వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/old

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
11వ వార్షికోత్సవ సంబరాలు
11th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee

సభ్యులకు అందరకూ నమస్కారం. ఈ పేజీ తెలుగు వికీపీడియా 11 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా జరుపదలచిన కార్యక్రమ ప్రణాళికకు సంబందించినది.


విషయ సూచిక

తెలుగు వికీపీడియా[మార్చు]

విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పదకొండు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో 60 వేలకు చేరువలో ఉన్నందుకు అత్యంత ఉత్సాహంతో 11 సంవత్సరాల సంబరాలు జరుపాలని నిర్ణయింపబడినది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

తెలుగు వికీపీడియా[మార్చు]

  • వికీమీడియా ఉద్యమం 14 సంవత్సరాల క్రితం ప్రారంభమై మానవ విజ్ఞానం అంతా నిక్షిప్తం చేయాలనే నినాదం నెరవేర్చడంలో నిజానికి విజయవంతమైంది. వికీపీడియా, 287 భాషలలో, మూడున్నర కోట్ల వ్యాసాలతో, స్వేచ్ఛా సాఫ్టువేర్ ప్రతిపాదించే 4 స్వేచ్ఛలతో అందుబాటులో ఉన్న అతిపెద్ద అంతర్జాల విజ్ఞాన సర్వస్వం. అంతర్జాతీయ వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమ స్ఫూర్తితో తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2003 న 11 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈ పదకొండు సంవత్సరాల ప్రయాణంలో 60,000 వ్యాసాలు వరకు, అనేక వందల మంది స్వచ్ఛంద ఔత్సాహికుల ద్వారా అందించబడింది. నేడు తెలుగు వికీపీడియా భారతీయ భాషలలోని మొదటి మూడు (3) వికీపీడియాలలో ఒకటిగా నిలిచింది. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న వారిని గుర్తించి, అభిమానించి, సన్మానించేందుకు, తెవికీ11నిర్వాహక కమిటి వారికి ఇది ఒక మహా సదవకాశంగా ఒక గొప్ప అధికారంగా భావించి పాలుపంచు కున్నందుకు అందరినీ అభినందిస్తున్నాము. మేము ఈ ఉత్సవం సందర్భంగా మొత్తం సమాజానికి తైకీ గురించి చాటి చెబుతూ, మరింత మంది ఔత్సాహికులను ఈ సమిష్టి యజ్ఞంలో భాగస్వాములను చేద్దామనుకుంటున్నాము.

(గమనిక: తెలుగులో అనువాదం అవసర మయితే అర్థవంతముగా మరింత అభివృద్ధి పరచగలరు.)

  • Wikimedia movement that started 13 years ago was indeed successful in fulfilling its motto of summing up all human knowledge. With 285+ languages and 2.6 crore article count, Wikipedia is the biggest such online encyclopedia available that comes with all the 4 freedoms of free software! Telugu Wikipedia that started with the same spirit 10 years ago on December 10, 2003. The ten years of journey saw 54,000 articles, contributed by hundreds of Volunteers. Today it stands among the top 3 Wikipedias in Indian languages. To recognise, appreciate and felicitate those who have been part of this Bigger Mahayajna is a great privilege that the organising committee of the Tewiki10 celebrations holds. We hope that this event would bring together the whole community and enable more collaborative projects at Tewiki. (ఆంగ్లము)

11 సంవత్సరాల ఉత్సవాలు ఎందుకు[మార్చు]

  1. తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
  2. తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
  3. బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు

ఎందుకు ఉత్సవాలు ?[మార్చు]

  1. తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు సహకార ప్రాజెక్టులు వ్యాప్తిలోకి తెచ్చేందుకు కృషి.
  2. వికీపీడియా సహాయకులు (కంట్రీబ్యూటర్స్) అందర్నీకలిపి ఒక వేదిక పైకి తీసుకురావడం.
  3. తెవికీ వినియోగదారులు ఈ ఉచిత ఎన్సైక్లోపీడియా నుండి ఏమి పొందేందుకు ఆశిస్తున్నారో తెలుసుకోవడం.

కార్యక్రమ లక్ష్యాలు[మార్చు]

  1. తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  2. తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  3. తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  4. తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  5. తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  6. గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
  7. ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం

మహిళలకు[మార్చు]

  • ఈ కార్యక్రమానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను.
  • ఈ సమావేశంలో మహిళల కొరకు హ్యాండ్ బ్యాగులు, బొట్టు వంటివి తయారు చేస్తే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాల సమయంలో విష్ణువర్ధన్ గారు సూచించారు. హ్యాండు బాగులవంటివి ప్రచారానికి సహకరిస్తాయని నా అభిప్రాయం. ఏదశాబ్ధి ఉత్సవాల సమయానికి మహిళాసభ్యుల కొరకు అలాంటివి సిద్ధం చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తాం.--t.sujatha (చర్చ) 16:48, 3 నవంబర్ 2014 (UTC)
  • వికీపీడియా లోగోతో పొర్టుఫోలియే బ్యాగు ఇస్తే, మహిళలకు, పురుషులకు అనుకూలంగావుంటుంది. మహిళలకు ప్రత్యేకం అనేది సబబు కాదేమో ఆలోచించండి.

గుళ్ళపల్లి నాగేశ్వర రావు --వాడుకరి:Nrgullapalli 13.23, 20 నవంబర్ 2014

కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలు[మార్చు]

  1. నాణ్యత మరియు పరిమాణం పరంగా తెవికీని అభివృద్ధి చేయడం.
  2. తెవికీ కంట్రిబ్యూటర్ వాడుకదారుల పెంచడం.
  3. తెవికీ ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కీలక సమాచారం తీసుకురావడం.
  4. తెవికీ ద్వారా మరింత కొత్త రచనలు, కొత్త సహాయకులను (కంట్రిబ్యూటర్స్) తీసుకురావడానికి ప్రస్త్రుతమున్న వారిని ప్రోత్సహించడం.
  5. ప్రజల్లో తెవికీ గురించి అవగాహన తీసుకురావడం.
  6. తెవికీ ఒక ప్రపంచ ప్రత్యక్షత సృష్టించడం.
  7. తెవికీపీడియా ఆఫ్ లైన్ వాడుక ప్రారంభించడం.


కార్యక్రమ ముఖ్యాంశాలు[మార్చు]

11 వ వార్షికోత్సవ ఉత్సవాలు ఎలా వుండాలో నా వూహా జనిత కార్యక్రమము: (నిధుల లభ్యతకు లోబడి). ముందుగా తెవికీ 11వ వార్షికోత్సవాల తేదీలను నిర్ణయించాలి.

ప్రచారము:[మార్చు]

ముందుగా చేతి పుస్తకం ద్వారా /కరపత్రాలు / గోడ పత్రికల ద్వారా / ఇతర మాద్యమాల ద్వార ప్రచారం జరగాలి. చేతి పుస్తకం (hand book) కొత్తవారికి/ ఇదివరకే చేరిన వారికి రచనలు కొనసాగించేలా ప్రోత్సాహ కరంగా వుండాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించాలి. మన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కళాశాలలు, గ్రంధాలయాలు, ఇతర సంస్థల చిరునామాలు సేకరించి వారికి చేతిపుస్తకాలు/కరపత్రాలు పంపిణి చేయాలి. వారు అంగీకారంతో ఆయా సంస్థలలో మన అవగాహన కార్యక్రమము చేయవచ్చు. ఆ యాప్రాంతాలలో ప్రాంతీయంగా వున్న వున్న వికీపీడియన్లను కలుపు కోవాలి.

  • తగిన ప్రచారం రావాలంటే ప్రసార మాధ్యమాలను ఆహ్వానించి వారికి తగు ప్రోత్సాహం కల్పించే సౌకర్యాలగురించి ఆలోచించండి.

గుళ్ళపల్లి నాగేశ్వర రావు వాడుకరి: Nrgullapalli

మార్గము:[మార్చు]

మహబూబ్ నగర్, రాయల సీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విస్త్రుత ప్రచారము జరగాలి. కార్య కర్తలు హైదరాబాదు నుండి. తిరుపతి సమావేశ సమయానికి రెండు మూడు రోజుల ముందు బయలు దేరి మహబూబ్ నగర్, కర్నూలు చేరాలి. అక్కడ మన వారందరు రెండు బృంధాలుగా ఏర్పడి ఒక బృంధం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ద్వారా తిరుపతి చేరాలి. రెండో బృంధం అనంతపురం, కడప, చిత్తూరు ద్వారా సమావేశ సమయానికి తిరుపతి చేరాలి. ఈ మార్గాలలో ముందుగా నిర్ణయించుకొన్న ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ ముందుకు సాగాలి. ఆయా ప్రాంతాలలో వున్న వికీపీడియన్ల సహకారం తీసుకోవాలి.

ప్రధాన సమావేశానికి ముందు :[మార్చు]

తిరుపతి లోను ఆ చుట్టు ప్రక్కల అనేక విద్యాసంస్థలు ఇతరమైన సంస్థలు అనేకం వున్నాయి. వాటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారిని ప్రథాన సమావేశానికి అహ్వానించాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవకాశాన్ని బట్టి ప్రధాన సమావేశం తర్వాత కూడ రెండు రోజులు నిర్వహించాలి.

ముఖ్య అతిధులు:[మార్చు]

తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.

పురస్కారాలు:[మార్చు]

సమావేశంలో ముఖ్యులైన కొంత మందికి వికీపీడియా గురించి అవగాన, మరియు వారు అందించిన సేవలకు గాను పురస్కారాలు అందించాలి.

కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు[మార్చు]

ముఖ్య తేదీలు[మార్చు]

మరింత సమాచారం[మార్చు]

సంప్రదింపులు[మార్చు]

తిరుపతి లో వున్న ‎తెలుగు భాషోధ్యమ సమితి,తిరుపతి వ్వవస్థాపకులైన సాకం నాగరాజ తో వ్యక్తి గతంగా కలిసి మన 11 వ వార్షికోత్సవాల విషయమై వివరించాను. వారు ఈ విషయంలో వికీపీడియాకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానము చేశారు. వారు గతంలో తెలుగు భాషా సదస్సులను బారీ ఎత్తున నిర్వహించిన అనుభవము వారికున్నది. వారు చేస్తున్నది కూడ తెలుగు భాషా అభివృద్ధికి తోడ్పాటు కనుక వారి సహకారముతో మన 11 వ వార్షికోత్సవాలను తిరుపతిలో జయప్రధమంగా నిర్వహించ వచ్చును. అంతే గాక తిరుపతి స్థానికులైన భాషాభిమానులను కూడ కొందరిని సంప్రదించగా వారుకూడ మన వార్షికోత్సవాలకు తగు విధంగా తోడ్పాటు నిస్తామని చెప్పారు. స్థానికంగా వున్న ఇటు వంటి వారి సహకారము మనకెంతో అవసరము. Bhaskaranaidu (చర్చ) 15:38, 3 నవంబర్ 2014 (UTC)

సమాచారం[మార్చు]

స్థలం: Tirupathi (తిరుపతి)

తేదీ: one Saturday, Sunday Between February 5 to 15 (ఫిబ్రవరి 5 నుండి 15 మధ్యలో ఒక శని, ఆదివారాలు)

వేదిక : నిర్ణయించాలి

సంప్రదించు:

వికీపీడియా : తెవికి 11 వ వార్షికోత్సవాలు: కార్యక్రమ ప్రణాళిక[మార్చు]

వికీ వ్యాసరచన కొరకు చూడండి 11 వ వార్షికోత్సవ వ్యాసరచన పోటీ

సమావేశానికి ముందు[మార్చు]

1. బడ్జెట్ ప్రతిపాదనలు: ఈ సమావేశాలకొరకు కావలసిన బడ్జెట్ ప్రతిపాదనల సంబందించిన చర్చ నిన్నటితో ముగిసింది. కను ఆ బడ్జెట్ ప్రతి పాదనలు పైకి పంపే ఏర్పాట్లు విశ్వనాద్. బి.కె. ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ సమావేశం జయ ప్రదంగా జరగడానికి ఒక కార్యా చరణ ప్రణాలిక ఈ క్రింద పొందు పరచడమైనది. అనుభవశాలురు ఈ క్రింద కనబరచిన విషయాలలో మార్పులు/చేర్పులు/సవరణలు చేసి దానికి సమగ్ర రూపం ఇవ్వాలని కోరడమైనది.

