............. ..........

సాకం నాగరాజ మాట్లాడుతూ... తిరుపతి లో స్థానికంగ మరియు పరిసర ప్రాంతాలలో వున్న విద్యావంతులను, ఉత్సాహ వంతులకు, వికీపీడియా లో వ్రాయడానికి శిక్షణ ఇస్తే చాల మంది వికీమీడియాలో చేరి తమ వంతు సహకారం అదిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాకం నాగరాజ తాను రచించిన పిల్లల పుస్తకము (బాపు బొమ్మలతో) కాపీ రైట్ హక్కులతో వికీ సోర్స్ కు ఇచ్చారు.

కలువకుంట నారాయణ పిల్లై/ హోసూరు

[మార్చు]

డా: రాజశేఖర్ ..... ఈసభలకు (అతిధిగా అహ్వానించ బడిన) హోసూరు నుండి వచ్చిన నారాయణ పిల్లై గారిని సభకు పరిచయం చేస్తూ...... తాను విక్షనరీలో వ్రాస్తున్నప్పుడు ఎదురైన భాషా సంబందమైన సందేహాలకు చాల చక్కని సలహాలనిచ్చారని కొనియాడారు. దానికి నారాయణ పిళ్ళై గారు స్పందిస్తూ...... స్వతహాగా డాక్టరైన రాజశేఖర్ గారు తెలుగు పండితులలో కూడ చర్చకు రానటువంటి భాషా సంభందిత సందేహాలను అడిగే వారని.... వాటన్నిటికి సమాదానాలు చెప్పానని.... తెలుగు భాషా పండితుడు కాని డాక్టర్ రాజశేఖర్ గారు తెలుగు భాష పై ఇంత మమకారము పెంచుకోవడము ఎంతో ఆనంద దాయకమని అన్నారు.

తెవికీ క్విజ్

[మార్చు]

ఉదయం నుండి ఉపన్యాసాలతో అలసిన వికీ మిత్రులకు ఆటవిడుపుగా మల్లాది కామేశ్వరరావు క్విజ్ మాస్టర్ గా వికీ క్విజ్ నిర్వహణ జరిగింది. సరదా కొరకు మాత్రమే నిర్వహించిన ఈ పోటీలో ఐదు గ్రూపులుగా విడగొట్టబడ్డాయి. ఇ.భాస్కరనాయుడు, సుల్తాన్ ఖాదర్, వై.వి.ఎస్. రెడ్డి, పాలగిరి మరియు రాజశేఖర్ గార్ల ఆధ్వర్యంలో బృందాలు పొటీపడ్డాయి. గ్రూపులను చీటీలు వేసి రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు మరియు ఆంజనేయస్వామి గా నామకరణం చేశారు. రాముడు గ్రూపుగా ఎంపికైన వై.వి.ఎస్. రెడ్డి గ్రూపునకు మొదటి ప్రశ్న (తిరుమలలో వున్న డ్యాం పేరు ఏమిటి) వేయగా వై.వి.ఎస్.రెడ్డి గ్రూపుతో చర్చించకుండానే సమాధానం (గోగర్భ డ్యాం) ఇచ్చాడని సమాధానం సరైనది అయినా దానికి మార్కులు ఇవ్వలేదు. మళ్ళీ రౌండ్ లో వై.వి.ఎస్.రెడ్డి గ్రూపునకు వచ్చిన ప్రశ్నకు వై.వి.ఎస్.రెడ్డి సమాధానం ఇది అని గ్రూపుతో చెప్పినను గ్రూపు అంగీకరించడంలో జాప్యం వలన ఆ ప్రశ్న ఆంజనేయస్వామి గ్రూపుగా ఎంపికైన పాలగిరి గ్రూపునకు వెళ్ళింది. అప్పుడు ఆ ప్రశ్నకు (హుద్ హుద్ తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రాంతం ఏది) గట్టిగా వై.వి.ఎస్.రెడ్డి సమాధానం (కైలాసగిరి) చెప్పినను టైం అయిపోయిన తరువాత చెప్పినారు అని ఆ ప్రశ్నకు మార్కులు వేయలేదు. ఆ తరువాత క్విజ్ బాగా ఆసక్తిగా కొనసాగింది. క్విజ్ లో చివరి ప్రశ్న వై.వి.ఎస్.రెడ్డి గ్రూపునకు వచ్చినది. ప్రశ్న ఏమిటంటే సరోజినీనాయుడు ఏ సంవత్సరం ఏ తేదిన జన్మించారు. క్విజ్ నిర్వాహకులు తేదితో సహా ఈ ప్రశ్నకు సమాధానం చెబితే 2 మార్కులు లభిస్తాయని తెలియజేశారు. వై.వి.ఎస్.రెడ్డి గ్రూపులో వున్న ప్రణయ్‌రాజ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంతో వై.వి.ఎస్.రెడ్డి గ్రూపునకు ఒకేసారి 2 మార్కులు లభించాయి. తరువాత నిర్వాహకులు మార్కులను లెక్కించి వై.వి.ఎస్.రెడ్డి గ్రూపునకు అధిక మార్కులు లభించాయని విజేతగా వై.వి.ఎస్.రెడ్డి గ్రూపునకు ఒక చిన్న బహుమతిని అందజేశారు. బహుమతిని అందుకున్న వై.వి.ఎస్.రెడ్డి తరువాత ఆ బహుమతిని ప్రణయ్‌రాజ్ ని తీసుకోమని కోరగా ప్రణయ్‌రాజ్ తీసుకోలేదు. కార్యక్రమం ఆద్యంతమూ మల్లాది కామేశ్వరరావు గారి హాస్యభరిత వ్యాఖ్యానాలు సభికులను కడుపుబ్బా నవ్వించాయి. తరువాత దానికి కొనసాగింపుగా సైగలతో విషయాన్ని తెలియజేసే కార్యక్రమం (డం షరేడ్స్ Dumb Charades) జరిగింది.