2. సమావేశముకు ముందు: తిరుపతి లో సమావేశము ఫిబ్రవరి 14, 15 తేదీలలో జరుప తలపెట్టాము (రెండవ శనివారము, ఆదివారము) ఆ కార్యక్రము జయప్రధము కావడానికి జనవరి 2015 లో రెండు సార్లు ఫిబ్రవస్రి 2015 మొదటివారములో ఒక సారి మనలో కొందరు తిరుపతి కెళ్ళి అక్కడ మన సమావేశం జరపడానికి వున్న అనుకూలతలను పరిశీలించి నిర్ణయం చేయవససి వున్నది. ఈ ముందస్తు తిరుపతి ప్రయాణలలో మనం నిర్ణయించ వలసినవి. 1. సభాస్థలి. (వేధిక) /వసతి అవకాశము (లాడ్జింగు) భోజన వసతి మిదలగునవి. (తిరుపతి ప్రముఖ యాత్రా స్తలమైనందున ఈ విషయాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడము ఇబ్బంది కరము) ఏర్పాట గురించి నిర్ణయించుకోవాలి. 2.సభాస్థలి విషయమై తిరుపతిలోని విజ్ఞాన భారతి కళాశాల ప్రాంగణము ఇచ్చేందుకు సుముఖత వ్యక్తము చేసి నట్లు తెలియ వచ్చింది. ఆ కళాశాల తిరుపతి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వున్నందున ప్రయాణపు ఇబ్బందులు ఎదురు కావచ్చునేమో... ఆలోశించాలి. తిరుపతి పట్టణంలోనే మరొక ప్రదేశంలో సభాస్థలి దొరుకునేమో పరిశీలించాలి.

3.తిరుపపతి స్థానికులైన ప్రముఖులు (రాజకీయ ప్రముఖులు, విధ్యా ప్రముఖులు, సాహితీ ప్రముఖులు, అధికారులు) మొదలగు వారిని మన సమావేశాల ఆతిద్యానికి ఆహ్వానించాలి. అలాంటివారికి ముందస్తుగా వికీపీడియా గురించి ఒక అవగాన కల్పించాలి. దీనికి గాను తెలుగు వికీపీడియా .. మార్గదర్శని అనే చేతి పుస్తకము అప్పటివరకు పుస్తక రూపం దాల్చక పోతే...... దానిని ప్రింటవుట్ తీసుకొని దానినైన వారికిస్తే మన సమావేశాలలో వికీపీడియా గురించి వారు మాట్లాడడానికి అవగాహన పెరుగుతుంది.

4. తిరుపతిలో మన ప్రయాణానికి అవసరమైన వాహనాలను ముందస్తుగానే రిజర్వు చేసుకోవాలి. భోజన వసతులు కూడ ముందస్తుగానే అమర్చి పెట్టుకోవాలి. కర పత్రాలు, బ్యానర్లు ఇతర ముద్రిత ప్రసార సామగ్రి మొదలైనవి హైదరాబాదులో సిద్ధ పరుచుకుంటే పరవాలేదు. కాని వాటిని స్థానికంగా తిరుపతిలో తయారు చేయలనుకుంటే .... మన ముందస్తు తిరుపతి ప్రయాణంలోనే ఖారారు చేసుకోవాలి. గోడ పత్రికలు, ఖర పత్రాలు, బ్యానర్లు, వేధిక అలంకరణ మొదలగు పనులకు మానవ వనరుల విషయమై స్థానికులతో సంప్రదించి సిద్ధం చేసుకోవాలి. (ఈ మానవ వనరుల విషయమై భాద్యత నేను తీసుకోగలను)

5, మనకు వసతి విషయమై తిరుపతిలోని శ్రీనివాసం లో వుండవచ్చును అనే విషయము ఇదివరకే చర్చకు వచ్చినది. దీని సాద్యాసాద్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అది వీలు కాకపోతే స్థానికి హోటళ్ళలో ప్రయత్నించి ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి.

6. మన ముందస్తు తిరుపతి ప్రయాణాలలో కనీసం 4 వికీ అవగాహన అకాడమీలను నిర్వహించాలి. అందులో ఒక విజ్ఞాన భారతి కళాశాల అని అనుకున్నాము. దాని సంగతి నిర్ధారించుకోవాలి. అదే విధంగా తిరుపతిలో అకాడెమీలు నిర్వహించుకోవడానికి 1. శ్రీ వేంకటేశ్వరా విశ్వవిధ్యాలయము లోని తెలుగు విభాగము, 2. శ్రీ వేంకటేశ్వరా ఓరియంటల్ కళాశాల, 3. తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం అనే విశ్వవిద్యాలయాలము, స్థానికంగా వుండే మరో రెండు మూడు విద్యా సంస్థలను సంప్రదించి నిర్ణయము తీసుకోవాలి.

5. సభా స్థలిలోగాని, జరుప బోయే అకాడెమీల ప్రాంగణంలో గాని అంతర్జాలసౌకర్యము వున్నదో లేదో పరిశీలించి అది అవసరమనుకుంటే దానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైతే అంతర్జాల సౌకర్యమున్న లాప్ టాప్ లు సిద్ధంగా వుంచుకోవాలి. అవసరమనుకుంటే ప్రొజెక్టరు ను కూడ సిద్ధపరుచుకోవాలి.

7. ప్రసార మాధ్యమాలైన, వార్తా పత్రికలు, రేడియో, దూరదర్శని మొదలగు వారిని సంప్రదించి ముందస్తుగా వికీపీడియా సమావేశం గురించి, సమావేశ సమయమున ప్రచారానికి అహ్వానించాలి. ఈ విషయమై వారికి ముందస్తుగానే మన చేతి పుస్తకాన్ని అందించాలి. ( వారి అవగాహన కొరకు)

8. తిరుపతిలో స్థానికంగా వున్న విధ్యాసంస్థలన్నిటిని ఒక సారి సందర్శించి వారికి వికీపీడియా చేతి పుస్తకాన్నిచ్చి (అవగాహనకొరకు) వారిని మన సమావేశాలకు ఆవ్యానించాలి. విధ్యా సంస్థలేగాక స్థానికంగా వున్న, ఇతర సాహిత్య సంస్థలను, తెలుగు భాషా సంస్థలను కలుపుకోవాలి.

పైన కనబరచిన పనులు తిరుపతి సమావేశానికి ముందు మనం తిరుపతి వెళ్ళే ప్రయాణ సందర్భంలో నిర్థారణ చేసుకోవాలి.

తిరుపతి సమావేశాల సందర్భంగా[మార్చు]

2015 వికీపీడియా వ్యాసరచన పోటీ కొరకు నియమ నిభంధనలు చేర్చబడినవి

  • దీనిలో విద్యార్ధులవరైనా పాల్గొనవచ్చు
  • పాల్గొను విద్యార్ధులు తప్పక లాగిన్ అవ్వాలి
  • అభ్యర్ధులు తమతమ ప్రయోగశాల పేజీలో వ్యాసం రాయవచ్చు
  • వ్యాసం ఏ రంగానికి సంభందించినదైనా అయి ఉండవచ్చు
  • వ్యాసంలో రెండు కాపీ హక్కులు లేని బొమ్మలు ఉండాలి
  • వ్యాసానికి మూలాలు, ఆధారాలు, కనీసం రెండు రిఫరెన్స్‌గా ఇవ్వాలి
  • వ్యాసం మూడు సబ్ హెడ్డింగ్స్‌తో కనీస సమాచారం కలిగి ఉండాలి
  • వ్యాసం రాయడంలో సందేహాలకు వికీపీడియన్ల సహాయం తీసుకోవచ్చు
  • మీ పేజీలో సహాయం అనే చోట మీకు కావలసినది రాయవచ్చు
  • గడువు తేదీ ఫిబ్రవరి 05 -2015



.............................................................................................................................................................................................................................................................................................

చేతిపుస్తకము/ హాండ్ బుక్[మార్చు]

జిమ్మీ వేల్స్

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

చరిత్ర[మార్చు]

లారీ సాంగర్

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరుజిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.

లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.

సాఫ్టువేరు మరియు హార్డువేరు[మార్చు]

వికీపీడియా ఓపెన్ సోర్సు మరియు ఉచితంగా లభించే వికీమీడియా సాఫ్టువేరు ఆధారంగా నడుస్తుంది. ఇది పి హెచ్ పి(PHP) అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేసు పేరు మై ఎస్ క్యు ఎల్ (MySQL). ఇది జి ఎన్ యు జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద రిజిస్టర్ చేయబడి ఉంది.

ఇతర భాషలు[మార్చు]

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2007 గణాంకాలననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు,జర్మన్,ఫ్రెంచి,పోలిష్,జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

ఎంతవరకూ ఆధారపడవచ్చు?[మార్చు]

వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేవారు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నమోదు చేసుకోని సభ్యులు చేసే మార్పులు కూడా సభ్యత్వం ఉన్నవారు చేసే మార్పులతో సరిపోల్చగలవని 2007 లో డార్ట్ మౌత్ అనే కాలేజీ లో జరిగిన పరిశోధన ఆధారంగా తేలింది.

విమర్శ[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా మార్పులు చేయవచ్చు కాబట్టి, ఈ సమాచారం మీద పూర్తిగా ఆధారపడలేమన్నది కొద్ది మంది విమర్శకుల వాదన. అంతేకాకుండా కొన్ని వ్యాసాలకు సరైన మూలాలు లేవని కూడా వారు భావిస్తున్నారు. కొద్ది మంది వ్యాఖ్యాతలు మాత్రం వికీపీడియా మొత్తంగా పోల్చుకుంటే ప్రమాణాలు కలిగిఉంది కానీ ఏదైనా ఒక్క వ్యాసాన్ని తీసుకుని దాని నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయలేమని భావిస్తున్నారు.

సోదర ప్రాజెక్టులు[మార్చు]

వికీపీడియా తో బాటు అదే బాటలో నడిచే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. విక్షనరీ సమిష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం.

చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు తరాల వాళ్ళు వాటి గురించి తెలిసికోగలుగుతారు. ఇలా లోకంలోని ప్రతీ విషయం గురించీ ఒక పుస్తకంగా రాస్తే.. అదే విజ్ఞాన సర్వస్వం!

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం[మార్చు]

వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

ఏమిటి వికీపీడియా విశిష్టత?[మార్చు]

వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలకు వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.

భారతీయ భాషల్లో వికీపీడియా:[మార్చు]

మొదటగా 2001 లో ఇంగ్లీషులో మొదలైందీ వికీపీడియా. నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 200 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. హిందీ, సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. మనకు గర్వకారణమైన విషయమేమిటంటే, భారతీయభాషల వికీపీడియాలన్నిటిలోకీ తెలుగే ముందుంది. వ్యాసాల సంఖ్యలోగానీ, సభ్యుల సంఖ్యలో గానీ తెలుగు వికీపీడియాదే అగ్రస్థానం.

తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు:[మార్చు]

తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు 44 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే వుంటారు.

ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?[మార్చు]

అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమేంటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో చూడండి.

ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?[మార్చు]

సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకు అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. సాఫ్టువేరును అభివృద్ధి చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేసారు. ఇక వ్యాసాలు - వ్యాసాలు రాసేవాళ్ళంతా మనబోటి వాళ్ళే. తమకు తెలిసిన విషయాలను ఉచితంగానే రాస్తున్నారు. ఎవరికి తెలిసిన విషయాలను వాళ్ళు రాస్తూ పోతే వికీపీడియాలో ఎంతటి విషయ సంపద పోగు పడుతుందో ఊహించండి.

ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?[మార్చు]

నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు. వికీపీడియా ఉద్దేశమే అది. విషయ పరిజ్ఞానమున్న వారు ఆ విషయాలలోని ఇదివరకు వున్న వ్యాసాలలోని విషయము తక్కువగా వుంటే అటువంటివారు తమ వద్ద విమ్మ అధిక సమాచారాన్ని జోడించ వచ్చు. ఏదైనా వ్యాసం అసలు లేకుంటే ఆ విషయమై కొత్త వ్యాసాన్ని తయారు చేయవచ్చు. ఆ వ్వాసంలో వారి వద్ద పూర్తి సమాచారము లేకున్న పరవాలేదు. వారి వద్ద వున్న విషయాన్ని పొందుపరచి వ్యాసాన్ని సృష్టించ వచ్చు. పూర్తి సమాచారముతో ఆ వ్యాసాన్ని మీలాగే మరొకరు పూరుస్తారు. భాషా పరమైన పరిజ్ఞానమున్నవారు వ్యాసాలలోని వ్యాకరణ/అక్షర దోషాలను సరిదిద్దవచ్చు.

దేని గురించి రాయవచ్చు?[మార్చు]

మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.

మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?[మార్చు]

ఏం పర్లేదు, తెలుగు వికీలో అప్రమేయం తెలుగు టైపింగ్ సహాయం వుపకరణం వుంది. అదేకాక ప్రతి కంప్యూటర్ వ్యవస్థలో పని చేసే వివిధ రకాల కీ బోర్డులున్నాయి .

కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?

మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే!

కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?[మార్చు]

నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.

2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది. అలాగే 2006 నవంబరు 5 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం కారణంగా తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపై ఒక్కసారిగా తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానానికి దూసుకుపోయింది.

మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

వికీపీడియా:వికీ చిట్కాలు[మార్చు]

వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?[మార్చు]

వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి లాగిన్ కానవసరము లేనే లేదు. ఎవరైనా, ఎప్పుడైనా దాదాపుగా అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైనది, క్షణాలలో చేయగలిగినది, ఉచితమైనదీను. ఇది చాలా చాలా మంచి ఆలోచన అని చెప్పడానికి అనేక రకాల కారణాలున్నాయి.

  • 1 సభ్యనామం

మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక సభ్యనామాన్ని ఎంచుకోవచ్చు. మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) ఐ.పీ. చిరునామాకు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.

మీకు మీ సొంత సభ్యుని పేజీ ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.

మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత సభ్యుని చర్చ పేజీ ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా గోపనీయమైనది. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.

  • 2 ప్రసిద్ధీ, గోప్యతా

మీరు మీ నిజ జీవితపు గుర్తింపును తెలియపరచనవసరం లేదు, కానీ ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తింపును ఎకౌంటు మీకు ఇస్తుంది. లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియజేస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తింపు) మీతో సంభాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాతవారికి సులభంగా విశ్వాసం కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకుండే స్వేచ్ఛ తగ్గుతుంది.

వికీపీడియాలో దురుపయోగం చెయ్యటం, స్పామింగు చెయ్యటం, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ రాసే సమాచారపు మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్నీ నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.

మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే మార్పుచేర్పులన్నీ, అప్పటి మీ ఐ పీ అడ్రసు కు చెందుతాయి. లాగిన్ అయివుంటే అవి బహిరంగంగా మీపేరుకు, అంతర్గతంగా మీ ఐ.పి.అడ్రసుకు చెందుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కొరకు వికీమీడియా గోప్యతా విధానము చూడండి.

మీ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియాలో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.

  • 3 మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు

నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు ఎన్నో వున్నాయి. ఉదాహరణకు, చేసిన మార్పుచేర్పులు 'చిన్న'వని గుర్తు పెట్టగలగడం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. చిన్న మార్పులు కానివాటిని కూడా చిన్నవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాం. కాబట్టి, కేవలం వ్యాకరణదోషాల సవరణల వంటి వాటిని మాత్రమే చిన్న మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు ఐ.పి.అడ్రసు చాటుగా వుంటారు కనుక, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుకా చిన్నమార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వారా విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.

చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం వీక్షణ జాబితా. మీరు చూసే ప్రతి పేజీ లోను "వీక్షించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.

నమోదైన సభ్యులు మాత్రమే పేజీల పేరు మార్పుచెయ్యగలరు. వికీపీడియా ఆకారాన్నీ, దాని ప్రామాణికతనూ చెక్కు చెదరకుండా వుంచటానికి ఇది చాలా ముఖ్యం.

ఇంకా, బొమ్మలు అప్‌ లోడు చెయ్యాలంటే మీరు లాగిన్ అవ్వవలసిందే.

  • 4 సభ్యుని అభిరుచులు ఎన్నో

పై విశేషాలతో పాటు, మీడియావికీ ఆకృతిని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అసలు వెబ్‌ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. ఉదాహరణకు.., ఇప్పుడున్న "మోనోబ్లాక్‌" రూపు స్థానంలో ఇదివరకటి "స్టాండర్డ్" రూపును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, దిద్దుబాటు పెట్టె (ఎడిట్ బాక్స్) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇలా ఇంకా ఎన్నో.

  • 5 నిర్వాహకుడి హోదా

నిర్వాహకులు (ఇంగ్లీషు లో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం, సంరక్షించినవాటిని మార్చడం, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు వంటి పేజీల్లో వికీ అభిమతాన్ని అమలుచేస్తూ వుంటారు.

నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్నినెలల పాటు వికీపీడియాలో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండివుంటే నిర్వాహకుడు కావడానికి సరిపోతుంది.

మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చూడండి.

  • 6 ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు..

వికీపీడియాలోని చాలా పోలింగులలో ఎవరైనా - లాగిన్ అయినా కాకున్నా - తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ అదే అభిప్రాయం ఒక చక్కని దిద్దుబాటు చరితం కలిగిన సభ్యునికి చెందినదైతే దానికి మరింత విలువ వుంటుంది. కొన్ని పోలుల లోనైతే, మీ వోటును పరిగణించాలంటే, మీరు నమోదైన సభ్యుడు అయి వుండాలనే నియమం ఉంది. నమోదు కాని వారు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.

వికీమీడియా బోర్డులో వాడుకరుల ప్రతినిధులు ఇద్దరు వుంటారు - ఒకరు "అందరు" వాడుకరులకు, మరొకరు సభ్యులైన వాడుకరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, మీరు సభ్యులయి వుంటే, వివాదాలు వచ్చినప్పుడు, మీకు, బోర్డుకు మధ్యవర్తిత్వం కోసం మీరు (ఇద్దరిలో ఒకరిని) ఎంచుకొనటానికి అవకాశం వుంటుంది.

వికీపీడియా:సముదాయ పందిరి[మార్చు]

వికీపీడియాకు మీ అవసరం ఉంది. అందరం కలిసి ఒక విజ్ఞాన సర్వస్వాన్నీ, ఒక వికీ సమాజాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికిప్పుడు మీరో వ్యాసాన్ని దిద్దుబాటు చెయ్యడం మరియు కొత్త వ్యాసాన్ని ప్రారంభించడం చెయ్యవచ్చు. మీ వ్యాసాలను ఎలా సమర్పించాలో పాఠం లో తెలుసుకోండి. (లేదా ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి).
దయచేసి ఒక వాక్యంతో కొత్త వ్యాసాలు ప్రారంభించవద్దు. కనీసం ఆరేడు వాక్యాలు మరియు అంతకన్న తక్కువైతే బొమ్మ వున్న వ్యాసం ప్రారంభించండి. కొత్తగా చేరిన వారు అనుభవం వచ్చేదాక ఇప్పటికే వున్న వ్యాసాలలో దోషాల సవరణ, వ్యాసాల విస్తరణ చేపట్టటం మంచిది.
మీకు ఇంకా ఖాతా లేకపోతే ఖాతా సృష్టించుకోండి (ఎందుకు?)
రచ్చబండ వద్ద వార్తలు చూడండి ఇతరత్రా చర్చించండి, ఇంకా కావాలంటే సహాయము పేజీని మరియు మా విధానాలు పేజీని సంప్రదించండి. వికీపీడియాపై మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే ఈ పేజీ చూడండి.
అంతర్జాల సమావేశాలు మరియు భౌతిక సమావేశాలు లో పాల్గొనండి.

వికీపీడియా:ప్రయోగశాల[మార్చు]

ఈవరుసతో పాటు మొదటి 6 బుల్లెట్ పేరాలు దయచేసి మార్చవద్దు
ఇది ఒకే సమయంలో ఒక్కరు మాత్రమే వాడదగిన ప్రయోగశాల. మీరు ఇక్కడ టైపింగ్ నైపుణ్యం మెరుగు పరచుకొనడానికి, వికీపీడియా టాగ్లు పరీక్ష చేయడం చేయవచ్చు.
ఇక్కడ ఇతరులకు ఇబ్బంది/నొప్పి కలిగించే విషయాలు రాయవద్దు.
ఇక్కడ వ్రాసినది అవసరమనుకుంటే, మీ ప్రయోగం అయిన తరువాత మీ సభ్య పేజీలలో పదిలపరచుకోండి. అలాగే మీ సభ్యపేజీని లేక దాని ఉపపేజీలను ప్రయోగశాల వాడుకోవటం మరింత మంచిది.
రయోగం చేయటానికి "వికీపీడియా
ప్రయోగశాల " పైవరుసలో నున్న "సవరించు" అన్న అదేశం బొత్తాము పై నొక్కండి.

వికీపీడియా:సహాయ కేంద్రం[మార్చు]

గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

ప్రాపంచిక ప్రశ్నల కొరకు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?), ముందు తెవికీలో శోధన చేసి ఆతరువాత అవసరమైతే సంప్రదింపుల కేంద్రం ( Reference Desk) చూడండి.
అడిగే ముందు, మీ ప్రశ్న తరచూ అడిగే ప్రశ్నలలో ఇప్పటికే సమాధానము ఉందేమే చూడండి. అలాగే సహాయం చేయబడిన పేజీలు మరియు సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలుకూడా ఉపయోగపడవచ్చు.
సాంకేతిక విషయాలపై సమాచారం కొరకు రచ్చబండ చూడండి.
సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం కొరకు వివాద పరిష్కారం చూడండి.

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.

ప్రశ్న ఎలా అడగాలి[మార్చు]

ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
సూటిగా, వివరంగా అడగండి.
ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ఎల్లంకి (చర్చ) 10
17, 29 డిసెంబరు 2014 (UTC) అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు.
ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
ప్రశ్న తెలుగులోనే అడగండి.
ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.

సమాధానం ఎలా ఇవ్వాలి[మార్చు]

వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.

వివిధ ప్రసార మాద్యమాలలో తెలుగు వికీపీడియా[మార్చు]

‘#ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా

‘ఆకాశవాణి హైదరాబాద్’ మెయిన్ స్టేషన్ లో తెలుగు వికీపీడియా చర్చా వేదిక కార్యక్రమం – 2014 ఫిబ్రవరి 13 వ తేదీ ఉదయం 7-20 గంటల నుంచి 7-45 గంటల వరకు ప్రసారం అయింది. అలాగే - ‘ఆకాశవాణి హైదరాబాద్’ FM – ‘రెయిన్ బో’ లో అదే రోజు అంటే (2014 ఫిబ్రవరి 13 వ తేదీ) ఉదయం 8-00 గంటల నుంచి 8-25 గంటల వరకు ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో విష్ణు, రాజశేఖర్, రహమానుద్దీన్, మల్లాది కామేశ్వర రావు గార్లు పాల్గొన్నారు.

  1. తెలుగు వెలుగు, జనవరి 2014 సంచికలో అర్జున వ్యాసం

తెలుగు వెలుగు, జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో అందరి విజ్ఞానం అందరికీ శీర్షికతో వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై అర్జునరావు గారు వ్రాసిన వ్యాసం, ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడింది.

  1. Hmtv లో “విజయవాడలో వికీపీడియా’’ ఫిబ్రవరి 8వతేదీ శనివారం సాయంత్రం 4-30 గంటల నుంచి 5-00 గంటల వరకు ప్రసారమయింది.

చిట్కాలు[మార్చు]

1.పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎంత అభివృద్ధి చేశారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకులు నొక్కితే ఆ రచయిత ఆ స్టెప్పులో ఏమి మార్చారో, కూర్చారో తెలుస్తుంది.

2. పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎంత అభివృద్ధి చేశారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకులు నొక్కితే ఆ రచయిత ఆ స్టెప్పులో ఏమి మార్చారో, కూర్చారో తెలుస్తుంది.

3. పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. ఇదే విధంగా సినిమా సన్నివేశ చిత్రాన్ని కూడా Non-free film screenshot క్రింద వాడవచ్చును.

4. టెక్నికల్ ఇబ్బందులు * వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ, అంతర్వికీ లింకులూ, బాట్లూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

ఏ మాత్రం సమస్య కాదు. వికీలో సరైన సమాచారంతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. మిగిలినవ్నీ తరువాయే. కనుక మీరు నాణ్యమైన వ్యాసం వ్రాయడంపై దృష్టిని కేంద్రీకరించండి. మిగిలిన విషయాలకు ఇతరులు సాయపడతారు. కొద్ది వారాల్లో మీకూ అలవాటు అవుతుంది.

5.అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

ఏమీ ఫరవాలేదు. ఆ పదాన్ని అలా ఇంగ్లీషులోనే వదిలెయ్యండి. ఎవరైనా సరైన పదాన్ని పెట్టవచ్చు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.

6. బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ:Mahabubnagar Bus Station.jpg చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు. M S Picture Managerలో గాని, మరేదైనా Image Editing softwareలో గాని "crop" feature మీరు వాడవచ్చు.

7. వికీలో వ్రాయడానికి చాలా సమయం పడుతున్నది. నాకు ఇంటర్నెట్‌లో అంత సమయం గడపడం కుదరదు. పరవాలేదు. లేఖినిని మీరు ఆఫ్‌లైన్ వినియోగం కోసం complete web page గా save చేసుకోండి. లేదా offline లో తెలుగు వ్రాయడానికి మరికొన్ని ఉపకరణాలున్నాయి. (ఉదా: http://www.kavya-nandanam.com/dload.htm లో పోతన ఫాంట్‌తో లభించే సాఫ్ట్‌వేర్.) వీటితో మీరు సమయం చిక్కినపుడు తెలుగులో వ్రాసుకొని M S Word లో గాని, మరొక wordprocessor లో గాని భద్రపరచుకోండి. సమయం చిక్కినపుడు ఇంటర్నెట్‌లో వికీ ఎడిట్‌బాక్స్ తెరిచి మీరు భద్రపరచిన విషయాన్ని పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఇంటర్నెట్ బిల్లు టెన్షన్ లేకుండా పనిచేయగలరు.

8. సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

9. దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. అలాంటప్పుడు. ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయము అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు మిగతా రెండు పేర్లకు దారి మార్పు పేజీలను సృష్టించాలంటే మిగతా పేజీలలో #REDIRECT రామప్ప దేవాలయము అని ఉంచాలి. ఇలా దారి మార్పు పేజీలను తయారు చేయడం వలన కొత్త సందర్శకులకు మరింత సులభంగా సమాచారం దొరుకుతుంది.

10. పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం ఎక్కడ దొరికిందీ రిఫరెన్సు ఇలా ఇవ్వాలి - [1] అని వ్రాయొచ్చు. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో

  1. ఫలాని వెబ్ సైటులో ఆ సమాచారం లభించింది.

అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

11. పేపర్లో చదివే వార్తలు

ఏదైనా వూరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. రిఫరెన్సుగా ఆ పేపరు, తేదీలను పేర్కోవడం మరచి పోకండి.

12. టీ.వీ.లో సినిమా చూశాను

మీరు క్రొత్తది కాని, పాతదికాని సినిమా చూశారనుకోండి. మరిచిపోక ముందే ఆ సినిమా గురించి వికీలో ఆ సినిమా వ్యాసం వ్రాసెయ్యండి. ఆ సినిమా గురించి ఇప్పటికే ఒక పేజీ ఉండవచ్చును. వర్గం:తెలుగు సినిమాలు చూడండి. అందులో మరింత సమాచారం చేర్చవచ్చును. టైటిల్స్‌లో నటులు, నిపుణుల పేర్లు చూస్తే మరీ మంచిది. "సినిమా బాగుంది. బాలేదు" వంటి అభిప్రాయాలు మాత్రం వ్రాయొద్దండి.

13. మీకు తెలియని వూరు గురించి

ఎవరైనా పరిచయమున్న మిత్రులను వారి వూరి గురించి అడగండి. వూరెక్కడుంది? పంటలేంటి? గుళ్ళు, గోపురాలు, తిరణాలు, సంబరాలు, నీటి వనరులు - ఇలాంటి విషయాలు. వికీలో ఆ వూరి గురించి వ్యాసం కొద్దిగా వ్రాసేయవచ్చును. చర్చా పేజీలో "ఫలాని వారు ఇచ్చిన సమాచారం ప్రకారం" అని వ్రాస్తే మర్యాదగా ఉంటుంది. (వారికి అభ్యంతరం లేకపోతేనే).

14. ఎక్కువ సమయం దొరకడం లేదు

నాకు వికీపీడియాలో పని చేయడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు కనుక పెద్ద వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను.--

వ్యాసం పొడవును బట్టి వికీ నాణ్యత గాని, మీ విలువ గాని పెరగవు. వికీలో ఎంత చిన్న దిద్దుబాటైనా స్వాగతించబడుతుంది. ఉదాహరణకు అక్షర దోషాల సవరణ. "భాగవతం" బదులు "బాగవతం" అని మీకు ఎక్కడైనా కనిపించిందనుకోండి. వెంటనే దిద్దెయ్యండి. కాలిలో చిన్న ముల్లు ఉంటే ఉపేక్షిస్తామా?

15. ఎవరీ నిర్వాహకులు?

వికీపీడియాలో ఉన్న కొద్దిపాటి నియమాలను కుటుంబపరమైన బాధ్యతలుగా అమలు చేసే సభ్యులు నిర్వాహకులు. నిర్వాహకులకు మిగిలినవారిపై పెత్తనం చెలాయించే హక్కు గాని, వివాదాలను పరిష్కరించే హోదా గాని లేవు. వారి అభిప్రాయాలకు ప్రత్యేకమైన విలువ లేదు. అయితే నిర్వాహకులకు ఇప్పటికే కొంత అనుభవం ఉన్నందున వారి సూచనలను బహుశా ఇతరులు గౌరవించవచ్చును. మరి కొన్ని వివరాలకు వికీపీడియా:నిర్వాహకులు చూడవచ్చును. వికీపీడియా:నిర్వాహకుల జాబితా కూడా చూడండి.

16. "భారతం" లేదా "భారతము"

"గ్రామం" అని వ్రాయాలా? లేక "గ్రామము" అని వ్రాయాలా? - దేశం? దేశము? - రామాయణం? రామాయణము?

తెలుగు వికీపీడియా వాడుక భాష వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. కాని ఇది నిర్బంధం కాదు. ఇందుకు మార్గ దర్శకాలు-

పేజీ హెడ్డింగు, సెక్షన్ హెడ్డింగులలో "గ్రామం", "రామాయణం", "ఆనందం" - ఇలాంటి పదాలు వాడండి.
వ్యాసం లోపల మీకు ఏది సబబు అనిపిస్తే ఆ పదాలను వాడండి.

17. వ్యాసం పేరు

వీలయినంత వరకు వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: వ్యాసం పేరు ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు.

పేరును ఇటాలిక్స్‌ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్‌ నియమాలను పాటించండి.

18.భాష

మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి.

19.వ్యావహారిక భాషలో రాయండి.

సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.

20. ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం

'ము 'తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది.


21. వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.

బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి.
ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ; ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి.
పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు
పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి.
వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు
రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి.
ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.

గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.

22. పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:

ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)

23. గౌరవ వాచకాలు

వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.

24. విరామం తరువాత ఖాళీ

వ్రాసేటప్పుడు చాలా మంది చేసే చిన్న పొరపాటు. ఫుల్‌స్టాప్, కామాల తరువాత ఖాళీ (space) ఉంచకపోవడం. దీనివలన వాక్య విభజన సరిగా రాదు. "రాముడు వచ్చాడు.బంతిని తన్నాడు" అని వ్రాస్తే "వచ్చాడు.బంతిని" అనేది ఒకే పదంగా పరిగణింపబడుతుంది. ఇది వ్యాకరణ పరంగా సరి కాదు. చూడడానికి కూడా బాగుండదు.

25.ప్రత్యేక పేజీలు

ఎడమ ప్రక్క ప్రత్యేక పేజీలు అని బాక్సు ఉంటుంది. వికీ విశ్లేషణకు అది చాలా ఉపయోగం.

పెద్ద పేజీలు, చిన్న పేజీలు, లింకులు లేని పేజీలు, అధికంగా లింకులున్న పేజీలు, వర్గాలు, మూసలు, వర్గాలలో చేరని పేజీలు - ఇలా ఎన్నో విధాలుగా వికీ విశ్లేషణ అందులో లభిస్తుంది. సమయం దొరికినప్పుడు ఒకో పేజీని తెరిచి పరిశీలించండి. వికీ అభివృద్ధికి మీకు ఎన్నో ఐడియాలు తడుతాయి.

26. మీ వూరి గురించి ఏం వ్రాయొచ్చు?

మాది చాలా చిన్న పల్లె. దాన్ని గురించి ఏం వ్రాయగలం? అనిపించవచ్చును. - అందుకు సూచనల కోసం ఈ సూచనాపేజీ చూడండి. ఇంకా కొన్ని ఉదాహరణల కోసం బ్రాహ్మణగూడెం, చిమిర్యాల, పెదవేగి చూడండి. జనాల గురించి, పంటల గురించి, సౌకర్యాల గురించి వ్రాయొచ్చు. ఒకసారి రాయడం మొదలు పెడితే మీరే ఆశ్చర్యపోతారు - ఇంత వ్రాయొచ్చునా అని.

26. వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా

వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.

సభ్యనామం రాయడం సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం తేదీ, సమయం మాత్రమే రాయడం సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను - 3 సార్లు నొక్కితే - సభ్యనామం, 4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం, 5 సార్లు నొక్కితే - తేదీ, సమయం

27. అందమైన ఫోటోలు

వికీపీడియాలో చాలా వ్యాసాలకు ఫోటోలు అవసరం. ఈ ఫోటోలు తీయడానికి మీరు ఫోటోగ్రఫీ నిపుణుడు కానవసరం లేదు. కాకపోతే మీరు తీసిన ఫోటో సరిగా రాకపోతే, ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్లైన పికాసా (Picasa), జింప్ (GIMP) మొదలైన వాటిని వాడి ప్రాసెస్ చేయవచ్చు. ఇంకా మీ ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఆన్‌లైన్ టూల్స్] కూడా లభ్యమౌతున్నాయి. వీటిలో ఏదైనా ఉపయోగించి, మీఫోటోలను, క్రాప్(crop), పరిమాణం మార్పు(resize), చీకటిగా ఉన్న బొమ్మలను ప్రకాశవంతం చేయడం వంటి మార్పులు చేసి తరువాత వాటిని ఇక్కడ అప్‌లోడ్ చెయ్యండి.

28. మీ సంతకాన్ని మార్చుకోవచ్చు

వికీపీడియాలో సంతకాలు చర్చాపేజీలో మీరు వ్యాఖ్యానించిన తర్వాత వాడతారు. దానివల్ల ఆ వ్యాఖ్య చేసిందెవరో ఇతర సభ్యులకు సులువుగా అర్థమవుతుంది. సంతకం చేయడానికి ఎల్లంకి (చర్చ) 11:47, 29 డిసెంబరు 2014 (UTC) అని టైపు చేస్తే సరిపోతుంది.