తెవికీ భవిష్యత్ ప్రణాళిక (తెవికీ సభ్యుల చర్చ)

[మార్చు]
తెవికీ భవిష్యత్ ప్రణాళిక (తెవికీ సభ్యుల చర్చ)

తెలుగు వికీపీడియా, మరియు దాని సోదర ప్రాజెక్టులలో 2015 వ సంవత్సరములో చేయవలసిన అభివృద్ధి గురించి చర్చకోసం రాత్రి భోజన అనంతరం వికీపీడియస్లు సమావేశమయ్యారు. దీనికి విష్ణువర్ధన్ గారు అధ్యక్షత వహించగా, రాజశేఖర్, ఇ.భాస్కరనాయుడు, టి. సుజాత, సుల్తాన్ ఖాదర్, గుళ్ళపల్లి నాగేశ్వర రావు, పాలగిరి, విశ్వనాధ్, శ్రీరామమూర్తి, రాజశేఖర్,, నాయుడుగారి జయన్న, మల్లాది కామేశ్వరరావు, సి. బి. రావు, వై.వి.ఎస్. రెడ్డి, స్వరలాసిక, కశ్యప్, పవన్ సంతోష్ , ప్రణయ్ రాజ్ వంగరి, రాజ్ పల్గుణ్ లు పాల్గొన్నారు. అందులో చర్చించిన అంశాలు.

  1. వికీ సోర్స్ లో తెలుగు వికీపీడియా ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. అయితే మనం వికీలో చేస్తున్న ప్రాజెక్టులు ఏ ఒక్కరివి అనికాకుండా అంతా కలిసి వాటిపైన దృష్టిపెడితే బాగుంటుంది. ఇప్పటికీ పని అంతగా జరగని వికీకోట్స్ వంటి విభాగలలో ఈ సంవత్సరంలో నైనా కొంత పని జరగాలి. -ఇ.భాస్కరనాయుడు
  2. మన బలం, బలహీనతలు ఎంటో చూసుకోవాలి. యూజర్స్ ని బట్టి వికీ ఉండాలా ? వద్దా ? అన్నది గమనించాలి.- విష్ణువర్ధన్
  3. మీడియా, పత్రికల ద్వారా జనంలోకి వెళ్లాలి. - రాజశేఖర్, మల్లాది కామేశ్వరరావు, పవన్ సంతోష్
  4. ఇతర భారతీయ భాషల కమ్యూనిటీ సభ్యులు ఇండియా మేయిలింగ్ లిస్ట్ లో, మెటా పేజీలలో పార్టిసిపేట్ చేస్తారు. మనంకూడా అలా చెయ్యాలి. నెలవారి సమావేశాల విషయాలు ఇంగ్లీష్ లో రాసి ఇండియన్ మేయిలింగ్ లిస్ట్ కి పంపించాలి. - విష్ణువర్ధన్
  5. వికీ వార్తను మళ్లీ కొనసాగించాలి. - సుల్తాన్ ఖాదర్, వై.వి.ఎస్. రెడ్డి
  6. జూన్ లోపు రాయలసీమ ప్రాంతంలో 7-9 వికీ శిక్షణ శిబిరాలు, ఒక వికీ సమావేశం నిర్వహించాలి. - విష్ణువర్ధన్
  7. ఆప్ వికీలో లీడర్ షిప్ ఉండడంలేదు. హైదరాబాద్ లో జరిగే సమావేశాలకు ఇతర వికీపీడియన్లు రావడంలేదు. ఇతర ప్రాంతాలలో కూడా వికీ సమావేశాలు నిర్వహించాలి. - రాజశేఖర్
  8. తెలుగు వికీపీడియన్లు సాంకేతికపరంగా కొంత నేర్చుకోవలసి ఉంది. దానికోసం శిక్షణ కార్యక్రమం ఉంటే బాగుంటుందని రాజశేఖర్ కోరారు. మరికొద్ది రోజుల్లో సి.ఐ.ఎస్. వారు మీడియా వికీ శిక్షణా శిబిరం ఉంటుందని, ఆసక్తి ఉన్నవాళ్లు దానిలో పాల్గొనవచ్చని విష్ణువర్ధన్ సూచించారు. ఆ శిక్షణా శిబిరంలో పవన్ సంతోష్ , రాజ్ పల్గుణ్, తరుణ్ సత్య లు ముందుకు వచ్చారు.
  9. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్స్ లో వికీపీడియా గురించి పోస్ట్ చేస్తే ఇతర వికీపీడియన్లనుండి స్పందన ఉండడంలేదు. మీరు స్పందిస్తే వికీపీడియన్లు కానివారు కూడా స్పందించే అవకాశం ఉంటుంది.

15 వతేదీ కార్యక్రమం

[మార్చు]

ఉదయ ఫలహార అనంతరం తిరిగి సమావేశము ప్రారంభమైంది.

జ్యోతి ప్రజ్వలన చిత్రమాలిక

జ్యోతి ప్రజ్వలన అనంతరం

రెండవ రోజు ప్రారంభంలో ఈ వేడుకలకు వచ్చిన ఆంధ్ర లయోల కళాశాల విద్యార్ధులు వికీపీడియా లో వారి యొక్క అనుభవాలను గూర్చి, వికీపీడియాలో ఇప్పటివరకు వారేంనేర్చుకున్నారు అనే విషయాలను తెలియ జేశారు. ఇందులో నాయక్, జానీ భాషా, సూర్య కిరన్ వారు వారి యొక్క అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.

యూనికోడు గురించి వివరిస్తున్న కశ్యప్

వికీపీడియా లో పెద్దవారైన అనుభవంగల వ్యక్తి అయిన విష్ణుగారు అను ఫాంట్, యునీ కోడ్ యొక్క ఉపయోగాలు దాని ప్రధాన్యత వికీపీడియాలో డీ కోడ్ మరియు యూని కోడ్, నాన్ యూనికోడ్ గూర్చి తెలియజేశారు. బైట్ ,ఎంబీ, జిబీ, కేబీ అంటే ఏమిటో బిట్లో ఏమింటుంది ఎంబీలో ఏముంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. iscii అంటే ఏమిటో అందులో 8 బైట్స్ లో మొత్తం ఆంగ్ల అక్షరలు టైపు చేసినప్పుడు 256 స్పేసెస్ వస్తాయి. దీనిని 8 బైట్స్ కంప్యూటర్ అని చెప్పుకుంటున్నారు.అను అనేది కేవలం ప్రింటింగ్ ప్రెస్ వారికి మాత్రమే ఉపయోగ పడుతుందని వివరించారు.యూని కోడ్ అనేది బైట్ కంప్యూటర్ నుండి మొదలై (2)34 యూని కోడ్ అనేది ప్రారంభమై మొత్తం నేటి సమాజంలో విస్తరించిందని వివరించారు. యూనికోడ్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే వెళ్ళలేదు కారణం వారందరూకూడ అనూను మాత్రమే ఉపయోగిస్తున్నారు అని తెలియజేశారు.