సంతకాలను కావాలనుకుంటే రంగులతో నింపుకోవచ్చు. మీ సంతకానికి రంగులు అద్దడానికి, "నా అభిరుచులు" అనే లింకు (పేజీ పై భాగంలో కుడి వైపున) క్లిక్ చేయండి. మీ సభ్యనామం అని ముద్దుపేరు అని ఉన్న పెట్టెలో రాయండి. "మీకు నచ్చిన రంగు"ను "red" లేదా "green" వంటి మీకు నచ్చిన రంగులతో మార్చండి. మీ సభ్యనామంను మీ సభ్యనామంతో మార్చండి. తరవాత, "సంతకం మాత్రమే" అని రాసి ఉన్న పెట్టెలో టిక్ పెట్టండి. ఇప్పుడు మీరు ఎల్లంకి (చర్చ) 11:47, 29 డిసెంబరు 2014 (UTC) ఇలా సంతకం చేస్తే మీ కొత్త సంతకం కనబడుతుంది.

29. వేదిక

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము ఒక వేదిక నడపబడుతున్న సంగతి మీకు తెలుసా? వేదిక:వర్తమాన ఘటనలు చూడండి. అక్కడ ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతము జరుగుతున్న విషయాలను పొందుపరుస్తున్నారు. మీరు కూడా ఆ వేదికలో వార్తలు లేదా ఇతర సంబంధించిన విషయాలను చేర్చవచ్చు.

30. ఏకవచన ప్రయోగం/ఏకవచనం ఎందుకు?

సాధారణంగా వ్యవహారాలలో, వార్తాపత్రికలలో సమకాలీన వ్యక్తులను ఉద్దేశించేటపుడు గారు, విచ్చేశారు, ఆవిడ గారు వచ్చేశారు వంటి గౌరవార్ధక బహువచనం ప్రయోగించడం చూస్తూ ఉంటాం. కానీ వెనుకటి తరాలవారి గురించి రాసేటపుడు మాత్రం ఏకవచన ప్రయోగమే జరుగుతూ ఉంటుంది. రాము'డు' రావణుని చంపి సీతను తెచ్చా'డు' . పోతన భాగవతం రాశాడు అని వ్యహరిస్తారు గాని, రాముడు గారు రావణుని చంపి సీత గారిని తెచ్చారు అని, పోతన గారు భాగవతం రాశారు అనే ప్రయోగాలు కనిపించవు.

నిన్నటి వారైన శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, ఎన్టీ రామారావు వంటి వారిని కూడా ఏకపచన ప్రయోగంతోనే ఉదహరిస్తాం.
కేవలం జీవించి ఉన్న వ్యక్తులకే ఈ గౌరవ వాచకాలను ప్రయోగిస్తున్నట్టు గమనించగలం.
సజీవ వ్యక్తుల గురించి రాసేటప్పుడు బహువచన ప్రయోగం చేయాలని కొందరు సూచించారు. ఉదాహరణకు ఒక ప్రముఖ వ్యక్తి గురించి నేడు వ్యాసంలో బహువచన ప్రయోగం ఉపయోగించి రాస్తాం. ఆ తరువాత వారానికి ఆ వ్యక్తి గతించాడనుకుంటే అప్పుడు వ్యాసంలోని బహువచన ప్రయోగాలను ఏకవచనాలుగా మార్చాలా? మార్చితే ఎంతకాలం తర్వాత మార్చాలి. ఇలా కొన్ని వ్యాసాలలో బహువచన ప్రయోగం, కొన్ని వ్యాసాల్లో ఏకవచన ప్రయోగం విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రామాణికతను దెబ్బతీస్తుంది.
విజ్ఞాన సర్వస్వాలు కాలాతీతాలు. శైలికి సంబంధించినంత వరకు వీటికి ప్రాచీన, ఆధునిక, మధ్య యుగ భేదాలు లేవు. కాబట్టి వికీపీడియాలో బహువచన ప్రయోగం తగదు.
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేసిన కొమర్రాజు లక్ష్మణరావు అందులో ఏకవచన ప్రయోగాన్నే వాడాడు.

31. స్త్రీలను ఏకవచనంలో ఉదహరిస్తే అమర్యాదగా ధ్వనిస్తుంది కదా

వికీపీడియా వ్యాసాల్లో ఒక సారూప్యత ఉండాలి. ఏకవచనం పురుషులకెంత మర్యాదగా ఉంటుందో స్త్రీలకూ అంతే మర్యాదగా ఉంటుంది.ఉదాహరణకు కింది వాక్యాలు చూడండి.

..సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది.
..ప్రముఖ నటి సావిత్రి 1937 డిసెంబర్ 6 న కొమ్మారెడ్డి గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వీటిలో అమర్యాద ధ్వనించిందని అనలేము.

32. ప్రశ్నించండి!

వికీపీడియా అందరిచే నిర్మించబడుతున్న విజ్ఞాన సర్వస్వం. కాబట్టి ఆ ప్రయత్నంలో సమాచారంలో తప్పులు దొర్లవచ్చు. తప్పుడు సమాచారాన్ని చొప్పించవచ్చు. తటస్థ దృక్కోణంలో ఉండకపోవచ్చు. సమాచారం పాతబడి ఉండవచ్చు. అలాంటప్పుడు నిస్సందేహంగా మీ అనుమానాల్ని దాని చర్చాపేజీలో రాయడమో లేక సరిదిద్దడమో చెయ్యండి.

33. విద్యార్థుల కోసం వికీపీడియా

ఆంగ్ల వికీపీడియాలో చాలా వ్యాసాలను చాలా దేశాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగించుకుంటున్నారు. మన తెవికీలో ఇటువంటి వ్యాసాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆసక్తి గల సభ్యులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఆచార్యులు ఎవరైనా ఉంటే, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివిధ విజ్ఞాన దాయకమైన వ్యాసాలు రాయవచ్చు.

33. మొలకలు

ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారం మాత్రమే తెలుసు. మీకు తెలిసిన సమాచారం కేవలం రెండే లైన్లైనా సరే వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో రెండు మీసాల బ్రాకెట్ల మద్య మొలక అని వ్రాయండి . ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు.

==వర్గం అంటే?

వికీపీడీయాలో వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని వర్గీకరించడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు మీరు రామాయణానికి సంభందించిన వ్యాసాన్ని రాస్తున్నట్లయితే వ్యాసం చివరలో అని చేర్చవచ్చు. అయితే ఇలా చేర్చేముందు ఆ వర్గం ఇదివరకే ఉందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. వర్గం కోసం వెతకాలంటే వర్గం:రామాయణం అనే పేరుతో వెతుకు పెట్టెలో ఇవ్వాలి. ఇలా వర్గాలు చేర్చడం వలన ఈ వ్యాసం దానంతట అదే వర్గంలో చేర్చబడుతుంది. దీనివలన సందర్శకులకు ఈ వ్యాసాన్ని కనుగొనడం సుళువౌతుంది.

34. విక్షనరీ

వికీపీడియాకు సోదర ప్రాజెక్టు ఐనటువంటి విక్షనరీలో ఎన్నో ఆంగ్ల పదాలకు మరియు తెలుగు పదాలకు అర్థాలు ఉన్నాయి. మీకు అనువాదంలో ఏదైనా పదాలకు అర్థాలు కావలంటే దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాక మీకు తెలిసిన పదాలను దీనికి చేర్చి విస్తరించండి.

35. వ్యాసాల తొలగింపు

వికీపీడీయాలో మీరు సంచరిస్తున్నపుడు మీకు కొన్ని అవసరం లేనివి అర్థం లేని వ్యాసాలు కనిపించ వచ్చు. అప్పుడు మీరు వాటికి రెండు మీసాల బ్రాకెట్ మధ్యలో 'తొలగించు|కారణం' అని చేరిస్తే ఎవరైనా నిర్వాహకులు వాటిని చూసి తొలిగిస్తారు.

36. లింకులు

ఒక వ్యాసం వ్రాస్తున్నప్పుడు అందులో వచ్చే పదాలను తెవికిలోని ఇంకో వ్యాసానికి లింకు చేయాలంటే దాని చుట్టూ క్రింద చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్లను వాడండి. ఉదాహరణకు మీరు తెలుగు వ్యాసాన్ని లింకు చేయాలనుకుంటే, తెలుగు అని వ్రాయండి. తెలుగు అని చూపబడుతుంది.

అదే ఆంగ్ల వికీలో వ్యాసానికి లింకు చేయాలనుకుంటే, వ్యాసం పేరుకి ముందు :en: అని వ్రాయాలి. ఉదాహరణకు మీరు ఆంగ్ల వికీలో ని తెలుగు వ్యాసనికి లింకు చేయాలునుకుంటే, en:Telugu అని వ్రాయండి. en:Telugu అని చూపబడుతుంది.

37. కీ బోర్డు అడ్డదారులు Esc మరియు Ctrl-[

తెలుగు మరియు ఇంగ్లీషు భాషల మధ్య మారడానికి Ctrl-[ గానీ Esc గానీ వాడవచ్చు. ఈ రెంటి మధ్య ఒక తేడాను మీరు గమనించవచ్చు. మీరు కొంత వాక్యం వ్రాసిన తర్వాత భాష మారల్సి వస్తే Ctrl-[ వాడడం ఉత్తమం. Esc వాడితే అప్పటిదాకా మీరు ఇతర భాషలో వ్రాసిన వివరాలు చెరిగిపోయే అవకాశం ఉంది (IE లో మాత్రమే).

38. పరికరాల పెట్టె

మీరు వికీపీడియాలో ఎడమవైపునున్న పరికరాల పెట్టెను గమనించారా? అందులో ఫైలు అప్లోడు, ప్రత్యేక పేజీలు వంటి ఉపయోగకరమయిన లింకులు చాలా ఉంటాయి. ఏదైనా వ్యాసాన్ని ముద్రించాలి (ప్రింట్ చేయాలి) అనుకొన్నా ఆ వ్యాసం యొక్క ముద్రణా వర్షన్‌కు లింకు కూడా మనం అక్కడ పొందవచ్చు.

39. కొత్త లైను

వ్రాసే వాక్యం కొత్త లైనులో రావటానికి మీడియా వికీ సింటాక్స్ లో ప్రతిసారి
ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక అదనపు లైను వదిలేస్తే చాలు అదే కొత్త లైనుకు వెళ్తుంది.

40. బాట్లు అంటే ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎగుమతి చేయడం, వందలాది పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చెయ్యాల్సి రావడం కష్టం మరియు విసుగుతో కూడుకున్న పని. ఇలాంటి అవసరాలను తీర్చడానికి బాట్లను తయారు చేస్తారు. సాధారణంగా వీటిని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో అనుభవమున్న సభ్యులు రాస్తారు. ప్రస్తుతం పైథాన్, పెర్ల్, పీహెచ్‌పీ, జావా మొదలైన భాషల్లో బాట్లను రాయవచ్చు. ఆసక్తి గలవారు ఆంగ్ల వికీపీడియాలోని ఈ లింకును సందర్శించగలరు.

41. దిద్దుబాటు పెట్టె

మీరు ఎక్కడైనా నీలం రంగులో ఉన్న మార్చు అనే లింకును నొక్కితే దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది. వ్యాసంపైన ఉన్న టాబ్‌ను నొక్కితే మొత్తం వ్యాసం దిద్దుబాటు పెట్టెలో తెరచుకుంటుంది. అదే వ్యాసంలోని ఒక విభాగంపైన కుడివైపునున్న లింకును నొక్కితే ఆ విభాగం మాత్రం దిద్దుబాటు పెట్టెలోకి మారుతుంది. ఆ తరవాత మీరు చేయదలచిన మార్పులను చేసి దిద్దుబాటు పెట్టె క్రింద ఉన్న పేజీభద్రపరచు అనే బటన్‌పై నొక్కినట్లయితే మీరు చేసిన మార్పులు వ్యాసంలో చేర్చబడతాయి.

42. వికీపీడియాలో పదాల రంగులు

మీరు ఏ వ్యాసాన్ని చూసినా అందులో నలుపు, నీలం మరియు ఎరుపు రంగుల్లో కొన్ని లింకులు ఉంటాయి. ఇవి కాకుండా ఇతర రంగుల్లో కూడా అక్షరాలు కొన్ని సార్లు కనిపించవచ్చు. ఆ రంగులెందుకో కింద చూడండి. నలుపు - ఈ రంగు పదాలు వికీపీడియాలో ఎటువంటి లింకులూ లేని పదాలకు ఉంటాయి. (కావాలని నలుపు రంగు లింకులు ఉంచితే తప్ప) నీలం - నీలం రంగు పదాలు తెలుగు వికీపీడియాలోని ఇతర వ్యాసాలకు లింకులు, వాటిపై నొక్కి పదం లింకుకు చేరుకోవచ్చు. ఇలాంటి నీలం లింకులు వ్యాసాన్ని మార్చడానికి కూడా వాడబడతాయి. ఏ వ్యాసం పైనైనా మీరు 'మార్చు' మరియు 'చరితం' వంటి లింకులను చూడవచ్చు. లేత నీలం- ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని లింకులు, ఉదా: ఆంగ్ల వికీ, విక్షనరీ వంటివి ఎరుపు- ఈ రంగులో ఉండే పదాల లింకులు తొలగిపోవడం గానీ ఇంకా సృష్టించబడిగానీ లేవని అర్థం. మీరు వాటిపై నొక్కి ఆ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఇతర రంగులు - ఇవి సాధారణంగా వ్యాసం పేజీల్లో ఉండవు. చర్చా పేజీల్లో, సంతకాలల్లో సభ్యులు వాడుతుంటారు.

43. ఎక్కడ ప్రారంభించాలి

వికీపీడియాలో మీ రచనలను ఎక్కడ ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా?. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మీ ఊరి గురించి వికీపీడియాలో లేకపోతే మీ ఊరి గురించి వ్రాయండి. లేదా ఈ వారము సమైక్య కృషి అన్న లింకుపై నొక్కి, ఇప్పుడు మార్పులు అవసరమైన పేజీలేవో తెలుసుకోండి.

44. వ్యాసాన్ని ఫలానా వర్గంలో ఎలా చేర్చాలి?

వికీపీడియాలో వర్గాలు అని పిలిచే సూచికా వ్యవస్థ ఉంది. దీని వలన వ్యాసాలలో చేర్చిన కొన్ని ట్యాగుల వలన, వాటంతటవే వర్గీకరించబడతాయి.

ఒక వ్యాసాన్ని ఫలానా వర్గంలో చేర్చటానికి,ను వ్యాసంలో ఎక్కడో ఒక చోట చేర్చండి (సాధారణంగా వ్యాసం చివర చేరుస్తారు). అలా వ్యాసంలో వర్గం చేర్చేసిన తరువాత, వ్యాసంలో చేర్చిన వర్గాలన్నీ వ్యాసం అడుగు భాగాన కనపడతాయి, వాటికి అనుభందంగా ఉన్న లింకును నొక్కితే అదే వర్గంలోకి చేర్చిన మిగితా అన్ని పేజీలనూ చూపించే వర్గపు పేజీకి తీసుకుని వెళ్తుంది.

45. సమాచార సేకరణ

వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. లేకపొతే అన్నింటికన్నా ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం.

46. కొత్త పేజీలు

తెవికీలో ఇటీవల ప్రారంభించిన కొత్త వ్యాసాలు తెలుసుకోవాలనుకుంటే పేజీకి ఎడమవైపున ఉన్న మార్గదర్శకములో |కొత్త పేజీలు అన్న లింకును నొక్కండి.

47. ఒక పేజీ చరిత్ర

ఒక పేజీ ప్రారంభించినప్పటినుంచీ దాన్ని ఎవరెవరు ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి చరితం ట్యాబ్ ను నొక్కండి. దీనిని మీరు బాగా గమనిస్తే ఒక వికీపీడియా లో ఒక గొప్ప విషయం అర్థమౌతుంది. మీరు చేసిన మార్పులను వేరెవ్వరూ మేము చేశామని చెప్పుకోలేరు(నిర్వాహకులతో సహా). అంతేకాదు, ఒక వేళ ఆపేజీ మీరు ప్రారంభించి ఉంటే, ఎవరైనా ఎప్పుడైనా అనవసర మార్పులు చేసి ఉంటే ఆ పేజీని మీరు యథాస్థానంలోకి తీసుకొని వెళ్ళవచ్చు కూడా.

48. మౌలిక పరిశోధనలు నిషిద్ధం

మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా లోని వ్యాస విషయాన్ని నిర్దేశించే మూడు నిర్దేశకాల్లో ఒకటి. మిగతావి తటస్థ దృక్కోణం, నిర్ధారత్వం.

గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.

49. సంతకాన్ని మార్చుకోవడం ఎలా

సంతకం ఎలా ఉండాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" ఒక దాన్ని ఎంచుకుని మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యకపోతే, సంతకంలో మీ ముద్దుపేరుకు ముందు "" నూ, వెనక "" ను సాఫ్టువేరు చేరుస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:కస్టమైజేషన్ చూడండి.


50 తెలుగువికీలో ఆంగ్ల వ్యాసాలా?

సభ్యులు గమనించవలసిన విషమేమిటంటే ఈ మన తెలుగు వికీపీడియాలో ఆంగ్ల వాక్యాలకు స్థానం లేదు. మీరు ఏ రచన చేయాలనుకున్నా తెలుగులోనే చేయండి. కొన్ని వ్యాసాలను సభ్యులు అనువాదం కొరకు ఆంగ్లభాషలోని వ్యాసాలను కాపీ చేసి మన తెలుగువికీలో అంటించారు. వారి ఉద్దేశ్యం సరైనదే కాని అవి చాలా కాలం నుండి అలాగే ఉండి పోయాయి. మీరు వాటిని తెలుగులోకి అనువదించాలనుకుంటే వర్గం:అనువాదము కోరబడిన పేజీలు సందర్శించండి.

51. నేను ఎలా తోడ్పడగలను?

ఈ ప్రశ్న అందరికీ వచ్చే సర్వసాధారణ ప్రశ్న. మీ అవసరం వికీపీడియాకు చాలా ఉంది. నేనేమి చేయగలనని మీరస్సలనుకోవద్దండి. మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో ఆ విషయం గురించి వెతకండి. మీకు ఆ విషయాలు లభిస్తే వాటిని మెరుగుపరచండి. లేకపోతే కొత్త వ్యాసాలు ప్రారంభించండి. మొహమాటం అస్సలు పడవద్దండి. ఇందులోని సభ్యులంతా చాలా సహాయకంగానూ స్నేహాభావంతోనూ ఉన్నారు. మీరూ అలానే కొనసాగుతారని ఆశిస్తున్నాము.

52. సంతకం చేయడం మర్చిపోకండి

ఒక చర్చా పేజీలో మీరు ఏదైనా వ్రాసినపుడు సంతకం చేయడం మరవకండి. సంతకం చేయడానికి ఎల్లంకి (చర్చ) 11:47, 29 డిసెంబరు 2014 (UTC) ఇలా నాలుగు టిల్డేలను వాడండి. ఇలా సంతకాలను వికీపీడియా వ్యాసాలలో చేయవలసిన అవసరం లేదు. కేవలం చర్చా పేజీలలోనే చేయాలి.

53. పేజీ మార్పులు

ఒక వ్యాసాన్ని ఎవరైనా మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియాలంటే , ఆ పేజీ యొక్క ఈ పేజీ మీద కన్నేసి ఉంచు అనే చెక్ బాక్సు ను ఎంచుకోండి. ఆ వ్యాసాన్ని మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియజేయ బడుతుంది. ఇటీవల మార్పులులో ఆ పేజీలో జరిగిన మార్పులు బొద్దుగా కనిపిస్తాయి మరియు నా వీక్షణ జాబితాలో చేర్చబడతాయి.

54. మీ పేజీ

ప్రతీ సభ్యునికి వికీపీడియాలో ఒక సభ్యపేజీ కేటాయించబడుతుంది. వికీపీడియాలో మీరు సభ్యులైతే మీ గురించి కొంత సంక్షిప్త సమాచారాన్ని రాసుకోవచ్చు. ఉదాహరణకు మీ పేరు, మీ జన్మస్థలం, మీ వృత్తి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనులు, మీకు ఇష్టమైన వ్యాసాలు, మొదలైనవి. దీని ద్వారా వికీపీడీయాలోని ఇతర సభ్యులు మీ గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.

55. మీరు అనువాదం బాగా చేయగలరా

మీరు సొంతంగా వ్యాసాన్ని రాయలేక పోయినా తెలుగు వికీపీడియాలో ఎన్నో అనువదించని వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఒక పట్టు పట్టండి. ఇక్కడ లేని వ్యాసాలు కొన్ని ఆంగ్ల వికీపీడియాలో ఉండి, అవి తెలుగులో ఉంటే బాగుంటుందని మీకనిపిస్తే ఒక మీరు ఒక కొత్త వ్యాసాన్ని ప్రారంభించవచ్చు.

56.మీ బ్రౌజరులో తెలుగు సరిగా కనిపించడం లేదా?

మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 వాడుతుంటే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 7 కు మారండి. లేదా మీకు ఫెడోరా లైనక్సు గురించి తెలిసి ఉంటే దానిలో ఇంకా అందమైన తెలుగు లిపిని వీక్షించ వచ్చు. ఇందుకు మీరు చేయవలసిందల్లా లైనక్సును ఇన్స్టాల్ చేసుకొనేటప్పుడు భాషను సెలెక్టు ను చేసుకొనేటపుడు తెలుగును కూడా ఎంచుకోవడమే

57. వికీపీడియాలో వెతకడం

వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

58. వికీపీడియా ఎంత ప్రజాదరణ పొందింది?

ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.

59. సభ్యత్వం

వికీపీడియాలో వ్రాయాలంటే మీరు సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కాని, తీసుకుంటే మంచిది.

సభ్యత్వం లేకుండా, లాగిన్ అవకుండా వ్రాస్తే, మీ రచనలు మీ పేరిట ఉండవు. ఏదో ఐ.పి.అడ్రసు పేరిట చేరుతాయి.
మీతో చర్చించడం ఇతరులకు సౌకర్యంగా ఉండదు. ఓ శంకరరావు గారితోటో, లక్ష్మి గారితోటో కలిసి పనిచెయ్యడానికి బాగుంటుందిగానీ, ఏ 66.221.78.112 తోటో కలిసి పని చెయ్యాలంటే కష్టమే కదండీ! చర్చలో పాల్గొన్నపుడు తాము ఎవరితో చర్చిస్తున్నామో మిగతా సభ్యులకు తెలుస్తుంది. అంచేత వారు మరింత చొరవగా చర్చలో పాల్గొనగలుగుతారు.
అన్నిటికీ మించి, అజ్ఞాతంగా వ్రాస్తున్నపుడు, మీ పేరుకు బదులు మీ ఐ.పి.అడ్రసు నమోదవుతుంది. అదే అడ్రసుతో ఇతరులు కూడా వ్రాసే సంభావ్యత ఉంది. ఒకవేళ వారు తప్పుడు పనులు చేస్తే..దానిపై నిర్వాహకులు చర్య తీసుకుంటే.., దానికి మీరు అనవసరంగా బలవుతారు.. అన్యాపదేశంగా బాధ్యులూ అవుతారు.

అంచేత మీరు సభ్యులుగా నమోదయి, లాగిన్ అయిన తర్వాతే రచనలు చేస్తే మంచిది. సభ్యులైన వారికి మాత్రమే నిర్వాహకుని హోదా లభించే అవకాశం ఉంది.