యూనిక్ కోడ్ వాడుకలో పాటించవలసిన స్వతంత్రాలు ♣freedom to use ♣freedom to study ♣freedom to modify ♣freedom to utilize

పవన్ కుమార్ గారు వికీపీడియాలో మనకు కావలసిన విషయాలను, అంటే వ్యాసాలు, అనేకరకమైన కధలు, ప్రసిద్ధ ప్రదేశాలను గురించి, చారిత్రక విషయలను, మాత్రమే కాకుండ మనకు ఆనందాన్ని కలిగించే అంశాలను కూడ ఇందులో చేర్చవచ్చునని, ఇటువంటివి ఇప్పటికే చాలా వున్నయని తెలియజేశారు.

  • www.oocities.org/vnagajuna/padma
  • padma unicode converter
  • eemaata
తెవికీ 11 గ్రూప్ ఫోటో

ఫోటో కార్యక్రమం

[మార్చు]

మధ్యాహ్న భోజన అనంతరం హజరైన సభ్యులందరితో ఫోటో కార్యక్రమం జరింగింది. అయితే ఒక్క గ్రూప్ ఫోటో దిగడానికే కనీసం 5 ని.అ సమయం కేటాయించవలసి వచ్చింది. కారణమేమంటే గ్రూప్ ఫోటో కాబట్టి అందరూ తమ కెమెరాలకు పని చెప్పారు. సి.ఐ.ఎస్. తరపున వచ్చిన తన్వీర్ కి తమతమ కెమెరాలు అప్పగించారు. తన్వీర్ చాలా ఓపికగా అన్ని కెమెరాల్లో గ్రూప్ ఫోటో బంధించారు. అంతసేపు నిలబడడం మాకు కాస్త కష్టంగా ఉన్నా... మంచి అనుభవాన్ని మిగిల్చింది.

తెవికీ భవిష్యత్ ప్రణాళిక (సమావేశానికి హాజరైన వారందరి చర్చ)

[మార్చు]
తెవికీ భవిష్యత్ ప్రణాళిక (సమావేశానికి హాజరైన వారందరి చర్చ)

నిన్న రాత్రి తెవికీ సభ్యుల మధ్య జరిగిన తెవికీ భవిష్యత్ ప్రణాళిక చర్చకు కొనసాగింపుగా... మరోసారి అందరి సూచనలు కావాలని విష్ణు కోరగా సభ్యులందరూ 5 సమూహాలుగా విడిపోయారు. ఈ కార్యక్రమ నిడివి ఒక గంటగా నిర్ణయించి, అంతర్గత చర్చలకు అరగంట... సూచనలను ఇవ్వడానికి అరగంట కేటాయించారు.

  1. రాజశేఖర్ - నాయుడుగారి జయన్న, తరుణ్ సత్య, ఎం. మల్లేశ్వర నాయక్, డి. రాయ్ కుమార్, ఎ. మస్తాన్ వలీ, ఇ. నాగేశ్వర రావు, వెన్నెల.
  2. టి. సుజాత - పవన్ సంతోష్ , సి. బి. రావు, కశ్యప్, మల్లాది దివ్య, వల్లూరి హారిక, యువరాణి, దివ్య అనూష, గౌస్ మొహిద్దీన్.
  3. సుల్తాన్ ఖాదర్- ఇ.భాస్కరనాయుడు , విశ్వనాధ్, విజయ విశ్వనాధ్, గుళ్ళపల్లి నాగేశ్వర రావు, జానీబాషా, బాబావలీ.
  4. మల్లాది కామేశ్వరరావు - వై.వి.ఎస్. రెడ్డి, ప్రణయ్‌రాజ్ వంగరి, కల్లూరి శ్రీనివాసరావు, రాజ్ పల్గుణ్, పి. వెంకటేష్, ఎం. యాసిన్, టి. సూర్య కిరణ్,
  5. పాలగిరి - శ్రీరామమూర్తి, స్వరలాసిక, శ్రీధర్, రమేష్, గోపి మొగిలి.

ఈ 5 సమూహాలు అరగంటపాటు చర్చించుకున్న తర్వాత, ఒక్కో సమూహంనుండి ఒక వికీపీడియన్ వచ్చి వారి సమూహంలో చర్చించుకున్న అంశాలను అందరి ముందుంచాల్సిందిగా విష్ణు కోరారు.

రాజశేఖర్ సమూహం
  1. కందుకూరి వారి రచనలు మరియు తెలుగు ప్రముఖుల వ్యాసాలు - ఎం. మల్లేశ్వర నాయక్, డి. రాయ్ కుమార్, పి. వెంకటేష్, డి. జానీ బాషా, బాబావలీ.
  2. లంబాడి వారి భాషా, సంస్కృతి గురించిన వ్యాసాలు ఎం. మల్లేశ్వర నాయక్ రాస్తానని చెప్పగా.. చరిత్ర గురించి పరిశోధన చేస్తున్న కట్టా శ్రీనావాసరావు ని పరిచయం చేస్తానని పవన్ సంతోష్ , లంబాడి వారి భాషా, సంస్కృతి గురించిన పుస్తకాలు ఉన్నాయని సి. బి. రావు సూచించారు. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు కాబట్టి ఇంకొంతమందికి వికీ శిక్షణ ఇస్తే బాగుంటుందని విష్ణు అన్నారు. తనతోపాటు ఈ పని చేయడానికి ఇంకా ఇద్దరు ఉన్నారని ఎం. మల్లేశ్వర నాయక్ చెప్పాడు.
  3. సాంఖ్యాకశాస్త్రము (స్టాటిస్టిక్స్) ప్రాజెక్టు ఎ. మస్తాన్ వలీ... సహకారం ఎం. యాసిన్.
  4. పూర్వగాథాలహరిలో ఉన్న పేర్లతో వికీ వ్యాసాలను సృష్టించడం ఇ. నాగేశ్వరరావు ...సహకారం కల్లూరి శ్రీనివాసరావు.
  5. నల్గొండ జిల్లా గ్రామ వ్యాసాల అభివృద్ధి వెన్నెల... సహకారం పవన్ సంతోష్ , ప్రణయ్‌రాజ్ వంగరి.
  6. ఆయుధాల తయారి వ్యాసాలు తరుణ్ సత్య...సహకారం పవన్ సంతోష్ , జానీబాషా (ప్రాథమిక వ్యాసాలుగా రాయాలి).
  7. మహబూబ్ నగర్ జిల్లా మరియు తెలంగాణ సంస్కృతి కి సంబంధించిన వ్యాసాలు నాయుడుగారి జయన్న.
టి. సుజాత సమూహం
  • సి.బి.రావు: వ్యక్తిగతంగా పరిచయం, స్నేహం ఉన్న ప్రముఖ రచయితల ఫోటోలు, ఆటోగ్రాఫులు సేకరించి వాటిని వికీకామన్స్ లో చేర్చి, వారి గురించి మొలక స్థాయి దాటే వ్యాసాన్ని సృష్టించి వీటిని అందులోకి చేర్చడం. తనకు విమాన ప్రయాణంలో తగిలిన ప్రముఖల ఫోటోలు తాను కూడా చేరుస్తానని విష్ణు, తనకు తెలిసిన కవుల ఫోటోలు తాను తీసి పెడతానని ప్రణయ్‌రాజ్ వంగరి తెలిపారు. ఫోటోలతో పాటుగా వారి గురించి కొద్ది సమాచారాన్ని ఆడియో రూపంలో రికార్డు చేసిపెట్టాల్సిందిగా పేర్కొన్నారు.
  • వల్లూరి హారిక: గుంటూరు జిల్లా గ్రామవ్యాసాల్లో సమాచారాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నాను. గుంటూరు అన్నమయ్య గ్రంథాలయంలో గుంటూరు జిల్లా గురించి సమగ్రంగా ఓ పుస్తకం ఉంది. దానిని కోట్ చేసి రాస్తాను. అన్నమయ్య గ్రంథాలయంలోని పుస్తకాల నుంచి సిబిరావు గారు పెట్టే ఫోటోల తాలూకు రచయితల గురించిన వివరాలు ఇస్తాను.
  • యువరాణి: బి.జెడ్.సి. చదువుతున్నాను. నా పాఠ్యాంశాల్లో అర్థమైనవాటి గురించి వికీలో వెతికి ఒకవేళ లేకుంటే వాటిని తయారుచేస్తాను. రాజ్ పల్గుణ్ సహకరిస్తానన్నారు.