60. వర్గాలు

ఒకే విధమైన లక్షణాలు కలిగిన పేజీలను ఒక సమూహంగా చేర్చడమే వర్గీకరణ. ఈ సమూహాలే వర్గాలు. ఒక ఉదాహరణ: నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పొట్టి శ్రీరాములు, బాపు, బి.నాగిరెడ్డి మొదలైన వారంతా సుప్రసిద్ధ ఆంధ్రులు. ఈ వ్యాసాలన్నిటినీ సుప్రసిద్ధ ఆంధ్రులు వర్గానికి చేర్చవచ్చు. అలాగే, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సమర యోధులు. ఈ వ్యాసాలను స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో కూడా చేర్చవచ్చు. ఒక్కో పేజీని ఎన్ని వర్గాలలోకైనా చేర్చవచ్చు; అవి తార్కికంగా ఉంటే చాలు. వర్గాల కారణంగా పేజీల శోధన సులువవుతుంది. వికీపీడియాకు ఒక చక్కటి ఆకృతి ఏర్పడుతుంది కూడా. వర్గాల గురించి మరింత సమాచారం కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి. ఒక పేజీని ఏదైనా వర్గంలోకి చేర్చడమంటే ఆ పేజీలో సదరు వర్గం పేరును చేర్చడమే! ఆ పేజీలో అన్నిటికంటే చివరన, ఇతర భాషా లింకులకు పైన అని వ్రాయాలి. దాంతో ఆ పేజీ సదరు వర్గంలోకి చేరిపోతుంది.

61. స్వీయ చరిత్ర

వికీపీడియాలో ఎవరి గురించి వారు రాసుకోవడం నిషిద్ధం. ఒకవేళ నిజంగా గనుక ప్రముఖ వ్యక్తులైతే, ఇతర సభ్యులు మీ గురించిన రాసిన వ్యాసానికి, దాని చర్చా పేజీలో సమాచారాన్ని తెలుపవచ్చు.

62. మీ వీలును బట్టే వికీలో కృషి చేయండి

వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వమని మీకందరికీ తెలిసిందే. ఇదే స్వేచ్చ వికీపీడియా కోసం పని చేసే సభ్యులకూ వర్తిస్తుంది. వికీ సభ్యులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయాల్లో, ఇష్టం వచ్చిన వ్యాసాలలో మార్పులు చేయవచ్చు. ఒక వేళ వికీ సభ్యులు తాము తగినంత సమయం కేటాయించలేక పోతే అందుకు సదరు సభ్యులు భాద పడనక్కర లేదు. ఇతర సభ్యులు అందుకు ఆక్షేపించడం కూడా సరియైన పద్దతి కాదు. అది నిర్వాహకుల విషయంలో నైనా సరే. ఎవరికైనా వాళ్ళ స్వంత పనులు, అభిరుచులు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని గౌరవించడం ఉత్తమం.

63. విశేష వ్యాసాలను అనువదించండి

ఒకమారు ఆంగ్ల వికీలో విశేష వ్యాసాలను en:Wikipedia:Featured articles చూడండి. ఇవి అధికంగా మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు. వీటిలో మీకు ఆసక్తి ఉన్న ఒక్క వ్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించండి.

64. మీ వాడుకరి పేజీ (Your user page)

వికీపీడియాలో సభ్యులైన ప్రతి ఒక్కరికీ "సభ్యులు
" నేమ్‌స్పేస్‌తో ఒక పేజీ ఉంటుంది.

ఇది మీ స్వంత బ్లాగు లేదా వెబ్‌సైటు కాదనుకోండి. కాని మీ సభ్య పేజీయే వికీలో మీ ముఖచిత్రం. మీ పరిచయాన్ని, ఇంకా ఇతర సభ్యులకు మీ గురించి, మీ కృషి గురించి మీకు ఇష్టమున్నంతవరకు వ్రాయవచ్చును. మీరు పాల్గొంటున్న ప్రాజెక్టులు, మీ అభిరుచులు తెలపడానికి కూడా ఇది మంచి స్థలం. అవుసరమైతే ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించుకోవచ్చును. ఉప పేజీలలో మీ కిష్టమైన సమాచారాన్ని విభజింపవచ్చును. ప్రయోగాలు చేసుకోవచ్చును.

65. రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.

66. మంచి వ్యాసం లక్షణాలు"

వికీపీడియాలో ఉన్నదేదయినా తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలనుకోండి. అంతే కాకుండా మంచి వ్యాసానికి ఆశించే కొన్ని లక్షణాలు.

ముందుగా వ్యాసానికి అనువైన ఉపోద్ఘాతం ఉండాలి.
చదువరులకు తేలికగా అర్ధం కావాలి. ఆసక్తి కలిగించాలి.
వేరే వ్యాసాల జోలికి వెళ్ళకుండా ఈ వ్యాసం చదివితే ఆ వ్యాసం శీర్షికకు తగిన సమగ్ర సమాచారం ఉండాలి.
ఇతర వ్యాసాలకు లింకులు, వీలయినంతలో ఇతర వికీల లింకులు ఉండాలి. ఇతర సంబంధిత వ్యాసాలలో ఈ వ్యాసానికి లింకు ఉండాలి.
మీ భావాలు కాకుండా ఆ విషయం నిపుణులు చెప్పిన విషయాలుండాలి. "అలాగని అంటారు", "చాలా ముఖ్యమైన ఘటన" వంటి పదాలు అనుచితం.
ఆ విషయంపై సమాచారం ఎక్కడి నుండి తీసుకొన్నారో "in text citations" ద్వారా తెలపాలి
అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

67. వ్యాసాలలో మీ పేర్లు

వికీపీడియాలో వ్యాసాలు సమిష్టి కృషితో రూపొందుతాయి. మీరు సృష్టించిన వ్యాసాన్ని వేరే సభ్యులెవరైనా మార్పులు చేయవచ్చు. కాబట్టి మీరు రాసే వ్యాసాలలో ఇట్లు తమ భవదీయులు <మీ పేరు> లాంటి వాక్యాలు రాయకండి. మీరు ఏ పేజీలలో నైనా ఇలాంటి వాక్యాలు చూస్తే తొలగించండి.

68. దేని గురించి రాయాలా అని ఆలోచిస్తున్నారా?

మీ స్నేహితులతో సంభాషిస్తున్నపుడు వారు మీరు చెప్పే విజ్ఞాన దాయకమైన విషయాలను ఆసక్తిగా వింటున్నారా? అయితే వాటి గురించి వికీపీడియాలో రాయండి.

69. అచ్చుతప్పులను సరిదిద్దండి

వికీపీడియాలో చాలా అక్షరదోషాలున్నాయి. సమయం చిక్కినపుడు ఆ దోషాలను సరిదిద్దడానికి సహకరించండి. మీ సభ్య పేజీలో అక్షరదోష నిర్మూలన దళ సభ్యుడు అన్న బ్యాడ్జిని ప్రదర్శించండి. అప్పుడు మీ పేరు వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు అన్న వర్గంలో చేరుతుంది.

70. వివాదాలు

ప్రపంచంలో ఏ ఒక్కరి అబిప్రాయాలు ఒకలా ఉండవు.కాబట్టి వ్యాసాలు రాసేటప్పుడు సభ్యుల మద్య అభిప్రాయ బేధాలు రావడం సహజం. అలాంటప్పుడు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమమైన పద్దతి. వీలైతే ఇతర సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానించండి. చర్చా పేజీలలో పరుష పదజాలను వాడకండి. ఎందుకంటే తాము పని చేసే సమయంలో కొంత వెసులుబాటు ను కల్పించుకుని వికీపీడియాలో రచనలు చేస్తున్న సభ్యులు మనస్థాపానికి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు తటస్థ దృక్కోణంతో వ్యాసాలు రాయండి. ఇలాంటి వివాదాస్పద విషయాలు చర్చించేటపుడు. మీ సభ్యనామంతో చర్చిస్తే బాగంటుంది. మీకు వాదనకు దిగే ఆలోచన లేక పొతే వేరే వ్యాసాల వైపు దృష్టి సారించండి.

71. కాల్పనిక సాహిత్యం గురించి : కాల్పనిక సాహిత్యం (నవలలు, సినిమాలు వంటివి) గురించి వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు [1] --

విజ్ఞాన సర్వస్వం ప్రధానం లక్ష్యం యదార్ధాలు. కల్పనలు కాదు. కనుక ఆ వ్యాసాలు యదార్ధాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయాలి.
ఒక సినిమా గురించి వ్రాసేటప్పుడు - సినిమా నటులు, సాంకేతిక నిపుణులు, జయాపజయాలు, ఆ సినిమా ప్రభావం - ఇవన్నీ యదార్ధాలు. "సినిమా కధ" కల్పన. కనుక కధను క్లుప్తంగా ఇక్కడ వ్రాయవచ్చును. అతిగా వ్రాయ తగదు.

72. బొమ్మలకు పేర్లు

మీరు ఏదైనా చిత్రాన్ని అప్‌లోడ్ చేసినపుడు ఆ చిత్రం పేరు, ముఖ్య సమాచారం ఆంగ్లంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఆ బొమ్మను ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులలో కూడా వాడుకొనే అవకాశం ఉంది. బొమ్మ పేరును వివరణాత్మకంగా పెడితే ఉపయోగకరంగా, స్పష్టంగా ఉంటుంది.

73. ఛాయా చిత్రాలు

మీరు గానీ, మీ బంధువులుగానీ, స్నేహితులుగానీ, మీకు తెలిసిన వాళ్ళెవరైనా సరే పర్యాటక ప్రదేశాలకు, చూడాల్సిన ప్రదేశాలకు వెళ్ళి ఉంటే దానికి సంబంధించిన ఫోటోలను వికీపీడీయా కు ఎగుమతి చెయ్యవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాకు బొమ్మల అవసం చాలా ఉంది. అంతే కాక అవి వ్యాసాలను మరింత ఆకర్షణీయంగా పరిపుష్టం చేయగలవు.

74. వికీపీడియా ఒక అధికార వ్యవస్థ కాదు

వికీపీడియా ఒక "బ్యూరోక్రసీ" కాదు. అధికారులు ఇతరులపై పెత్తనం చెలాయించే స్థలం కాదు. అందరికీ పాఠాలు చెప్పే వేదికా కాదు. నమూనా కోర్టు కాదు. ఇది నియమాలకోసం ఏర్పరచిన వ్యవస్థ కాదు. అధికంగా నియమాలను పెంచితే "నియమాల బంక"(Instruction creep) పెరుగుతుంది కాని వికీపీడియా ఆశయం నెరవేరదు. స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం తయారు చేసే లక్ష్యానికి అడ్డం వచ్చే నియమాలను పక్కన పెట్టండి. విభేదాలను సంయమనంతో పరిష్కరించుకుందాం రండి.

75. ఇలాంటివి వికీపీడియాలో వ్రాయవద్దు

వికీపీడియాలో వ్రాయదగనివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు

మీ వీధిలో దుకాణం గురించి
మీరు నిన్ననే మొదలు పెట్టిన ఇద్దరు సభ్యుల సమాజం గురించి
మీకిష్టమైన వంట
మీ పెంపుడు కుక్క
మీకు ఫలాని ఛానల్ ఎందుకు నచ్చదు?
మీ మరపురాని విహార యాత్ర.

76. మీకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?

వికీపీడియాలో తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు. తెలుగు సాహిత్యం వ్యాసాలకు కేంద్ర వ్యాసాలుగా ప్రారంభించిన క్రింది వ్యాసాలు చూడండి-

తెలుగు సాహిత్యము
తెలుగు సాహితీకారుల జాబితాలు
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

వీటిలో ఎర్రలింకులు అనేక ఇతర వ్యాసాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విజృంభించండి.

77. ప్రత్యేక పేజీలు

వికీపీడియాలోని పేజీలు దాదాపుగా అన్నీ సభ్యులు దిద్దుబాటు చెయ్యగలిగేవే. కొన్ని పేజీలు మాత్రం సభ్యుల దిద్దుబాట్లకు అందుబాటులో ఉండవు. అలాంటి పేజీలను ప్రత్యేక పేజీలు అంటారు. పరికరాల పెట్టె లోని "ప్రత్యేక పేజీలు" లింకుకు వెళ్ళి ప్రత్యేక పేజీల జాబితాలను చూడవచ్చు.

78. స్వీయ చరిత్రలు రాయకండి

ఒక సాధారణ విధానానికి అనుగుణంగా తెలుగు వికీపీడియాలో తమ స్వీయ చరిత్రను వ్యాసంగా రూపొందించకండి. ఒకవేళ మీ గురించి ఏదైనా వ్యాసం ఉంటే (గుర్తింపు పొందిన వ్యక్తులపై) దాన్ని కూడా మీరు దిద్దకండి. మీకు ఏదైనా సరిచేయడంగాని, ఇంకా ఏదైనా వివరం కూర్చదలిస్తే దానిని ఆ వ్యాసం చర్చా పేజీలో వివరించండి. కాలం చెల్లిన నిజాలుగాని, తప్పులు గాని ఉంటే మొహమాటపడకుండా సహకరించండి.