  • కశ్యప్: తెలుగు వికీపీడియాలో వ్రాయడం ద్వారా నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలు వివరిస్తూ యూనివర్శిటీ విద్యార్థులకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, పుస్తకాల పండుగల్లో స్టాల్స్ నిర్వహించడం. ప్రణయ్ రాజ్, సిఐఎస్‌లు ముందుకువచ్చారు.
  • గౌస్ మొహియుద్దీన్: మా ప్రాంతానికి సంబంధించి వికీపీడియాలో ఏముందో ముందు చూసి. ఆపైన నేనేం రాయాలో నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తాను.
  • మల్లాది దివ్య: వంటల గురించి పేజీలను అభివృద్ధి చేయదలుచుకున్నాను. శాకాహారం గురించి రాస్తాను. భోజనాలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేస్తాను.
  • టి. సుజాత: ఆంగ్ల వికీపీడియా నుంచి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యాసాలను 12 అనువదిస్తాను. నాయక్, వెంకటేష్ సహకరిస్తానన్నారు.
  • పవన్ సంతోష్: వికీపీడియాలో తెలుగు సినిమా వ్యాసాలు, వికీసోర్సులో కాపీరైట్లు లేని సినిమా పాటల పుస్తకాలు, వికీకోట్ లో సినిమాల నుంచి వ్యాఖ్యలు. కొన్ని లెజెండరీ మూవీస్ 25, 30, 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా పలు పత్రికల్లోని సినిమా పేజీల్లో వ్యాసాలు వస్తాయి. ప్రముఖ దినపత్రికల ఆదివారం మేగజైన్ల నుంచి సినిమాల నిర్మాణం గురించి, పాటల రచన గురించి వ్యాసాలు వస్తూంటాయి. విభిన్నమైన, విలువైన చలన చిత్రాల గురించి నవతరంగం.కాంలో వ్యాసాలున్నాయి. కొత్త సినిమాల గురించి ఎలానూ వివిధ సోర్సులు ఇప్పటికే వున్నాయి. వాటన్నిటి ద్వారా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తాను. అనంతరం అన్నం మస్తాన్ వలీ, వల్లూరి హారిక, నాగేశ్వరరావు, సుల్తాన్ ఖాదర్, సూర్యకిరణ్, ప్రణయ్‌రాజ్ వంగరి సహకరిస్తామని ముందుకువచ్చారు. సినిమాల గురించిన రూపవాణిని తాను అందజేస్తానని విష్ణుగారు వివరించారు.
సుల్తాన్ ఖాదర్ సమూహం
  1. బొమ్మలు లేని వ్యాసాలు గుర్తించి ఫోటోలను ఎక్కించడం విశ్వనాధ్, సుల్తాన్ ఖాదర్... సహకారం రాజశేఖర్, విష్ణు, వై.వి.ఎస్. రెడ్డి, వల్లూరి హారిక.
  2. ఎన్.సి.సి కి సంబంధించిన వ్యాసాలు జానీబాషా.
  3. ఢిల్లీ లోని తెలుగు అసోసియేషన్ తో మాట్లాడి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారితో తెలుగు వికీపీడియా సమావేశాలు నిర్వహించాలి. హైదరాబాద్ లో జరిగే సమావేశాలకు ఇతర వికీపీడియన్లు రావడంలేదు. ఇతర ప్రాంతాలలో కూడా వికీ సమావేశాలు నిర్వహించాలి గుళ్ళపల్లి నాగేశ్వర రావు.
  4. ఆరు నెలలకొకసారి సాంకేతిక శిక్షణా శిబిరాలు పెట్టాలి.
  5. వికీ సోదర ప్రాజెక్టులలో ఇంకా కృషి జరగాలి.
  6. వికీలో ఎలా రాయాలి, ఏంఏం చేయోచ్చు అన్న విషయాలతో ఇంగ్లీష్ లో ఉన్న విధంగా తెలుగులో వీడియోలు తయారు చెయ్యాలి.