79. సమిష్టి కృషి

సభ్యులు కొంతమంది కలిసి ఒక ప్రాజెక్టు (యజ్ఞము)ను వృద్ధి చేస్తుంటారు. సభ్యులంతా తమ తమ అభిరుచులకి తగ్గట్టుగా ఏదో ఒక ప్రాజెక్టును వృద్ది చేయవచ్చు. దీనికి ఎవరి ఆహ్వానము అవసరం లేదు. ఇలాంటి ప్రాజెక్టులు ఒక విషయం అని కాకుండా విభిన్న విషయాలపై నడుస్తూ ఉంటాయి. కావున సభ్యులు సంకోచించకుండా ఏ వ్యాసంలోనైనా రచనలు లేదా దిద్దుబాట్లు చేయవచ్చు.

80. కొత్త పేజీని సృష్టించడం ఎలా

మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, వెళ్లు గానీ వెతుకు గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!

మరో పద్ధతి.. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాసి ఎంటరు నొక్కండి
http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి.

81.లింకుల కిటుకులు

1. పైపు కిటుకు: వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు వేరే వ్యాసపు పాఠ్యం నుండి లింకు ఇచ్చేటపుడు, లింకు ఇస్తున్న పదం పేరు లక్ష్య వ్యాసం పేరు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసంలో ఒంగోలు ఎద్దుల గురించి రాస్తూ సంబంధిత వ్యాసానికి లింకు ఇవ్వదలచారనుకోండి.. ఒంగోలు ఎద్దు పేరుతో వికీలో వ్యాసం లేదు గానీ, ఒంగోలు జాతి పశువులు అనే వ్యాసం ఉంది. ఆ పదం నుండి ఆ వ్యాసానికి లింకు ఇలా ఇవ్వాలి: ఒంగోలు ఎద్దులు). ఇలా రాసినపుడు వ్యాసంలో ఇలా కనిపిస్తుంది.. ఒంగోలు ఎద్దులు).

2. బహువచన కిటుకు లేదా పొర్లింత కిటుకు: వ్యాసాల్లో ఇతర వ్యాసాల పేర్లను ఉదహరించేటపుడు ఆ వ్యాసం పేరును ఖచ్చితంగా అలాగే రాసే వ్లు ఉండక పోవచ్చు. ఉదాహరణకు,

కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు. అనే వాక్యంలో అల్లూరి సీతారామరాజును అనే పదానికి లింకు ఇలా ఇవ్వవచ్చు: అల్లూరి సీతారామరాజును. వ్యాసంలో ఇది కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు.అని కనిపిస్తుంది. ఈ కిటుకును బహువచన పదాలకు కూడా వాడవచ్చు.

82. కొత్త పేజీ కి మార్గదర్శకాలు

కొత్త పేజీ మరీ ఒక వాక్యంతో వుంటే ఉపయోగంగా వుండదు. కనీసం ఆరేడు వాక్యాలు రాయగలిగినప్పుడే కొత్త పేజీ ప్రారంభించండి. అంతకన్న తక్కువైతే దానికి తగిన బొమ్మను చేర్చగలిగినప్పుడు ప్రారంభించండి. ఖాతా లో ప్రవేశించకుండా ఒక వాక్యసమాచారంతో కొత్త పేజీలు సృష్టించవద్దు. ఒకవేళ సృష్టించినా అవి తొలగింపబడతాయని గమనించండి ఎందుకంటే అలా ప్రారంభించిన వారిని సంప్రదించటం వీలవదుకాబట్టి. కొత్త సంపాదకులు అనుభవం కోసం ఇప్పటికే వున్న వ్యాసాల దోషాల సవరణ, చిన్న వ్యాసాల విస్తరణ చేయటం మంచిది.

83. పేజీ సృష్టించుట

పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒకటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి వికీపీడియా:నామకరణ పధ్ధతులు చూడండి.

84. ఏ సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడడం

ఫలానా సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడాలంటే.. ముందు ఆ సభ్యుని "సభ్యుని పేజీ"కి వెళ్ళండి. పేజీకి ఎడమ వైపున ఉన్న పరికరాల పెట్టెలో ఉన్న సభ్యుని రచనలు లింకును నొక్కండి. సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన రచనల జాబితా కనిపిస్తుంది.

మీరు చేసిన రచనలు చూసేందుకు, పేజీకి పైన, కుడి మూలన ఉన్న నా మార్పులు-చేర్పులు లింకును నొక్కండి.

85. మీరు చేసిన దిద్దుబాటు గురించి క్లుప్తంగా దిద్దుబాటు సారాంశం పెట్టెలో రాయండి

మీరు చేసిన మార్పుల గురించి దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఆ పేజీని గమనిస్తూ ఉన్న ఇతర సభ్యులకు, పేజీలో ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయో సులభంగా తెలుస్తుంది. చిన్న మార్పులకు తప్పించి మిగతా అన్ని దిద్దుబాట్లకు ఈ సారాంశం రాయడమనేది వికీ సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశాలు పేజీ చరితం లోను, వీక్షణ జాబితాలలోను, ఇటీవలి మార్పులు లోను కనిపిస్తాయి. వాటి ద్వారా ఓ పేజీలో ఏమేం దిద్దుబాట్లు జరుగుతోందనే విషయాన్ని సభ్యులు తెలిసికోగలుగుతారు. మీరు విభాగంలో దిద్దుబాటు చేస్తూ ఉంటే, సారాంశం పెట్టెలో ముందుగానే ఆ విభాగం పేరు కనిపిస్తుంది. దాని తరువాత మీ సారాంశం రాయాలి. సారాంశంలో వ్యాసాలకు లింకులు ఇవ్వవచ్చు. సారాంశం 200 కారెక్టర్ల లోపు ఉండాలి. ఇక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో పొడిపదాలను కూడా వాడవచ్చు.

86. నిర్వాహకుడు కావడం

ఏ సభ్యుడైనా/సభ్యురాలైనా నిర్వాహకుడు/నిర్వాహకురాలు కావచ్చు. వికీపీడియాలో ఉన్న సమాచారం మీద నిర్వాహకులకు ప్రత్యేక హక్కులేమీ లేవు; వాళ్ళు చిన్నపిల్లల బడిలో ఆయాల వంటి వారు. నిర్వాహకులు పేజీలను తొలగించగలరు (వికీపీడియా:తొలగింపు విధానం), సంరక్షించగలరు (వికీపీడియా:సంరక్షణ విధానం), నిరోధించగలరు (వికీపీడియా:నిరోధ విధానం). పై చర్యలన్నిటినీ మరో నిర్వాహకుడు/నిర్వాహకురాలు రద్దు చెయ్యవచ్చు. మీరు వికీపీడియాలో చురుగ్గా ఉంటే (కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లు చేసి ఉంటే), నిర్వాహకత్వం కోరవచ్చు.

87. నిర్వాహకుడి సహాయం కావాలా?

నిర్వాహకుల సహాయం అవసరమైన సమస్స్యను ఎదుర్కొంటున్నారా?

నిర్వాహకుల దృష్టిని శీఘ్రంగా ఆకర్షించేందుకు నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయండి. నిర్వాహకులు అక్కడకు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు; మీ సందేశాన్ని ఎవరో ఒకరు చూస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు.

88. ఒకే సభ్యనామాన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.

ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

89. peacock terms వాడవద్దండి

నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు." అని వ్రాయడం మంచిది.

ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" - ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం

90. Weasel Words వాడవద్దండి

సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం

91. ఇతర భాషలనుండి వ్యాసాలను తెలుగులోకి అనువదించండి

ఇంగ్లీషువికీలో మీరు చూసిన వ్యాసాలు తెలుగులోకి అనువదించి, తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకు ఇంగ్లీషుతోపాటు ఇంకా ఏమైనా ఇతర భాషలు వస్తే వాటినుంచి తెలుగులోకి అనువదించి తెలుగువికీ అభివృద్దికి తోడ్పడండి. అనువదించేటప్పుడు ఇతర భాషా లింకులు ఇవ్వడం మర్చిపోకండి!

92. మీరు కొత్తగా చేరారా?

మీరు వికీపీడీయాలో కొత్తగా చేరారా? అంతా గజిబిజిగా ఉందా? మీరు సహాయం కోసం చూస్తున్నారా? మీకు సహాయం కావాలంటే ఎక్కడో ఎవర్నో అడగక్కరలేదు. మీ చర్చాపేజీలో రెండు మీసాల బ్రాకెట్ల 'సహాయం కావాలి ' అని చేర్చండి. నిమిషాల్లో మీకు సహాయం చేయడానికి ఎవరో ఒక వికీ సభ్యుడు/సభ్యురాలు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఇతర వికీ సభ్యులతో చర్చించడానికి ఆ సభ్యుని చర్చాపేజీలో రాయవచ్చు. సభ్యుల పేజీలకు లింకులు సాధారణంగా వారి సంతకాల్లో గాని ఇటీవలి మార్పులు పేజీలో గాని, ఏదైనా వ్యాసం యొక్క చరితం పేజీలో గాని లేదా పూర్తి సభ్యుల జాబితాలోగాని ఉంటాయి. మీరు నిర్మొహమాటంగా సభ్యులను సహాయంకోసం అడగవచ్చు. సహాయంకోసం అన్నింటికంటే ఉత్తమమైన లింకు ఇటీవలి మార్పులు పేజీనే! ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము తెలుగువికీ తెరచి మార్పులు చేస్తున్న సభ్యులను కలవవచ్చు.

93. చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి

వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.

94. మీ సభ్య పేజీ

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

95. మీ సభ్యుని పేజీ

వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.

96. ఖాతా ఎందుకు సృష్టించుకోవాలి?

వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!

తెలుగు వికీపీడియా పురోగతి[మార్చు]

2014 డిసెంబరు ఆఖరుకు తెలుగు వికీపీడియాలో...... మరియు సంబందిత సోధర ప్రాజెక్టులలో పురోగతి ఈ విధంగా వున్నది.

  1. తెలుగు వికీపీడియా (వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.)
తెలుగు వికీపీడియాలో 60,115 వ్యాసాలున్నాయి. .......
వికీపీడియాని మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు 13,56,409
నమోదైన వాడుకరులు 42,164
క్రియాశీల వాడుకరులు (సభ్యుల జాబితా) (గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) 227
బాట్‌లు 40 మంది

నిర్వాహకులు 17 మంది అధికారులు 4 మంది

  1. తెలుగు విక్షనరీ (విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం. ఇది మామూలు పదకోశాల వంటిది కాదు.ఇక్కడ పదాల సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని పదాల సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు విక్షనరీలో 97,616 పదములు ఉన్నాయి
విక్షనరీని మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు 5,27,064
నమోదైన వాడుకరులు 2,788
క్రియాశీల వాడుకరులు (సభ్యుల జాబితా) (గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) 11
బాట్‌లు (సభ్యుల జాబితా) 9
నిర్వాహకులు 5


  1. తెలుగు వికీసోర్స్ (ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు )
ఇప్పటికి ఇందులో 10,000 తెలుగు పాఠ్యపుపేజీలు, 8 అమోదించబడిన, 4 దిద్దబడిన, 11 టైపు పూర్తయిన మరియు 78 టైపు చేయబడుచున్న పుస్తకాలున్నాయి.


  1. తెలుగు వికీబుక్స్ ( ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి).
ఈ తెలుగు వికిపుస్తకాలలో ప్రస్తుతం 55 వ్యాసములు ఉన్నాయి.


  1. వికీకోట్ వ్యాఖ్యలు (వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి)

ఇందులో ..............(వ్రాయవలసి వున్నది)

తెలుగు వికీపీడియా...... ఇతర భారతీయ భాషల వికీపీడియాతో పోలిక[మార్చు]