మల్లాది కామేశ్వరరావు సమూహం
  1. హార్డ్ వేర్ కి సంబంధించిన ప్రాజెక్టు వై.వి.ఎస్. రెడ్డి.
  2. తెలుగు పండుగలు ప్రాజెక్టు (చరిత్ర, ప్రసిద్ధి సంబంధింత వివరాలు.. ఫోటోలు, వీడియోలు ఎక్కించుట.. పండుగల గురించి కాలెండర్ తయారు చేయడం..) (వికీసోర్స్ లో పండుగలు-పరమార్ధాలు అనే పుస్తకం ఉంది)
పాలగిరి సమూహం
  1. వికీసోర్స్ లో రచనలు శ్రీరామమూర్తి.
  2. అన్నమయ్య గ్రంథాలయంలోని పుస్తకాల లిస్ట్ మరియు రైల్వే వివరాలు గోపి మొగిలి...సహకారం విశ్వనాధ్.
  3. పత్రికల వ్యాసాలు స్వరలాసిక... సహకారం రాజశేఖర్, పవన్ సంతోష్ .
  4. 150 వ్యాసాల నాణ్యత, మూలాలు చేర్చడం, చురుకుగా పాల్గొంటూ కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం పాలగిరి.

తెవికీ 11వ వార్షికోత్సవాల మగింపు సమావేశం

[మార్చు]

సాయంకాల సమయం టి విరామం తర్వాత తెవికీ 11వ వార్షికోత్సవాల మగింపు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యనిర్వాహణ కమిటీ అధ్యక్షలు ఇ.భాస్కరనాయుడు గారు అధ్యక్షత వహించగా, సీనియర్ సభ్యులు పాలగిరి గారు, తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యనిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌రాజ్ వంగరి లు పాల్గొన్నారు.

ముందుగా విష్ణు గారు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ రెండు రోజుల్లో జరిగిన కార్యక్రమాల గురించి సూక్ష్మంగా వివరించారు. అనంతరం అవార్డు, ప్రశంసా పత్రాల ప్రదాన కార్యక్రమం జరిగింది.

విశిష్ట వికీపీడియన్ అవార్డు, ప్రశంసా పత్రాల ప్రదానం

[మార్చు]

విష్ణుగారు విశిష్ట వికీపీడియన్ అవార్డు పొందిన వికీపీడియన్లను వేదిక మీదకు ఒక్కొక్కరుగా పిలిచారు. రాజశేఖర్, టి. సుజాత, సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ లకు పాలగిరి గారు జ్ఞాపికను అందించగా... ఇ.భాస్కరనాయుడు గారు, ప్రణయ్ రాజ్ వంగరి లు ప్రశంసా పత్రాలను అందజేశారు. విశిష్ట వికీపీడియన్ గా ఎంపికైన వెంకటరమణ గారు సమావేశానికి హాజరుకాకపోవడంతో, ఆయన తరపున పాలగిరి రామకృష్ణారెడ్డి అందుకున్నారు..

అనంతరం తెవికీ 11వ వార్షికోత్సవాలకు హాజరైన విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు.

విశిష్ట వికీపీడియన్ అవార్డు చిత్రమాలిక

వందన సమర్పణ

[మార్చు]

............ ........... ........... ..........

జాతీయ గీతాలపనతో సభ సమాప్తము

[మార్చు]

చివరగా సభికులందరూ మన జాతీయగీతమైన జనగణ మన అధినాయక జయహే..... అంటూ జాతీయగీతాలాపనతో సభ సమాప్తమైంది.

తదనంతరం రాత్రి భోజన విరామం

తిరుపతి రోడ్లపై తెవికీ యాత్ర

[మార్చు]
తిరుపతి రోడ్లపై తెవికీ యాత్ర
బహుమతులతో విజేతలు

రాత్రి భోజన అనంతరం తిరుపతి లోని ప్రముఖ స్థలాలకు వెళ్లాలని మాలో కొందరు కోరగా మా అందరికి దగ్గరలోని ప్రదేశాలను చూపించే బాధ్యతను కశ్యప్ తీసుకున్నారు. ఆయనకు తోడుగా పవన్ సంతోష్ , విజయ విశ్వనాధ్ లు సహకరించగా యువతరం వై.వి.ఎస్. రెడ్డి, ప్రణయ్‌రాజ్ వంగరి, రాజ్ పల్గుణ్, తరుణ్ సత్య, బాబావలీ, టి. సూర్య కిరణ్, ఎం. యాసిన్, జానీబాషా, పి. వెంకటేష్, ఇ. నాగేశ్వర రావు, ఎ. మస్తాన్ వలీ, డి. రాయ్ కుమార్, గోపి మొగిలి, ఎం. మల్లేశ్వర నాయక్, యువరాణి, దివ్య అనూష, వల్లూరి హారిక, వెన్నెల లు బయలుదేరాము.

మాలో చాలామంది వికీ టి షర్ట్స్ ధరించి ఉండడంవల్ల అంతా మమ్మల్ని కొత్తగా చూస్తున్నారు. అది మాలో ఇంకా ఉత్సాహాన్ని నింపింది. అది చూసిన కశ్యప్ గారు తన మొదడుకు పదును పెట్టి మాతో వికీ రైలు యాత్ర చేయించారు. దాన్ని రాజ్ పల్గుణ్ కెమెరాలో బంధించాడు.

అప్పటికే భోజనం చేసి ఉన్నాం... ఇంకా కొద్ది దూరమే..ఇంకా కొద్ది దూరమే అంటూ కశ్యప్ గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. అలా అలా కనీసం ఒక 3 కి.మీ దూరం నడిచుంటాము.

చివరికి గోవిందరాజుల స్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. ఆలయం ముందుభాగంలో చిన్నచిన్న దుకాణాలు ఉన్నాయి. అమ్మాయిలు వాటిని చూస్తూ అక్కడే ఉండిపోవడంతో అబ్బాయిల్లో కొంతమంది వారికి తోడుగా ఉన్నారు. ఈలోగా కశ్యప్, పవన్ సంతోష్ మరికొంతమంది కలిసి గుడి ముందుకు వెళ్లారు.

2 ని.ల తర్వాత అందరూ రావడంతో గుడి ముందరి ప్రాంతానికి వెళ్లాము. కాని అప్పటికే గుడి మూసివేయడం జరిగింది. ఇంతదూరం వచ్చాక ఏంచేయకుండా వెలితే బాగోదని కశ్యప్ గారు ఒక గేమ్ ప్రతిపాదన చేశారు. అది ఏంటంటే గుడి ముందు ఒక శిలా ఫలకంపై ఆ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఉంది. దానిలో ఉన్న కథని ఒక ప్రత్యేక శైలీలో చెప్పాలని, అందరిలో ఎవరూ మంచిగా చెబితే వారికి బహుమతులు ఉంటాయని చెప్పారు.

ముందుగా ట్రయల్ షూట్ లో భాగంగా కశ్యప్ గారు తన శైలీలో చెప్పారు. అనంతరం పవన్ సంతోష్ రావుగోపాలరావు గారి శైలీలో, ప్రణయ్‌రాజ్ వంగరి చంద్రబాబు, వైయస్సార్ శైలీలో, వెన్నెల రేడియో జాకీ శైలీలో ఇంకా కొంతమంది వివిధ రకాల శైలీలలో చెప్పారు. పవన్ సంతోష్ రావుగోపాలరావు గారి శైలీలో చెప్పడంతో మిగతావారందరు ఒక్కసారిగా నవ్వారు. అలా మేం చేస్తున్న అల్లరిని గుడికి వచ్చినవారు వింతగా చూడడం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసు ‘‘ఈ సమయంలో ఏంటీ ఈ అల్లరి’’ అని వారించడంతో ఆయనకు సర్దిచెప్పి, నిశ్శబ్దంగా అక్కడినుండి బయలుదేరాము.

బయటికివచ్చినతర్వాత గుడిముందు ఉన్న దుకాణాల్లో ఒక దుకాణంకి తీసుకెళ్లి వెంకటేశ్వరస్వామి ఉన్న చిన్న బొమ్మలను కశ్యప్ గారు పోటీలో పాల్గొన్న అందరికి బహుమతులను అందజేసి, ఆ పక్కనే ఉన్న దుకాణంలో అందరికి శీతలపానీయాలను తాగించారు.

ఇక అందరి షాపింగ్ అయిపోయింతర్వాత విజయ విశ్వనాధ్, యువరాణి, దివ్య అనూష, వల్లూరి హారిక, వెన్నెల లను ఆటోలో పంపించి, మిగతావారందరం నడుచుకుంటూ హోటల్ కి వచ్చాము.

ఈ విధంగా కశ్యప్ గారి సారధ్యంలో పవన్ సంతోష్ , విజయ విశ్వనాధ్ ల సహకారంతో తిరుపతి రోడ్లపై తెవికీ యాత్ర ఆనందంగా, ఉత్సాహంగా సాగింది. కలకాలం నిలిచివుండే మధురజ్ఞాపకంగా మిగిలింది.

చిత్రమాలిక

[మార్చు]
  • తెవికీ 11వ వార్షికోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ చూడగలరు.